వైసీపీపై ప్రజా వ్యతిరేకత ఎందుకు తగ్గలేదంటే?

posted on: Jun 4, 2026 3:09PM

 ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో సరిగ్గా రెండేళ్ళ క్రితం ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. 2024 జూన్ 4వ తేదీన విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు యావత్ రాష్ట్రాన్నివిస్మయపరిచాయి. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ప్రభంజనం సృష్టించిన వైసీపీ, ఐదేళ్లలోనే తీవ్ర ప్రజావ్యతిరేకత మూటగట్టుకుని ఘోరంగా పరాజయం పాలైంది. 2024 ఎన్నికలలో  వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన జగన్.. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది.  ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన ఆయనకు, ఆయన పార్టీకీ కనీసం విపక్ష హోదా కూడా ఇవ్వడానికి జనం నిరాకరించారు.

ఇంతటి ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న తరువాత కూడా జగన్ లో కానీ, వైసీపీలో కానీ ఇప్పటికీ ఇసుమంతైనా మార్పు రాలేదు. ఇప్పటికీ..  క్షేత్రస్థాయి వాస్తవాలను, 2024 ఎన్నికలలో ప్రజలు తమను తిరస్కరించడం వెనుక ఉన్న కారణాలను అంగీకరించేందుకు కానీ, గుర్తించేందుకు కానీ వైసీపీ అధినేత జగన్, ఆయన పార్టీ సిద్ధంగా లేరు. అదే ఇప్పటికీ రాష్ట్రంలో జగన్ పట్ల, వైసీపీ పట్ల ప్రజా వ్యతిరేకత ఇసుమంతైనా తగ్గకపోవడానికి కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ప్రజలు కేవలం నెలవారీ సంక్షేమ పథకాల లబ్ధిని మాత్రమే ఆశించరనీ, వాటితో పాటు సుస్థిరఅభివృద్ధి, ఉపాధి, ఆర్థిక స్వావలంబన, ప్రశాంతమైన జీవన వాతావరణం కూడా  కోరుకుంటారనే కనీస సత్యాన్ని ఇప్పటికీ వైసీపీ గుర్తించడం లేదని అంటున్నారు.  ప్రజల నిజమైన ఆకాంక్షలను పక్కనబెట్టి, కేవలం పార్టీ రాజకీయ,  ఆర్థిక ప్రయోజనాలకే   ప్రాధాన్యత ఇచ్చిన జగన్ గత ఎన్నికలలో పరాజయం పాలయ్యారు.  

అప్పట్లో ఆయన రాజధాని అమరావతి నిర్ణయాన్ని వ్యతిరేకించి మూడు రాజధానులంటూ ఆడిన మూడుముక్కలాట కారణంగా ఆయన పార్టీ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోనూ కుదేలౌంది. అంతటి ఘోర పరాజయం తరువాత రెండేళ్లయినా జగన్ లో కానీ, ఆయన పార్టీలో కానీ ఇసుమంతైనా మార్పు రాలేదనడానికి జగన్ తాజాగా ప్రస్తావించిన ‘మావిగన్’ ప్రతిపాదనే నిదర్శనమంటున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...