మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల(ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల పోలింగ్  గురువారం (నవంబర్ 5)  షురూ అయ్యింది.  రాష్ట్రవ్యాప్తంగా  582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఈ పోలింగ్  మొత్తం మీద ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో  తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మరి కొన్ని చోట్ల భారీ వర్షాల కారణంగా పొలింగ్ మందకొడిగా సాగుతోంది.   ఈ ఎన్నికల కోసం  రాష్ట్రవ్యాప్తంగా 31 వేల 460 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రమారమి  2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.  పోలింగ్ పర్యవేక్షణ కోసం అధికారులు భారీగా సిబ్బందిని మోహరించారు.  ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాలతో పాటు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో భారీ వర్షాలు, వరద పరిస్థితుల కారణంగా ఎన్నికలను వాయిదా వేసి శుక్రవారం(నవంబర్ 6) పోలింగ్ నిర్వహించి, శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు. నెల్లూరు, బాపట్ల, కాకినాడ తదితర జిల్లాల్లోనూ ఉదయం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ, ఓటర్లు వెనకడుగు వేయకుండా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. అదలా ఉంటే.. కడప జిల్లాతో పాటు పల్నాడు, మన్యం జిల్లాల్లో కొన్ని తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం, వైసీపీ  వర్గాల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు,తోపులాటలూ చోటు చేసుకున్నాయి.   పులివెందుల నియోజకవర్గ పరిధిలో నందలూరు మండలం ఎర్రిపాపయ్యగారి పల్లెలో పోలింగ్ కేంద్రాల వద్ద బయటి వ్యక్తుల సంచారంపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల పోలీసులు జోక్యం చేసుకుని గుంపులను చెదరగొట్టాల్సి వచ్చింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈ నెల 7వ తేదీన చేపట్టనున్నారు. పోలింగ్ సజావుగా ముగిసేలా ప్రతి కేంద్రం వద్ద పర్యవేక్షణను కట్టుదిట్టం చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన నిఘా ఉంచామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.   [AP MPTC ZPTC Elections Poling, Largely Peaceful, AP Local Body Elections, Kadapa, Palnadu, Manyam Districts, Tense, Telugu One] 
ఆంధ్రప్రదేశ్‌  మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాజయం చవిచూసిందని  వైసీపీ  సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు  అన్నారు.  ఎన్నికల్లో అధికార తెలుగుదేశం కూటమి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూనే, గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాల ఫలితమే ఇప్పుడు  అనుభవిస్తున్నామని చెప్పారు. తద్వారా గతంలో తాము అక్రమాలు చేశామని అంగీకరించారు. విశేషమేంటంటే.. ఆయనీ ఓటమి ఒప్పుకోలు హైదరాబాద్‌లో ఈడీ విచారణకు హాజరై బయటకు వచ్చిన తరువాత జరిగింది. ఈడీ విచారణ ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడిన అంబటి,   రాష్ట్రంలో ఏ ఎన్నికలు నిర్వహించినా ప్రజల నుంచి ఇదే రకమైన తీర్పు వస్తుందని, ఫలితాలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయని చెప్పారు. వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఓ వైపు వైసీపీ అధినేత జగన్.. ఎన్నికల్లో అక్రమాలు, అధికార తెలుగుదేశం కూటమి దౌర్జన్యాల కారణంగానే ఫలితాలు ఇలా వచ్చాయనీ, పోలీసులు, ఎన్నికల సంఘం, బాబు టీమ్ గా ఏర్పడి మునిసిపోల్స్ ను ఎలక్షన్ గా కాకుండా సెలక్షన్ గా మార్చేశారని విమర్శిస్తుంటే, ఆ పార్టీ సీనియన్ నాయకుడు, కీలక నేత అంబటి.. మాత్రం ప్రజాక్షేత్రంలో వైసీపీపై ఉన్న వ్యతిరేకత కారణంగానే ఓటమి పలయ్యామని అంగీకరించడం గమనార్హం. జరిగిన పరిణామాలే నేడు పార్టీకి ఈ గతి పట్టించాయని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా ఇదే సందర్భంగా  మద్యం రవాణాకు సంబంధించిన ఈడీ విచారణ వివరాలను కూడా అంబటి వెల్లడించారు.  తన నియోజకవర్గ పరిధిలోని వైకాపా నాయకులు సుబ్బారెడ్డి, పురుషోత్తంలకు మద్యం రవాణాకు సంబంధించి సబ్ కాంట్రాక్టులు ఇప్పించేందుకు తాను సిఫారసు చేసినట్లు  అంగీకరించారు. ఈ విషయమై అప్పట్లో వాసుదేవరెడ్డితో మాట్లాడానని కూడా అంగీకరించారు.  ఈ వ్యవహారానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఈడీ అధికారులకు   వివరించినట్లు చెప్పారు. తాను సిఫారసు చేసిన వ్యక్తులకు కాంట్రాక్టులు దక్కాయని, వాటిని సుమారు ఐదేళ్లపాటు నిర్వహించగా రూ.16 కోట్ల నుంచి రూ.18 కోట్ల వరకు టర్నోవర్ నమోదైందన్న అంబటి,   అయితే ఈ ఆర్థిక లావాదేవీలలో కుంభకోణం జరిగిందనే ఆరోపణలతో అధికారుల దర్యాప్తులో భాగంగానే తాను విచారణకు హాజరైనట్లు పేర్కొన్నారు. విచారణలో భాగంగా అధికారులు తన ఆధాన్, పాన్ కార్డు వివరాలను సేకరించారని తెలిపారు.  రాష్ట్ర రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఒకవైపు గరిష్ట స్థాయికి చేరిన తరుణంలో, అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులే నేడు పార్టీ ఓటమికి కారణమని విపక్ష నేత స్వయంగా అంగీకరించడం గమనార్హం. ఒకవైపు ఈడీ విచారణ ఎదుర్కొంటూనే మరోవైపు ఎన్నికల పరాజయంపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.   [Ambati Rambabu On AP Municipal Elections, Accepts YCP Defeat, Ambati Rambabu ED Inquiry Hyderabad, Andhra Pradesh Politics, Telugu One] 
ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్  తెలుగుదేశం కూటమి వశమైంది. ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికలలో  తెలుగుదేశం  ఘన విజయం సాధించింది. ఒంగోలు మేయర్ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి నల్లమళ్ళ శ్రీశిల్ప కైవసం చేసుకున్నారు.   ఆమె తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థిపై  37 వేల ఓట్ల అఖండ మెజారిటీతో విజయం సాధించారు.  ఈ విజయంతో తెలుగుదేశం కూటమి శ్రేణులు ఒంగోలులో సంబరాలు చేసుకున్నారు.  కౌంటింగ్ లో మొదటి నుంచి నల్లమళ్ళ శ్రీశిల్ప స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు.  అదలా ఉంటే ఒంగోలు కార్పొరేషన్ లో   తెలుగుదేశం  39 స్థానాల్లో గెలుపొందగా, మిత్రపక్షాలు  జనసేన   8 డివిజన్లలో, బీజేపీ ఒక డివిజన్‌లో విజయం సాధించాయి.  ఇక వైసీపీ కేవలం 11 డివిజన్లకే పరిమితమైంది. ఇతరులు మూడు డివిజన్ లలో గెలుపొందారు.  కాగా మురసు తుపాను కారణంగా ఒంగోలు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. తుపాను కారణంగా మంగళవారం (నవంబర్ 3) జరగాల్సిన ఓట్ల లెక్కింపు  బుధవారం (నవంబర్ 4) నిర్వహించారు.   [TDP Win Ongole Corporation, Mayor, SriSilpi, TDP Victory,  Ongole Municipal Corporation, AP Local Body Elections, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
రామాయణ.. భారతీయ ఇతిహాసంతో ముడిపడి ఉన్న అయోధ్య రాముడి జీవిత చరిత్ర.. అందుకే కళ అనేది పుట్టిన దగ్గరనుంచి ఆ 'రాముడి'పై ఎన్నో సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఆ కోవలోనే ఇప్పుడు రణబీర్, యష్, సాయి పల్లవి, నితీష్ తివారి రామాయణ సెల్యులాయిడ్ పై అడుగుపెట్టింది. మరి గత రామాయణ, ఇప్పటి రామాయణ  చిత్రాలకి మధ్య ఉన్న తేడాలేంటో చూద్దాం.  1971లో ఎన్టీఆర్ నటించిన 'సంపూర్ణ రామాయణం' మరియు 1961లో వచ్చిన 'సీతారామ కళ్యాణం' వంటి క్లాసిక్ చిత్రాలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. ఆ రోజుల్లో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం చాలా తక్కువ. గ్రాఫిక్స్ లేదా సీజీఐ (CGI) టెక్నాలజీ అసలే లేని ఆ రోజుల్లో, కేవలం 100% నటీనటుల సహజ సిద్ధమైన అభినయం, శక్తివంతమైన సంభాషణలు, ఘంటసాల గానం మరియు పౌరాణిక సంగీతం ద్వారానే ఆ సీన్లలో జీవం నింపారు. శోభన్ బాబు, ఎన్టీఆర్, కాంతారావు వంటి దిగ్గజ నటులు తమ పాత్రల్లో లీనమై నటించడంతో ప్రేక్షకులు థియేటర్లలో భక్తి పారవశ్యంతో నమస్కారాలు చేసేవారంటే ఆ సినిమాల ప్రాణం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.  కాలక్రమేణా చలనచిత్ర సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. నాటి రామాయణ చిత్రాలకి, నేటి ఆధునిక రామాయణ దృశ్యకావ్యాలకి ఉన్న ప్రధాన వ్యత్యాసం సాంకేతిక పరిజ్ఞానంలోనే స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకి  2011లో బాపు దర్శకత్వంలో వచ్చిన 'శ్రీరామరాజ్యం' చిత్రం నాటి భక్తి భావాన్ని,నేటి ఆధునిక విజువల్ క్వాలిటీని కలగలిపి 32 కోట్లతో తెరకెక్కింది. ఈ చిత్రం వందకిపైగా థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని సుమారు 45 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించి ఆధునిక యుగంలోనూ పౌరాణిక కథల దమ్ము ఏంటో నిరూపించింది. ఇక 2023లో భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'ఆదిపురుష్' చిత్రం నాటి రామాయణ నిర్మాణ శైలికి మరియు నేటి 3D మోషన్ క్యాప్చర్ టెక్నాలజీకి ఉన్న తేడాను ప్రపంచానికి చూపించింది. సుమారు 500 కోట్ల నుంచి రూ. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఏకంగా 60 శాతానికి పైగా విజువల్ ఎఫెక్ట్స్ మరియు VFX సీన్లు ఉపయోగించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మొదటి వారంలోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 450 కోట్లు సాధించినప్పటికీ, పాత సినిమాల్లో ఉన్న నాటి భావోద్వేగాలు నేటి ఆధునిక విజువల్ టెక్నాలజీలో లోపించాయని మెజారిటీ ప్రేక్షకుల నుండి విమర్శలు వచ్చాయి. ఇది కూడా చదవండి:  Ramayana: రామాయణం హైలెట్స్ ఇవే.. పబ్లిక్ టాక్ పరిస్థితి అయితే ఇదే!    ఈ రోజు విడుదలైన 'రామాయణ' పార్ట్ 1  విజువల్స్ పరంగాను, కంటెంట్ పరంగాను, భావోద్వేగాలు పండించంలోను  అద్భుతంగా తెరకెక్కిందనే మాటలు వినిపిస్తున్నాయి  . అస్కార్ పురస్కారాలు పొందిన హాలీవుడ్ VFX సంస్థ డిఎన్‌ఈజి (DNEG) ఈ ప్రాజెక్ట్ కోసం 1000 మందికి పైగా డిజిటల్ ఆర్టిస్టులతో వర్క్ చేసింది. ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లేతో గ్లోబల్ ఆడియెన్స్ ని కూడా  టార్గెట్ చేసింది. మరి ముఖ్యంగా ప్రీవియస్ రామాయణ చిత్రాల్లో రావణుడి తల్లి, అతని యవ్వనం, లక్ష్య సాధన వైపు మళ్లడం అనేది చూపించలేదు. కానీ ఇప్పుడు రామాయణలో చూపించారు. రాముడు, సీతాదేవి క్యారక్టర్ డిజైన్ కూడా కొత్తగా ఉంది. పైగా త్రేతా యుగంలో రాముడు, సీతాదేవి అలాగే ఉండేవారు అనేలా కూడా అనిపిస్తుంది. ఫైనల్ గా  రామాయణంలోని మూల భావోద్వేగం, ధర్మ మార్గం అభిమానులు, ప్రేక్షకులు, రామ భక్తులు మనసులని తాకిందనే మాటలు సోషల్ మీడియా వేదికగా రామాయణ చూసిన వాళ్ళు చెప్తున్నారు.     [Ramayana Movies Evolution Telugu Cinema, Ramayana Movie highlights, Ramayana Movie Review Telugu, Ramayana Part 1 Movie Review Telugu, Ramayana Part 1 Review, Tollywood News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News]  
అభిమానులు, ప్రేక్షకులు సుదీర్ఘ కాలం నుంచి ఎదురుచూస్తున్న రాముని దివ్యచరితం  రామాయణ ఈ రోజు సెల్యులాయిడ్ పై సాక్షాత్కృతమైంది. మూవీ చూసిన ప్రేక్షకులైతే ఆ రాముడే నేటి తరం కోసం మళ్ళీ రామాయణ తెరకెక్కించేలా మేకర్స్ ని పురికొల్పాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా పలు హైలెట్స్  గురించి చెప్తున్నారు. మరి ఆ హైలెట్స్ ఏంటో చూద్దాం. 1 .విష్ణువుని అంతం చేయాలనుకునే కైకసి జీవిత లక్ష్యం  2 . దశానన, రావణుడుగా మారే టోటల్ ఎపిసోడ్  3 . రాముడి ఇంట్రడక్షన్ ఎపిసోడ్   4 . రాముడు, సీతాదేవి మధ్య వచ్చిన సీన్స్   5 . టోటల్ ఫస్ట్ హాఫ్  6 . జటాయువు తో వచ్చిన సీన్స్  7 . పరశురాముడు కనిపించడం  8 .మూవీ మొత్తం మెస్మరైజ్ చేసిన విజువల్ ఎఫెక్ట్స్  9 .బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫొటోగ్రఫీ, నటీనటుల పెర్ఫారెన్స్   10 . కథని బోర్ కొట్టకుండా చెప్పిన దర్శకత్వం   ఇది కూడా చదవండి: Ramayana Movie Review Telugu: రామాయణం మూవీ రివ్యూ      ఇలా పలు హైలెట్స్ ని మూవీ చూసిన ప్రేక్షకులు చెప్తున్నారు. ఇండియా వైడ్ గా మెజారిటీ రివ్యూస్ కూడా పాజిటివ్ గా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామాయణ సృష్టించబోయే కలెక్షన్ల సునామి ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.   [Ramayana Movie highlights, Ramayana Movie Review Telugu, Ramayana Part 1 Movie Review Telugu, Ramayana Part 1 Review, Ranbir Kapoor Ramayana Movie Review, Nitesh Tiwari Ramayana Movie , Tollywood, Tollywood News, TeluguCinema, Telugu Cinema News]      
సినిమా ఇండస్ట్రీలో నార్త్, సౌత్ అనే విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయా? తాజాగా నటి రెజీనా కాసాండ్రా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇదే అనుమానం కలుగుతోంది. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ తనను కావాలనే ప్రమోషన్లకు దూరంగా పెట్టిందని ఆమె ఆరోపించారు. 'కేసరి ఛాప్టర్ 2' సినిమాలో అక్షయ్ కుమార్ భార్యగా కీలక పాత్ర పోషించినప్పటికీ తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జాన్వీ కపూర్, రాధికా ఆప్టే తెలుగు సినిమాలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నార్త్-సౌత్ విభజన గురించి కూడా రెజీనా స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 'పెద్ది' సినిమాలో తన పాత్ర చిత్రీకరణపై జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. సినిమాలో బౌండ్ స్క్రిప్ట్ ఉండదని, కెమెరా యాంగిల్స్ కూడా ముందుగా తెలియవని సౌత్ ఇండస్ట్రీ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. అటు నటి రాధికా ఆప్టే సైతం గతంలో తెలుగు సినిమాలో నటించినప్పుడు ఎదురైన అనుభవాలను ప్రస్తావించారు. వయసులో పెద్ద నటుడితో రొమాన్స్ చేయాల్సి వచ్చిందని, తన పాత్ర మధ్యలోనే చనిపోతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ వ్యాఖ్యలు కూడా టాలీవుడ్‌లో చర్చకు దారితీశాయి. అప్పుడు టాలీవుడ్ లో అవకాశాలు వచ్చినప్పుడు ఆకాశానికెత్తి, ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాల కోసం ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదంటూ తెలుగు ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రెజీనా కాసాండ్రా చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. నార్త్ ఇండియన్ హీరోయిన్స్ సౌత్ ఇండస్ట్రీ గురించి మాట్లాడేటప్పుడు నార్త్-సౌత్ విభజనను సృష్టించేలా వ్యాఖ్యలు చేయడంపై తనకు అభ్యంతరం ఉందని ఆమె అన్నారు. అంతేకాదు.. కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ సినిమాలో తాను నటించినప్పుడు కూడా సౌత్ నటిగా వివక్ష ఎదుర్కొన్నానని ఆరోపించారు. 'కేసరి ఛాప్టర్ 2' సినిమాలో అక్షయ్ కుమార్ భార్యగా కీలక పాత్ర పోషించినప్పటికీ ప్రమోషన్ల సమయంలో తన పేరును తొలగించారని వెల్లడించారు. తనకు ఎలాంటి వివరణ ఇవ్వకుండానే ప్రమోషన్ల నుంచి పక్కన పెట్టారని, తనపై పాటను విడుదల చేసినప్పటికీ కనీసం సోషల్ మీడియాలో ట్యాగ్ కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా తాను సౌత్ ఇండియన్ నటిని కావడం వల్లే జరిగిందా? అంటూ ప్రశ్నించారు. నిజానికి రెజీనా తెలుగు, తమిళ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. ఆ తర్వాత హిందీ సినిమాల్లోనూ అవకాశాలు అందుకున్నారు. 'జాత్', 'కేసరి ఛాప్టర్ 2' వంటి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ తనకు ఎదురైన అనుభవాలు మాత్రం అంత సానుకూలంగా లేవని గతంలోనూ ఆమె చెప్పుకొచ్చారు. ఇది కూడా చదవండి: ట్విన్ సిస్టర్స్‌తో రొమాన్స్.. ఒకరిని ప్రేమించి మరొకరితో.?       [North South Divide, Regina Cassandra, Karan Johar, Dharma Productions, Kesari Chapter 2, Janhvi Kapoor, Radhika Apte, Telugu Film News]  
టైటిల్‌లోనే ఏదో మ్యాజిక్ ఉంది. ఇక ట్రైలర్ చూస్తే నవ్వులు, ప్రేమ, గందరగోళం.. ఇలా అన్నీ కలిపి ఓ ఫన్ రైడ్‌లా కనిపిస్తోంది. అదే రాకేష్ వర్రే నటిస్తున్న 'మాయ లేడీ'. ఇప్పటికే టీజర్, పాటలతో కొంత బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఇందులో ట్విన్ ట్విస్ట్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఒక అమ్మాయిని ప్రేమిస్తే.. ఆమెకు మరో కవల సోదరి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? పైగా ఆ ఇద్దరి మధ్య అస్సలు పడకపోతే.. ప్రేమించిన వ్యక్తి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఈ పాయింట్ చుట్టూనే దర్శకుడు ప్రాసంకర్ కథను నడిపించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో రాకేష్ వర్రే కృష్ణ అనే యువకుడిగా కనిపిస్తున్నారు. అతడు ఓ కరాటే కోచ్. పెళ్లి చేసుకునే ముందు తనకు నచ్చిన అమ్మాయిని వెతుక్కోవాలని భావిస్తాడు. ఈ క్రమంలో ఆశ(మధుమిత సర్కార్) పరిచయమవుతుంది. ఆమె వ్యక్తిత్వం నచ్చడంతో కృష్ణ ప్రేమలో పడతాడు. కానీ అసలు ట్విస్ట్ అప్పుడే మొదలవుతుంది. ఆశకు రూప అనే కవల సోదరి ఉంటుంది. ఆశ అనుకొని కృష్ణ రూపకి దగ్గరవుతాడు. ఆ ట్విన్ సిస్టర్స్ మనస్తత్వాలు పూర్తిగా భిన్నంగా ఉండటమే కాకుండా.. ఒకరంటే ఒకరికి పడదు. దీంతో కృష్ణ జీవితంలో అనుకోని గందరగోళం మొదలవుతుంది. అసలు ఆశతో ప్రేమలో పడిన కృష్ణకు రూప వల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయి? చివరకు అతడి ప్రేమకథ ఎలాంటి మలుపు తిరిగింది? అనేదే సినిమాలో ఆసక్తికరమైన అంశం. రాకేష్ వర్రే గతంలో 'ఎవరికీ చెప్పొద్దు', 'పేక మేడలు' వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకోవడంలో ఆయనకు మంచి అభిరుచి ఉందనే పేరుంది. ఈసారి మాత్రం పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ట్రైలర్‌లో ప్రేమలో పడినప్పుడు కనిపించే ఆనందం నుంచి.. ఇద్దరు ట్విన్ సిస్టర్స్ మధ్య చిక్కుకున్నప్పుడు ఎదురయ్యే కన్ఫ్యూజన్ వరకు రాకేష్ వర్రే మంచి ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్నారు. ఇక కమెడియన్ సత్య తనదైన టైమింగ్, పంచ్ డైలాగులతో నవ్వులు పంచేలా కనిపిస్తున్నారు. ఈ సినిమాతో బెంగాలీ నటి మధుమిత సర్కార్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. ఇందులో ఆమె ఆశ, రూప అనే రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఒకే నటి రెండు పాత్రలు పోషించడం, ఆ రెండు పాత్రల మధ్య ఉండే భిన్నమైన మనస్తత్వాలు కథలో కీలకంగా మారనున్నాయి. ఇక ట్రైలర్‌లో రొమాన్స్, కామెడీతో పాటు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇద్దరు అమ్మాయిల మధ్య కృష్ణ పడే ఇబ్బందులు ప్రేక్షకులకు వినోదాన్ని అందించేలా ఉన్నాయి. రాకేష్ వర్రే స్వయంగా క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్‌లో ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు మంచి ఎనర్జీ తీసుకొచ్చింది. యెదు రాధాకృష్ణన్ సినిమాటోగ్రఫీ, రవితేజ గిరిజాల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి 'మాయ లేడీ' ట్రైలర్ చూస్తుంటే యాక్షన్ సినిమాల మధ్య ఓ మంచి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ రాబోతున్నట్లు అనిపిస్తోంది. నవంబర్ 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. మరి ఆశ, రూపల మధ్య చిక్కుకున్న కృష్ణ చివరకు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? ఈ ట్విన్ ట్విస్టులు ప్రేక్షకులను ఎంతవరకు నవ్విస్తాయో చూడాలి. ఇది కూడా చదవండి: 'ఇట్లు అర్జున' హీరో అనీష్ ఎవరు?.. నాగార్జున, ఎన్టీఆర్ సపోర్ట్ వెనుక అసలు కథ ఇదేనా.?       [Maya Lady Trailer, Maya Lady Movie, Rakesh Varre, Madhumita Sarcar, Satya Comedy, Vishal Chandrashekhar, Prasankar, Telugu Movies 2026, Telugu Film News]  
  -సినిమా పేరు: రామాయణం -న‌టీన‌టులు:  రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్, శోభన, అరుణ్ గోవిల్, రకుల్ ప్రీత్ సింగ్,  కాజల్, రవి దుబే  తదితరులు  -సినిమాటోగ్ర‌ఫీ: పంకజ్ కుమార్, మహేష్ లిమాయే -ఎడిటింగ్: హుఫేజా లోకండ్ వాలా   -మ్యూజిక్: ఏ ఆర్ రెహ్మాన్, హన్స్ జిమ్మర్  -నిర్మాత‌లు: నమిత్ మల్హోత్రా, యష్  -బ్యానర్స్  : ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్  -రచన,దర్శకత్వం: నితిన్ తివారి  -రిలీజ్ డేట్ : నవంబర్ 5 ,2026  భారతీయుల సంస్కృతితో ముడి పడిన రామ చరిత్ర  'రామాయణం' గురించి అందరకి తెలిసిందే. మళ్ళీ ఈ రోజు సెల్యులాయిడ్ పై సాక్షాత్కరించింది. మరి ఎలా ఉందో చూద్దాం.   కథ  కైకసి( శోభన) రాక్షస(అసుర) జాతికి చెందిన స్త్రీ. తన పుట్టబోయే సంతానం పాండిత్యంలో సైతం ప్రావిణ్యం సంపాదించాలని 'విశర్వ' అనే మహామునిని పెళ్లి చేసుకొని పిల్లలని కంటుంది. మహా విష్ణువు తమ జాతిని సంహరిస్తున్నాడని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కైకసి పెద్ద కొడుకు దశానన తల్లి కోరుకున్నట్టే ఋషి లక్షణాల ప్రకారం సాధువుగా లలిత కలల్లో ప్రావీణ్యం సంపాదిస్తాడు. అలాంటి దశానన 'లంక' అనే మహా సామ్రాజ్యంతో పాటు   ముల్లోకాలని పరిపాలించే రావణుడి ( యష్) గా మారతాడు. రాముడు( రణబీర్ కపూర్)  అయోధ్యకి చెందిన దశరధ మహారాజు పెద్ద కుమారుడు. అనుచిత కార్యం చేయడానికి భయపడాలి కానీ, మంచి చేయడానికి భయం ఎందుకు అనే మృదుస్వభావి. అస్త్ర విద్యల్లో నైపుణ్యం గల వ్యక్తి. కాబోయే అయోధ్య చక్రవర్తి కూడా. కర్మ', విధి తన జీవితంతో ఆడుకుంటున్నాయని  చిన్న తనం నుంచే గ్రహిస్తాడు. అలాంటి రాముడు కర్మ, విధి రెండింటిని తన ఆత్మస్తైర్యంతో ఎదుర్కోవాలని అనుకుంటాడు. రాముడు ఆ విధంగా అనుకోవడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఆ పరిస్థితుల మధ్య తన ధర్మపత్ని సీతా దేవి(సాయి పల్లవి) సోదరుడు లక్ష్మణుడు(రవి దుబే ) తన యోగక్షేమాలు చిన్నతనం నుంచే గమనిస్తూ ఉండే జటాయువు అనే పక్షి మధ్య జరిగిన సంఘటనలు ఏంటి? అనేదే రామాయణం మొదటి భాగం ఎనాలసిస్  ఇలాంటి అద్భుతమైన దృశ్య కావ్యాన్ని ఈ జనరేషన్ ముందుకు తీసుకు వచ్చినందుకు మేకర్స్ కి హాట్స్ హాఫ్ చెప్పాలి. ప్రతి సన్నివేశం ఒక అద్భుతం, పాఠం, గుణపాఠం.  చాలా సినిమాల్లో విజువల్స్ ఎఫెక్ట్ చూస్తుంటే విజువల్స్ అని అర్ధమవుతుంది. కానీ రామాయణ చూస్తున్నంత సేపు ఆ ఫీలింగ్ ఉండదు. ఆ ఏరియాలోనే మనం ఉన్నట్టుగా రామాయణ ఇతిహాసంతో ట్రావెల్ అవుతాం. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే  కైకసి(శోభన) సీన్ తోనే కొత్త రామాయణని చూడబోతున్నామని అర్ధమవుతుంది. దీంతో రామాయణంకి సరెండర్ అవుతాం. దశానన (యష్) సీన్స్ తో పాటు దశానన రావణగా మారే ఎపిసోడ్ సూపర్. రాముడి(రణబీర్) జనన రహస్యం, పెద్దయ్యాక ఇంట్రడక్షన్ సీన్ అన్ని కూడా రోమాంచితంగా ఉన్నాయి. రాముడు సౌమ్యుడు కాబట్టే ఆ విధమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, షాట్ డివిజన్ చేసిన తీరు ఎక్స్ లెంట్. రాముడి ఊహల్లో సీతాదేవిని (సాయి పల్లవి) ని సీతాదేవి తన ఊహల్లో రాముడ్ని ఊహించుకునే వెర్షన్ కొత్తదనంతో నిండి కధనంకి మరింత వెలుగుని తెచ్చింది. ఇద్దరి వివాహం జరిగిన విధానాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసుండాల్సిందేమో. వనవాసంకి వెళ్లే టోటల్ ఎపిసోడ్ కూడా చాలా బాగుంది. కాకపోతే ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించే విషయంలో డైలాగ్స్ మరింత ఆర్తిగా ఉండాల్సింది. ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్. సెకండ్ హాఫ్ లో చూసుకుంటే అడవిలో సన్నివేశాలు బాగానే  ఉన్నాయి.  రాముడు, శూర్పణఖ మధ్య వచ్చిన ట్రాక్ సింపుల్ గా తేల్చేసినట్టుగా ఉంది. ఆ తర్వాత వచ్చిన యాక్షన్ ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవల్. రావణుడుని పదితలల వాడిగా ఎందుకని అనుకుంటూ ఉంటామో వివరణలా వచ్చిన సీన్ బాగుంది. సీతాదేవిని అపహరించే సీన్ బాగానే ఉన్నా,ఆ ఎపిసోడ్ ని బాగా లెన్త్ లో తెరకెక్కించి ప్రేక్షకుల్లో సీతాదేవిని అపహరించేటప్పుడు క్యూరియాసిటీని కలిగించాల్సింది. నటీనటులు, సాంకేతిక నిపుణులపనితీరు  రాముడిగా రణభీర్ పెర్ఫార్మ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సాక్షాత్తు కోదండ రాముడే కళ్ళ ముందు ఉన్నట్టుగా మెస్మరైజ్ చేసి పడేసాడు. మరి ముఖ్యంగా అత్యంత కష్ట తరంతో కూడుకున్న సాత్వికమైన నటనలో కళ్ళు, ముఖంలో ఒకే రకమైన ఎక్స్ ప్రెషన్ ఇవ్వడంలో నభూతో నబిష్యత్. ఒక రకంగా తన జీవితం ధన్యమైనట్టే. సాయి పల్లవి కూడా అంతే, సీతాదేవిగా ఒక రేంజ్ పెర్ఫార్మ్ చేసింది. రావణుడిగా యష్ నూటికి నూరుపాళ్లు సెట్ అయ్యాడు. ఇంచు కూడా తగ్గకుండా మేకర్స్ తనపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కానీ విధంగా రావణ క్యారక్టర్ లో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మ్ ఇచ్చాడు. మిగతా క్యారెక్టర్స్ లో చేసిన రకుల్, రవి దూబే, అరుణ్ గోవిల్ ఇలా అందరూ రామాయణం కోసమే మేము నటనలో ఓనమాలు దిద్దినట్టుగా మెప్పించారు. లెజండ్రీ మేకర్  నితీష్ తివారి దర్శకత్వం ఒక రేంజ్ లో ఉంది. ప్రతి షాట్ ని అద్భుతమైన దృశ్య కావ్యంగా మలచాలనే తపనతో తీర్చిదిద్దారు. కాకపోతే రచయిత కోణంలో ఆలోచిస్తే భావోద్వేగం కలిగించే సన్నివేశాలని మరింత లెన్త్ గా చూపించాల్సిది. నమిత్ మల్హోత్రా నుంచి విజువల్ ఎఫెక్ట్స్, నిర్మాణ విలువలు రామాయణకి మరింత వన్నె తెచ్చాయి. ఏ ఆర్ రెహ్మాన్, హన్స్ జిమ్మర్  నుంచి బ్యాక్ గ్రౌండ్  స్కోర్ , ఫొటోగ్రఫీ రామాయణకి అదనపు బలంగా నిలిచాయి.  బలాలు 1 .రణబీర్, యష్, సాయిపల్లవితో పాటు ఆల్ ఆర్టిస్ట్ పెర్ ఫార్మెన్స్ 2 . కథ, కథనం 3 . డైరెక్షన్  4 . విజువల్ ఎఫెక్ట్స్  5 .నిర్మాణ విలువలు  6 . ఫోటోగ్రఫీ  బ్యాక్ గ్రౌండ్ స్కోర్  7 . కాస్ట్యూమ్స్  8 . ఫస్ట్ హాఫ్  బలహీనతలు  1 . సెకండ్ హాఫ్ లో ఎక్కువ కథని చెప్పకపోవడం   చివరిగా చెప్పాలంటే ఎన్నో రామాయణాలు వచ్చినా ఈ నయా 'రామాయణం' కొత్తగా, క్వాలిటీ గా ఉంది. నిరుత్సాహపరచదు.   రేటింగ్ 2.75/5                                                                                                                    అరుణాచలం 
Cast: Ranbir Kapoor, Sai Pallavi, Yash, Ravi Dubey, Kajal Aggarwal, Rakul Preet Singh, Vivek Oberoi, Shobana, Arun Govil, Lara Dutta, Anupam Kher Crew:  Based on Sage Valmiki's Ramayana Written by Shreyas Jain, Shridhar Raghavan, Nitesh Tiwari Cinematography by Pankaj Kumar, Mahesh Limaye Editing by Huzefa Lokhandwala Music by Hans Zimmer, A. R. Rahman Directed by Nitesh Tiwari Produced by Namit Malhotra, Yash, DNEG Ramayana, the most beloved epic of India, is considered mythology by some and real history by many. Talking a middle ground and re-imagining the Sage Valmiki's poetic verse, Namit Malhotra and Nitesh Tiwari brought the new epic re-telling, Ramayana, as two part Saga. The first part released on 5th November and second part is scheduled for 2028 Diwali. Let's discuss about the movie in detail.  Plot:  While everyone is aware about Ram's story, this plot details reflect what this movie is all about. Jatayu (Anupam Kher) narrates the story of how Asuras led by princess Kaikasi (Shobana) fight ferociously against Lord Indra (Kunal Kapoor) led Devathas. Kaikasi asks her elder son, Dashanana (Yash) to lead the attack of Asuras and bring their resurgence. He takes the onus upon himself even though he loves to play veena and live like a sage. His other brothers - Kumbhakarna and Vibhishana (Harish Uttaman) are not similarly capable. Dashanana gets the boon of Lord Brahma to not be harmed by any weapon yielded by Devathas, Kinneras, Yaksha, Kimpurushas and leaves out humans. He surges against Kubera and takes over Lanka, and even defeats Indra. So, the king of Devathas pleads Lord Vishnu to help them. He takes the form of Rama (Ranbir Kapoor), eldest son of King Dasaratha (Arun Govil). He is always puzzled by the question of what is his destiny. He goes with Sage Vishwamitra to defeating Tadakha, Subhahu. He travels to Mithila and marries Sita (Sai Pallavi), after lifting Lord Shiva's Dhanusu. Dasaratha decides to coronate Rama as Ayodhya's King but then Rama decides to honor his father's word to Kaikeyi (Lara Dutta) and accepts 14 years of exile from Kingdom. The story ends at Ravana abducting Sita and Jatayu being killed in the battle to save Sita. Watch the movie to know how the makers narrated this story.  Analysis:  Note: Telugu Press premiere had been conducted in 2D and this review reflects the experience of watching the film in same format but not in 3D or IMAX.  Ranbir Kapoor is good as Rama but he decided to restrict his natural charm and restrain in playing Lord Rama. It is visible in his stance, in his body language. In few scenes, his performance comes across as him trying too much to fit in to a different body language and feels awkward. Overall, he did try his best to not be the Ranbir Kapoor, audiences have been used to watching on screen. Sai Pallavi is okayish as Sita. While her efforts are visible, she did not really leave an impact.  Yash as Ravana is splendid. His screen presence, his performance - mainly, in the ten different personalities leading him to take a decision scene, stand out. He did put his best foot forward to look, act and bring aura of Ravana to the scenes. Ravi Dubey, Arun Govil, Lara Dutta, Kajal Aggarwal, Rakul Preet Singh are okay but they do not leave any sort of impact. Shobana is very good in the portions given to her.  Nitesh Tiwari tried to re-imagine a lot of portions and add more meat to Ravana's side of the story. But the materials they have sourced from is not Valmiki Ramayana in those portions. Also, Rama looking to find his destiny is not taken from Valmiki's version, as the sage's manuscript never states that Ram did not know his purpose rather it points to the opposite. He knew it. The makers also try to showcase Ravana taking revenge for Surpanaka and knowing Ram could be Lord Vishnu's avatar, which is also sourced from other interpretations but not from Valmiki's Ramayana.  The makers tried to give their twist to many renowned scenes and established beats. At many places, it feels like they tried to re-work certain emotions to fit their interpretation like Sita fighting and being a warrior alongside Ram. These kind of embellishments to the popular epic fail to really evoke a surprise as the narration is flat. The slow paced stretches turn predictable and they are not executed with similar vigor, visually.  VFX artists did put their best foot forward. While visually, it is not ground-breaking, majority of the portions are new for Indian screens. Cinematography could have been better as at places, it is evident that movie had been shot on green screen and in a studio. Maybe, a little more mix of real locations and enhancement through VFX might have worked better. Music by Hans Zimmer and AR Rahman is a big letdown. The amalgamation did not really shine.  Namit Malhotra's vision of scaling up Ramayana with Hollywood level visuals and re-interpret it as a cross between real history and mythology is visible but it doesn't yield stunning results. The effort and conscious decision behind action choreography to not let Rama be seen as a superhuman is understandable but lacks the impact. Similarly, most hyped portions also feel like inspired from other big films rather than being true to well-known text.  Maybe a grounded and more realistic approach like Christopher Nolan's The Odyssey could've been refreshing than this film. Overall, the movie doesn't really has the same impact as Sampoorna Ramayanam, Seetha Kalyanam and Sita Ramula Kalyanam, Bhookailas kind of films and Hindi Ramayana serial. It tries to be different yet seems to have over-stretched material as the intended awe and impact are missing. It is decent attempt and better than Adipurush.  Positives:  Yash's performance VFX and production design Detailing in Fur, Animal animation Intent to be different Epic Scale Negatives:  Slow Narrative Over-stretching portions without impact Lacklustre Writing  Several portions are executed lethargically Music and BGM  Bottomline: Scale and efforts are visible but lacks similar impact. One-time watchable and better than Adipurush.  Rating: 2.75/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
సినిమా ఇండస్ట్రీలోకి కొత్త నటులు పరిచయం కావడం సహజమే. కానీ ఎలాంటి స్టార్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వస్తున్న ఓ కొత్త నటుడికి అక్కినేని నాగార్జున అండగా నిలవడం, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి ప్రశంసించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ కొత్త నటుడు ఎవరు? ఆయన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇండస్ట్రీలో ఇంతమంది ప్రముఖులు అతడిని సపోర్ట్ చేయడానికి కారణమేంటి? ఆ నటుడే అనీష్. ఆయన హీరోగా పరిచయమవుతున్న సినిమానే 'ఇట్లు అర్జున'. ఈ సినిమాను నాగార్జున సమర్పిస్తుండగా, తాజాగా ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల చేశారు. దీంతో అనీష్ గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అనీష్ ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త మహేశ్ రెడ్డి తనయుడు. ఆయన కుటుంబానికి సినిమా ఇండస్ట్రీతో మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా అక్కినేని నాగార్జునతో అనీష్ ఫ్యామిలీకి ప్రత్యేకమైన పరిచయం ఉంది. అందుకు కారణం మహేశ్ రెడ్డి గతంలో నాగార్జున నటించిన 'శిరిడి సాయి', 'ఓం నమో వేంకటేశాయ' సినిమాలను నిర్మించడమే. ఈ రెండు సినిమాలతో నాగార్జున, మహేశ్ రెడ్డి మధ్య మంచి అనుబంధం ఏర్పడినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. వీరిద్దరూ బిజినెస్ పార్ట్‌నర్స్ అనే ప్రచారం కూడా ఉంది.  అనీష్ తొలి సినిమాను నాగార్జున ప్రజెంట్ చేయడం వెనుక ఈ పాత అనుబంధం కూడా ఓ కారణమని చర్చ జరుగుతోంది. అయితే కేవలం పరిచయం మాత్రమే కాకుండా సినిమా కంటెంట్ కూడా నాగార్జునకు నచ్చిందని తెలుస్తోంది. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ముందుండే నాగార్జున.. 'ఇట్లు అర్జున' కాన్సెప్ట్, అనీష్ నటన నచ్చడంతో ఈ సినిమాకు అండగా నిలిచారు. ఇక తాజాగా ఎన్టీఆర్ కూడా అనీష్‌కు తన మద్దతు ప్రకటించారు. 'ఇట్లు అర్జున' ట్రైలర్‌ను విడుదల చేసిన తారక్.. తొలి సినిమాతోనే ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రను ఎంచుకోవడం సాహసమని ప్రశంసించారు. ముఖ్యంగా సినిమాలో అనీష్ ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా నటించడం తనకు నచ్చిందని అభినందించారు. అనీష్ ఫ్యామిలీతో ఎన్టీఆర్ కి కూడా బాండింగ్ ఉందని తెలుస్తోంది. ఓ కొత్త నటుడి సినిమా ట్రైలర్‌ను ఎన్టీఆర్ స్థాయి స్టార్ విడుదల చేయడం, పైగా అతడి నటనను ప్రత్యేకంగా ప్రశంసించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాలో అర్జున్ అనే మాటలు రాని యువకుడిగా అనీష్ కనిపించనున్నారు. అతడికి కీర్తి (అనస్వర రాజన్) అంటే ఎంతో ఇష్టం. అయితే ఈ ప్రేమకథలోకి ఓ భారీ క్రైమ్ ఎపిసోడ్ వచ్చి చేరుతుంది. ఓ దొంగతనం కేసులో పోలీసులు అర్జున్ కోసం వెతుకుతుంటే.. మరోవైపు రూ.1000 కోట్ల డీల్‌కు సంబంధించిన పెన్‌డ్రైవ్ కోసం ఓ గ్యాంగ్ అతడిని, కీర్తిని వెంటాడుతుంది. అసలు ఆ పెన్‌డ్రైవ్‌కు అర్జున్‌కు సంబంధం ఏంటి? మాటలు రాని యువకుడిగా అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ప్రేమ కోసం మొదలైన ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది సినిమాలో చూడాలి. థమన్ సంగీతం అందిస్తుండగా, మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నవంబర్ 13న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. మరి పలువురు స్టార్స్ అండతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న అనీష్.. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: ఇట్లు అర్జున ట్రైలర్.. నాగార్జున ప్రజెంటేషన్‌లో కొత్త ప్రయోగం.!       [Itllu Arjuna Hero Aniesh Family Background, Itllu Arjuna Movie, Actor Aniesh, Producer Mahesh Reddy, Shiridi Sai, Om Namo Venkatesaya, Nagarjuna, Jr NTR, Anaswara Rajan]  
కోలీవుడ్ లేటెస్ట్ ఇండస్ట్రీ హిట్ ‘జైలర్ 2’ మూవీ నవంబర్ 12 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ఇటీవల ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ తాజాగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.  సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ఖరారైంది. నవంబర్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.  అక్టోబర్ 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. రజినీకాంత్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా యాక్షన్ సన్నివేశాలు, స్టార్ క్యాస్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా కనిపించారు. ఆయనతో పాటు రమ్యకృష్ణ, యోగిబాబు, ఎస్.జే. సూర్య, విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజరమూడు కీలక పాత్రల్లో నటించారు. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి వంటి ప్రముఖ నటుల ప్రత్యేక పాత్రలు కూడా సినిమాకు ఆకర్షణగా నిలిచాయి. అనిరుధ్ అందించిన సంగీతం మరో హైలైట్‌గా నిలిచింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఓటీటీ వెర్షన్‌లో థియేటర్లలో చూపించని కొన్ని సన్నివేశాలు కూడా ఉండవచ్చని గతంలో ప్రచారం జరిగింది. ముఖ్యంగా మోహన్‌లాల్, విజయ్ సేతుపతి, హృతిక్ రోషన్‌కు సంబంధించిన మరిన్ని సన్నివేశాలతో సహా సుమారు 30 నిమిషాల అదనపు ఫుటేజ్ ఉంటుందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌పై మేకర్స్ నుంచి అధికారిక స్పష్టత లేదు. ఇది కూడా చదవండి: రామాయణ మూవీ ట్విట్టర్ రివ్యూ https://x.com/PrimeVideoIN/status/2118199134679130305       [Jailer 2 OTT Release Date, Jailer 2 OTT Telugu, Jailer 2 Amazon Prime Video, Jailer 2 Streaming Date, Rajinikanth Jailer 2, Jailer 2 OTT, Nelson Dilipkumar, Rajinikanth]  
థియేటర్లలో మంచి స్పందనను పొందిన షరాఫుద్దీన్, సంగీత్ ప్రతాప్ నటించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’ చిత్రం మనోరమా మాక్స్‌లో అద్భుతమైన ప్రారంభాన్ని సాధించింది. ఈ కామెడీ థ్రిల్లర్ ఓటిటి స్ట్రీమింగ్ విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్ల నిమిషాలకు పైగా వాచ్ టైమ్‌ను నమోదు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ప్రత్యేకంగా మనోరమా మాక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ నాలుగు భాషల ప్రేక్షకులను అలరిస్తోంది. డెబ్యూ డైరెక్టర్ శ్యామిన్ గిరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఒక వినూత్నమైన కథాంశాన్ని హాస్యం ఇంకా ఊహించని ట్విస్టులతో అద్భుతంగా తెరకెక్కించింది.  ‘ప్రేమలు’ చిత్రంలో అమల్ డేవిస్‌గా, ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’లో జోయెల్‌గా గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ ప్రతాప్ ఈ చిత్రంలో తొలిసారిగా లీడ్ రోల్‌లో నటించగా, షరాఫుద్దీన్ ఒక కీలక పాత్రలో కనిపించారు. కోమాలో నుంచి అద్భుతంగా కోలుకుని, దూరం నుంచి వచ్చే శబ్దాలు, సంభాషణలను వినే అసాధారణ శక్తిని పొందిన రూబిన్ (సంగీత్ ప్రతాప్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సూరజ్ (షరాఫుద్దీన్) అనే స్నేహపూర్వక పోలీసు అధికారిని కలవడం వల్ల జరిగే ఊహించని పరిణామాలు ఈ చిత్రంలో కామెడీ, సస్పెన్స్‌ను జోడిస్తాయి. ఈ చిత్రంలో షరాఫుద్దీన్, సంగీత్ ప్రతాప్‌లతో పాటు అఖిల భార్గవన్, పార్వతి ఆర్. కృష్ణ, కోట్టాయం నసీర్, ఆనంద్ మన్మధన్, కిరణ్ పీతాంబరన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ‘కరిక్కు’ ఫేమ్ నీలీన్ సంద్ర ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించారు. డా. పాల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, డ్రీమ్ బిగ్ ఫిలిప్స్ బ్యానర్లపై డా. పాల్ వర్గీస్, సుజిత్ జే నాయర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అఖిల్ జేవియర్ సినిమాటోగ్రఫీ అందించగా, రాకేష్ చెరుమడం ఎడిటర్‌గా వ్యవహరించారు. ముజీబ్ మజీద్ సంగీతం సమకూర్చగా, నిక్సన్ జార్జ్ సౌండ్ డిజైనర్‌గా పనిచేశారు. ఇది కూడా చదవండి: రామాయణ ట్విట్టర్ రివ్యూ       [It’s A Medical Miracle On ManoramaMAX, It’s A Medical Miracle OTT, Sangeeth Prathap, Sharaf U Dheen, Premalu Movie, Its A Medical Miracle, OTT Movies, ManoramaMAX]  
ఎంతో కాలంగా భారతీయ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ‘రామాయణ’ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా నటించిన ఈ భారీ చిత్రం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. నితీష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి మాత్రం భిన్నమైన స్పందన వస్తోంది. ముఖ్యంగా సినిమా విజువల్స్, గ్రాఫిక్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్‌పై ప్రశంసలు కురుస్తుండగా.. కథనం, సంగీతం విషయంలో మాత్రం కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో రామాయణం గురించి వస్తున్న పోస్టులు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఈ సినిమాలో ఎక్కువగా ప్రశంసలు అందుకుంటున్నది మాత్రం యశ్ నటన. రావణుడి పాత్రలో ఆయన కనిపించిన తీరు, ముఖ్యంగా ఇంట్రడక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయట. కొందరు నెటిజన్లు యశ్‌ను ఈ సినిమాకు అసలైన సీన్ స్టీలర్‌గా అభివర్ణిస్తున్నారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు రాముడిగా రణ్‌బీర్ కపూర్ కూడా మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయన నటనలోని ప్రశాంతత, పాత్రకు తగ్గట్టుగా చూపించిన హావభావాలు ఆకట్టుకున్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సీతగా సాయి పల్లవి కూడా తన పాత్రకు న్యాయం చేశారని టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మంచి మార్కులు సంపాదిస్తోంది. గ్రాండ్ సెట్స్, యుద్ధ సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయని కొందరు ప్రశంసిస్తున్నారు. అయితే కొన్ని సన్నివేశాల్లో గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయని, కొన్ని గ్రాఫిక్స్ ఆశించిన స్థాయిలో లేవని మరికొందరు విమర్శిస్తున్నారు. ఇక కథనం విషయంలోనే ఎక్కువగా మిశ్రమ స్పందన వస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలపై ఎక్కువ దృష్టి పెట్టడంతో ఎమోషన్స్, డ్రామా కొంత తగ్గిపోయాయని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ కలిసి సంగీతం అందించారు. ఇలాంటి ఇద్దరు దిగ్గజాలు పనిచేయడంతో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సినిమా చూసిన కొందరు మాత్రం సంగీతం ఆశించిన స్థాయిలో లేదని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఇతిహాస కథలో దైవత్వం, భావోద్వేగాలను సంగీతం మరింత బలంగా ఎలివేట్ చేయాల్సి ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ‘రామాయణం’లో గ్రాండియర్, విజువల్స్, యశ్ నటనకు మంచి స్పందన వస్తుండగా.. కథనం, ఎమోషన్స్, సంగీతం విషయంలో మాత్రం మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ సోషల్ మీడియా టాక్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? రామాయణ భారీ అంచనాలను అందుకుంటుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: ‘రామాయణ’ రివ్యూ ఇచ్చిన దిల్ రాజు.!           [Ramayana Twitter Review, Ramayana Review Telugu, Ramayana Audience Response, Ramayana Movie Review, Ramayana Mixed Reviews, Ranbir Kapoor, Yash Ravana, Sai Pallavi, Nitesh Tiwari, Namit Malhotra]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మన ఆరోగ్యవంతమైన జీవనానికి ప్రకృతి మనకు అందించిన ఎన్నో రకాల తృధాన్యాలు మరియు పోషక విలువలతో కూడిన పదార్థాలు ఎంతో దోహదపడతాయి. అలాంటి వాటిలో మినుములు లేదా మినప్పప్పు మన తెలుగు వంటకాల్లో ప్రముఖ స్థానం సంపాదించుకున్నాయి. 'మినుములు తింటే ఇనుమంత బలం వస్తుంది' అనే నానుడి మన పెద్దల కాలం నుంచి ఎంతో ప్రాచుర్యంలో ఉంది. ఈ నానుడి కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఆధునిక ఆరోగ్య నిపుణులు మరియు వైద్యులు కూడా మినుములలోని అపారమైన పోషక విలువలను పూర్తిగా సమర్థిస్తున్నారు. వీటిని క్రమం తప్పకుండా మన డైట్‌లో భాగం చేసుకోవడం ద్వారా శరీర రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుందని, తద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి రక్షణ లభిస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మినుములలో శరీరానికి అత్యవసరమైన అనేక పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా నిరుపమానంగా లభిస్తాయి. ముఖ్యంగా వీటిలో అధిక మొత్తంలో ప్రోటీన్లు, ఫైబర్ లేదా పీచు పదార్థం, కాల్షియం, భాస్వరం (ఫాస్ఫరస్), ఐరన్, పొటాషియం, బి-కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్-సి మరియు ఆరోగ్యకరమైన మంచి కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ కలిసి మన నాడీ వ్యవస్థను, జీవక్రియలను అత్యంత సక్రమంగా మరియు ఆరోగ్యకరంగా నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఉదయం చేసే అల్పాహారంలో లేదా మధ్యాహ్న భోజనంలో మినుములతో తయారు చేసిన వంటకాలను తీసుకోవడం వల్ల శరీరం రోజంతా శక్తివంతంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో మినుములు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో లభించే పీచు పదార్థం (ఫైబర్) జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మలబద్ధకం, ఉబ్బసం వంటి అసౌకర్యాలను నివారించడంలో మినుములు ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా, మధుమేహం మరియు రక్తహీనత వంటి దీర్ఘకాలిక సమస్యలకు ఇది ఒక చక్కటి పరిష్కార మార్గం. మినుములోని పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడమే కాకుండా, ఇన్సులిన్ మరియు గ్లూకోజ్ స్థాయులను క్రమబద్ధీకరించి షుగర్ వ్యాధి ముప్పును సమర్థవంతంగా అడ్డుకుంటాయి. అలాగే శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనతను నివారిస్తాయి. ఎముకల దృఢత్వానికి మినుములు ఒక పవర్‌ఫుల్ సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. వీటిలో కాల్షియం, భాస్వరం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు అత్యధికంగా ఉంటాయి. ఈ ఖనిజాలు ఎముకలను బలంగా, పటిష్టంగా ఉంచడానికి అత్యంత కీలకం. ముఖ్యంగా ఎముకలు విరిగినవారు, ఆర్థరైటిస్, కీళ్లవాతం మరియు కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నవారు తమ దైనందిన ఆహారంలో మినుములను కచ్చితంగా చేర్చుకోవడం ద్వారా ఊహించని ప్రయోజనాలను పొందవచ్చు. కండరాలకు మరియు నరాలకు కూడా ఇది అసాధారణమైన బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన మరియు బలమైన శరీరం కోసం ఈ అద్భుతమైన ధాన్యాన్ని మీ డైట్‌లో భాగం చేసుకోండి.     Black Gram Health Benefits, Urad Dal Medicinal Uses, Joint Pain Natural Remedy, Asthma Relief Food Tips, Minumulu Health Uses, Traditional Nutrition Advice, Health Tips In Telugu.  
ఈ రోజుల్లో చాలామందిని వేధించే అత్యంత సాధారణ సమస్యల్లో వెన్ను నొప్పి లేదా నడుము నొప్పి ఒకటి. గంటల తరబడి కుర్చీలో లేవకుండా కూర్చోవడం, ఫోన్‌ చూస్తూ ముందుకు వంగడం వంటి ఆధునిక జీవనశైలి అలవాట్లు మన వెన్నెముకపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తున్నాయి. దీనివల్ల నడుము నొప్పి, వీపులో అసౌకర్యం, కండరాల బిగుతు వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే, మన దినచర్యలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ నొప్పుల బారి నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు. వెన్నెముకను ఆరోగ్యంగా, ఉక్కులా దృఢంగా మార్చుకోవడానికి నిపుణులు సూచిస్తున్న ఆ ముఖ్యమైన 5 అలవాట్లను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది కండరాలకు తగిన పని చెప్పడం. వెన్నెముక సురక్షితంగా ఉండాలంటే దానికి పునాదిగా ఉండే వీపు, నడుము మరియు కోర్ (పొట్ట) కండరాలు బలంగా ఉండాలి. అందుకోసం వారానికి కనీసం 2 లేదా 3 రోజులు ఈ కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయాలి. అయితే మొదటి రోజే కఠినమైన వర్కౌట్లు చేయకుండా, మీ శరీర సామర్థ్యాన్ని బట్టి నెమ్మదిగా మొదలుపెట్టి క్రమంగా తీవ్రతను పెంచడం మంచిది. కేవలం వ్యాయామమే కాకుండా, మనం తీసుకునే పోషకాహారం కూడా వెన్నెముక ఆరోగ్యాన్ని శాసిస్తుంది. రోజూ పాలు, పెరుగు, పన్నీర్ వంటి కాల్షియం పదార్థాలు ఎముకలకు బలాన్ని ఇస్తే.. కోడిగుడ్లు, పప్పు ధాన్యాలు, చేపలు వంటివి కండరాలకు కావాల్సిన ప్రొటీన్‌ను అందిస్తాయి. ఈ సమతుల్య ఆహారం వెన్నెముకకు శ్రీరామరక్ష లాంటిది. ఆఫీసు పనిలో పడి గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చునే అలవాటును మార్చుకోవాలి. ప్రతి అరగంటకోసారి సీట్లోంచి లేచి రెండు నిమిషాలు అటూ ఇటూ నడవడం లేదా తేలికపాటి స్ట్రెచింగ్ చేయడం చాలా ముఖ్యం. శరీరానికి ఎప్పటికప్పుడు కదలిక ఇవ్వడమే అత్యుత్తమమైన భంగిమ అని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మన శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడానికి నడకను మించిన సులభమైన మార్గం మరొకటి లేదు. ప్రతిరోజూ కనీసం 8,000 అడుగులు నడవాలని లక్ష్యంగా పెట్టుకుంటే గుండె ఆరోగ్యంతో పాటు బరువు కూడా అదుపులో ఉంటుంది. నడిచే అలవాటు లేనివారు కొద్ది దూరంతో ప్రారంభించి నెమ్మదిగా అడుగుల సంఖ్యను పెంచుకోవాలి. చివరిది మరియు అత్యంత ముఖ్యమైనది బరువుపై పూర్తి నియంత్రణ కలిగి ఉండటం. శరీర బరువు పరిమితి దాటితే ఆ అదనపు భారం మొత్తం నేరుగా వెన్నెముకపైనే పడుతుంది. కాబట్టి సరైన వ్యాయామం, ఆహార నియమాలతో బరువును అదుపులో ఉంచుకోవాలి. అలాగే బరువైన వస్తువులను పైకి ఎత్తేటప్పుడు ఎప్పుడూ నడుమును వంచకూడదు. దానికి బదులుగా మోకాళ్లు, తుంటిని మడిచి వస్తువును శరీరానికి దగ్గరగా పట్టుకుని పైకి లేవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ చిన్న జీవనశైలి మార్పులతో వెన్నునొప్పికి దూరంగా ఉండవచ్చు.     Lower Back Pain Relief, Strong Spine Habits, Cure Backache Naturally, Posture Correction Tips, Spine Health Exercises, Daily Habits For Back Pain, Health Tips In Telugu.
మనలో చాలా మందికి పాఠశాల రోజుల నుంచే ఒక ప్రాథమిక వైద్య సత్యం గుర్తిండిపోయింది. ఆరోగ్యంగా ఉన్న ఏ మనిషి శరీర ఉష్ణోగ్రత అయినా సరే సాధారణంగా 98.6 డిగ్రీల ఫారెన్‌హీట్ (37 డిగ్రీల సెల్సియస్) ఉండాలని మనం నమ్ముతూ వస్తున్నాము. ఎవరికైనా జ్వరం ఉందా లేదా అని నిర్ధారించుకోవడానికి దశాబ్దాలుగా ఈ కొలతనే మనం ప్రామాణికంగా ఉపయోగిస్తున్నాము. అయితే, ప్రసిద్ధ స్టాన్‌ఫోర్డ్ మెడిసిన్ పరిశోధకులు నిర్వహించిన ఒక తాజా మరియు అత్యంత విస్తృతమైన అధ్యయనం ఈ నమ్మకాన్ని పూర్తిగా తలకిందులు చేసింది. ఆధునిక కాలంలో మనుషుల సగటు శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతోందని, అలాగే 98.6 డిగ్రీల ఫారెన్‌హీట్ అనేది నేటి కాలానికి కొద్దిగా ఎక్కువేనని ఈ పరిశోధన తేల్చిచెప్పింది. నేడు సగటు మనిషి శరీర ఉష్ణోగ్రత దాదాపు 97.9 డిగ్రీల ఫారెన్‌హీట్ లేదా అంతకంటే తక్కువగా ఉంటోందని నిపుణులు వెల్లడించారు. ఈ అద్భుతమైన పరిశోధన వివరాలు వైద్య రంగంలో సరికొత్త చర్చకు దారితీశాయి. ఈ విప్లవాత్మక అధ్యయనం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే, 19వ శతాబ్దంలో అనగా 1868లో ఒక జర్మన్ వైద్యుడు కార్ల్ వండర్‌లిచ్ సుమారు 25,000 మంది రోగుల ఉష్ణోగ్రతలను సేకరించి 98.6 డిగ్రీల ఫారెన్‌హీట్‌ను సగటు ప్రమాణంగా నిర్ణయించారు. కానీ కాలం మారుతున్న కొద్దీ మానవ శరీర నిర్మాణంలో మరియు జీవన విధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. స్టాన్‌ఫోర్డ్ పరిశోధకులు 19వ శతాబ్దం నుంచి నేటి వరకు సుమారు 6,77,000 మందికి పైగా వ్యక్తుల నుంచి సేకరించిన భారీ డేటాను విశ్లేషించారు. దీని ప్రకారం, పాత కాలంతో పోలిస్తే ఆధునిక కాలంలో మనుషుల శరీర ఉష్ణోగ్రత ప్రతి దశాబ్దానికి సుమారు 0.05 డిగ్రీల ఫారెన్‌హీట్ చొప్పున క్రమంగా తగ్గుతూ వస్తోందని తేలింది. 2000వ దశకంలో పురుషులలో శరీర ఉష్ణోగ్రత ప్రారంభ 1800ల నాటి పురుషులతో పోలిస్తే సగటున 1.06 డిగ్రీల ఫారెన్‌హీట్ తక్కువగా నమోదైంది. అదేవిధంగా, మహిళల్లో కూడా దాదాపు 0.58 డిగ్రీల ఫారెన్‌హీట్ మేర ఉష్ణోగ్రత తగ్గుదల కనిపించింది. మానవ శరీర ఉష్ణోగ్రత తగ్గడానికి గల ప్రధాన కారణాలపై వైద్య నిపుణులు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గత రెండు వందల సంవత్సరాలలో మన జీవన ప్రమాణాలు మెరుగుపడటం, పబ్లిక్ హెల్త్ సదుపాయాలు అందుబాటులోకి రావడం, మరియు శరీరంలో దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్ (మంట లేదా వాపులు) తగ్గుముఖం పట్టడం ఇందుకు ముఖ్య కారణాలుగా పరిశోధకులు భావిస్తున్నారు. పాతకాలంలో క్షయ వంటి దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్లు సర్వసాధారణంగా ఉండటం వల్ల ప్రజల శరీర ఉష్ణోగ్రతలు తరచుగా ఎక్కువగా నమోదయ్యేవి. ఆధునిక వైద్యం, మెరుగైన ఆహారపు అలవాట్లు మరియు పరిశుభ్రమైన వాతావరణం కారణంగా మన శరీరాలు అంతర్గతంగా ప్రశాంతంగా ఉంటూ, జీవక్రియలో వచ్చే మార్పుల వల్ల చల్లబడుతున్నాయి. అంతేకాకుండా, శరీర ఉష్ణోగ్రత అనేది అందరికీ ఒకేలా ఉండదని, ఇది ప్రతి ఒక్కరి వయస్సు, లింగం, బరువు, ఎత్తు మరియు రోజు జరిగే సమయాన్ని బట్టి మారుతుంటుందని స్టాన్‌ఫోర్డ్ నిపుణులు స్పష్టం చేశారు. ఉదాహరణకు, ఉదయం పూట ఉండే ఉష్ణోగ్రత కంటే మధ్యాహ్నం మరియు సాయంత్రం వేళల్లో శరీర ఉష్ణోగ్రత కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అలాగే వృద్ధులతో పోలిస్తే యువతలో, పురుషులతో పోలిస్తే మహిళల్లో ఉష్ణోగ్రతలు కొద్దిగా భిన్నంగా నమోదువుతాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ ఒకే నిర్దిష్టమైన సాధారణ ఉష్ణోగ్రతను ఆపాదించడం సరికాదని, ప్రతి మనిషికి వారి సొంత సహజ ఉష్ణోగ్రత వేర్వేరుగా ఉంటుందని ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది. సాధారణ జ్వరం గురించి మాట్లాడితే, వయోజనులలో కనీసం 100.4 డిగ్రీల ఫారెన్‌హీట్ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటేనే దానిని వైద్యపరంగా జ్వరంగా పరిగణించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత శరీర ఉష్ణోగ్రతలలోని హెచ్చుతగ్గులను ముందుగానే పసిగట్టగలిగితే భవిష్యత్తులో వ్యాధులను ముందస్తుగా గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం సులువవుతుందని స్టాన్‌ఫోర్డ్ పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.     Human Body Temperature 98.6, Stanford University Health Study, Normal Temperature Facts, Medical Science Discoveries, Average Body Heat Changes, Health Facts In Telugu, Science Articles.
మలబద్ధకం సమస్యతో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. సరిగ్గా మలవిసర్జన కాకపోవడం, మలం గట్టిగా రావడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రోజువారీ జీవితాన్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇలాంటి సమస్యలకు సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు ఎంతో ఉపయోగపడతాయి. ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ మలబద్ధకం సమస్యకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను వివరించారు. వాము, బెల్లం, కరక్కాయ పెచ్చుల వంటి సహజ పదార్థాల ఉపయోగాలు, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వాటి పాత్ర గురించి తెలియజేశారు. మలబద్ధకం సమస్యకు కారణాలు ఏమిటి? పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? మలవిసర్జన సాఫీగా జరిగేందుకు ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించాలి? వాము, బెల్లం, కరక్కాయలను ఎలా ఉపయోగించాలి? మలబద్ధకం సమస్యను తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సహజమైన పద్ధతులతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. మలబద్ధకం సమస్య తరచూ వేధిస్తున్నా, తీవ్రమైన కడుపునొప్పి లేదా మలంలో రక్తం కనిపించినా వైద్యులను సంప్రదించడం అవసరం. మలబద్ధకం సమస్యకు ఆయుర్వేదంలో సూచించే సహజ పరిష్కారాలు, వాము, బెల్లం, కరక్కాయ పెచ్చుల ఉపయోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
నేటి కాలంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ లు, కంప్యూటర్లు మన దైనందిన జీవితంలో ప్రధాన భాగమైపోయాయి. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు స్క్రీన్ వైపు చూడటం చాలా మందికి అలవాటుగా మారిపోయింది. సోషల్ మీడియా వాడకం, ఆఫీస్ పని లేదా వినోదం కోసం గంటల తరబడి డివైజ్‌ల ముందే గడపడం సర్వసాధారణం అయింది. ఈ నేపథ్యంలో స్క్రీన్ టైమ్ ఎక్కువైతే దుష్పభావాలు ఉంటాయని వైద్యులు కూడా చెబుతున్నారు. అయితే తాజాగా..  ఈ విషయం గురించి  వైద్య నిపుణులు , పరిశోధకులు చెబుతున్న విస్తుపోయే నిజాలేంటో వివరంగా తెలుసుకుంటే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం కేవలం స్క్రీన్ ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల నేరుగా పక్షవాతం వస్తుందని చెప్పలేము. అయితే ఎక్కువ సమయం స్క్రీన్ చూస్తూ గడపడం అనేది ఒక రకమైన నిశ్చల జీవన శైలితో ముడిపడి ఉంటుంది. ఈ విధంగా శారీరక శ్రమ లేకుండా రోజంతా ఒకే చోట కూర్చునే అలవాటు వల్ల క్రమంగా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా బరువు పెరగడం, హై బ్లడ్ ప్రెషర్, మధుమేహం , చెడు కొలెస్ట్రాల్  వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ కూడా పక్షవాతం ముప్పును పెంచే ప్రధాన కారణాలలో ముఖ్యమైనవిగా వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అమెరికన్ స్ట్రోక్  అసోసియేషన్  కు చెందిన జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం అరవై  సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న వారు రోజులో కనీసం ఎనిమిది గంటల పాటు శారీరక శ్రమ లేకుండా కేవలం కూర్చునే పనులలో  గడిపితే, వారిలో పక్షవాతం వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందని తేలింది. అయితే ఇది నేరుగా స్క్రీన్ వల్ల జరిగే నష్టం కాకపోయినా, ఎక్కువ సమయం కదలకుండా కూర్చునే స్వభావం వల్ల కలిగే దుష్పరిణామం అని పరిశోధకులు పేర్కొంటున్నారు. కాబట్టి స్క్రీన్ చూసే గంటలను మాత్రమే లెక్కగట్టి ప్రమాదాన్ని అంచనా వేయలేము. ఎందుకంటే రోజంతా కంప్యూటర్ ముందు పని చేసే వ్యక్తి క్రమం తప్పకుండా వ్యాయాయం చేస్తుంటే, అస్సలు శారీరక శ్రమ లేని వ్యక్తితో పోలిస్తే అతనిలో ప్రమాదం కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రాత్రి సమయాల్లో ఎక్కువ సేపు మొబైల్ లేదా ల్యాప్టాప్ వాడటం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. నిద్రలేమి సమస్య ఏర్పడినప్పుడు అది రక్తపోటును , జీవక్రియలను నియంత్రించడం కష్టం చేస్తుంది. దీనివల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా హైపర్ టెన్షన్, డయాబెటిస్, ఊబకాయం , గుండె జబ్బులు ఉన్నవారు తమ ఆరోగ్యం పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అధిక రక్తపోటు అనేది పక్షవాతానికి దారితీసే అత్యంత ముఖ్యమైన కారకాల్లో ఒకటి కాబట్టి, బీపీని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. యువత కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పక్షవాతం కేవలం వృద్ధులలోనే వస్తుందని అనుకోవడం  పొరపాటు. మారుతున్న జీవన శైలి కారణంగా నేడు యువతలో కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. అయితే ఉద్యోగరీత్యా లేదా చదువురీత్యా ఎప్పుడూ స్క్రీన్ ముందు పనిచేయాల్సిన వారు పూర్తిగా డివైజ్ లను పక్కన పెట్టడం సాధ్యం కాదు. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. జాగ్రత్తలు.. రోజూ గంటల తరబడి ఒకే చోట కదలకుండా కూర్చోకుండా మధ్యమధ్యలో చిన్న బ్రేక్ లు  తీసుకోవడం మంచిది. కుర్చీలోంచి లేచి కొద్దిసేపు నడవడం, ఫోన్ మాట్లాడేటప్పుడు గదిలో తిరగడం, అలాగే రోజూవారీ జీవితంలో తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెద్దలు ప్రతి వారం కనీసం నూట యాభై నిమిషాల పాటు ఏదైనా వ్యాయామం లేదా నడక వంటి శారీరక కార్యకలాపాలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.  వీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పొగత్రాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం , ప్రశాంతమైన నిద్ర  చాలా అవసరం. గుర్తుంచుకోవాల్సిన విషయం.. కేవలం స్క్రీన్ టైమ్ తగ్గించడం వల్ల మాత్రమే పక్షవాతం రాకుండా నివారించలేము. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు వాటిని అదుపులో ఉంచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పక్షవాతం బారిన పడకుండా ఉండాలంటే శరీరానికి తగిన వ్యాయామం ఇస్తూ, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం ఎంతో ముఖ్యం. ఒకవేళ ఎవరికైనా ముఖం ఒకవైపు వంకరపోవడం, శరీరంలో అకస్మాత్తుగా బలహీనత రావడం, మాట తడబడటం, చూపు మందగించడం లేదా విపరీతమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.                                                                                                                                          *రూపశ్రీ*
వైద్య రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు మనుషుల జీవన శైలిని , బాధ్యతలను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇప్పటివరకు కుటుంబ నియంత్రణ , గర్భనిరోధక బాధ్యతలు ఎక్కువగా మహిళల మీదే ఉంటూ వచ్చాయి. మార్కెట్లో లభించే వివిధ రకాల గర్భనిరోధక మాత్రలు లేదా పద్ధతులు అన్నీ మహిళల శారీరక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవే. కానీ మారుతున్న కాలానికి తగినట్టుగా వైద్య శాస్త్రం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా పురుషుల కోసం ప్రత్యేకంగా గర్భనిరోధక మాత్రలను తీసుకువచ్చే దిశగా పరిశోధనలు జోరుగా సాగుతున్నాయి. ఈ కొత్త  ఆవిష్కరణ భవిష్యత్తులో గర్భనిరోధక పద్ధతులపై  చాలా అంచనాలు సృష్టిస్తోంది.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..  గర్బనిరోధక మాత్రలు.. సాధారణంగా మహిళలు వాడే గర్భనిరోధక మాత్రలు వారి శరీరంలోని హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల వారిలో కొన్ని రకాల శారీరక మార్పులు లేదా దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంటుంది. కానీ పురుషుల కోసం తయారు చేస్తున్న ఈ సరికొత్త  మాత్రల ప్రత్యేకత ఏమిటంటే ఇవి ఎలాంటి హార్మోన్ మార్పులకు గురిచేయవు. కేవలం పురుషుల శరీరంలో ఉండే శుక్రకణాల కదలికలను మాత్రమే నేరుగా ప్రభావితం చేసేలా ఈ మందులను రూపొందిస్తున్నారు. మానవ శరీరంలో , పురుషుల వ్యవస్థలో ప్రత్యేకంగా ఉండే ఒక ఎంజైమ్ పై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. శుక్రకణాలు ముందుకు కదలడానికి , మహిళల అండం వరకు సులభంగా చేరుకోవడానికి ఈ ప్రత్యేక ఎంజైమ్ చాలా కీలకంగా పనిచేస్తుంది. ఇప్పుడు కొత్తగా కనిపెడుతున్న  ఔషధం తీసుకున్నప్పుడు ఆ ఎంజైమ్ కొన్ని గంటల పాటు తాత్కాలికంగా నిలిచిపోతుంది. దీనివల్ల శుక్రకణాలు సాధారణ పద్ధతిలో ముందుకు కదలలేవు. ఫలితంగా అవి అండం వరకు చేరే సామర్థ్యాన్ని కోల్పోతాయి కాబట్టి  గర్భధారణ జరిగే అవకాశం చాలావరకు తగ్గిపోతుంది. పురుషుల కోసం కనిపెడుతున్న ఈ కొత్త  గర్భనిరోధక మాత్రల గురించి శాస్త్రవేత్తలు వెల్లడించిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే వీటిని ప్రతిరోజూ క్రమం తప్పకుండా మింగాల్సిన అవసరం ఉండదు. శారీరక సంబంధానికి కేవలం ముప్పై నిమిషాల ముందు ఈ మాత్రను తీసుకుంటే సరిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మొదటి దశలో జరిపిన పరీక్షల ప్రకారం ఈ మందు ప్రభావం శరీరంలో కొన్ని గంటల పాటు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ భవిష్యత్తులో జరిగే క్లినికల్ పరీక్షలు , పరిశోధనలు విజయవంతమైతే పురుషులు రోజూ ఎలాంటి మందులు వాడకుండా కేవలం అవసరమైనప్పుడు మాత్రమే వీటిని ఉపయోగించే వెసులుబాటు కలుగుతుంది. ఈ మాత్రలు తీసుకుంటే పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుందా అని చాలా మందిలో ఒక  సందేహం కలుగుతుంది . అయితే ఈ మాత్రల ప్రధాన ఉద్దేశం పురుషులలో శుక్రకణాలు పుట్టకుండా చేయడం కాదు. కేవలం తాత్కాలికంగా వాటి కదలికలను నిలిపివేయడం లేదా మందగించడం మాత్రమే. ఈ  మాత్ర  ప్రభావం పూర్తిగా ముగిసిన తర్వాత శుక్రకణాలు నార్మల్ గా  తమ సాధారణ స్థితికి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినప్పటికీ మందు ప్రభావం పోయిన తర్వాత పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందా లేదా అనేదానిపై మరింత లోతైన పరీక్షలు అవసరం అంటున్నారు. ఈ కొత్త ఆవిష్కరణను ప్రస్తుతం జంతువులపై ప్రయోగించి పరిశీలిస్తున్నారు. మనుషులపై వీటిని వాడే ముందు వాటి భద్రత , సరైన మోతాదును నిర్ణయించడం  చాలా ముఖ్యం. ఏవైనా దుష్ప్రభావాలు వస్తాయా లేదా అని నిరంతరం పరిశీలించాల్సి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధనలు అన్నీ విజయవంతమైతే భవిష్యత్తులో గర్భనిరోధక బాధ్యతలను కేవలం మహిళలు మాత్రమే కాకుండా  భాగస్వాములిద్దరూ సమానంగా పంచుకోవడానికి ఒక చక్కటి అవకాశం లభిస్తుంది. అయితే ఈ మాత్రలు కేవలం గర్భధారణను మాత్రమే నివారిస్తాయి కానీ ఎలాంటి లైంగిక  వ్యాధుల నుంచి రక్షణ ఇవ్వలేవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు                             *రూపశ్రీ.