LATEST NEWS
  ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..! తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ వివాదంపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ ప్రస్తుతం హస్తం పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, కాంగ్రెస్ నేతల ప్రకటనలు పార్టీలో అంతర్గత విభేదాలను తీవ్రస్థాయికి చేర్చాయి. ముఖ్యంగా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా కొండా కుటుంబ సభ్యుల తీరు ఉందన్న అభిప్రాయంతో అధిష్ఠానం ఈ అంశాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అత్యవసరంగా బెంగళూరు పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమైన భట్టి విక్రమార్క, రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా నివేదికను ఆయనకు సమర్పించినట్లు సమాచారం. బెంగళూరు భేటీ అనంతరం ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు వేదికగా మంత్రులు, సీనియర్ నేతల మధ్య వరుస భేటీలు జరగడంతో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే ఈ వివాదంపై పార్టీ క్రమశిక్షణా కమిటీ నివేదికను సిద్ధం చేసి అధిష్ఠానానికి పంపినట్లు సమాచారం. అందుతున్న వార్తల ప్రకారం, అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకుంటే మంత్రివర్గంలో మార్పులు లేదా స్వచ్ఛంద రాజీనామా అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం మొదలైంది. మరోవైపు కొండా మురళీధరావు కీలక వ్యాఖ్యలు చేయడం, తమ వైఖరిని స్పష్టం చేయడంతో ఈ ఎపిసోడ్ మరింత కాకరేపుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినకుండా ఉండేందుకు అసెంబ్లీ సమావేశాల లోపే తుది నిర్ణయం తీసుకోవాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న కొండా సురేఖ వ్యవహారంలో ఏఐసీసీ పెద్దల నిర్ణయం ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే హైకమాండ్ అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. మరోవైపు సెప్టెంబర్ 2 తర్వాత మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ అగ్రనేత కేసీ వేణుగోపాల్‌.. సెప్టెంబర్ 2న ఢిల్లీకి చేరుకోనున్నారు. ఆయన ఢిల్లీకి వచ్చిన తర్వాతే కొండా సురేఖ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేసీ వేణుగోపాల్‌ రాక అనంతరం క్రమశిక్షణ కమిటీ చేసిన సిఫార్సులపై చర్చ జరగనుంది. ఈ వ్యవహారంలో రాయబారం చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు భట్టి ఆసక్తి చూపలేదని సమాచారం. మరోవైపు.. క్రమశిక్షణ కమిటీ నిర్ణయమే తుది నిర్ణయమని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో కేసీ వేణుగోపాల్‌ రాక తర్వాత కొండా సురేఖపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది కాంగ్రెస్‌ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.   Konda Surekha, Bhatti Vikramarka, Telangana Congress Politics, Mallikarjun Kharge, AICC, Telugu News, Telugu one, KC Venugopal  
రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ ఏ మూలైనా సరే ఏదైనా ఒక ఘోరం జరిగితే, ఒక నేరం జరిగితే.. వాటి మూలాలు ఏపీలోని వైసీపీ పార్టీలో ఉంటాయన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నవే. ఇప్పుడు తాజాగా నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి.  కాకినాడ జిల్లాలో ఇటీవల వెలుగుచూసిన  కుటుంబ  ఆత్మహత్య ఉదంతం రాజకీయంగా, సామాజికంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగి నూకరాజు కుటుంబంతో సహా ఆత్మహత్యకు  పాల్పడటం వెనుక లవ్ జిహాద్, మతమార్పిడి ఒత్తిళ్లు, ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్  ఉన్నాయన్న ఆరోపణలు పెను సంచలనం సృష్టించాయి. ఈ కుటుంబం ఆత్మహత్యకు  కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధిక్ అనే వ్యక్తికి  వైసీపీతో సంబంధాలున్నాయన్న సంగతి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వైసీపీ  నాయకుడు, కాకినాడ మాజీ ఎమ్మెల్యే   ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సాధిక్ అనుచరుడన్న వార్తలు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.  సాధిక్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో  సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే వార్తలు  నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.  సాధిక్,  వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఉన్న ఫొటోలు, దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.   సాధిక్ మాజీ ఎమ్మెల్యే   అనుచరుడేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  వైసీపీ హయాంలో సాధిక్ కు  రాజకీయ అండదండలు పుష్కలంగా లభించాయని, ఆ అండదండలతోనే సాధిక్   ఇటువంటి అరాచకాలకు ఒడిగట్టాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  భాధిత  నూకరాజు కుటుంబాన్ని లవ్ జిహాద్ పేరుతో వేధింపులకు గురిచేసి, బలవంతపు మతమార్పిడికి ఒత్తిడి తీసుకురావడంతో ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేకనే నూకరాజు కుటుంబ సమేతంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని అంటున్నారు.  గతంలో సాధిక్ ప్రారంభించిన ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్  ప్రారంభోత్సవానికి కూడా మాజీ ఎమ్మెల్యే హాజరైనట్లు చెబుతున్నారు.  దీనిపై కాకినాడ ఎంపీ, జనసేన నాయకుడు   తంగెళ్ల శ్రీనివాస్ నూకరాజు కుటుంబానికి   న్యాయం చేయాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్‌ను   ఈ ఉదంతం వెనుక ఏకపక్ష వేధింపులే కాకుండా ఒక పెద్ద వ్యవస్థాగత రాకెట్ పనిచేస్తోందని ఎంపీ ఆరోపించారు. అమాయక కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ తరహా అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.   Kakinada Family Suicide, Sadiq Controversy, Dwarampudi Chandrasekhar Reddy Link , Kakinada Love Jihad Case
  తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని, పార్టీ మార్పుపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలతో కొండా మురళి సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పార్టీలో గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు, మంత్రి కొండా సురేఖ చుట్టూ తిరుగుతున్న వివాదాల వేళ ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశం ముగిసిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కొండా మురళి పలు విషయాలపై ఓపెన్ అయ్యారు. గాంధీ కుటుంబంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల నాయకత్వంలోనే తాము ముందుకు సాగుతామని పునరుద్ఘాటించారు. ఇటీవల తమ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై సైతం ఆయన స్పందించారు. కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఆమె కేవలం 'ప్లాన్-ఎ' ప్రకారమే మాట్లాడిందని, అసలు ఆమె మనసులో ఉన్న 'ప్లాన్-బి' ఏంటో తనకు కూడా తెలియదని వ్యాఖ్యానించారు. మంత్రి కొండా సురేఖ కార్యకలాపాలపై మాట్లాడుతూ.. ఆమె ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని గుర్తుచేశారు. మంగళవారం జరిగిన వనమహోత్సవంతో పాటు బుధవారం నిర్వహించిన ఇతర అధికారిక సమావేశాల్లోనూ సురేఖ పాల్గొన్నారని తెలిపారు. ప్రస్తుతం పార్టీ క్రమశిక్షణ కమిటీ సమక్షంలో ఉన్న అంశాలపై తాను స్పందించబోనని మురళి తెలిపారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ తుది నిర్ణయం వెలువరించేంత వరకు తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనంగానే ఉంటానని స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా కొండా సురేఖ వైఖరిపై పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ (డీఏసీ) ముందుకు కూడా ఈ అంశం వెళ్లడంతో అధిష్టానం ఏ విధమైన చర్యలు తీసుకోబోతోందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ భేటీలు, సీనియర్ నేతల సంప్రదింపుల నేపథ్యంలో త్వరలోనే ఈ వివాదానికి తెరపడే అవకాశాలు కనిపించాయి. అధిష్టానం నిర్ణయం ఆధారంగా తదుపరి రాజకీయం ఎలా మారుతుందో వేచి చూడాల్సి ఉంది. Konda Murali, Konda Surekha, Telangana Congress News, Deputy cm Bhatti Vikramarka,TeluguOne News, CM Revanth reddy, Congress party, Minister Uttam Kumar Reddy,  MLA Komatireddy Rajagopal Reddy  
ఏపీలో   స్థానిక  ఎన్నికలకు ముహూర్తం దాదాపు ఖరారైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్రం అంతా ఒకెత్తు అయితే కడప జిల్లా అందులోనూ పులివెందుల మరో ఎత్తు అన్నట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వైసీపీ అధినేత   జగన్  అడ్డా అయిన   పులివెందుల మున్సిపాలిటీని  తమ ఖాతాలో వేసుకోవాలని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వెస్తున్నది. అన్నిటికీ మించి ఈ సారి మునిసిపల్ చైర్మన్లు, మేయర్లు, జడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిన జరుగుతుండటంతో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. ఇక సాధారణంగా స్థానిక ఎన్నికలలో అధికార పక్షం హవా నడుస్తుంది. అయితే విపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత పులివెందుల విషయంలో మాత్రం మిగిలిన ప్రాంతాలలోలా  అధికార పార్టీ హవా అని టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవడానికి లేదు. అందుకే అధికార తెలుగుదేశం కూటమి వ్యూహాత్మకంగా పులివెందులలో పాగా వేయడానికి ప్రణాళికలు రచిస్తోంది.  గతంలో  వైసీపీ  అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంపై వైసీపీ ప్రత్యేక దృష్టి సారించి, అక్కడ లోకల్ బాడీ ఎన్నికలలో పై చేయి సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగుదేశం కూటమి కూడా అలాగే పులివెందులలో జగన్ పునాదులు కదిలించాలన్న పట్టుదలతో ఉంది. అదే సమయంలో తన పట్టు నిలుపుకోవడానికి మజీ సీఎం, వైసీపీధినేత జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా ఇప్పటికే పులివెందుల మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిని ఖరారు చేసినట్లు చెబుతున్నారు. పులివెందుల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైసీపీ   యువ నేత దుష్యంత్ రెడ్డిని బరిలోకి దింపనుంది. దుష్యంత్ రెడ్డి జగన్ కు సమీపబంధువు. ఆయన ఇప్పటికే క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలతో అనధికారికంగా ఎలక్షన్ క్యాంపెయి ప్రారంభించేసినట్ల తెలుస్తోంది.  అయితే అదే సమయంలో తెలుగుదేశం కూటమి కూడా పులివెందులలో జగన్ పట్టుకు చెక్ పెట్టి మునిసిపాలిటీని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది. పులివెందులతో బీటెక్ రవి తెలుగుదేశం కూటమి తరఫున కీలక పాత్ర పోషిస్తున్నారు.  గతంలో పులివెందుల జెడ్పీటీసీకి జరిగిన ఉప ఎన్నికలో బీటెక్ రవీ పకడ్బందీగా వ్యవహరించి.. తెలుగుదేశం అభ్యర్థిని మట్టి కరిపించి తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధించడంలో కీలక పాత్ర వహించారు. అంతకు ముందు..  పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బీటెక్ రవి తన వ్యూహాలతో జగన్ మెజారిటీని గణనీయంగా తగ్గించగలిగిన విషయాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.  ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అనేక ఒత్తిళ్లను తట్టుకుని నిలబడిన బీటెక్ రవి, ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో పులివెందులలో  సత్తా చాటుతున్నారంటున్నారు. పులివెందులలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలంగా సాధిస్తున్న ఆధిపత్యానికి గండి కొట్టడమే లక్ష్యంగా కూటమి అడుగులు వేస్తుంటే.. వైసీపీ పట్టు నిలుపుకోవడానికి శాయశక్తులా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పులివెందులలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది.    AP localbody Elections, Pulivendula Municipal Elections, YCP Candidate Dushyant Reddy, BTech Ravi TDP,Pulivendula Politics, Telugu News, TeluguOne
  తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం కల్పించడమే తమ లక్ష్యమని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ పిలుపునిచ్చారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్‌ మండలం నల్లంపల్లి వద్ద నిర్వహించిన నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయదుర్గం ప్రజలకు ప్రేమ, పౌరుషం, అభిమానం ఎక్కువే..! “విజయనగరం రాజుల మూడో రాజధాని రాయదుర్గం. రాయదుర్గం కోటలో ఎంత పౌరుషం ఉందో.. ఇక్కడి ప్రజల్లోనూ అంతే పౌరుషం ఉంది. ఇక్కడ పట్టు చీరలు, జీన్స్ ఎంత ఫేమసో.. మీ ప్రేమ, అభిమానం, స్టైల్ కూడా అంతే ఫేమస్. అవన్నీ ఈరోజు ప్రత్యక్షంగా చూశాను. గత 11 ఎన్నికల్లో టీడీపీ కేవలం 4 సార్లు మాత్రమే గెలిచినా.. గెలిచినా, ఓడినా రాయదుర్గం నియోజకవర్గాన్ని గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఓబుళాపురం గనుల పేరుతో అడ్డగోలుగా అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పుడు కమిటీ వేసి ప్రజల తరఫున పోరాడింది టీడీపీ. నాడు మనం చేసిన పోరాటానికి ఫలితంగా తాజాగా తీర్పు వచ్చింది. ప్రజల కోసం పోరాడింది.  కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలైన బలం. అందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తే అధినేత. దేశంలో మరే రాజకీయ పార్టీ కల్పించని విధంగా కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పిస్తున్న పార్టీ టీడీపీ. కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటికే రూ.160 కోట్లు ఖర్చు చేశాం. కష్టపడి పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం కల్పించడమే మా లక్ష్యం” అని అన్నారు. మైటీడీపీ యాప్‌లో మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వండి.. నేను పరిష్కరిస్తాను..! “యువగళం పాదయాత్రలో కార్యకర్తలను కలిసినప్పుడు.. “పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వండి.. మమ్మల్ని గుర్తించండి” అని చాలామంది కోరారు. అందుకే మైటీడీపీ యాప్‌ను తీసుకొచ్చాం. మీరు పాల్గొనే ప్రతి పార్టీ కార్యక్రమం, మీరు సొంతంగా చేపట్టే ప్రతి కార్యక్రమం పార్టీకి తెలియాలంటే మైటీడీపీ యాప్‌లో ఫీడ్ చేయండి. క్లస్టర్, యూనిట్, బూత్ సమావేశాల్లో మీరు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ను మేము చదువుతున్నాం. మీరు చెప్పే సమస్యలు, సూచనలు మాకు చేరడం లేదనే అపోహ వద్దు. కొత్త పెన్షన్లు, ఇళ్లు ఇవ్వాలని కార్యకర్తలే ఫీడ్‌బ్యాక్‌లో కోరారు. కొత్త పెన్షన్ లు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిది.  ఇలా మీరు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే నేను నిర్ణయాలు తీసుకుంటాను. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు కచ్చితంగా గుర్తింపు దక్కుతుంది. మీరు మమ్మల్ని వెతుక్కుంటూ రావాల్సిన అవసరం లేదు.. మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాం. కోటి మంది సభ్యులతో కూడిన కుటుంబం మనది. సముద్రం లాంటి ఈ కుటుంబంలో సమస్యలు సహజం. మనలో మనమే చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలి. ఎక్కడైనా మీ సమస్య పరిష్కారం కాకపోతే మా దగ్గరకు రండి. మీకు అండగా నేను ఉంటాను. కార్యకర్తల కోసం, పార్టీ కోసం ఎప్పుడూ ముందుండి పనిచేస్తాం” అని హామీ ఇచ్చారు. టీడీపీలో కార్యకర్తే అధినేత..! ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ నియోజకవర్గానికి వెళ్లినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అనంతరం కార్యకర్తలను కలవడానికే ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి కార్యకర్తతో మాట్లాడి, ఫొటో దిగి, వారి సమస్యలను తెలుసుకున్న తర్వాతే అమరావతికి తిరుగు ప్రయాణమవుతారు. కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే విలువకు ఇదే నిదర్శనం. 2025 మహానాడులో ప్రవేశపెట్టుకున్న ఆరు శాసనాల్లో “కార్యకర్తే అధినేత” అనేది అత్యంత ముఖ్యమైనది. టీడీపీలో కార్యకర్తే అధినేత. అందుకే మహానాడు, అసెంబ్లీ, మండలి సహా పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో కార్యకర్తలు ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో కలిసి వేదికను పంచుకుంటున్నారు.  కష్టపడి పనిచేసే కార్యకర్తకు గుర్తింపు, గౌరవం కల్పించడం టీడీపీ బాధ్యత. కార్యకర్తల సంక్షేమానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. పార్టీ కోసం ప్రాణాలు వదిలిన తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు చట్టాన్ని సవరించి బిల్లు తీసుకొచ్చాం. వైసీపీ ఎమ్మెల్సీలు అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు బిల్లును చట్టంగా చేసి చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం. నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రాణాలు అర్పించిన కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గౌరవానికి ఇదే నిదర్శనం. పులివెందుల ప్రజల కోసమైనా జగన్ అసెంబ్లీకి రావాలి..! “జగన్ ప్రెస్‌మీట్ పెడితే మనందరికీ పండగే. చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో ఆయన చెప్పే విషయం ఏమీ తెలియని వారికి కూడా సులభంగా అర్థమయ్యేలా ఉంటుంది. కానీ మాజీ సీఎం జగన్‌కు డీఎస్సీ, ఏపీపీఎస్సీకి తేడా తెలియదు. డీఎస్సీ, ఏపీపీఎస్సీ రెండూ ఒకటేనంటారు. జగన్ రెడ్డికి మరోసారి సవాల్ చేస్తున్నా. టైమ్, డేట్, లొకేషన్ నువ్వే ఫిక్స్ చేయి.. డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం. అసెంబ్లీలోనూ ఎన్ని రోజులైనా చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. నా సవాల్‌ను స్వీకరించి ఎందుకు రావడం లేదు? ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించకుండా, ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదనే వాస్తవం బయటపడుతుందనే భయమా?  ప్రెస్‌మీట్లు ఎందుకు.. అసెంబ్లీకి రా! పులివెందుల ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే వారి సమస్యలను అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించడం లేదు? రెండేళ్లలో జగన్ అసెంబ్లీకి వచ్చింది ఒక్కసారి మాత్రమే. అది కూడా ప్రమాణస్వీకారానికి వచ్చి వెళ్లిపోయారు. జగన్‌లా నేను కంచుకోటలో గెలిచిన వ్యక్తిని కాదు. 1988 తర్వాత టీడీపీ ఎప్పుడూ గెలవని మంగళగిరిలో తొలిసారి ఓడినా వెనక్కి తగ్గకుండా పోరాడి విజయం సాధించాను. కుప్పంలో పోటీ చేయమని చెప్పినా మంగళగిరిలోనే నిలబడి 91 వేల మెజార్టీతో గెలిచి ఆ విజయాన్ని చంద్రబాబు గారికి గిఫ్ట్ గా ఇచ్చాను. మంగళగిరి ప్రజల రుణం తీర్చుకుంటున్నాను. నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే.. పులివెందుల ప్రజల కోసమైనా అసెంబ్లీకి రా..!” అని సవాల్ విసిరారు. కూటమి ఐక్యతను కాపాడండి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే మన లక్ష్యం“కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి కూటమిలో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. జనసేన, బీజేపీ పేరుతో టీడీపీని తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలి. వాళ్ల ప్రచారాన్ని నమ్మి ఆవేశపడకుండా కూటమి ఐక్యతను కాపాడాలి. మనమంతా ఐక్యంగా ఉండి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాలి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకే ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రజలకు వివరించి కూటమి బలాన్ని మరింత పెంచాలి” అని పిలుపునిచ్చారు. కణేకల్‌కు డిగ్రీ కళాశాల మంజూరు చేసే బాధ్యత నాది..! “మీ అభిమానానికి నేను ధన్యుడిని. యువగళం పాదయాత్రలో కణేకల్‌కు రాలేకపోయిన లోటు నేడు తీరిపోయింది. మీరు ఇచ్చిన ఘన స్వాగతం, చూపించిన ప్రేమ, అభిమానం ఎప్పటికీ మరిచిపోలేను. పట్టణ అధ్యక్షుడి ఆత్మీయ పలకరింపు నా గుండెను హత్తుకుంది. వీలైతే మీ ఇంటికి భోజనానికి వస్తాను. గతంలో కణేకల్‌కు సీఎం చంద్రబాబు గారు వచ్చినప్పుడు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు పూర్తిస్థాయిలో జరగడం లేదు. కానీ కణేకల్‌కు డిగ్రీ కళాశాల మంజూరు చేసే బాధ్యత నాది. నిధులు సమకూర్చే బాధ్యత మంత్రి కేశవ్ గారిది. రెండు సంవత్సరాల్లో అడ్మిషన్లు పూర్తిస్థాయికి తీసుకెళ్లే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం ఎంపీ అంబికా జీ.లక్ష్మీనారాయణ, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, జోనల్ కోఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి, అనంతపురం పార్లమెంట్ ప్రెసిడెంట్ పూల నాగరాజు, అనంతపురం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి జి.శ్రీధర్ చౌదరి, నియోజకవర్గ పరిశీలకులు బి. గురప్ప, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Telugu Desam Party, Rayadurgam, Anantapur, Local Body Elections, TDP Cadre, Party Workers, My TDP App, TDP Alliance, CM Chandrababu Naidu, Andhra Pradesh Development, TDP Welfare, Kalyan Yojana, Political Alliance, Jana Sena, BJP, AP Politics  
ALSO ON TELUGUONE N E W S
Vijay Deverakonda and Rashmika Mandanna star in the highly anticipated pan-India movie “Ranabaali,” directed by Rahul Sankrityan. Presented by T-Series and produced by Naveen Yerneni and Y. Ravi Shankar under the banner of Mythri Movie Makers, the film is being mounted on a huge budget. Set against the backdrop of the 19th century, “Ranabaali” is based on real historical events that took place between 1854 and 1878 during the British colonial era. With massive expectations across India, the film is scheduled for a worldwide grand theatrical release on October 16, coinciding with the auspicious occasion of Vijayadashami. The release date announcement poster features Vijay Deverakonda in a fierce and powerful look, holding a sword and commanding attention. With the arrival of “Ranabaali,” the Dussehra box office is set to become even more exciting.  
National Award-winning actor and Icon Star Allu Arjun has achieved another significant milestone, gracing the cover of Forbes India’s much-anticipated Showstoppers 2026 edition, which celebrates India’s 100 biggest celebrities. The cover places Allu Arjun at the forefront of a definitive annual snapshot of celebrity influence, recognising the extraordinary scale of his stardom, his box-office pull and the remarkable evolution of his brand value. It is a powerful acknowledgement of how far the actor’s influence has travelled from Telugu cinema to a truly pan-India phenomenon. Allu Arjun’s ascent to the national spotlight has been driven by a rare combination of performance, personality and unprecedented audience connect. The Pushpa franchise transformed his already formidable popularity into a nationwide cultural phenomenon, with his distinctive style, mannerisms, dance and screen presence becoming instantly recognisable across linguistic and regional boundaries. The Forbes India recognition also underlines the commercial force that Allu Arjun has built around his name. His continued presence among India’s most valuable and recognisable celebrities demonstrates that his impact is no longer measured by films alone. Being the face of Showstoppers 2026 makes the moment particularly significant. Forbes India’s annual celebration brings together the personalities who shape popular culture and command influence far beyond their primary professions. With his box-office dominance, expanding brand aura and pan-India following continuing to grow, the Forbes India cover stands as yet another defining milestone in the extraordinary phenomenon that is Allu Arjun.  
      యష్ వన్ మాన్ షో 'టాక్సిక్' ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతున్న విషయం తెలిసిందే. డివైడ్ టాక్ హోదాని తొలి ఆట నుంచే దక్కించుకోవడంతో  వరల్డ్ వైడ్ గా  అడ్వాన్స్ బుకింగ్స్ డల్ గా సాగుతున్నాయి.  టాక్సిక్ థియేట్రికల్ హక్కులని రెండు తెలుగు రాష్ట్రాల్లో 'దిల్ రాజు' దక్కించుకున్నాడు. దీంతో దిల్ రాజుకి  భారీ నష్టాలు తప్పవంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.  కొంత ముందైతే ఏకంగా 100 కోట్ల వరకు నష్టం వస్తుందని పోస్టులు చేస్తున్నారు.  అయితే ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం  దిల్ రాజు డీల్  సాధారణ థియేట్రికల్ రైట్స్ కొనుగోలు తరహాలో జరగలేదని, రిటర్నబుల్ అడ్వాన్స్ ప్రాతిపదికన తీసుకున్నారనే ప్రచారం ఇండస్ట్రీలో ప్రధానంగా వినిపిస్తోంది. ఈ విధానం ప్రకారం సినిమా నిర్ణీత బాక్సాఫీస్ టార్గెట్‌ను చేరుకోలేక నష్టం వస్తే, ఒప్పందంలోని నిబంధనల ప్రకారం ఆ మొత్తాన్ని నిర్మాతలు లేదా సంబంధిత పక్షాలు తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. Also Read: జాన్వీకపూర్ ఆ హీరోని రహస్యంగా పెళ్లి చేసుకుందా.. ఈ వీడియోనే అందుకు సాక్ష్యమా! అయితే ఈ లెక్కలు, ఒప్పంద వివరాలపై చిత్రబృందం లేదా దిల్ రాజు నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అందువల్ల ప్రస్తుతం వైరల్ అవుతున్న మొత్తాలను అధికారికంగా ధ్రువీకరించిన సమాచారం కంటే రూమర్స్ అని చెప్పవచ్చు. ప్రచారంలో ఉన్న వివరాల ప్రకారం, ‘టాక్సిక్’ సినిమా ద్వారా నష్టం వస్తే ఆ మొత్తాన్ని 45 రోజుల్లో తిరిగి చెల్లించే విధంగా ఒప్పందం జరిగినట్లు కూడా సమాచారం. ఇదే నిజమైతే సినిమా ఫలితంతో దిల్ రాజుకు వచ్చే ఆర్థిక రిస్క్ గణనీయంగా తగ్గుతుంది. తెలుగు హక్కులు 120 కోట్లని ప్రచారం జరిగినా 80 కోట్లకి డీల్ కుదిరిందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. Dil Raju, yash, Toxic, Tollywood, TeluguCinema, TeluguNews, TeluguCinemaNews TeluguOneDotCom
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకని దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ‘ఇరుముడి’ చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.  ‘ఇరుముడి’తో బ్లాక్ బస్టర్ సాధించిన సోదరుడు రవితేజకు శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. “సినిమాను మొదటి నుండి చివరి వరకు ఎంజాయ్ చేశాను. రవితేజ ‘త్రినాథ్’ పాత్రను తన భుజాలపై అద్భుతంగా మోశారు. వాట్ ఎ ఫినామినల్ పెర్ఫార్మెన్స్.” అంటూ రవితేజ యాక్టింగ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు, ఈ సినిమాను ఎంతో లోతుగా, ఎమోషనల్‌గా తెరకెక్కించిన డైరెక్టర్ శివ నిర్వాణ పనితనాన్ని మెగాస్టార్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. అలాగే, సినిమాలో కీలక పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్రకు తన ఆశీస్సులు అందిస్తూ.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలతో పాటు, చిత్ర యూనిట్ మొత్తానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ ట్వీట్ లో చిరంజీవి రాసుకొచ్చిన కొన్ని లైన్స్ హాట్ టాపిక్ గా మారాయి. "ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే. ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు. మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి!" అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు.  ఇటీవల కొందరు సోషల్ మీడియాలో 'తొక్కేశారు' అంటూ కావాలని చిరంజీవిపై నెగెటివ్ ట్రోల్స్ చేస్తున్నారు. దానికి కౌంటర్ గానే చిరు ఈ ట్వీట్ లో ఆ మాటలను జోడించారా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  https://x.com/KChiruTweets/status/2092882989680337188       [Chiranjeevi, Ravi Teja, Irumudi, Shiva Nirvana, Mythri Movie Makers]  
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతోన్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని సెప్టెంబర్ 11న రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే ‘రణబాలి’ రిలీజ్ డేట్ మారనుందని ఇటీవల న్యూస్ వినిపించింది. దానిని నిజం చేస్తూ, తాజాగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ‘రణబాలి’ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 16, 2026న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ పవర్ ఫుల్ గా ఉంది. కండలు తిరిగిన దేహం, పొడవాటి జుట్టు, భుజాన కత్తితో విజయ్ వీరుడిలా కనిపిస్తున్నాడు. ఈ పవర్ ఫుల్ లుక్ చూస్తుంటేనే అర్ధమవుతోంది.. బాక్సాఫీస్ దగ్గర ఈసారి విధ్వంసం మామూలుగా ఉండదని. 19వ శతాబ్దంలో బ్రిటీష్ అణచివేతకు వ్యతిరేకంగా సాగిన యధార్థ పోరాటాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 1854 నుండి 1878 మధ్య కాలంలో బ్రిటీష్ పాలకులు చేసిన ఆర్థిక దోపిడీ, మన నేలపై వచ్చిన తీవ్రమైన కరువు పరిస్థితుల నేపథ్యంలో సాగే యధార్థ సంఘటనల ఆధారిత కథ ఇది. మన చరిత్రలో దాయబడ్డ ఒక చీకటి అధ్యాయాన్ని ఈ సినిమా ద్వారా బిగ్ స్క్రీన్ పై చూపించబోతున్నారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత బ్లాక్‌బస్టర్ జోడీ విజయ్- రష్మిక మూడోసారి జతకడుతున్నారు. రష్మిక ఈ సినిమాలో ‘జయమ్మ’ అనే పవర్ ఫుల్ రోల్ పోషిస్తోంది. పెళ్లి తర్వాత విజయ్- రష్మిక కాంబోలో ఇదే మొదటి సినిమా కావడం విశేషం.  అంతేకాదు, ‘సర్ థియోడోర్ హెక్టర్’ అనే పవర్ ఫుల్ నెగెటివ్ రోల్ లో హాలీవుడ్ స్టార్ యాక్టర్, ‘ది మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ నటిస్తున్నాడు. విజయ్, ఆర్నాల్డ్ వోస్లూ మధ్య వచ్చే సీన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయని టాక్. https://x.com/MythriOfficial/status/2092849087838302580       Ranabaali Release Date, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan, Mythri Movie Makers  
  'పెద్ది'తో మెస్మరైజ్ చేసిన దేవర భామ జాన్వీ కపూర్ తదుపరి చిత్రం అప్డేట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ యువ హీరో ఇషాన్ ఖట్టర్ తో పెళ్లిపీటలు ఎక్కిందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ హోదాలో చక్కర్లు కొడుతుంది. ఒకవైపు పెళ్లికూతురి గెటప్‌లో ఐవరీ, ఎరుపు రంగుల శోభితమైన లెహంగా ధరించి మెరిసిపోతున్న జాన్వీ,మరొక వైపు  తెల్లటి షేర్వాణీ ధరించిన ఇషాన్ ఖట్టర్ కలిసి నడుస్తున్న దృశ్యాలు చూసి ప్రతి ఒక్కరూ వీళ్లు నిజంగానే సీక్రెట్‌గా పెళ్లి లేదా నిశ్చితార్థం చేసుకున్నారేమో అని కన్ఫ్యూజ్ అయ్యారు.  ఈ వైరల్ వీడియోలో జాన్వీ కపూర్ హెవీ జ్యువెలరీతో సాంప్రదాయబద్ధంగా చాలా అందంగా కనిపించడమే కాకుండా, వీరిద్దరి మధ్య ఉన్న ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. వీడియోలో "సరైన వ్యక్తి ఎవరో మనకు ఎలా తెలుస్తుంది?. నీకోసం ఓపికగా ఎవరు ఎదురుచూస్తుంటే వాళ్లే సరైన వ్యక్తి' అని జాన్వీ అడిగిన ప్రశ్నకి  ఇషాన్ ఖట్టర్ "ఆమె కోసం ఎదురుచూడటంలో కూడా సంతోషం ఉంటే ఆమెనే మన భాగస్వామి" అంటూ చెప్పే రొమాంటిక్ డైలాగ్స్ నెటిజన్ల మనసులను దోచుకున్నాయి.  Also Read: లవకుశతో ఇరుముడిని పోలుస్తున్న ప్రేక్షకులు.. అందుకు కారణాలు ఇవే ఈ సన్నివేశాలు చూసిన చాలామంది అభిమానులు 2018 లో విడుదలైన వీరి తొలి చిత్రం 'ధడక్' రోజులను గుర్తుచేసుకున్నారు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో వచ్చిన 'ధడక్' సినిమాతోనే వీరిద్దరూ హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఆ సినిమాలో విషాదంతో కూడిన ముగింపు ఉండటంతో, "ధడక్ చిత్రానికి దక్కాల్సిన అసలైన హ్యాపీ ఎండింగ్ ఇదే" అంటూ కామెంట్ల వర్షం కురిపించారు.  అయితే, ఈ వైరల్ పెళ్లి వార్తల వెనుక ఉన్న అసలు నిజమేంటంటే.. వీళ్లిద్దరూ నిజంగా పెళ్లి చేసుకోలేదు! దాదాపు 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జాన్వీ, ఇషాన్‌లు కలిసి ఒక ప్రముఖ జ్యువెలరీ, వెడ్డింగ్ బ్రాండ్ ప్రమోషన్ కోసం చేసిన కమర్షియల్ యాడ్ షూట్ ఇది. ప్రేమ, నిబద్ధత, భాగస్వామి కోసం ఎదురుచూడటం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ బ్రాండ్ ప్రమోషనల్ క్యాంపైన్‌లో భాగంగానే వీరిద్దరూ నూతన వధూవరులుగా దర్శనమిచ్చారు.  ఇషాన్ ఖట్టర్ స్వయంగా ఈ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ "కొన్ని కలయికలు అసలు కాలమే మారనట్టు అనిపిస్తాయి" అని క్యాప్షన్ జోడించడంతో ఈ కాంబినేషన్‌కి  మళ్లీ భారీ స్పందన లభిస్తుంది.  Janhvi Kapoor, Ishaan Khatter, Tollywood, TeluguCinema, TeluguNews, TeluguCinemaNews TeluguOneDotCom
  లవకుశ.. తెలుగు సినిమా, తెలుగు ప్రేక్షకుడు నేటికీ తమ గుండెల్లో గుడిలా నింపుకొని పూజిస్తున్న అరుదైన దృశ్య కావ్యం. సీతారాముల కథ, కుశ, లవుల భక్తి,  వాత్సల్యం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి. ఏ థియేటర్ లో ఆడుతుందో ఆ థియేటర్ కి చుట్టూ పక్కన ఉన్న గ్రామాల ప్రజలు ఎడ్ల బళ్ళు కట్టుకొని, క్యారేజ్ లో అన్నం నింపుకొని ఎదురొచ్చిన వాళ్లకి లవకుశకి వెళ్తున్నామని గర్వంగా చెప్తూ వెళ్లేవారు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఇరుముడి మూవీకి రిపీట్ అవుతుంది.   థియేటర్ నుంచి బయటకి వచ్చిన ప్రేక్షకులు 'ఇరుముడి' చూస్తుంటే  'లవకుశ' చూసినట్టు ఉందని,  లవకుశ లో రాముడి పట్ల పిల్లలకి  ఉండే భక్తి, హృదయ నాళాన్ని తాకే సన్నివేశాలు, పాటలు ఏ విధంగా కన్నీళ్లు పెట్టించాయో, ఇరుముడిలో కూడా తండ్రి బాధ్యత, కూతురు ఆశయం, అయ్యప్ప స్వామి శరణువేడుడు ఘట్టాలు అదే స్థాయిలో కంటతడి పెట్టిస్తున్నాయని భావోద్వేగంతో చెప్తున్నారు. దీన్ని బట్టి వయసుతో తారతమ్యం లేకుండా  ఇరుముడి ఎంతటి ప్రేక్షక, జన ప్రభంజనాన్ని సృష్టిస్తుందో అర్ధం చేసుకోవచ్చు.  ముఖ్యంగా 10 ఏళ్ల లోపు పిల్లలు, వాళ్ళ తల్లితండ్రులు చలో టూ ఇరుముడి అంటున్నారు. సినిమా చూసిన దాదాపు 95% మంది ప్రేక్షకులు ఇది కేవలం భక్తి చిత్రం మాత్రమే కాదని, ఒక గొప్ప కుటుంబ కథా చిత్రం అని ప్రశంసిస్తున్నారు. Also Read: ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్.. బాక్సాఫీస్ కింగ్ కొత్త చరిత్ర శబరిమల అయ్యప్ప స్వామి వారి భక్తిపథం, తండ్రీ కూతురు బంధం, నేటి సమాజంలో అసాంఘిక శక్తులు వల్ల ఆడవారి పట్ల, చిన్న పిల్లలు ఎదుర్కుంటున్న లైంగిక దాడి ,    మనుషుల మధ్య తగ్గుతున్న నమ్మకం, మానవీయ విలువల చుట్టూ 'ఇరుముడి' కథ తిరుగుతుంది.ప్రతిఒక్కరి ప్రకృతి సిద్దమైన పెర్ ఫార్మెన్స్ , అయ్యప్ప స్వామి మహత్యం ప్రతి ఒక్కరి హృదయాలని బలంగా  తాకుతున్నాయి. . ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే 45 నిమిషాల ఎమోషనల్ సీన్లు, అయ్యప్ప స్వామి పాటలు మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్  భక్తి పారవశ్యంలో ముంచెత్తుతున్నాయి. ఇరుముడి కట్టుకుని శబరిమల కొండలు ఎక్కేటప్పుడు ఆ అయ్యప్ప భక్తులు అనుభవించే ఆధ్యాత్మిక అనుభూతిని ఇరుముడి చూస్తూ పొందుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుత ట్రెండ్  ఎలా ఉందంటే ఇరుముడి ఇంకా చూడలేదని తమ పక్కింటోళ్ళకి చెప్తే నామూషిగా  ఫీలయ్యే పరిస్థితి. Lavakusa, irumudi, Tollywood, TeluguCinema, TeluguNews ,TeluguCinemaNews, TeluguOneDotCom  
    సెల్యులాయిడ్ పై మొట్టమొదటి తెలుగు నేషనల్ అవార్డ్ విన్నర్ 'ఐకాన్ స్టార్ అల్లు అర్జున్' బొమ్మ ఉన్నా లేకపోయినా తన 'ఆరా' మాత్రం పాన్ ఇండియా వ్యాప్తంగా చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఇందుకు నిదర్శనంగా మరో చారిత్రాత్మక ఘనతని అల్లు అర్జున్ అందుకున్నాడు. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ ఇండియా '100 బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ 2026' కవర్ స్టార్‌గా నిలిచి తగ్గేదేలే  అనే తన మేనరిజానికి మరోసారి పాన్ ఇండియా వ్యాప్తంగా అదనపు అర్హత తీసుకొచ్చాడు    ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరవడం కేవలం ఒక నటుడిగా ఆయన సాధించిన విజయమే కాకుండా దక్షిణ భారతదేశం నుండి ఎదిగిన ఒక నటుడు, దేశంలోనే అతిపెద్ద సెలబ్రిటీ బ్రాండ్‌గా రూపాంతరం చెందడం సినీ వర్గాల్లోనూ, వ్యాపార వర్గాల్లోనూ పెద్ద సంచలనంగా మారింది. దీన్ని బట్టి  ఇండియన్ సినిమా వ్యాపారాన్ని అల్లు అర్జున్ ఎంతగా ప్రభావితం చేస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. Also read: మెగాస్టార్ చిరంజీవి కాపాడబోతున్నాడా!  అల్లు అర్జున్ బాక్సాఫీస్ స్టామినా మరియు బ్రాండ్ వ్యాల్యూ గడిచిన కొన్నేళ్లలో ఊహించని రీతిలో ఆకాశాన్ని తాకాయి. పుష్ప సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా రికార్డులను తిరగరాసిన అల్లు అర్జున్ ఏకంగా 300 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి చేరుకుని ట్రెండ్ సెట్ చేశాడు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల పరంగా కూడా ఐకాన్ స్టార్ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు . కేవలం ప్రకటనల రూపంలోనే ఒక్కో బ్రాండ్‌కి   4 కోట్ల వరకు వసూలు చేస్తూ, దేశంలోనే అత్యధిక డిమాండ్ ఉన్న కమర్షియల్ ఫేస్‌గా మారారు. సంపాదించిన హోదా, డబ్బు తిరిగి సినిమాకే ఉపయోగపడాలని  హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక అల్లు స్టూడియోస్, టెక్నాలజీ హంగులతో నిర్మించిన AAA సినిమాస్ మల్టీప్లెక్స్, అలాగే వ్యాపార భాగస్వామ్యాలు ఆయన వార్షిక ఆదాయాన్ని మరియు బ్రాండ్ సామ్రాజ్యాన్ని వేగంగా విస్తరింపజేస్తున్నాయి. గడిచిన దశాబ్ద కాలంగా ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో నిరంతరం చోటు సంపాదిస్తూ వస్తున్న అల్లు అర్జున్, 2026 నాటికి 100 మంది అతిపెద్ద ఇండియన్ సెలబ్రిటీలలో ముఖచిత్రంగా నిలవడం ఒక రికార్డు అని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఒక ప్రాంతీయ నటుడు గ్లోబల్ ఐకాన్‌గా ఎదగడం తెలుగు సినిమా గర్వించదగ్గ మైలురాయి. ప్రస్తుతం 'రాకా'తో బిజీగా ఉన్నాడు. Allu Arjun, Forbes India, Tollywood, TeluguCinema, TeluguNews, TeluguCinemaNews TeluguOneDotCom
    అభిమానుల కలలని నిజం చేస్తూ నిన్న వరల్డ్ వైడ్ గా టాక్సిక్ ల్యాండ్ అయ్యింది.  మెజారిటీ ప్రేక్షకుల మౌత్ టాక్ డిజాస్టర్.. కాకపోతే యష్ పెర్ ఫార్మెన్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఒక రేంజ్ లో ఉన్నాయనే మాటలు కూడా మెజారిటీ ప్రేక్షకుల నుంచి వినిపిస్తుంది. టాక్సిక్ ని నిర్మించింది కెవిఎన్ ప్రొడక్షన్స్ . ఇళయ దళపతి విజయ్ జన నాయగన్ ని నిర్మించింది కూడా కె వి ఎన్ సంస్థనే. జన నాయగన్ సైతం డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ రెండు చిత్రాల బడ్జెట్ సుమారు 1000 కోట్లు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న  మెగాస్టార్ చిరంజీవి 'కాకా' ని  కెవిఎన్ ప్రొడక్షన్స్ నే నిర్మిస్తుంది. చిరు కెరీర్ లోనే హై బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటుండంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. టాక్సిక్, జన నాయగన్ డిజాస్టర్స్ గా నిలవడంతో  'కాకా' పై ప్రతికూల ప్రభావం పడుతుందా అనే  ఆందోళనలో కొంత మంది  చిరు అభిమానులు ఉన్నారు. బిజినెస్ పరంగాm ప్రమోషన్స్ పరంగా రిస్క్ అవుతుందేమోనన్న టెన్షన్ కూడా ఉందనే మాటలు వినిపిస్తున్నాయి  కానీ కొంత మంది అభిమానులైతే అక్కడ ఉన్న కట్ అవుట్ పేరు చిరంజీవి.. బడా హీరోల సినిమాలు కె వి ఎన్ కి కలిసి రావేమో అనే సెంటిమెంట్ ఆమడదూరంలో ఆయిల్ మెంట్ రాకుండా ఉండాల్సిందే అని సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రిలీజైన 'కాకా' టీజర్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది.   Also Read: Toxic: టాక్సిక్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే   2021 వ సంవత్సరంలో 'సకత్' మూవీతో  తన సినీ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసిన కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ 2022 లో  'బై టూ లవ్' నిర్మించింది. ఆ రెండు చిత్రాలు ఏవరేజ్.  అయితే 2026 ఏడాది మాత్రం ఈ బ్యానర్‌కు అసలైన పరీక్షగా మారింది.  'కల్ట్', కెడి: ది డెవిల్',  జన నాయగన్ ,టాక్సిక్  బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.  Toxic, yash, Chiranjeevi, Kaaka,Tollywood, TeluguCinema, TeluguNews, TeluguCinemaNews TeluguOneDotCom
Marvel Studios is bringing the epic conclusion to the Infinity Saga back to the big screen with Avengers Endgame: Encore, releasing in theatres across India in English, Hindi, Tamil and Telugu from 25th September 2026. The film will be available in IMAX® and Marvel Studios Presents INFINITY VISION – a new certification for Premium Large Format (PLF) theatres that guarantees audiences an exceptional cinematic presentation, with larger screens, brighter images and outstanding sound. The special Encore presentation of the record-breaking blockbuster will give fans the opportunity to relive one of the most monumental cinematic experiences of all time, while also offering an exclusive look at the highly anticipated Avengers: Doomsday, arriving in theatres on 18th December 2026. Audiences watching  Avengers Endgame: Encore on IMAX® and Marvel Studios presents INFINITY VISION-certified screens will also be treated to an additional sneak peek of the upcoming Marvel Studios epic.  In Avengers Endgame: Encore, after devastating events wiped out half the world’s population, the remaining heroes struggle to move forward. Ultimately, they must come together to restore order and harmony in the universe and bring their loved ones back in a dramatic showdown against Thanos. The film is produced by Kevin Feige and directed by Anthony and Joe Russo. Louis D’Esposito, Victoria Alonso, Michael Grillo, Trinh Tran, Jon Favreau, James Gunn, and Stan Lee serve as executive producers.     Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రశాంతమైన నిద్ర కోసం నేటి ఆధునిక ప్రపంచంలో మనుషులు వేలకు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్ వంటి నగరాల్లో వెలిసిన హేస్టెన్స్ (Hästens) వంటి లగ్జరీ స్లీప్ స్పాలు నేడు సరికొత్త ట్రెండ్‌గా మారాయి. మృదువైన లావెండర్ సువాసన, డిమ్ లైట్లు, హాయిగా ఉండే క్లాసిక్ బెడ్స్ మధ్య షాపింగ్ చేయడం ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో గడిపిన అనుభూతిని అందిస్తుంది. హాలీవుడ్ నటి ఎమిలీ బ్లంట్ వంటి ప్రముఖులు తమ హేస్టెన్స్ దిండుపై ప్రేమతో తన సహనటుడు సిలియన్ మార్ఫీకి కూడా ఒక దిండును కానుకగా ఇచ్చారంటే, వీటి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే—లక్షల రూపాయలు లేదా వేల డాలర్లు పోసి కొనే లగ్జరీ దిండ్లు నిజంగానే మెడ నొప్పులను మాయం చేసి మనకు హాయి నిద్రను అందిస్తాయా? లేక ఇది కేవలం మార్కెటింగ్ మాయాజాలమా? గంటల తరబడి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్ల ముందు గడిపే నేటి తరం నిద్రలేమి, మెడ నొప్పుల సమస్యతో బాధపడుతూ దిండ్ల మార్పిడికి భారీగానే డబ్బులు కుమ్మరిస్తోంది. స్లీప్ స్పెషలిస్ట్ ఎమిలియా ఆక్సెల్సన్ ప్రకారం, మనం పడుకునే విధానానికి అనుగుణంగా దిండు ఎత్తు లేకపోతే మెడ కండరాలు రాత్రంతా ఉద్రిక్తతకు లోనవుతాయి. మనం సైడ్ స్లీపర్ అయితే, అంటే పక్కకి తిరిగి పడుకునే అలవాటు ఉంటే, మన తలకు మరియు భుజానికి మధ్య ఉండే ఖాళీని సరిగ్గా పూరించడానికి కాస్త ఎత్తైన దిండు అవసరం. ఒకవేళ దిండు ఎత్తు సరిగ్గా లేకపోతే గడ్డం రొమ్ము వైపు వంగిపోయి మెడ కండరాలు విశ్రాంతి తీసుకోకుండా రాత్రంతా కష్టపడాల్సి వస్తుంది. మార్కెట్‌లో లభించే బెడ్డోక్ థెరప్యూటిక్ పిల్చే ($1,035 అంటే దాదాపు లక్ష రూపాయలకు పైగా) లేదా హేస్టెన్స్ హై ఫర్మ్ పిల్చే ($725) వంటి విలాసవంతమైన దిండ్లు మంచి సపోర్టును ఇస్తున్నప్పటికీ, అంతటి భారీ ధర అందరికీ అందుబాటులో ఉండేది కాదు. ఆస్ట్రేలియాలో నిద్ర సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఆస్ట్రేలియన్ పెద్దలలో సగానికి పైగా ప్రజలు క్రమం తప్పకుండా ఏదో ఒక రకమైన నిద్ర లేమి లక్షణాలను అనుభవిస్తున్నారు. 2023లో చేపట్టిన  ఛాయిస్ (Choice) సర్వే ప్రకారం, ఏకంగా 62% మంది ప్రజలు తమ నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవడానికి ఏదో ఒక నిద్ర ఆధారిత ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. అయితే స్లీప్ ఫిజిషియన్ డాక్టర్ డేవిడ్ కన్నింగ్‌టన్ భిన్నమైన విశ్లేషణను అందిస్తున్నారు. ఒక దిండు వల్ల సౌకర్యం పెరుగుతుందే తప్ప, అది సంక్లిష్టమైన నిద్ర సమస్యలను లేదా నిద్రలేమిని పూర్తిగా నయం చేయలేదు. మన దైనందిన జీవితంలో ఎదుర్కొనే ఒత్తిడి, జీవనశైలి మార్పులే నిద్రపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. పగటిపూట నిరంతరం ఒత్తిడితో గడిపినప్పుడు, ఆ ప్రభావం రాత్రి నిద్రపై స్పష్టంగా పడుతుంది. అందుకే విపరీతమైన మెడ నొప్పులతో బాధపడే మైనింగ్ ఇంజనీర్ శామ్యూల్ ప్యాటర్సన్ వంటి వారు తమ కప్‌బోర్డ్‌ను అనేక దిండ్ల గ్రావ్‌యార్డ్‌గా మార్చేశారు. ప్రతీసారి కొత్త దిండు కొంటే తన మెడ నొప్పి తగ్గుతుందని భావించి ఆయన ఎన్నో దిండ్లు మార్చారు. చివరకు ఆస్ట్రేలియన్ ఫిజియోథెరపీ అసోసియేషన్ ఆమోదించిన డన్‌లపిల్లో లగ్జరీ లేటెక్స్ కాంటూర్ పిల్చే ($189.99) వంటి దిండు కొంత ఉపశమనాన్ని ఇచ్చినా, అసలు సమస్య మన శరీర కదలికల్లోనే ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.       expensive luxury pillows sleep quality, how to choose perfect pillow neck pain.
  మన చుట్టూ ఉండే మనుషుల్లో ఎవరు ఎలాంటివారో అంచనా వేయడం అంత సులభం కాదు. ముఖ్యంగా బయటకు చాలా సాధువులుగా, నమ్మదగినవారిగా కనిపిస్తూనే లోపల అత్యంత ప్రమాదకరమైన ఆలోచనలు కలిగిన వారిని గుర్తించడం పెద్ద సవాలు. ప్రముఖ పరిశోధకురాలు డాక్టర్ కారెన్ మిచెల్ అభిప్రాయం ప్రకారం, సాధారణ మనుషులకు మరియు ప్రమాదకరమైన  సైకోపాత్  స్వభావం ఉన్నవారికి మధ్య తేడా పెంపుడు పిల్లికి (Domestic Cat) మరియు అడవి పిల్లికి (Wild Cat) ఉన్నంత తీవ్రమైన వ్యత్యాసం ఉంటుంది. బయటకు ఒకేలా కనిపించినా, వారి మనస్తత్వం మరియు నడవడిక పూర్తిగా భిన్నంగా ఉంటాయి. చారిత్రకంగా 1980వ సంవత్సరంలో ప్రొఫెసర్ రాబర్ట్ హేర్ 20 ముఖ్యమైన లక్షణాల ఆధారంగా సైకోపతిని కొలిచే శాస్త్రీయ చెక్‌లిస్ట్‌ను రూపొందించారు. అయితే ఈ పరిశోధనలు కేవలం జైలు శిక్ష అనుభవిస్తున్న నేరస్థులపై మాత్రమే జరిగాయి. కానీ సమాజంలో నేరాలు చేయకుండా, బయటకు కార్పొరేట్ ఉద్యోగులుగా, నాయకులుగా చెలామణి అయ్యే  హై ఫంక్షనింగ్ సైకోపాత్స్  (High functioning psychopaths) గురించిన పరిశోధన చాలా ఏళ్లపాటు మిస్టరీగానే ఉండిపోయింది. డాక్టర్ కారెన్ మిచెల్ దాదాపు 30 ఏళ్లపాటు కార్పొరేట్ రంగంలో పనిచేసి, 5 ఏళ్లపాటు విస్తృతమైన పిహెచ్‌డి పరిశోధన జరిపి ఈ  డార్క్ పర్సనాలిటీ  (Dark Personality) లేదా పసిగట్టలేని ప్రిడేటరీ మనస్తత్వాలపై కీలక విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఆమె నిర్వహించిన పరిశోధనలో హెచ్‌ఆర్ అధికారులు, సోషల్ వర్కర్లు, ఎఫ్‌బీఐ (FBI) ఏజెంట్లు, న్యాయ నిపుణులు మరియు మత పెద్దల నుంచి సమాచారాన్ని సేకరించారు. అధిక శక్తి సామర్థ్యాలు ఉన్న ఈ ప్రిడేటర్స్ వల్ల కలిగే మానసిక భయం ఎంతలా ఉంటుందంటే, బాధితులు నిరంతరం వారి కెరీర్‌ను లేదా జీవితాన్ని నాశనం చేస్తారేమోనని భయపడుతుంటారు. డాక్టర్ మిచెల్ ఈ పరిశోధన ఆధారంగా 4 విభిన్న క్లస్టర్లలో 20 ముఖ్యమైన ప్రవర్తనా లక్షణాలు మరియు 25 ఎత్తుగడలను (Tactics) వర్గీకరించారు. ఇందులో మితిమీరిన నియంత్రణ, పగ సాధించే నైజం, అబద్ధాలు చెప్పడం, ఎలాంటి తప్పు చేసినా పశ్చాత్తాపం లేకపోవడం మరియు ఇతరుల పట్ల దయాజాలి లేకపోవడం వంటి ప్రధాన లక్షణాలు ఉన్నాయి.     psychopath vs normal human psychology signs, high functioning psychopath behavioral red flags.
ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పండ్లలో రాంబుటాన్ ఒకటి. శ్రీ రామునికి ఎంతో ప్రియమైన పండుగా భావించే ఈ విదేశీ ఫలం, ప్రస్తుతం మన దక్షిణ భారత రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలలో విస్తృతంగా సాగవుతూ మార్కెట్లలో లభిస్తోంది. చూడటానికి లిచీ పండును పోలి ఉండే ఈ రాంబుటాన్ బాహ్య రూపంపై ఎర్రటి లేదా పసుపు రంగులో మెత్తటి ముళ్లు ఉంటాయి. లోపల తెల్లటి సువాసనభరితమైన గుజ్జు, తీపి మరియు తేలికపాటి పులుపు కలయికతో కూడిన రుచితో అందరినీ ఆకట్టుకుంటుంది. జూన్, జూలై, ఆగస్టు నెలల కాలంలో ఎక్కువగా లభించే ఈ పండు కేవలం రుచిలోనే కాదు, శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు మరియు శక్తివంతమైన పోషకాల సమూహంతో నిండి ఉంది. పోషకాల పరంగా చూస్తే, రాంబుటాన్‌లో ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, భాస్వరం, విటమిన్ బి3 మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో అధిక మొత్తంలో లభించే విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని విశేషంగా పెంచుతుంది. రోజువారీ జీవితంలో మన శరీరం ఎదుర్కొనే వివిధ ఇన్ఫెక్షన్లను అడ్డుకోవడంతో పాటు, శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపడంలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే రాంబుటాన్‌లో ఉన్న యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శరీరంలో ఏర్పడే దెబ్బలు లేదా గాయాలు త్వరగా మానేలా సహాయపడతాయి. హృదయ ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ పండు ప్రత్యేకమైన పాత్ర వహిస్తుంది. రాంబుటాన్ శరీరంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో ఎంతో దోహదపడుతుంది. తద్వారా హృదయ సంబంధిత వ్యాధులు మరియు గుండెపోటు ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా, ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్ (పీచు పదార్థం) కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు రక్తపోటును అదుపులో ఉంచుతుంది. జీర్ణ వ్యవస్థ విషయానికి వస్తే, ఈ ఫైబర్ మలబద్ధకం సమస్యను పూర్తిగా నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ పండులో నీటి శాతం చాలా ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి కావలసిన హైడ్రేషన్ లభించడమే కాకుండా మూత్రపిండాల్లో రాళ్లను (కిడ్నీ స్టోన్స్) సమర్థవంతంగా కరిగించడంలో సహాయపడుతుందని నమ్ముతారు.         How rambutan fruit boosts overall health, rambutan fruit nutrition and precautions.
కొలెస్ట్రాల్ అనేది శరీరంలో ఉండే ఒక రకమైన కొవ్వు పదార్థం. ఇది శరీరంలోని కణాల నిర్మాణానికి మరియు కొన్ని రకాల హార్మోన్ల తయారీకి ఎంతో అవసరం. అయితే, రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణం ఉండాల్సిన దానికంటే ఎక్కువగా పెరిగితే అది గుండె ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడి, గుండెపోటు , పక్షవాతం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ప్రస్తుతం కాలంలో ఉన్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, పోషకాహార లోపం , తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో కొలెస్ట్రాల్ సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే సరైన ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడమే కాకుండా, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారాలు ఏమిటో, అవి ఎలా సహాయపడతాయో తెలుసుకుంటే.. ఫైబర్.. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో  పీచు పదార్థం లేదా ఫైబర్ పాత్ర చాలా కీలకమైనది. ముఖ్యంగా కరిగే పీచు పదార్థం పుష్కలంగా ఉండే ఆహారాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఓట్స్ , బార్లీ వంటి ధాన్యాలలో కరిగే ఫైబర్  ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించి, శరీరం నుండి దాన్ని బయటకు పంపడానికి సహాయపడతాయి. రోజూ ఉదయం అల్పాహారంలో ఓట్స్ లేదా బార్లీ చేర్చుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమంగా తగ్గుతాయి. పప్పుధాన్యాలు, గింజలు.. వివిధ రకాల పప్పుధాన్యాలు , గింజలు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయి. శనగలు, పెసలు, రాజ్మా, మినుములు , కందిపప్పు వంటి వాటిలో ప్రోటీన్లు, విటమిన్లు , పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగించి, అనవసరమైన కేలరీలు తీసుకోకుండా నిరోధిస్తాయి. అలాగే నట్స్ అని పిలిచే బాదం, వాల్‌నట్స్ , పిస్తా పప్పులు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఉండే అసంతృప్త కొవ్వులు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. కాకపోతే వీటిని పరిమిత పరిమాణంలోనే తీసుకోవడం మంచిది. తాజా కూరగాయలు , ఆకుకూరలు.. రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. పాలకూర, తోటకూర, మెంతి కూర వంటి ఆకుకూరలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బెండకాయ, వంకాయ, క్యారట్ , బీట్‌రూట్ వంటి కూరగాయలలో కరిగే పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఇవి కొలెస్ట్రాల్ శోషణను అడ్డుకుంటాయి.  వెల్లుల్లి.. వెల్లుల్లి రక్తనాళాలను శుభ్రపరచడంలో , కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. రోజూ ఒకటో రెండో వెల్లుల్లి రెబ్బలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా తగ్గుతుంది. పండ్లు.. పండ్లు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. బొప్పాయి, ఆపిల్, నారింజ, జామ, దానిమ్మ  వంటి పండ్లలో పెక్టిన్ అనే ప్రత్యేకమైన కరిగే పీచు పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించడంలో ఎంతగానో దోహదపడుతుంది. అలాగే పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి.  నిమ్మజాతి పండ్లు.. నిమ్మ జాతి పండ్లలో ఉండే విటమిన్ సి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. హెల్తీ ఫ్యాట్స్.. చేపలు , ఆరోగ్యకరమైన నూనెలు కూడా కొలెస్ట్రాల్ నిర్వహణకు సహాయపడతాయి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చేపలను తినడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు తగ్గుతాయి. వంటల కోసం ప్రాసెస్ చేసిన నూనెలకు బదులుగా ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె లేదా ఆవనూనె వంటి వాటిని పరిమితంగా ఉపయోగించడం మంచిది. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచకుండా కాపాడతాయి. ఈ ఆహారాలు తినకూడదు.. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు కొన్ని ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన మాంసం, మైదాతో చేసిన పదార్థాలు, తీపి పదార్థాలు, బేకరీ ఆహారాలు , పూర్తి కొవ్వు ఉన్న పాల పదార్థాలను తగ్గించాలి. వీటిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ , సంతృప్త కొవ్వులు రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను వేగంగా పెంచుతాయి. ఆహారాలు మాత్రమే కాదు.. ఇవి కూడా ముఖ్యమే.. కేవలం మంచి ఆహారం తీసుకోవడమే కాకుండా, రోజువారీ జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం అవసరం. ప్రతిరోజూ కనీసం ముప్పై నిమిషాల పాటు నడక లేదా ఇతర వ్యాయామాలు చేయడం, తగినంత నీరు తాగడం, ఒత్తిడిని తగ్గించుకోవడం , మంచి నిద్ర వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. సరైన ఆహార నియమాలు , ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే కొలెస్ట్రాల్‌ను సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు.                         *రూపశ్రీ.
ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మెదడు పనితీరును పెంచడంలో , శరీరంలో మంటను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా ఒమేగా3 అనగానే ఖరీదైన సప్లిమెంట్లు లేదా సాల్మన్ వంటి పెద్ద చేపలే గుర్తొస్తాయి. కానీ మనకు సులభంగా , తక్కువ ధరలో లభించే ఆహార పదార్థాల ద్వారా కూడా ఒమేగా3 ని పొందవచ్చు. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. అవిసె గింజలు.. అవిసె గింజలు ఒమేగా3 పొందడానికి అత్యంత చౌకగా లభించే పదార్థం. వీటిని కాస్త వేయించి పొడి చేసుకుని రోజువారీ ఆహారంలో, పెరుగులో లేదా నీటిలో కలుపుకుని తీసుకోవచ్చు. ఇవి గుండె ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తాయి. చియా విత్తనాలు.. శాకాహారులకు ఇవి మంచి ఎంపిక. వీటిని నీటిలో నానబెట్టి స్మూతీలు, జ్యూస్‌లు లేదా మజ్జిగలో కలుపుకుని తాగవచ్చు. ఇవి ఒమేగా3 తో పాటు శరీరానికి కావలసిన పీచు పదార్థాన్ని కూడా అందిస్తాయి. చిన్న చేపలు (సార్డిన్స్, మకేరల్).. ఖరీదైన విదేశీ చేపల జోలికి వెళ్లకుండా  స్థానిక మార్కెట్లలో దొరికే చిన్న రకం చేపలను ఎంచుకోవచ్చు. సార్డిన్స్, మకేరల్ వంటి చిన్న చేపల్లో ఒమేగా3 సమృద్ధిగా ఉంటుంది. ఇవి ధరలో తక్కువగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. సోయాబీన్స్.. మొక్కల ఆధారిత పోషకాల్లో సోయాబీన్స్ ఒకటి. వీటిని కూరగాయల రూపంలో లేదా సోయా పాలు, తోఫు రూపంలో తీసుకోవడం వల్ల ఒమేగా3 తో పాటు మంచి ప్రొటీన్ లభిస్తుంది. నువ్వులు.. భారతీయ ఇళ్లలో సాధారణంగా వాడే నువ్వులు కూడా మంచి పోషకాలను అందిస్తాయి. వీటిని వివిధ వంటకాల రూపంలో తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. పాలకూర మరియు ఆకుకూరలు.. రోజువారీ వంటల్లో వాడే ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూరలో కొంత పరిమాణంలో ఒమేగా3 లభిస్తుంది. ఇవి శరీరానికి ఇతర విటమిన్లు , ఖనిజాలను కూడా అందిస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండానే మన రోజువారీ ఆహారంలో ఈ సాధారణ పదార్థాలను చేర్చుకోవడం ద్వారా ఒమేగా3 లోపాన్ని నివారించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.                                                                                                                                          *రూపశ్రీ.
మారుతున్న వాతావరణంతో, పిల్లల నుండి పెద్దల వరకు ప్రతిఒక్కరినీ కడుపునొప్పి, గ్యాస్, దగ్గు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. గ్రామీణ ప్రాంతాలలోనూ, ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నప్పుడు మెడికల్ స్టోర్ మందులకు బదులుగా పెద్దవాళ్లు తమ సాంప్రదాయ వైద్యాన్ని, పెద్దలు నేర్పించిన ఇంటి చిట్కాలను పాటిస్తుంటారు. నిజానికి ఈ చిట్కాలు చాలా వరకు మ్యాజిక్ లాగా పనిచేస్తాయి కూడా.  అలాంటి అద్బుతమైన చిట్కా గురించి తెలుసుకుంటే.. కడుపునొప్పికి వేడి ఉప్పు ప్యాక్.. కడుపు నొప్పికి ఒక సాంప్రదాయ  ఇంటి చికిత్స ఉంది. గోరువెచ్చని ఉప్పు కాపడాన్ని పెట్టడం చాలా ప్రబావవంతంగా పనిచేస్తుంది. దొంతర ఉప్పు లేదా దొడ్డు ఉప్పును ఒక గుడ్డలో చుట్టి, కొద్దిగా వేడి చేసి, ఆ తర్వాత కడుపుపై ఉంచుతారు. ఆ వెచ్చదనం ఉదర కండరాలలోని తిమ్మిర్లు లేదా బిగువు నుండి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తుంది. గ్యాస్ లేదా తేలికపాటి తిమ్మిర్ల వంటి సమస్యలు ఉన్నవారికి  గోరువెచ్చని కాపడాలు చాలా బాగా  సహాయపడతాయి. అయితే కడుపు నొప్పి వేరే ఏదైనా సమస్యల వల్ల వచ్చి ఉంటే.. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం, ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజనింగ్, అలర్జీలు లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా కడుపు నొప్పి రావచ్చు. ఇలాంటి సమస్యల వల్ల కడుపు నొప్పి వచ్చి ఉంటే..  ఆ కడుపు నొప్పి కూడా వాంతులు,  జ్వరం, విరేచనాలు, కడుపు ఉబ్బరం, లేదా కడుపులో రక్తం వంటి లక్షణాలతో కూడి ఉంటే అలాంటి సమస్యలకు ఈ ఉప్పు కాపడం అనేది సరైనది కాదు.. కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. వేడి ఉప్పు కాపడం వాడే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. ఉప్పు ప్యాకె ను మరీ ఎక్కువగా వేడి చేయకూడదు. దీనిని నేరుగా చర్మం మీద పెట్టడానికి బదులుగా ఒక సన్నని క్లాత్ ను పొట్ట మీద ఉంచి ఆ తర్వాత కాపడం పెట్టాలి. పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది, కాబట్టి వారి విషయంలో ఉష్ణోగ్రత విషయంలో జాగ్రత్త వహించాలి. నిద్రపోతున్నప్పుడు వెచ్చని ప్యాక్‌ను  అలాగే పెట్టుకుని పడుకోకూడదు. ఒకవేళ ఎరుపు, మంట లేదా నొప్పి వంటివి కలిగితే ఉప్పు కాపడం ఆపెయ్యాలి. కఫ సమస్యలకు ఉప్పు కాపడం.. దగ్గు, కఫం లేదా ఛాతిలో భారంగా అనిపించడం వంటి వాటికి చాలా ఇళ్లలో వేడి ఉప్పు కాపడం ఉపయోగించడం ఒక సాధారణ పద్ధతి. ఉప్పును వేడి చేసి, ఒక గుడ్డలో లేదా టవల్‌లో ఉంచి, కొద్దిసేపు ఛాతిపై ఉంచుతారు. ఆ వెచ్చదనం ఛాతి పట్టేసినట్టు ఉండటం నుండి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తుంది.  ఒక్కొక్కరికి ఒక్కో విధంగా దీని ఫలితం ఉండవచ్చు.  వేడి ఉప్పు టవల్ దగ్గుకు పూర్తీ చికిత్స కాదు. . వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, అలర్జీలు, ఆస్తమా లేదా ఇతర కారణాల వల్ల కూడా దగ్గు రావచ్చు. అందువల్ల, కేవలం ఈ ఇంటి చిట్కాపై మాత్రమే ఆధారపడటం మంచిది కాదు.                                                                                                                                                   *రూపశ్రీ.