ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ వివాదం మరోసారి బహిర్గతమైంది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, వైసీపీ అధినేత  జగన్‌ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడాన్ని తప్పుపడుతూ జగన్ మీడియా ప్రచురించిన కథనంపై షర్మిల నిప్పులు చెరిగారు. తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.  సాధారణ కుటుంబ సంబంధాలను కూడా వక్రీకరించి మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరించడాన్ని తప్పుపట్టారు.   మహిళలను గౌరవిస్తామని చెప్పే జగన్..  ఇలాంటి నిరాధారమైన,  దిగజారిన వార్తలను తన సొంత మీడియా ప్రచురించడాన్ని ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు. ఈ  ప్రచురణ వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో జగన్ స్వయంగా సమాధానం చెప్పాలని   డిమాండ్ చేశారు. గతంలో తమ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సైతం రాజకీయ విభేదాలను పక్కనబెట్టి తన పిల్లల పెళ్లిళ్లకు అందరినీ ఆహ్వానించిన విషయాన్ని ఈ సందర్భంగా  గుర్తుచేశారు. రాజకీయంగా ఎన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, కుటుంబ వేడుకల్లో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం జగన్ దిగజారుడుతనానికి పరాకాష్ఠగా షర్మిల అభివర్ణించారు. అన్నదమ్ముల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న   వివాదాల నేపథ్యంలో ఈ తాజా పరిణామం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం రాజకీయ లబ్ది కోసమే జగన్  కుటుంబ వ్యవహారాలను బహిరంగ వేదికలపైకి లాగుతూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని షర్మిల పదేపదే ఆరోపిస్తున్న సంగతి విదితమే. ఇది కూడా చదవండి: వెల్తారా, వెళ్లరా: షర్మిల కుమార్తె వివాహానికి జగన్ హాజరుపై చర్చ.! అయినా..  తమ ప్రత్యర్థి అయితే చాలు…  వ్యక్తిత్వహననానికి పాల్పడడం, మహిళలను కించపరచడం వైసీపీ నేతలకు అలవాటేనంటూ.. నాడు నిండు సభలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అవమానించిన విషయాన్ని గుర్తు చేస్తూ పరిశీలకులు సైతం షర్మిలపై అనుచిత వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.    అంతెందుకు గతంలో షర్మిల కూడా పలు సందర్భాలలో జగన్ ది సైతాన్ సైన్యం   విమర్శించిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబుకు తన కుమారుడి పెళ్లి పత్రిక ఇచ్చేందుకు పసుపు రంగు చీర కట్టుకొని వెళ్లిన షర్మిలను దూషించిన ఘనత వైసీపీ సైకో సైన్యానిది. ఇప్పుడు కూడా తన కూతురు అంజిలి పెళ్లి పత్రిక అందించేందుకు చంద్రబాబును కలిసిన షర్మిలపై వైసీపీయులు దుర్భాషలాడుతున్నతీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మీకు నచ్చవచ్చు:   ఉంటే ఉండు, లేకుంటే దేశం విడిచిపో: వైఎస్ కంటే గొప్పోడివా.. జగన్ ను ఉతికి ఆరేసిన షర్మిల కుటుంబం.! ఎలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె పెళ్లి: పేర్ని నానికెందుకు నొప్పి.? [YSSharmila, YSJagan, SharmiladaughterMarriage, Invitation, CBN, CharacterAssassination, TeluguOne]
 దేశ రాజధాని నూతన దిల్లీలో జరిగిన సోనియాగాంధీ ఆత్మకథ  బిలాంగింగ్ పుస్తకావిష్కరణ వేడుకలో సీటింగ్ అరేంజ్ మెంట్ రాజకీయ చర్చకు తావిచ్చింది.  ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి  దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ప్రముఖులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇండియా కూటమి నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో వేదికపై అతిథుల సీటింగ్  అరేంజ్ మెంట్ లో ప్రాధాన్యతల క్రమం రాజకీయ చర్చకు తెరలేపింది.   ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మొదటి వరుసలో అదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పక్కన కూర్చుంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  కర్ణాటక  ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు రెండో వరుసలో సరిపెట్టుకున్నారు.  ఇదే వేదికపై అఖిలేష్ యాదవ్ వంటి ఇతర విపక్ష నేతలు కూడా మొదటి వరుసలో ఆసీనులయ్యారు.  కాంగ్రెస్ పార్టీ  కార్యక్రమంలో సొంత పార్టీ ముఖ్యమంత్రులను రెండో వరుసలో కూర్చోబెట్టి, బయటి నుంచి వచ్చిన మిత్రపక్ష నేతలకు వారికి మించిన ప్రాధాన్యత ఇవ్వడం రాజకీయంగా సంచలనంగా మారింది.  అంతే కాకుండా సోనియాగాంధీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తొలి వరుసలో తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ రాహుల్ పక్కన ఆసీనులైన ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. అదే సమయంలో రేవంత్, డీకే వంటి నేతలు రెండో వరుసలో కూర్చున్న ఫొటోలు సైతం అదే స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  కాగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హై కమాండ్ వద్ద ప్రాధాన్యత తగ్గిందంటూ నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.  అయితే  పరిశీలకులు మాత్రం అతిథి మర్యాదలో భాగంగానే కాంగ్రెస్ ఈ విధమైన సీటింగ్ అరేంజ్ మెంట్ చేసి ఉంటుందని విశ్లేషిస్తున్నారు.  ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డిలో అసంతృప్తి నిజమేనా? సొంత కార్యక్రమంలో సొంత నేతల కంటే.. ఇతర పార్టీల నేతలను గౌరవించడం సముచితంగా ఉంటుందని, అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ ఆ విధమైన ఏర్పాట్లు చేసిందని చెబుతున్నారు.   నాయకులకు సముచిత గౌరవం ఇచ్చి మొదటి వరుసలో సీట్లు కేటాయించిందని కాంగ్రెస్ శ్రేణులు కూడా చెబుతున్నాయి.  పార్టీలో అత్యంత కీలకమైన నాయకురాలు ప్రియాంకా గాంధీ సైతం రెండో వరుసలోనే ఆసీనులవ్వడాన్ని ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు.  అతిథులకు మర్యాదపూర్వకంగా మొదటి స్థానం కల్పించడం కాంగ్రెస్ సంప్రదాయమని, సోనియా పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అదే చేసిందని అంటున్నారు.  మీకు నచ్చవచ్చు:  పార్టీ, ప్రభుత్వంపై పట్టుబిగించిన సీఎం రేవంత్.! రాహుల్ కు ఫిర్యాదు చేస్తా: తెలంగాణ సీఎం రేవంత్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుగుబావుటా.!​ [Sonia, biography Belonging, Revanth Reddy Vijay,Seat, TeluguOne] 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాలను మరింత పటిష్టపరిచే దిశగా అధిష్ఠానం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జి బాధ్యతలను యువ నాయకుడు బీఎం సందీప్‌కు అప్పగిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది.    పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోద ముద్రతో ఈ నియామకం తక్షణమే అమల్లోకి రానున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ పార్టీని సమన్వయం చేసే తరుణంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.    గతంలో ఈ బాధ్యతలను నిర్వర్తించిన మీనాక్షి నటరాజన్ ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో ఈ మార్పు జరిగిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ సంస్థాగత పదవి నుంచి తప్పుకున్న ఆమె, గతంలో రాష్ట్రంలో అందించిన విశేష సేవల పట్ల అధిష్ఠానం ప్రత్యేక ప్రశంసలు కురిపించింది.    కొత్త ఇన్‌ఛార్జి రేసులో పలువురు సీనియర్ జాతీయ నేతల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగింది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో పాటు సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్, మాణిక్‌రావు థాక్రే వంటి ఉద్ధండుల పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ, అనూహ్యంగా అధిష్ఠానం బీఎం సందీప్ వైపు మొగ్గు చూపడం గమనార్హం.    ఈ పరిణామం సరిగ్గా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనలో ఉన్న సమయంలో జరగడం రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. పార్టీ యంత్రాంగాన్ని మరింత ఉత్సాహపరిచేందుకు, క్షేత్రస్థాయిలో సమన్వయం సాధించేందుకు ఈ నాయకత్వ మార్పు దోహదపడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు  ఇతర రాజకీయ సవాళ్లు ఎదురుకానున్న తరుణంలో, కొత్త ఇన్‌ఛార్జి నియామకం పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతుందని ఆశిస్తున్నారు. రాష్ట్ర నాయకత్వంతో సఖ్యతను పెంపొందిస్తూ, పార్టీని విజయపథంలో నడిపించడంలో బీఎం సందీప్ ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. మీకు నచ్చవచ్చు: Under 19 Asia Cup: పాక్‌పై చివరి బంతికి భారత్  థ్రిల్లింగ్ విక్టరీ..కప్ మనదే.! [ BM Sandeep Telangana Congress In-charge, Telangana Congress news, AICC new appointments 2026, TPCC updates, Mallikarjun Kharge decisions ]
ALSO ON TELUGUONE N E W S
తెరపై సూపర్‌స్టార్‌గా అభిమానులను అలరించే రజనీకాంత్.. నిజ జీవితంలో మాత్రం కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. తన వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా బయటకు చూపించడానికి ఇష్టపడని ఆయనకు సంబంధించిన కొన్ని అరుదైన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి గ్రీస్‌లో సరదాగా గడుపుతున్న రజనీకాంత్ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ వివాహ వేడుక గ్రీస్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు రజనీకాంత్ తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. పెళ్లి వేడుకలు పూర్తయిన తర్వాత అక్కడే కొంత సమయం గడిపిన ఆయన.. భార్య లత, కుమార్తెలు సౌందర్య, ఐశ్వర్య, మనవళ్లతో కలిసి ఏథెన్స్ నగరంలో పర్యటించారు. ఈ వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలను ఆయన కుమార్తె సౌందర్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోల్లో రజనీకాంత్ తన భార్య లత చేయి పట్టుకుని నడుస్తూనే.. మరోవైపు మనవళ్ల చేతులు పట్టుకుని కనిపిస్తున్నారు. ఆయన కుమార్తెలు సౌందర్య, ఐశ్వర్య కూడా ఈ ఫోటోల్లో ఉన్నారు. ఐశ్వర్య కుమారులు యాత్ర రాజా, లింగా రాజా.. సౌందర్య కుమారులు వేద్ కృష్ణ, వీర్‌లతో కలిసి రజనీ ఎంతో ఆనందంగా గడిపారు. బ్రౌన్ కలర్ స్వెటర్, బ్లాక్ ట్రాక్ ప్యాంట్, వైట్ స్కార్ఫ్, బ్లూ క్యాప్‌తో ఆయన కనిపించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలను షేర్ చేసిన సౌందర్య.. “ఏథెన్స్‌లో మేము అద్భుతమైన జ్ఞాపకాలను సృష్టించుకున్నాం. ఈ అందమైన కుటుంబ విహారయాత్రలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాం” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు కూడా తమ ఆనందాన్ని కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. నటి రాశీ ఖన్నా 'హౌ క్యూట్' అంటూ స్పందించగా.. మరికొందరు 'నిజ జీవితంలోనూ ఆయన గెలిచారు.. ఎంత అందమైన కుటుంబం' అంటూ ప్రశంసిస్తున్నారు. ఇది కూడా చదవండి: గోదారి గట్టు, మీసాల పిల్ల.. అంతకుమించి మరో పాట.. వెంకీ సినిమా ఫస్ట్ సింగిల్‌పై అప్‌డేట్! ఇక రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన 'జైలర్ 2'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ధర్మన్' చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రామ్ పోతినేని, సిమ్రన్, నయనతార, రాశీ ఖన్నా, శ్రీలీల, యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా 2027లో విడుదల కానుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబంతో గడిపే సమయానికి రజనీకాంత్ ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఈ ఫోటోలు మరోసారి చూపిస్తున్నాయి. మీకు నచ్చవచ్చు: విలన్‌గా గోపీచంద్ రీ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన టీమ్! వారణాసి వాయిదా: అసలు నిజమేంటి? బాల్ రాజమౌళి కోర్టులో లేదా?       [RajinikanthFamily, RajinikanthGreecePhotos, RajinikanthGrandchildren, SoundaryaRajinikanth RajinikanthAthensTrip]
సినిమా ప్రమోషన్స్‌లో కొత్తదనం చూపించాలంటే నాని తర్వాతే ఎవరైనా. తన సినిమాలకే కాదు.. తాను సమర్పిస్తున్న సినిమాల ప్రమోషన్స్‌లోనూ నాని తనదైన స్టైల్‌లో సందడి చేస్తుంటారు. ఇప్పుడు నితిన్ నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ కోసం కూడా అదే జోష్ చూపించారు. తాజాగా జరిగిన జామ్ పార్టీలో నాని, నితిన్ కలిసి ‘రుకు రుకు రుక్మిణి’ పాటకు స్టెప్పులేస్తూ సందడి చేశారు. ఈ పార్టీకి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా నాని, నితిన్ కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పార్టీ పూర్తి వీడియోను రేపు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ ప్రమోషనల్ ఈవెంట్‌లో మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. నాని, నితిన్ మధ్య ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. నాని తన కెరీర్ ప్రారంభంలో నితిన్‌ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్ గా పనిచేశారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. https://x.com/UnanimousProds/status/2123005403000967215 "ఒకప్పుడు నేను నితిన్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ ని. నా బిగినింగ్స్ లో ఒక పేజీ నితిన్ ది. ఇప్పుడు నితిన్ రీ బిగినింగ్స్ లో ఒక పేజీ నాది." అంటూ నాని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.  ఇది కూడా చదవండి: అప్పుడు మల్లెపూల పల్లకి.. ఇప్పుడు రఘుకుల తిలక.! నితిన్ నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అఫియా సయ్యద్ హీరోయిన్. ఈ సినిమాను నాని సమర్పించగా, దీప్తి గంటా నిర్మించారు. డిసెంబర్ 4న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. మీకు నచ్చవచ్చు: నీ గూడు చెదిరింది.. ప్రతి పదంలోనూ ఒక విషాదం.. పాటలోని అసలు భావం ఇదే.! రెండేళ్లుగా మంచానికే పరిమితమైన స్టార్ యాక్టర్.. కన్నీళ్లు తెప్పిస్తున్న రియల్ స్టోరీ.!       [Nani Nithiin Dance, Alias Rukmini, Jam Party, Ruku Ruku Rukmini Song]
కోలీవుడ్ స్టార్ సూర్య సినిమాలో టాలీవుడ్ హీరో గోపీచంద్ విలన్‌గా నటించబోతున్నారంటూ వచ్చిన వార్తలకు తెరపడింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని గోపీచంద్ టీమ్ అధికారికంగా స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని వెల్లడించింది. ఇటీవల సూర్య 49వ సినిమాలో గోపీచంద్ విలన్‌గా కనిపించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ సినిమాల్లో విలన్‌గా మెప్పించిన గోపీచంద్.. మళ్లీ అదే తరహా పాత్రలో కనిపిస్తే బాగుంటుందని అభిమానులు కూడా ఆశించారు. ముఖ్యంగా సూర్యతో తలపడే పాత్రలో ఆయన నటిస్తారనే ప్రచారం ఆసక్తి రేపింది. అయితే ఈ వార్తలపై తాజాగా గోపీచంద్ టీమ్ స్పందించింది. రాబోయే తమిళ సినిమాలో గోపీచంద్ విలన్‌గా నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా తప్పు అని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని మీడియా సంస్థలు, సోషల్ మీడియా హ్యాండిల్స్ ని కోరింది. అంతేకాదు.. గోపీచంద్ తదుపరి సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు, అప్‌డేట్స్ ఏవైనా ఉంటే తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానే వెల్లడిస్తామని తెలిపింది. దీంతో సూర్య సినిమాలో గోపీచంద్ విలన్ అనే ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడినట్లయింది.  ఇది కూడా చదవండి: మళ్ళీ విలన్‌గా గోపీచంద్.. జయం, వర్షం రోజులు గుర్తొస్తాయా.? కాగా, ప్రస్తుతం గోపీచంద్ హీరోగా రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘భరతవర్ష’ ఒకటి. మరో సినిమా 'సింగ' వెంకట్ దర్శకత్వంలో రూపొందుతోంది. మీకు నచ్చవచ్చు:  ఆకాశంలో ఒక తార vs డియర్ ఆస్ట్రోనాట్.. ఒకే రోజు ఒకే కథతో రెండు సినిమాలు.! తను మాట్లాడలేదు.. చిరు నోటి నుంచి బయటపడ్డ అసలు సీక్రెట్.!       [Gopichand, Villain Role, Suriya 49, Bharata Varsha, Singa Movie]  
బాలీవుడ్‌ కి సరికొత్త ఊపిరిని ఇవ్వడంతో పాటు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టించింది ధురంధర్ సిరీస్. ఈ ఘనతకి ప్రధాన ఆద్యుడు దర్శకుడు ఆదిత్య ధర్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. దీంతో ఆదిత్య ధర్ కొత్త మూవీ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అప్ కమింగ్ మూవీ ఇదే అంటూ తాజా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ధురంధర్  హీరో రణ్‌వీర్ సింగ్,  ఆదిత్య ధర్ మరోసారి చేతులు కలపబోతున్నట్లు సమాచారం. . ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈసారి ఎలాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్ కాకుండా పూర్తిగా విభిన్నమైన పౌరాణిక, చారిత్రక నేపథ్యంతో కూడిన భారీ మైథలాజికల్ యాక్షన్ డ్రామాని  తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతోందని, 2027 సంవత్సరంలో షూటింగ్ ప్రారంభించి 2028 డిసెంబర్ నాటికి ఈ సినిమాను థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ఓం రిలీజ్ వేళ ఫ్యాన్స్ కి ధనుష్ నుంచి సరికొత్త పిలుపు: సీఎం విజయ్ ఏం చేసాడయ్యా!   మౌర్య సామ్రాజ్య నేపథ్యాన్ని లేదా పురాణ గాథలని  ఆధారంగా చేసుకుని ఒక విజువల్ వండర్‌గా  తీర్చిదిద్దాలని  ఆదిత్య ధర్ భావిస్తున్నారట. కేవలం సాధారణ వినోదమే కాకుండా, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ చిత్రానికి ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి. అయితే, గతంలో ఆదిత్య ధర్ తెరకెక్కించాలనుకుని ఆగిపోయిన 'అశ్వత్థామ' ప్రాజెక్ట్‌ను మళ్లీ రీవిజిట్ చేస్తున్నారా లేక పూర్తిగా కొత్త మైథలాజికల్ కథతో వస్తున్నారా అనే దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.   మీకు నచ్చవచ్చు:విశ్వక్ సేన్ సంచలన కామెంట్స్: ఫ్లాప్ మూవీకి సక్సెస్ మీట్! మీకు నచ్చవచ్చు: చిరంజీవితో రోజా మూవీ: ఆ రోజు ఏం జరిగిందంటే.. ప్రముఖ రచయిత వ్యాఖ్యలు వైరల్!   [Aditya Dhar,Ranveer Singh,  mythological, Mourya Chakravarthy]
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ మూవీ వాయిదా పడే అవకాశముందనే ప్రచారం మొదలైంది. ఏప్రిల్ 7, 2027న విడుదల కావాల్సిన ఈ సినిమా జులై 30కి వెళ్లిపోవచ్చనే వార్తలు అభిమానుల్లో చర్చకు దారితీశాయి. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. సినిమా వాయిదా పడుతుందా లేదా అనేది షూటింగ్‌పై ఆధారపడి లేదు. దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తయిందట. ఎడిటింగ్ పనులు కూడా చాలావరకు ముగిశాయని తెలుస్తోంది. కీలక సన్నివేశాల్లో ఎక్కువ భాగం ఇప్పటికే ఎడిట్ చేశారట. అయితే ఫైనల్ ఎడిట్‌ను మాత్రం ఇంకా లాక్ చేయాల్సి ఉందని సమాచారం. ఈ సినిమా కోసం ప్రపంచంలోని ప్రముఖ VFX సంస్థలు పనిచేస్తున్నాయి. రాజమౌళి ఈ సంస్థలకు డిసెంబర్ చివరి నాటికి విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తి చేసి అందించాలని డెడ్‌లైన్ విధించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడే సినిమా విడుదల తేదీపై అసలు ఉత్కంఠ నెలకొంది. VFX పనులు అనుకున్న సమయానికి పూర్తయితే.. మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను పరుగులు పెట్టించనున్నారట. రీ-రికార్డింగ్, సౌండ్ మిక్సింగ్ సహా తుది మెరుగులు దిద్దే పనులను వేగంగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ప్రస్తుతం ‘వారణాసి’ విడుదల తేదీ విషయంలో కీలకమైన అంశం VFX పనులే అన్నమాట. అవి సమయానికి అందితే ఏప్రిల్ 7న సినిమా విడుదలకు మార్గం సుగమం అవుతుంది. ఇది కూడా చదవండి: వారణాసి స్టోరీ లీక్.. రావణుడి నవరత్నాల హారం చుట్టూ అసలు కథ.! ఇక సినిమాలో కొన్ని ప్యాచ్‌వర్క్ సన్నివేశాల కోసం జనవరిలో చిన్న షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇది చాలా తక్కువ రోజుల షూటింగ్ మాత్రమేనని తెలుస్తోంది. ఆ తర్వాత మార్చిలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి, మార్చి నుంచి ఏప్రిల్ వరకు భారీ స్థాయిలో గ్లోబల్ ప్రమోషన్స్ నిర్వహించాలనేది మేకర్స్ ప్రణాళికగా ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కలన్నీ చూస్తుంటే ‘వారణాసి’ టీమ్ ఏప్రిల్ 7 విడుదల లక్ష్యంగానే ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. అయితే డిసెంబర్ చివరి నాటికి VFX పనులు ఎంతవరకు పూర్తవుతాయన్నదే ఇప్పుడు కీలకం. ఒకవేళ VFX సంస్థలు డెడ్‌లైన్‌లోగా పనులు పూర్తి చేయలేకపోతే మాత్రం సినిమా విడుదలను జులైకి వాయిదా వేసే అవకాశం ఉందని టాక్. మీకు నచ్చవచ్చు: రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్‌.. వారణాసి తర్వాత జక్కన్న నెక్స్ట్ మూవీ ఇదేనా.? హైదరాబాద్‌లో ఐమాక్స్ రీఎంట్రీ.. ఫస్ట్ మూవీ ఇదే.!       [Varanasi Release Date, Varanasi VFX, Mahesh Babu, SS Rajamouli]  
సంక్రాంతి సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా ఆయన తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'జనవరి 12 విడుదల'పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. మూవీ ఫస్ట్ సింగిల్‌ను డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పాటలను ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఆయన మొదటి పాటను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ పాటకు సంబంధించిన ప్రకటనను కూడా అనిల్ రావిపూడి తనదైన కామెడీ స్టైల్‌లో చేయబోతున్నారట. ఇందుకోసం ఒక చిన్న కామెడీ స్కిట్‌ను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. గత సినిమాల ప్రమోషన్ల మాదిరిగానే ఈసారి కూడా తనదైన మార్క్ చూపించడానికి అనిల్ రెడీ అవుతున్నారు. అనిల్ రావిపూడి సినిమాల్లో పాటలకు కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. గతంలో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలోని 'గోదారి గట్టు మీద రామచిలకవే', 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలోని 'మీసాల పిల్ల' పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పాటలు సినిమాలపై అంచనాలను పెంచడంలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు 'జనవరి 12 విడుదల' సినిమాలో కూడా అలాంటి క్యాచీ మెలోడీని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా మొదటి పాట ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ బావ బామ్మర్దులుగా కనిపించబోతున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తాయని సమాచారం. వెంకటేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి కనిపించనుంది. కథలో కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా కామెడీగా ఉంటాయని తెలుస్తోంది. అలాగే వెంకటేష్, కీర్తి సురేష్ కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు గతంలో వచ్చిన 'ఎఫ్ 2' తరహాలో వినోదాన్ని పంచుతాయని ప్రచారం జరుగుతోంది. ఇది కూడా చదవండి:  ఫహాద్ ఫాజిల్ కొత్త అవతారం.. కరాటే ట్రైనింగ్ ఫొటోలు వైరల్! మరోవైపు ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి చేయబోయే ప్రాజెక్ట్ గురించి కూడా ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. 2028లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఆయన సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టును కళ్యాణ్ రామ్ నిర్మించే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతానికి అనిల్ రావిపూడి దృష్టి అంతా 'జనవరి 12 విడుదల' సినిమాపైనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2027 జనవరి 12న థియేటర్లలోకి రానున్నట్లు ప్రకటించారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ వంటి ఇద్దరు హీరోలు కలిసి నటిస్తుండటం, అనిల్ రావిపూడి దర్శకత్వం వహించడం, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించడం ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పుడు డిసెంబర్ మొదటి వారంలో విడుదల కానున్న ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి 'గోదారి గట్టు', 'మీసాల పిల్ల' పాటల తరహాలో ఈ కొత్త పాట కూడా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. మీకు నచ్చవచ్చు:  శుక్ర మహాదశ నుంచి ఎస్సై పరీక్షల వరకు.. ర‌వితేజ అండ్ గ్యాంగ్‌ అదిరిపోయే కామెడీ.! ‘ట్విలైట్’ హీరో ఇప్పుడు ఏజెంట్ 007.. జేమ్స్ బాండ్‌గా సంచలన ఎంట్రీ!       [January12Vidudala, Venkatesh, KalyanRam, AnilRavipudi, GVPrakashKumar] 
ఈ నెల 20 న స్టార్ హీరో ధనుష్ 'ఓం' మూవీతో సెల్యులాయిడ్ పై ల్యాండ్ అవుతున్న విషయం తెలిసిందే. మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ధనుష్ తో జాయిన్ కావడంతో స్క్రీన్ సరికొత్తగా  మెరవనుంది. ధనుష్  తాజాగా రిలీజ్‌కు ఒక్క రోజు ముందు ధనుష్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన ఒక స్పెషల్ నోట్ సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. సినిమా విడుదల సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయంపై ధనుష్ తన అపారమైన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఉదయం 6 గంటల ప్రత్యేక షో (Early Morning Show) నిర్వహించుకునేందుకు అనుమతిచ్చినందుకు తమిళనాడు ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎంకు ధనుష్ తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అయితే ఎర్లీ మార్నింగ్ షోల అనందంలో మునిగిపోకుండా, తన అభిమానులకి  ధనుష్ ఒక ఇంపార్టెంట్ రిక్వెస్ట్ కూడా చేశారు. “ఉదయం 6 గంటల షోకు థియేటర్లకు వచ్చే ఫ్యాన్స్ అందరూ ప్రభుత్వ సేఫ్టీ రూల్స్ తూచా తప్పకుండా పాటిస్తూ, ఎంతో బాధ్యతగా నడుచుకోవాలి. పక్కవాళ్లకు లేదా ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం మన బాధ్యత. థియేటర్లో సినిమాని  ప్రశాంతంగా చూసి ఎంజాయ్ చేయడమే అసలైన సెలబ్రేషన్” అంటూ ధనుష్ తన పోస్ట్‌లో హితవు పలికారు.   ఇది కూడా చదవండి:ఫ్లాప్ మూవీకి సక్సెస్ మీట్.. విశ్వక్ సేన్ సంచలన కామెంట్స్ వైరల్! సినిమా వెనుక ఉన్న ఎంతోమంది కార్మికుల కష్టాన్ని ధనుష్ ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. ఏదైనా ఒక సినిమా ఘనవిజయం సాధించ వెనుక ఎన్నో విభాగాలకు చెందిన వందలాది మంది టెక్నీషియన్లు, సినీ కార్మికుల హార్డ్‌వర్క్, డెడికేషన్ దాగి ఉంటాయని,అలాంటి శ్రమజీవులందరికీ ఆడియన్స్ ఇచ్చే అతిపెద్ద సపోర్ట్ కేవలం పైరసీని అరికట్టడం మాత్రమే కాదని, థియేటర్లకు భారీ సంఖ్యలో వెళ్లి సినిమాలు చూడటమేనని  పిలుపునిచ్చారు. మీకు నచ్చవచ్చు: ధోని ఫస్ట్ లవ్ మన తెలుగు హీరోయిన్ నేనా! మీకు నచ్చవచ్చు:వారణాసి తర్వాత మహేష్ చేసే మూవీ ఇదే!     [Dhanush, Om, Mammotty, Sai Pallavi, Sreeleela, Tollywood, Kollywood]  
Prince William's India visit took a Bollywood turn on Wednesday as the Prince of Wales visited Dharma Productions' office in Mumbai. Karan Johar hosted the royal guest, giving him a glimpse of Indian cinema, its filmmaking culture and its growing international reach. The Prince was welcomed by Karan Johar, Kareena Kapoor Khan, Saif Ali Khan and Dharma CEO Apoorva Mehta. A troupe of dancers performed popular numbers, including 'Bole Chudiyan' and 'Say Shava Shava' from Karan's 2001 blockbuster Kabhi Khushi Kabhie Gham. William spent around 45 minutes at the production house, where conversations revolved around Indian cinema and its global appeal. Karan spoke about the growing overseas market for Indian films, particularly in the Middle East, and also mentioned SS Rajamouli's RRR as a breakthrough for Indian cinema internationally. The filmmaker also revisited memories of making Kabhi Khushi Kabhie Gham, parts of which were shot in the UK. Karan reportedly encouraged the Prince to watch the film, and William assured him that he would do so. Also Read: SRK shoots a huge action scene in Delhi Sharing pictures from the meeting, Karan described it as an honour and spoke about how cinema connects cultures beyond geographical and linguistic boundaries. He also expressed his nostalgia over revisiting the memories of his much-loved family drama with Kareena. Interestingly, the visit came a day after Karan hosted the 2026 Earthshot Prize ceremony in Mumbai, attended by Prince William and Princess Catherine. The royal couple's three-day India visit also included engagements around cricket, traditional crafts and sustainability. Check Out:  Aditya Dhar to make Ashwatthama with Ranveer Singh?                         Sanjay Bhansali plans big expansion like a studio   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన పాత్రలు, సహజమైన నటనతో దక్షిణాది ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు మరో కొత్త అవతారంలో కనిపించడానికి సిద్ధమవుతున్నారు. 'కరాటే చంద్రన్' అనే సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా కరాటే శిక్షణ తీసుకుంటున్నారు. ఈ ట్రైనింగ్‌కు సంబంధించిన ఫొటోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ ఎలా కనిపించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. 'కరాటే చంద్రన్' సినిమాను భవన స్టూడియోస్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిలీష్ పోతన్ దగ్గర చాలాకాలం పాటు కో-డైరెక్టర్‌గా పనిచేసిన రాయ్.. ఈ సినిమాతో స్వతంత్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక ఈ సినిమాకు ఎస్. హరీష్, వినోయ్ థామస్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి 'చురులి' వంటి సినిమాకు పనిచేశారు. దీంతో ఈ ప్రాజెక్టుపై మలయాళ సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇది కూడా చదవండి:  ఇన్నాళ్లూ ఎవరూ గుర్తించలేదు.. 'బాయ్స్' టైటిల్ కార్డులో అసలు విషయం ఇదే! ఈ సినిమా కోసం ఫహాద్ ఫాజిల్ కరాటే ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను సినిమా ఎడిటర్ కిరణ్ దాస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు, సినిమా స్క్రిప్ట్‌కు సంబంధించిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు. 'కరాటే చంద్రన్' చిత్రంలో ఫహాద్ ఫాజిల్ టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఫొటోలు బయటకు రావడంతో ఆయన నిజంగానే కరాటే నేర్చుకుంటున్నారా? సినిమాలో ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి? అంటూ అభిమానులు చర్చించుకున్నారు. ఫహాద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ కలిసి భవన స్టూడియోస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో గతంలో 'కుంబళంగి నైట్స్', 'జోజి' వంటి మంచి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి వీరంతా కలిసి పనిచేస్తుండటంతో 'కరాటే చంద్రన్'పై అంచనాలు పెరిగాయి. విజయరాఘవన్, జానీ ఆంటోనీ, సుధీష్, రంజి పణిక్కర్, గోకుల్ సురేష్, సురేష్ కృష్ణ, స్పటికం జార్జ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ 2026 అక్టోబర్ 24న కేరళలోని కొట్టాయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కొట్టాయం, పరిసర ప్రాంతాల్లో సుమారు 140 రోజుల పాటు చిత్రీకరణ జరపాలని మేకర్స్ ప్లాన్ చేశారు. రాకేష్ హరిదాస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కిరణ్ దాస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జస్టిన్ వర్గీస్ సంగీతం అందిస్తున్నారు. అయితే సినిమా కథ, ఫహాద్ పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం ఇంకా వెల్లడించలేదు. ఇప్పటికే 'పుష్ప', 'విక్రమ్', 'ఆవేశం' వంటి సినిమాలతో తన నటనలోని విభిన్న కోణాలను చూపించిన ఫహాద్ ఫాజిల్.. ఇప్పుడు కరాటే నేర్చుకుంటూ కొత్త తరహా పాత్రకు సిద్ధమవుతున్నారు. గతంలో ఆయన ట్రైనింగ్ ఫొటోలు వైరల్ కాగా, ఇప్పుడు సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కావడంతో ఈ ప్రాజెక్టుపై ఆసక్తి మరింత పెరిగింది. మరి 'కరాటే చంద్రన్'గా ఫహాద్ ఫాజిల్ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి. మీకు నచ్చవచ్చు:  'నీ కన్ను నీలి సముద్రం..' ఈ పాటలోని ప్రతి లైన్ వెనుక ఇంత అందమైన అర్థం ఉందా? బడ్జెట్ 2 కోట్లు, కలెక్షన్ 150 కోట్లకు పైనే.. ఓటీటీలోకి 5 భాష‌ల్లో కన్నడ బ్లాక్‌బస్టర్.!     [FahadhFaasil, KarateChandran, RoyDirector, BhavanaStudios, DileeshPothan]
విశ్వక్ సేన్ మరి కాసేపట్లో  ENE రిపీట్ ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 పెయిడ్ ప్రీమియర్స్ తో థియేటర్స్ లో అడుగుపెడుతున్నాడు. వరల్డ్ రిలీజ్ రేపు. తాజాగా విశ్వక్ సేన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తాజాగా విశ్వక్ తన కల్ట్ సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు .ఇటీవల విశ్వక్ హీరోగా నటిస్తూ దర్శకుడిగా కల్ట్ సినిమాని తెరకెక్కించాడు. కొత్త పాయింట్ తో సర్వైవల్ థ్రిల్లర్ గా  తెరకెక్కింది. పాయింట్ బాగున్నా వైలెన్స్ ఎక్కువ ఉండటంతో ప్రేక్షకులకి  అంతగా కనెక్ట్ అవ్వలేదు. దీంతో  ఫ్లాప్ గా మిగిలింది. 20 కోట్ల పైగా గ్రాస్ రావాల్సి ఉండగా కేవలం 6 కోట్లు మాత్రమే వచ్చాయి కల్ట్ సినిమాకి రిలీజ్ తర్వాత ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. రిలీజ్ నెక్స్ట్ డే ఒక ప్రెస్ మీట్ అనౌన్స్ చేసి చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసారు. ఇది కూడా చదవండి:ధోనితో బ్రేకప్ చేసుకున్న టాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా.. కారణం అదేనంట! ఇప్పుడు  ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ తో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కల్ట్ సక్సెస్ మీట్ ఎందుకు పెట్టలేదు అని అడగ్గా విశ్వక్ మాట్లాడుతూ.. టైం లేదు. కల్ట్ సినిమా రిలీజ్ అవ్వగానే ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ సినిమా బిజీలో ఉన్నాను. ఈ సినిమాకు, కల్ట్ కి కలిపి రెండిటికి ఒకేసారి సక్సెస్ మీట్ పెడతాను అని అన్నారు. మరి విశ్వక్ సరదాగా అన్నాడో, కౌంటర్ వేశాడో తెలీదు కానీ ఫ్లాప్ సినిమాకు సక్సెస్ మీట్ అనడంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.   మీకు నచ్చవచ్చు: నయనతారకి మదర్ థెరిస్సాకి ఉన్న సంబంధం ఏంటి! మీకు నచ్చవచ్చు: ధనుష్ ఫ్యాన్స్ vs అనిరుద్   [Vishwak Sen, Cult, Ene Repeat, Tharun Bhackar]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
 ఈ నాలుగు పాటిస్తే అత్తాకోడళ్ల మధ్య గొడవలే ఉండవు ఇంట్లో సంతోషం , ప్రశాంతత ఉండాలంటే కేవలం ఆర్థిక పరిస్థితులు బాగుండటమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు కూడా ఎంతో సజావుగా సాగాలి. ముఖ్యంగా ఏ ఇల్లయినా సంతోషంగా ఉండాలంటే అక్కడ అత్తాకోడళ్ల మధ్య అనుబంధం ఎంతో కీలకం అవుతుంది. సమాజంలో సాధారణంగా అత్తాకోడళ్ల మధ్య చిన్నపాటి మనస్పర్థలు, గొడవలు ఉండటం సర్వసాధారణం అని అనుకుంటూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం రెండు వేర్వేరు తరాల ఆలోచనలు, వారి అనుభవాలు , వారి అంచనాలు ఒకే చోట ఉండటమే.. ఎప్పుడైతే ఇద్దరి మధ్య చిన్న పొరపాట్లు జరుగుతాయో, అవి క్రమంగా పెద్ద గొడవలుగా మారి ఇళ్లలోని శాంతిని దూరం చేస్తాయి. అయితే ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఈ బంధాన్ని మరింత గట్టిగా మార్చుకోవడానికి , ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషకరమైన వాతావరణం నెలకొనడానికి కొన్ని సులభమైన మార్గాలను అందించారు. ఆ నాలుగు ముఖ్యమైన విషయాలను పాటిస్తే ఈ బంధంలో ఎప్పుడూ ఎలాంటి అనుమానాలు, గొడవలు రావని స్పష్టం చేశారు.అవేంటో తెలుసుకుంటే.. సంయమనం.. ఏదైనా ఒక విషయంపై  ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు లేదా ఒకరిమీద మరొకరికి  కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కాస్త సంయమనం పాటించడం చాలా అవసరం. కోపంలో నోటి వెంట వచ్చే మాటలు ఎప్పుడూ జీవితాంతం  ఇతరుల మనసులో చెడు అభిప్రాయాన్ని కలిగిస్తాయి. కాబట్టి కోపం వచ్చిన తక్షణం గొడవ పడకుండా ప్రశాంతంగా పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒకరి మాటలు మరొకరు పూర్తిగా వినడం వల్ల చాలా వరకు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమవుతాయి. ఈ చిన్న నియమం వల్ల అత్తాకోడళ్ల మధ్య దూరం పెరిగే అవకాశమే ఉండదు. పరస్పర గౌరవం.. అత్తాకోడళ్లు  ఒకరి భావాలను మరొకరు గౌరవించడం కూడా అంతే ముఖ్యం. అత్తగారు ఏళ్ల తరబడి ఇంటి బాధ్యతలను మోస్తూ తనకంటూ కొన్ని పద్ధతులు ఏర్పరచుకుని ఉంటారు. అలాగే కోడలు కూడా తనదైన ఆలోచనలు, ఆధునిక భావనలతో కొత్త వాతావరణంలోకి అడుగుపెడుతుంది. ఇలాంటి సమయంలో ఇద్దరూ ఒకరి అభిప్రాయాలను, వారి స్వేచ్ఛను గౌరవించాలి. అత్తగారు తన పాత అనుభవాలను గౌరవించాలని కోరుకుంటే, కోడలు కూడా ఇంటి పాత సంప్రదాయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా పరస్పర గౌరవం ఉంటే ఇద్దరి మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. బయటి వ్యక్తుల దగ్గర ఓపెన్ అవ్వడం.. కుటుంబానికి సంబంధించిన చిన్నచిన్న విషయాలను లేదా మనస్పర్థలను బయటి వ్యక్తుల వద్ద, బంధువుల వద్ద చర్చించడం ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా కోడలు తన పుట్టింటికి వెళ్లినప్పుడు కూడా ఇంట్లోని విషయాలను బయట పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కాకపోగా మరింత పెద్దవిగా మారుతాయి. ఎప్పుడైనా సమస్యలు వస్తే వాటిని ఇంట్లోనే ఒకరితో ఒకరు కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సులువుగా పరిష్కరించుకోవచ్చు. ఇది కూడా చదవండి   జీవితంలో నిజమైన విజయం ప్రశాంతత కావాలా.. ఇదిగో ఈ సూత్రాలు పాటించండి.. !   సహకారం.. ఇద్దరి మధ్య మంచి సహకారం ఉండటం ఎంతో ముఖ్యం. ఏ బంధంలోనైనా ఇద్దరి అంచనాలు స్పష్టంగా లేనప్పుడు అపార్ధాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంటి పనులు, బాధ్యతలు , ఇతర విషయాల గురించి ఒకరికొకరు తోడుగా ఉంటూ పనులను పంచుకోవాలి. అత్తగారు కొత్తగా వచ్చిన కోడలికి విషయాలు నేర్చుకోవడానికి తగినంత సమయం ఇవ్వాలి. ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళితే ఆ ఇంటిలో ఎప్పుడూ నవ్వులు , సంతోషానికి లోటు ఉండదు. అత్తాకోడళ్ల మధ్య కూడా గొడవలు అనేవి చాలా వరకు రావు.. ఒకవేళ వచ్చినా పై మార్గాలు ఫాలో అవుతూ ఉంటే అవన్నీ                                                                                                                                             *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు  రిలేషన్‌షిప్‌లో పర్సనల్ స్పేస్..భాగస్వామి ఒంటరిగా గడపాలని కోరుకోవడానికి అసలు కారణాలు..!  
జీవితాంతం ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి పనిచేసినా చాలామంది ఆర్థికంగా ఎదగలేకపోతుంటారు. కానీ కొందరు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనైనా తరతరాలుగా అత్యంత ధనవంతులుగా నిలదొక్కుకుంటూ ఉంటారు. దీనికి అసలు కారణం వారి దగ్గర ఉన్న డబ్బు కాదు, వారి ఆలోచనా విధానం లేదా మైండ్ సెట్. భారతదేశంలో వ్యాపారాలకు  మార్వాడీలు  పెట్టింది పేరు.   మార్వాడీలు అవలంబించే కొన్ని ప్రత్యేకమైన ఆర్థిక సూత్రాలను తెలుసుకోవడం ద్వారా సామాన్యులు కూడా తమ సంపదను  వృద్ధి చేసుకోవచ్చు.  ఆ ఆర్థిక సూత్రాలు ఏమిటో వివరంగా తెలుసుకుంటే.. డబ్బును ప్రేమించడం కంటే దానితో పని చేయించడం ముఖ్యం.. చాలామందికి జీతం రాగానే కొత్త వస్తువులు కొనడం, రెస్టారెంట్లు , ట్రిప్స్ అంటూ ఖర్చు చేయడానికి ప్లాన్ చేసుకుంటుంటారు. కానీ మార్వాడీలు ఎప్పుడూ ఈ డబ్బు నాకు ఇంకో రూపంలో ఎంత సంపాదించి పెడుతుంది అనే కోణంలో ఆలోచిస్తారు. కేవలం పొదుపు చేయడం వల్ల డబ్బు నిలబడుతుంది కానీ ఇన్వెస్ట్‌మెంట్లు మాత్రమే డబ్బును రెట్టింపు చేస్తాయి. ప్రతి రూపాయిని ఒక ఉద్యోగిలా భావించి తగిన ప్రతిఫలం రాబట్టడంపై దృష్టి పెట్టాలి. ప్రతి రూపాయికి స్పష్టమైన లెక్క ఉండాలి.. నెలవారీ ఖర్చులపై సరైన అవగాహన లేకపోవడం వల్లనే చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు. లెక్క తెలియని సంపద ఎప్పుడూ నిలవదు. మార్వాడీలు తాము ఖర్చు చేసే ప్రతి పైసాను రాసుకుంటారు. రాత్రి పడుకునే ముందు ఆ రోజు ఎంత ఖర్చు చేశాం, ఎందుకు చేశాం అని పరిశీలించుకోవడం ద్వారా అనవసరపు ఖర్చులకు అడ్డుకట్ట వేయవచ్చు. జీవనశైలి మార్చుకోవడం కాదు.. ఆస్తులు పెంచుకోవాలి.. సమాజంలో హోదా కోసం లేదా పక్కవాళ్ళను చూసి ఐఫోన్లు, ఖరీదైన బైకులు, కార్లు కొంటూ ఈఎంఐలు , లోన్లతో జీవితాన్ని అప్పులమయం చేస్తుంటారు. కానీ ఆదాయం పెరిగిన వెంటనే జీవనశైలిని మార్చుకోకూడదని, ముందుగా ఆస్తులను పెంచుకోవాలని మార్వాడీలు నమ్ముతారు. ధనవంతులుగా కనిపించడం కోసం కాకుండా నిజంగా ధనవంతులు కావడానికి ఖర్చు చేయాలి. ఇది కూడా చదవండి    చేతికి డబ్బు రాగానే ఈ పనులు చేయండి.. లేకపోతే బాధపడతారు..!​   వాతావరణం.. చిన్నప్పటి నుంచే పిల్లలకు వ్యాపారం, డబ్బు నిర్వహణ గురించి మాట్లాడే వాతావరణం మార్వాడీ కుటుంబాల్లో ఉంటుంది. దీనివల్ల మంచి అవకాశాలు దక్కుతాయి. జీవితంలో ఎదగాలంటే మంచి ఆలోచనలు ఉన్నవారితో కలవడం, మంచి పుస్తకాలు చదవడం , అనుభవజ్ఞులైన మార్గదర్శకుల సలహాలు తీసుకోవడం ఎంతో అవసరం. రిస్క్.. రిస్క్ తీసుకోవడం అంటే గుడ్డిగా డబ్బు పెట్టేయడం కాదు, అన్ని కోణాల్లో ఆలోచించి చిన్న మొత్తంతో ప్రారంభించడం. ఈరోజు ఇన్ఫ్లేషన్ వల్ల డబ్బు విలువ పడిపోతున్న తరుణంలో ఎలాంటి రిస్క్ తీసుకోకపోవడమే పెద్ద రిస్క్ అవుతుంది. సరిగ్గా నేర్చుకొని, అర్థం చేసుకుని సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆస్తి కాదు.. జ్ఞానం ముఖ్యం.. కేవలం బడిలో, పుస్తకాల  చదువులతో సరిపెట్టకుండా చిన్న వయసులోనే వ్యాపార మెలకువలు, కస్టమర్లతో మాట్లాడే విధానం, లాభనష్టాల బేరీజు వేయడం నేర్పిస్తారు. దీనివల్ల యుక్తవయసు వచ్చేసరికి వారికి అద్భుతమైన  అనుభవం సొంతమవుతుంది. రేపటి తరం కోసం.. రేపటి లాభాల కోసం ఆశపడకుండా, సుదీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రణాళికలు రచిస్తారు. ఒక రైతు విత్తనం నాటి వెంటనే ఫలితం ఆశించకుండా ఎలా రోజూ నీరు పోసి సంరక్షిస్తాడో, సంపద సృష్టించడంలో కూడా అలాగే సహనంతో కూడుకున్న ప్రక్రియ. ఎప్పటికీ చేయకూడని పొరపాట్లు.. ఆదాయం పెరిగిన వెంటనే విలాసవంతమైన ఖర్చులు పెంచడం, కేవలం ఒకే ఆదాయ వనరుపై ఆధారపడకుండా వివిధ మార్గాల్లో సంపాదనను సృష్టించడం, అలాగే భావోద్వేగాలకు లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా లాజిక్ గా  రీసెర్చ్ ఆధారంగా పెట్టుబడులు పెట్టడం వంటి నియమాలు వారిని ఎప్పటికీ అగ్రస్థానంలో ఉంచుతాయి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టడం మన చేతుల్లో లేకపోయినా, సరైన ఆర్థిక నిర్ణయాలతో జీవితాన్ని మార్చుకోవడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది.                                                                                                                                               *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   రిలేషన్‌షిప్‌లో పర్సనల్ స్పేస్..భాగస్వామి ఒంటరిగా గడపాలని కోరుకోవడానికి అసలు కారణాలు..!​                                     మీ దగ్గర డబ్బు నిలవడం లేదా..అసలు కారణాలు ఇవే..!
చాలామంది భారతీయుల దినచర్య ఉదయం పూట ఒక వేడి వేడి టీ కప్పుతోనే ప్రారంభమవుతుంది. దానికి తోడు రెండు బిస్కెట్లు తింటే అల్పాహారం పూర్తయినట్లుగా ఎంతో సంతృప్తిగా భావిస్తారు. తక్కువ ఖర్చుతో, ఎంతో సులభంగా దొరికే ఈ సాధారణ అలవాటు దాదాపు ప్రతి మధ్యతరగతి ఇళ్లలోనూ కనిపిస్తుంది. అయితే ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా కేవలం టీ, బిస్కెట్లు మాత్రమే తీసుకుంటే ఆరోగ్యంపై ఎలాంటి తీవ్ర ప్రభావం పడుతుందనేది చాలామందికి తెలియదు. కన్సల్టెంట్ డైటీషియన్, డయాబెటిస్ ఎడ్యుకేటర్ కనికా మల్హోత్రా తెలిపిన వివరాల ప్రకారం, ఈ అలవాటును కేవలం 30 రోజుల పాటు నిరంతరం కొనసాగిస్తే శరీరంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. టీ, బిస్కెట్లు తినడం అప్పటికప్పుడు ఆకలిని తాత్కాలికంగా తగ్గించినప్పటికీ, శరీరానికి అవసరమైన ఎలాంటి పౌష్టికాహారాన్ని అందించడంలో పూర్తిగా వెనుకబడతాయి. ముఖ్యంగా ప్యాకెట్లలో లభించే బిస్కెట్లలో మైదా పిండి, రిఫైండ్ చక్కెర, అదనపు కొవ్వు పదార్థాలు అధిక మోతాదులో నిండి ఉంటాయి. అలాగే తీపి కలిపిన టీ నేరుగా రక్తంలో చక్కెర స్థాయిలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రొటీన్లు, పీచు పదార్థాలు పూర్తిగా లోపించిన ఇలాంటి అల్పాహారం తీసుకోవడం వల్ల రోజువారీ శక్తి తగ్గిపోవడం, ఆకలి నియంత్రణ కోల్పోవడం మరియు జీవక్రియ మందగించడం జరుగుతుంది. ఉదయం పూట మైదాతో తయారైన బిస్కెట్లు, చక్కెర కలిపిన పానీయాలు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు క్షణాల్లో వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ అకస్మాత్తుగా పెరిగిన చక్కెర స్థాయిలను నియంత్రించడానికి శరీరం అత్యవసరంగా ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. ఇలాంటి ఆహారపు అలవాట్లను ప్రతిరోజూ క్రమం తప్పకుండా కొనసాగిస్తే కొంతమందిలో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే ప్రీడయాబెటిస్ లేదా మధుమేహ సమస్యల బారిన పడినవారు ఇలాంటి ఆహారపు పొరపాట్ల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. బిస్కెట్లలో ఫైబర్ మరియు ప్రొటీన్లు నామమాత్రంగా ఉండటం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన అస్సలు కలగదు. దీనివల్ల ఉదయం 10 గంటల సమయానికే విపరీతమైన ఆకలి వేయడం, శరీరం నీరసించిపోవడం, తీవ్రమైన అలసట, చిరాకు మరియు ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా, నెల రోజుల పాటు ఈ అలవాటును పాటిస్తే శరీరానికి కావలసిన విటమిన్లు, కాల్షియం, బి విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాల లోపం ఏర్పడి ఎముకల బలం క్షీణించే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: రోజూ ఉదయం, ఇలా పసుపు నీళ్లు తాగితే. చర్మం మెరిసిపోవడంతో పాటు బోలెడు లాభాలు! ఈ కేలరీల భారాన్ని గమనిస్తే, చక్కెర మరియు చెడు కొవ్వులు అధికంగా ఉండే టీ, బిస్కెట్లను రోజూ తీసుకోవడం ద్వారా శరీరంలో అదనపు కేలరీలు పేరుకుపోతాయి. ఇది క్రమంగా బరువు పెరగడానికి మరియు కొలెస్ట్రాల్ సంబంధిత గుండె సమస్యలకు దారితీస్తుంది. అలాగే టీలో ఉండే టానిన్లు ఆహారం ద్వారా శరీరానికి అందాల్సిన ఐరన్ శోషణను అడ్డుకుంటాయి. దీనివల్ల రక్తహీనత వంటి సమస్యలు తలెత్తి శరీరం ఎప్పుడూ అలసటగా మారుతుంది. అయితే, టీ తాగే అలవాటును పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు గానీ దానితో పాటు తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. చక్కెర లేని టీ తీసుకోవడం, రాత్రంతా నానబెట్టిన 8 నుంచి 10 బాదం పప్పులను తినడం లేదా ఇంట్లో తక్కువ నూనెతో వేయించిన మఖానాలను అల్పాహారంగా ఎంచుకోవడం మంచిది. సరైన పోషకాహారాన్ని ఎంచుకోవడం ద్వారా కేవలం 30 రోజుల్లోనే మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. మీకు నచ్చవచ్చు:ఫీవర్ తగ్గాక కూడా గుండె దడ, కాళ్ల వాపులు ఉంటున్నాయా? ఇవి ప్రమాదకర గుండె ముప్పుకు సంకేతాలు!                                   ఆంధ్రుల ప్రత్యేక సాత్విక రుచి: అల్లం పచ్చి కారంతో, వంకాయ కూర!       Biscuits With Morning Tea, Daily Biscuit Side Effects, Unhealthy Breakfast Habits, Sugar And Maida Dangers, Weight Gain Risks, Doctor Health Advice, Health Tips In Telugu.  
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఇవి రక్తాన్ని నిరంతరం శుద్ధి చేస్తూ, శరీరంలోని వ్యర్థాలను, అదనపు నీటిని మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. అయితే, జీవనశైలిలో మార్పులు , వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా కిడ్నీలు బలహీనపడే ప్రమాదం ఉంది. కిడ్నీలు దెబ్బతినడం మొదలైనప్పుడు మన శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది. ముఖ్యంగా, మూత్ర విసర్జనలో వచ్చే మార్పులు కిడ్నీ సమస్యలకు తొలి సంకేతాలుగా భావించవచ్చు. వీటిని ముందుగానే గుర్తించడం ద్వారా పెద్ద ముప్పు నుంచి బయటపడవచ్చు. మూత్రంలో నురుగు.. సాధారణంగా కిడ్నీల పనితీరు మందగించినప్పుడు మూత్రం రంగు, పరిమాణం , దాని స్వభావంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. కొందరిలో మూత్రం చేసే సమయంలో విపరీతంగా , ఎక్కువసేపు నిలిచి ఉండే తెల్లటి నురగ వస్తుంటుంది. ఇలా తరచూ జరగడం మూత్రంలో ప్రొటీన్ బయటకు పోతున్నదనేదానికి ముఖ్య సంకేతం. ఆరోగ్యవంతమైన కిడ్నీలు శరీరానికి అవసరమైన ప్రొటీన్‌ను ఉంచుకుని వ్యర్థాలను మాత్రమే బయటకు పంపిస్తాయి. కానీ కిడ్నీ ఫిల్టర్లు దెబ్బతిన్నప్పుడు ప్రొటీన్ మూత్రం ద్వారా కారిపోతుంది. మూత్రం రంగు.. మూత్రం రంగులో వచ్చే మార్పులను కూడా తేలికగా తీసుకోకూడదు. సాధారణంగా మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. కానీ ఎటువంటి కారణం లేకుండా మూత్రం ముదురు పసుపు రంగులో, గోధుమ రంగులో లేదా తేయాకు రంగులో పడుతుంటే అప్రమత్తం కావాలి. కొన్ని సందర్భాల్లో మూత్రం గులాబీ రంగులో లేదా ఎరుపు రంగులో రావడం కూడా జరుగుతుంది. దీనిని వైద్య పరిభాషలో హెమటూరియా అంటారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడటం, ఇన్ఫెక్షన్లు తలెత్తడం లేదా వాపు కారణంగా ఇలా జరగవచ్చు. నొప్పులు లేకపోయినా మూత్రంలో రంగు మారడం లేదా రక్తం పడటం జరిగితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. మూత్రవిసర్జన వేళలు.. మూత్ర విసర్జన చేసే వేళల్లో వచ్చే తేడాలు కూడా కిడ్నీ సమస్యలను సూచిస్తాయి. పగటిపూట లేదా రాత్రి సమయంలో సాధారణం కంటే చాలా ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం కిడ్నీల సామర్థ్యం తగ్గడానికి ఒక కారణం కావచ్చు. కిడ్నీలు మూత్రాన్ని సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోవడం  వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. దీనికి తోడు డయాబెటిస్ లేదా ప్రోస్టేట్ సమస్యలు కూడా కారణం కావొచ్చు. మరోవైపు, అకస్మాత్తుగా మూత్రం వచ్చే పరిమాణం చాలా తగ్గిపోవడం లేదా పూర్తిగా ఆగిపోవడం జరిగితే అది చాలా ప్రమాదకరమైన పరిస్థితికి సంకేతం. ఇది కూడా చదవండి   కిడ్నీ, లివర్ సమస్యలకు ముందే శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే! వాసన.. మూత్రం నుండి తీవ్రమైన లేదా సాధారణం కాని ఘాటైన వాసన రావడం కూడా కొన్నిసార్లు శరీరంలో నీటిశాతం తగ్గడం వల్ల లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. ఈ లక్షణాలతో పాటు పొత్తి కడుపులో  నొప్పి, జ్వరం లేదా మంట వంటి సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మరికొన్ని సిగ్నల్స్.. మూత్రంలో కనిపించే ఈ మార్పులతో పాటు శరీరం ఇతర సంకేతాలను కూడా ఇస్తుంది. ముఖం మరియు పాదాలు ఉబ్బడం, ఒంట్లో తీవ్రమైన నీరసం నిరంతరం వేధించడం, ఆకలి మందగించడం, వికారంగా అనిపించడం, చర్మంపై విపరీతమైన దురద పుట్టడం , కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తే కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని అర్థం చేసుకోవాలి. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం వల్లే ఇవన్నీ జరుగుతాయి. అధిక రక్తపోటు, మధుమేహం దీర్ఘకాలికంగా నియంత్రణలో లేకపోవడం, కిడ్నీలో రాళ్లు, పదే పదే వచ్చే మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు , వైద్యుల సలహా లేకుండా విచ్చలవిడిగా పెయిన్‌కిల్లర్స్ వంటి మందులను వాడటం వల్ల కిడ్నీలు తీవ్రంగా దెబ్బతింటాయి. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, తగినంత నీరు తాగుతూ ఉండటం , ఏ చిన్న అనారోగ్య లక్షణం కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.                                                                                                                                              *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   ఈ ఐదు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు.. జీవితం మారిపోతుంది..​                                  మోకాళ్ల నొప్పులతో ఇబ్బందా..ఈ 5 వ్యాయామాలు మిస్ అవ్వకండి .! ​  
మన శరీరంలోని కిడ్నీలు, లివర్ వంటి ముఖ్యమైన అవయవాలు ఆరోగ్యంగా పనిచేస్తున్నాయా? వాటిలో ఏవైనా సమస్యలు మొదలైతే శరీరం ముందుగానే కొన్ని సంకేతాలను ఇస్తుందా? అసలు ఈ సంకేతాలను ఎలా గుర్తించాలి? మన శరీర ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడంలో చెవులు, కళ్లు, పెదవుల ఆకృతి వంటి బాహ్య లక్షణాలకు ఎలాంటి ప్రాధాన్యత ఉంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మన శరీరంలోని ప్రతి అవయవం తనదైన ప్రత్యేక విధులను నిర్వహిస్తుంది. కిడ్నీలు రక్తంలోని వ్యర్థ పదార్థాలను వడపోసి బయటకు పంపడంలో, శరీరంలో నీరు, లవణాల సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే లివర్ ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన పిత్తరసాన్ని ఉత్పత్తి చేయడంతో పాటు శరీరంలోని అనేక ముఖ్యమైన జీవక్రియల్లో పాల్గొంటుంది. ఈ అవయవాల పనితీరులో మార్పులు వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఈ వీడియోలో డాక్టర్ ఉమా వెంకటేష్ (Dr. Uma Venkatesh) పంచభూతాల సిద్ధాంతం, శరీరంలోని అవయవాల పనితీరు, నాడి ప్రాధాన్యత గురించి వివరిస్తున్నారు. ముఖ్యంగా కిడ్నీలు, లివర్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలతో పాటు చెవులు, కళ్లు, పెదవుల ఆకృతిని పరిశీలించడం ద్వారా శరీరంలోని అంతర్గత ఆరోగ్య పరిస్థితుల గురించి ఎలా అర్థం చేసుకోవచ్చనే అంశాలను పల్స్ బ్యాలెన్సింగ్ (Pulse Balancing) విధానం ద్వారా తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో మీరు తెలుసుకోగలిగే ముఖ్యమైన అంశాలు: కిడ్నీలు, లివర్ మన శరీరంలో నిర్వహించే ముఖ్యమైన విధులు ఏమిటి?   ఈ అవయవాల ఆరోగ్యంలో మార్పులు వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు ఏమిటి?   కిడ్నీ సమస్యలకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలను ఎలా  గుర్తించాలి?   లివర్ ఆరోగ్యాన్ని సూచించే లక్షణాలు ఏమిటి?    చెవులు, కళ్లు, పెదవుల ఆకృతికి శరీర ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏమిటి?   పంచభూతాల సిద్ధాంతం ప్రకారం శరీర అవయవాల పనితీరును ఎలా వివరిస్తారు?   నాడి పరిశీలన, పల్స్ బ్యాలెన్సింగ్ విధానంలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి?   మన అంతర్గత అవయవాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శరీరం ఇచ్చే మార్పులను నిర్లక్ష్యం చేయకుండా గమనించడం, అవసరమైనప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యం. కేవలం బాహ్య లక్షణాలు లేదా అవయవాల ఆకృతిని బట్టి కిడ్నీ, లివర్ వ్యాధులను నిర్ధారించలేము. సరైన వైద్య పరీక్షలు, నిపుణుల సలహాతోనే ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించుకోవాలి. కిడ్నీ, లివర్ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడానికి డాక్టర్ ఉమా వెంకటేష్ అందిస్తున్న ఈ విలువైన సమాచారాన్ని పూర్తిగా చూడండి. TeluguOne Health – ఆరోగ్యంపై అవగాహన, ఆరోగ్యకరమైన జీవితానికి మార్గదర్శకం.
శరీరంలోని ప్రతి విభాగానికి ఆక్సిజన్ సక్రమంగా అందాలంటే మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. కానీ మారుతున్న జీవనశైలి, విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యం, చెడు అలవాట్లు మన శ్వాస వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. దీనివల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు చాలా సాధారణం అయిపోతున్నాయి. ముఖ్యంగా క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (Chronic Obstructive Pulmonary Disease) సీఓపీడీ అనే దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతోంది. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, కేవలం వయసు మళ్ళిన వారికే కాకుండా నలభై ఏళ్లకంటే తక్కువ వయసు ఉన్న యువతలో కూడా ఈ సమస్యల బారిన పడుతున్న వారు క్రమంగా పెరుగుతున్నారు. ఈ వ్యాధి ముదిరినప్పుడు రోగులకు సాధారణంగా శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టంగా మారుతుంది. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. world copd day.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా నవంబర్ నెల మూడవ బుధవారం రోజున ప్రపంచ సీఓపీడీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ దినోత్సవం సందర్భంగా శ్వాస ఆడకపోవడం లేదా ఆయాసంగా ఉందా, అయితే అది సీఓపీడీ కావచ్చు అనే ముఖ్యమైన అంశంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు హరిస్తున్న ప్రధాన కారణాలలో మూడవ స్థానంలో ఉంది. దీనివల్ల ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ అనారోగ్యానికి ప్రధాన కారణం దాదాపు డెబ్బై శాతానికి పైగా పొగాకు , ధూమపానమే అని నిపుణులు చెబుతున్నారు. సీఓపీడీ బారిన పడినప్పుడు ఊపిరితిత్తులలోని గాలి నాళాల్లో తీవ్రమైన మంట , వాపు ఏర్పడుతుంది. దీనివల్ల గాలి లోపలికి వెళ్లడం, బయటికి రావడంలో అవరోధం ఏర్పడి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఈ సమస్యలో ఉన్న అతి పెద్ద ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే, దీని లక్షణాలు చాలా నెమ్మదిగా బయటపడతాయి. ప్రారంభ దశలో వీటిని గుర్తించడం కష్టం కావడం వల్ల చాలా మంది సాధారణ దగ్గు లేదా వయసు మళ్లడం వల్ల వచ్చే బలహీనత అనుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఉదయం పూట ఎక్కువగా దగ్గు రావడం, దగ్గుతో పాటు కఫం పడటం దీని ప్రధాన లక్షణం. అలాగే కాస్త దూరం నడిచినా, మెట్లు ఎక్కినా లేదా చిన్నపాటి శారీరక పని చేసినా వెంటనే ఆయాసం రావడం గమనించవచ్చు. వ్యాధి తీవ్రత పెరిగేకొద్ది ఎలాంటి పనులు చేయకపోయినా విశ్రాంతి సమయంలో కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. ఇవే కాకుండా సీఓపీడీ సోకినప్పుడు ఛాతీలో బిగువుగా అనిపించడం, బరువుగా ఉండటం, శ్వాస తీసుకునేటప్పుడు పీపీ మంటూ శబ్దం రావడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. కొందరిలో తరచుగా బ్రాంకైటిస్ లేదా నిమోనియా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఇబ్బంది పెడుతుంటాయి. ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా బరువు తగ్గడం, తీవ్రమైన అలసట , నీరసం  కూడా ఈ వ్యాధి లక్షణాలే. కొందరిలో చలి గాలి తగిలినా లేదా కాలుష్యం బారిన పడినా ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఇది కూడా చదవండి  షుగర్ ఉన్నవారికి స్ట్రోక్ ముప్పు పొంచి ఉందా..ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి! ధూమపానం , సిగరెట్, బీడీలు కాల్చే అలవాటు ఈ వ్యాధికి ప్రధాన శత్రువు. పొగత్రాగని వారితో పాటు చుట్టుపక్కల ఉండి ఆ పొగ పీల్చేవారికి కూడా ఈ ప్రమాదం ఉంటుంది. ఇది కాకుండా నగరాల్లో ఉండే తీవ్రమైన వాతావరణ కాలుష్యం, ఇళ్లలో వంట చేయడానికి ఉపయోగించే చెక్క, బొగ్గు వంటి కట్టెల పొగ కూడా ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. కొన్ని సందర్భాలలో జన్యుపరమైన కారణాల వల్ల కూడా చిన్న వయసులోనే ఇది రావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయడం కష్టమైనప్పటికీ, ప్రారంభ దశలోనే గుర్తిస్తే తగిన చికిత్స , జీవనశైలి మార్పుల ద్వారా దీనిని అదుపులో ఉంచుకోవచ్చు. దీనికోసం ప్రధానంగా ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి. కాలుష్యం , దుమ్ము ధూళి ఉండే ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ల సలహా మేరకు ఇన్‌హేలర్లు  వాడటం, క్రమంగా శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కాపాడుకోవచ్చు. ఏదైనా అనారోగ్య లక్షణాలు దీర్ఘకాలంగా వేధిస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే  వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం ఎంతో మంచిది.                                                                                                                                               *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   ఈ ఐదు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు.. జీవితం మారిపోతుంది..                                  వాకింగ్ ఎలా చేయాలి? చాలామందికి తెలియని సీక్రెట్ ఇదే..!​