LATEST NEWS
మార్గదర్శి ఫిన్ క్యాప్ కేసు వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది.   రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ కేసులో  సుప్రీం కోర్టు  ఉండవల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ, ఈ కేసుతో ఆయనకు నేరుగా ఉన్న సంబంధం ఏమిటని నిలదీసింది.   2008 నుంచి ప్రారంభమైన ఈ మార్గదర్శి కేసు అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. గతంలో హైకోర్టు ఈ కేసును కొట్టివేసినప్పటికీ, ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఊరూరా సభలు నిర్వహించి మరీ  మార్గదర్శి సంస్థలు ఆర్‌బిఐ నిబంధనలను ఉల్లంఘించాయని, ప్రజలను మోసం చేశాయని   ఆరోపణలు గుప్పించారు. అయితే ఆయన వాదనలు, ప్రచారాలు, ఆరోపణలూ అన్నీ అసత్యాలని సుప్రీం తీర్పుతో తేలిపోయింది.  దీనిపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు.. ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసారావు తెలుగువన్ చానల్ కు ఇచ్చినఇంటర్వ్యూలో ఉండవల్లి మార్గదర్శిపై కేసు, న్యాయపోరాటం అంతా కేవలం ఈర్ష్యతోనే అన్నారు. అయితే దోమ ఏనుగుని చూసి ఈర్ష్యపడితే ఏమౌతుందో.. ఇప్పుడు ఉండవల్లి పరిస్థితి కూడా అంతేనన్నారు.   మార్గదర్శి డిపాజిటర్ల పరంగా ఇప్పటివరకూ ఒక్క బాధితుడు కూడా ఫిర్యాదు చేయకపోవడం, సంస్థ ఇప్పటికే రూ.2,600 కోట్లకు పైగా ఎస్క్రో అకౌంట్‌లో జమ చేయడం వంటి అంశాలను గుర్తు చేసిన అడుసుమిల్లి..  రామోజీరావు నిర్మించిన పత్రికా, వ్యాపార సామ్రాజ్యంపై కేవలం ఈర్ష్యా ద్వేషాలతోనే ఉండవల్లి అరుణ్ కుమార్,   వైసీపీ నాయకులు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారన్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో రామోజీరావును విచారణ పేరిట ఇబ్బందులకు గురిచేసినప్పటికీ, ఆయన ఏనాడూ వెనకడుగు వేయలేదన్నారు. ఈ తీర్పు  రామోజీరావు ప్రతిష్టను ఇనుమడింపచేసిందనీ, ఆయనపై   కక్షసాధింపు చర్యలకు చెక్ పడిందని  అడుసుమిల్లి అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు లేదా రాజకీయ అజెండాతో చేసిన పోరాటాలు చివరికి న్యాయస్థానాల ముందు నిలబడవని ఈ కేసు మరోసారి స్పష్టం చేసిందన్న ఆయన. సుప్రీం కోర్టు నిర్ణయంతో మార్గదర్శి వివాదానికి   ముగింపు పడినట్లేనన్నారు.  ఇప్పటికైనా విమర్శకులు తమ వైఖరిని మార్చుకోవాలని అడుసుమిల్లి హితవు పలికారు.  Supreme Court,  Margadarsi Judgement, Vundavalli Aruna Kumar,  Margadarsi Case,  Court Verdict Telugu, TeluguOne
తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ఇప్పుడు కాంగ్రెస్ అంతర్గత విభేదాలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా కొందరు సీనియర్ లు విమర్శలు గుప్పిస్తున్నారు.  అందుకు ప్రతిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు, 5 గురు ఎమ్మెల్సీలు ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చి,   మంత్రి కొండా సురేఖను  పదవి నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై  ప్రభుత్వ విప్ వేముల వీరేషం  తెలుగువన్ న్యస్ చానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలన్న డిమాండ్  ఎవరి స్వార్థం కోసం చేసిన రచ్చ కాదు, పార్టీ క్రమశిక్షణను కాపాడేందుకు తీసుకున్న చర్య అని  వివరించారు. కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ప్రభుత్వంని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన వీరేషం..  క్రమశిక్షణ రాహిత్యంగా ఎవరు మాట్లాడినా సరే సహించేది లేదు అని వీరేషం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక జోడెడ్ల బండిలా రాత్రింబవళ్లు కష్టపడి పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే... కొంతమంది వ్యక్తులు మీడియా మైకులు దొరగ్గానే నోటికొచ్చినట్టు లూజ్ టాక్ మాట్లాడటం వల్ల క్యాడర్ తీవ్ర గందరగోళానికి గురవుతోందని వేముల వీరేషం అన్నారు. కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలన్న డిమాండ్ ను బీసీ మంత్రిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దాడిగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.  పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి అనే తేడాలు ఉండవు. బి ఫామ్ అందరికీ ఒక్కటే, పార్టీ క్రమశిక్షణ అందరికీ ఒక్కటే! తప్పు చేస్తే చర్యలు తప్పవు, నిన్న జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేయలేదా?" అని ప్రశ్నించారు.  తెలంగాణలో  ఆగస్టు సంక్షోభం, రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనను   క్యాన్సిల్ చేసుకుని హుటాహుటిన తిరిగి వస్తున్నారన్న కామెంట్లను కూడా వీరేషం ఖండించారు.  2029 వరకే కాదు, 2034 వరకు కూడా రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారన్నారు.   Demand in Congress to Burthruf Konda Surekha, Vemula Veeresham, CM Revanth Reddy, Telangana Congress Politics, Konda Sushmitha Comments, Revanth Reddy Cabinet 
తెలుగు రాజకీయాల్లో  సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి   హత్య కేసులో ఇప్పుడు ఈడీ రంగప్రవేశం చేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన సన్నిహితుల నివాసాలలో ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించింది.  2019 మార్చిలో జరిగిన వివేకా హత్య వెనుక 40 కోట్ల సుపారీ  ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రూ.1 కోటి అడ్వాన్స్‌గా ఇచ్చారని, అందులో రూ.70 లక్షలు రికవరీ అయ్యాయని వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు దాదాపు ఏడేళ్ల తరువాత ఈడీ సోదాలు నిర్వహించిందంటే ఏం జరుగుతోంది?  ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ ఎలాంటి కీలక ఆధారాలు సేకరించబోతోంది? అన్న విషయంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, ఏపీ కమ్మకార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.    ఈ కేసులో కీలక సాక్షులు కొందరు ఇప్పిటికే అనుమానాస్పద స్థితిలో చనిపోయారు.   ఇలాంటి పరిస్థితుల్లో అప్రూవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం  కీలకంగా మారింది. జైలులో బెదిరింపులు వచ్చినా, కోట్లాది రూపాయల ఆఫర్లు ఇచ్చినా లొంగకుండా దస్తగిరి మెజిస్ట్రేట్ ముందు వివరాలు వెల్లడించారు.  అదలా ఉంటే..   ప్రజా కోర్టులో  వివేకా హత్య కేసులో   తీర్పు వచ్చేసిందన్న అడుసుమిల్లి శ్రీనివాసరావు.. బాధితురాలైన కుమార్తెకు చట్టబద్ధంగా న్యాయం జరిగాల్సి ఉందన్నారు. అర్ధరాత్రి హత్య జరిగితే, తెల్లవారక ముందే ఫోన్ కాల్స్ వెళ్లడం, సాక్ష్యాధారాలు తుడిచిపెట్టే ప్రయత్నం జరగడంపై ఇప్పటికీ అనేక ప్రశ్నలు ఉన్నాయి?  అయితే ఇప్పుడు ఈ కేసులో ఈడీ ఎంట్రీ..  40 కోట్ల సుపారీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరెవరి ఖాతాల నుంచి ఎక్కడికి బదిలీ అయింది? అన్నది తేల్చడమే..   అయితే ఇప్పుడు ఇక ఈడీ సోదాల వల్ల ఒరిగిందేమీ ఉండదన్న అడుసుమిల్లి.. ఆ 40 కోట్లు వీళ్లకి రోడ్డు మీద దొరికాయని ఈడీ ముక్తాయించేసినా ఆశ్చర్యంలేన్నారు.   ఏది ఏమైనా, ఓ మాజీ ఎంపీ, మాజీ మంత్రి   స్వగృహంలోనే హత్యకు గురైతే.. ఏళ్లు గడుస్తున్నా బాధ్యులకు సరైన శిక్ష పడకపోవడం వ్యవస్థల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈడీ దర్యాప్తులోనైనా అసలు సూత్రధారులు బయటకు వస్తారా? లేక ఇది కూడా కేవలం విచారణలకే పరిమితమవుతుందా చూడాల్సి ఉంది. ED entry in YS Viveka Murder Case, ED Investigation AP, Avinash Reddy ED Raids, Dastagiri Statement, YS Jagan Mohan Reddy, AP Politics, TeluguOne
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్  ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుక  ఉభయ తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లో జరిగిన ఈ వివాహం కుటుంబ వేడుకగా కాకుండా.. వైసీపీ నేతల గ్యాదరింగ్ గా మారి పొలిటికల్ అటెన్షన్ కు కారణమైంది. పీఎస్సార్ ఆంజనేయులు కుమారుడి వివాహానికి  వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ సహా వైసీపీకి  చెందిన   కీలక నేతలు హాజరయ్యారు. జగన్, అంబటి రాంబాబు, కొడాలి నాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీకి చెందిన  పలువురు మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ఈ వివాహానికి హాజరయ్యారు.  వివాహ వేదిక దాదాపుగా వైసీపీ మినీ ప్లీనరీ జరుగుతోందా అనిపించేలా ఉంది.  ఈ వివాహ కార్యక్రమం దాదాపుగా పార్టీ అంతర్గత సమావేశాన్ని తలపింప చేసేదిగా మారిపోయింది.  ఇటీవల కాలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ స్థాయిలో ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటి సారి. మాజీ పోలీస్ ఉన్నతాధికారి కుటుంబంలో జరిగిన వేడుకకు ఒక రాజకీయ పార్టీకి చెందిన నేతలు ఈ స్థాయిలో హాజరుకావడం రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకోవడమే కాకుండా కొత్త చర్చకు దారి తీసింది.  గతంలో  వైపీపీ అధికారంలో ఉన్న సమయంలో  పీఎస్సార్ ఆంజనేయులు ఏపీ పోలీస్ శాఖలో   కీలకమైన పదవుల్లో బాధ్యతలు నిర్వహించారు. నిఘా విభాగం అధిపతిగా బాధ్యతలు చేపట్టిన కాలంలో ఆయన వైసీపీ సర్కార్ కు అనుకూలంగా వ్యవహరించారన్న   ప్రచారం అప్పట్లో పెద్ద ఎత్తున జరిగింది.   రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత..  ఆయన  చట్టపరమైన వివాదాలు, కేసులలో చిక్కుకోవడం వి తెలిసిందే. ముఖ్యంగా ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీకి సంబంధించిన వేధింపుల కేసు, అలాగే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  పరీక్షల్లో జరిగిన అక్రమాల ఆరోపణల కేసులలో ఆంజనేయులు పేరు ప్రముఖంగా ఉంది. జెత్వానీ వ్యవహారంలో ఆయన్ను ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు. ఆ తరువాత ఆయనకు బెయిల్  లభించింది అది వేరే సంగతి.  ఈ నేపథ్యంలో వైసీపీ హయాంలో  వివాదాస్పదంగా వ్యవహరించి ఆరోపణలు, విమర్శలూ ముటగట్టుకున్న ఓ మాజీ పోలీసు ఉన్నతాధికారి కుమారుడి వివాహానికి వైసీపీ అగ్రనేతలంతా తరలిరావడం అప్పటి ఆరోపణలకు బలం చేకూర్చేదిగా ఉందని పరిశీలకులు అంటున్నారు.   PSR Anjaneyulu son marriege in Hyderabad, YS Jagan Mohan Reddy, YCP Leaders, Hyderabad Wedding Gathering, AP IPS Officer, TeluguOne
ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్ పునర్వ్యవస్థీకరణ విషయంలో సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీ అధిష్ఠానం ఇటీవలే పార్టీ నూతన జాతీయ కార్యవర్గాన్ని  ప్రకటించింది. అలాగే ఇప్పుడు దేశ వ్యాప్తంగా భర్తీ చేయాల్సిన ఉన్న ఐదు రాష్ట్రాల గవర్నర్ లను భర్తీ చేయాలని కేంద్రం యోచిస్తున్నది. ఈ ఐదు గవర్నర్ పదవులలో రెండింటిని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు కేటాయించాలని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రెండింటిలోనూ ఒకటి ఎన్డీయేలో కీలక భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీకి కేటాయించాలని మోడీ నిర్ణయించినట్లు ఢిల్లీ వర్గాల భోగట్టా. ఈ సమాచారాన్ని ఆయన ఇప్పటికే చంద్రబాబుకు అందించారని అంటున్నారు.   ఇప్పటికే టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు  రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఆ అవకాశం కల్పించారు. ఇప్పుడు 5 రాష్ట్రాల భర్తీలో మరో 2 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించాలని కేంద్రం డిసైడ్ అవ్వడంతో, రెండో గవర్నర్ పదవి కూడా టీడీపీ ఖాతాలోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో తెలుగుదేశం తరఫున మరో గవర్నర్ పదవికి ఎవరు ఎంపికౌతారన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. కాగా గవర్నర్ రేసులో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో  సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ యనమలరామృష్ణుడు, అలాగే మరో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి, అలాగే సీనియర్ నాయకుడు కేఈ క్రిష్ణమూర్తిలు ఉన్నారు. వీరిలో యనమల, కేఈ బీసీ వర్గానికి చెందిన వారు కాగా, ప్రతిభా భారతి ఎస్సీసామాజిక వర్గానికి చెందిన నేత. ఈ ముగ్గురూ కూడా ఆరంభం నుంచీ తెలుగుదేశం పార్టీకి విధేయంగా ఉండి కీలక బాధ్యతలలో సేవలందించిన వారే. వీరి ముగ్గురిలో చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారన్న ఆసక్తి, ఉత్కంఠా సర్వత్రా నెలకొని ఉంది.   Another Governer post for TDP,  NDA Governor Appointments, Yanamala Ramakrishnudu, Pratibha Bharati, KE Krishnamurthy, Chandrababu Naidu, TeluguOne
ALSO ON TELUGUONE N E W S
  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..పుష్ప సిరీస్ తో  పాన్ ఇండియాని షేక్ చేసి అదే ఆనవాయితీని కంటిన్యూ చేయడానికి 'రాకా' ని ముస్తాబు చేస్తున్న విషయం తెలిసిందే. అభిమానుల్లోను, ప్రేక్షకుల్లోను 'రాకా' పై భారీ అంచనాలు ఉన్నాయి.  ఈ రోజు తన మావయ్య మెగా స్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా 'మన ఏకైక మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మా అందరికీ ఎంతో అండగా నిలిచారు. మాలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తూ, మమ్మల్ని ముందుకు నడిపించారు” అంటూ తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.అయితే ఈ ట్వీట్ చివరలో చేసిన  #KKAVCF (IYKYK) అనే పదాలే ఇప్పుడు నెటిజన్లలో ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి. అల్లు అర్జున్ ఈ హ్యాష్‌ట్యాగ్‌కు నేరుగా అర్థం చెప్పకుండా IYKYK అని పేర్కొన్నారు. దీని అర్థం “If You Know, You Know”. అంటే.. విషయం తెలిసిన వారికి దాని వెనుక ఉన్న అసలు అర్థం అర్థమవుతుందన్నట్లుగా  ట్వీట్ లో పేర్కొన్నాడు.  Also Read: చిరంజీవిపై సీఎం చంద్రబాబు ట్వీట్ వైరల్..రక్తనిధి, నేత్రనిధితో మానవత్వాన్ని చాటుకున్నారు అయితే అల్లు అర్జున్ గతంలో ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యను గుర్తు చేసుకుంటే ఈ హ్యాష్‌ట్యాగ్ వెనుక మ్యాటర్  అర్థమవుతోంది. “కట్టే కాలే వరకు చిరంజీవి ఫ్యాన్” అంటూ  గతంలో చెప్పిన మాట అభిమానులకు ఇప్పటికీ గుర్తుంది. అప్పట్లో ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇప్పుడు అదే మాటను షార్ట్ ఫార్మ్‌లో #KKAVCFగా ఉపయోగిస్తూ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారని అభిమానులు భావిస్తున్నారు.   Chiranjeevi, Allu Arjun, Tollywood  
Yash’s Toxic is already making waves at the box office, even before its worldwide theatrical release on August 26. The Geethu Mohandas directorial has recorded more than 335K tickets sold on BookMyShow within 24 hours of advance bookings opening, underlining the strong demand surrounding the film. The pre-release response is strong on the platform, with Toxic crossing 1.2 million interests. The numbers have prompted theatres to increase shows across languages as audiences look to experience the period crime thriller in theatres. Set against the post-independence Portuguese Goa backdrop, Toxic promises a gritty gangster drama mounted on scale. Yash plays a dual role, while Nayanthara, Kiara Advani, Rukmini Vasanth, Tara Sutaria and Huma Qureshi are part of the ensemble. The advance sales have raised expectations for a huge opening across India, with the Telugu market emerging as a key territory. Producer-distributor Dil Raju is bringing the film to Telugu states, adding weight to its release strategy. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
        ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడుగారికి,  మెగాస్టార్ చిరంజీవి గారికి మధ్య ఉన్న అనుబంధం యొక్క వయసుకి చాలా హిస్టరీ ఉంది.ఈ రోజు   చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా చేసిన ట్వీట్ నెట్టింట స్పెషల్ కేటగిరి హోదాలో వైరల్ గా మారింది. 1978లో తెలుగు చిత్రసీమలో సాధారణ నటుడిగా అడుగుపెట్టిన చిరంజీవి, అంకితభావం  కష్టపడే తత్వంతో అంచెలంచెలుగా ఎదిగి ఎనలేని కీర్తిప్రతిష్టలను సొంతం చేసుకున్నా రు. దశాబ్దాల కాలంలో వందలాది చిత్రాలలో నటించి, వెండితెరపై నటన, డాన్సులు, ఫైట్లతో సరికొత్త శకాన్ని సృష్టించడమే కాకుండా, తెలుగు సినీ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఇండస్ట్రీ రారాజుగా మారిన ఆయన ప్రయాణం ఎంతోమంది యువతకి  స్ఫూర్తిదాయకం. కేవలం వెండితెరకే పరిమితం కాకుండా సామాజిక సేవా రంగంలోనూ సమాజం పట్ల తనకున్న బాధ్యతను నెరవేరుస్తూ చిరంజీవి స్థాపించిన 'చిరంజీవి బ్లడ్ బ్యాంక్' (రక్తనిధి) మరియు 'నేత్ర నిధి' ద్వారా ఎంతోమంది బాధితులకి  ఉచితంగా రక్తాన్ని, అంధులకు చూపును ప్రసాదిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఆపదలో ఉన్న వేలాదిమంది ప్రాణాలను కాపాడటంలో ఈ రక్త నిధి ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది.  Also Read: కర్మ ఎవరని వదిలి పెట్టదు.. వైరల్ గా మారిన ఇష్యు  ఈ విధంగా వెండితెరపైన మాత్రమే కాక, నిజ జీవితంలోనూ ఎంతోమందికి సేవ చేస్తూ రియల్ హీరోగా నిలిచారు.  కేంద్ర మాజీ మంత్రిగా, పద్మభూషణ్ గ్రహీతగా ఆయన పొందిన గౌరవాలు తెలుగువారికి గర్వకారణం. చిరంజీవి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, ఆనందోత్సాహాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నట్లు ట్వీట్ చేసారు. Chiranjeevi, chandrababu Naidu, Tollywood
Shiva Kumar Kasaram's upcoming romantic drama Sahaa is set to arrive in theatres on September 4th. Directed by Nishanth Doti, the film stars Swetha Lakshman as the female lead and is produced by Teja Velpucharla under the Sumaira Studios banner. The film follows Sanju through different stages of his life, beginning with his childhood and moving into adulthood. His life takes an unexpected turn when he encounters Sahaa, a young woman whose presence brings back memories from his earlier years. The story revolves around how those memories connect with his present and shape his journey of love, relationships and destiny. The relationship between Sanju and Sahaa forms the central thread of the narrative, with the film exploring how unexpected encounters can bring forgotten chapters of one's life back into focus. The story's movement between childhood memories, college experiences and the present is expected to add an emotional layer to the romance. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
On the occasion of Megastar Chiranjeevi’s birthday on August 22, actor, producer, Member of the Andhra Pradesh Legislative Council (MLC), and Chairman of the AP GREEN Executive Committee, Konidela Nagendra Babu, marked the celebration with an eco-conscious initiative by planting saplings in an open area at Kokapet, Hyderabad. Among the plants introduced was a Kadamba Vruksham (Kadambavasini tree), sourced directly from the renowned nurseries of Kadiyam. Highlighting the ecological benefits of the species, Nagababu noted that the 1.5 to 2-year-old sapling features lush green foliage, provides cooling shade capable of reducing ambient heat by 10 to 15 degrees, and bears distinctive spherical blooms. Sharing his thoughts on celebrating milestones through nature, Nagababu stated: "Planting trees on the occasion of Annayya’s birthday felt truly happy and meaningful. Instead of celebrating with something temporary, planting a tree is a beautiful way to create something that grows, gives life, and benefits everyone for years to come. I believe everyone should plant a tree on the occasion of their loved ones’ birthdays. It’s a small gesture today that leaves a lasting gift for tomorrow. Happy Birthday, Annayya!  May your legacy continue to grow and inspire, just like these trees."  Nagababu further highlighted that this gesture is part of an ongoing family initiative. He has personally planted over 120 trees dedicated to his family members including Pawan Kalyan, Ram Charan, Varun Tej, Sai Dharam Tej, Vaishnav Tej, and Niharika. Underscoring his commitment to environmental preservation, he urged citizens and fans to adopt the practice of planting a tree on the birthdays of loved ones to create a greener, lasting future Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  అనసూయ,హేమ.. ఈ ఇద్దరు తెలుగు ప్రేక్షకులకి సుపరిచితులే. ఇప్పుడు ఈ ఇద్దరికీ సంబంధించిన న్యూస్  టాలీవుడ్ సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ  ప్రకంపనలు సృష్టిస్తోంది.   అనసూయ కొన్ని రోజుల క్రితం మాట్లాడుతు 'సనాతన ధర్మం 'జై శ్రీరామ్'  అనే నినాదం ముసుగులో దాడులకు పాల్పడుతున్నారని, కేవలం నినాదాలు చేయడం కంటే మనుషుల ప్రవర్తన ముఖ్యమనే వ్యాఖ్యలు చేసింది. దీంతో హైదరాబాద్ లోని బోరబండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదవ్వడంతో పాటు  సినీ పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రచ్చ మరింత ముదరడంతో తన మాటలను కొందరు కావాలని వక్రీకరించారని, తాను కూడా హనుమంతుడి భక్తురాలినేనని అనసూయ రెండవ వీడియోలో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ వ్యవహారంపై సీనియర్ నటి హేమ మాట్లాడుతు 'కోట్లాది మంది ప్రజల పవిత్ర విశ్వాసాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మాట్లాడే మాటలకి, చేసే పనులకి  తేడా ఉంటే ప్రజలు వెంటనే పసిగట్టేస్తారు. 'జై శ్రీరామ్' అనేది కేవలం ఒక సాధారణ స్లోగన్ కాదు.అది కోట్లాది మంది హిందువుల గుండెల్లో నిలిచిపోయిన ఒక పవిత్రమైన మంత్రం.  అది ఒక అపారమైన దివ్య శక్తి. Also Read: విశ్వనాథ్ అండ్ సన్స్ ని దెబ్బ కొట్టిన ఇరుముడి! అనసూయ మొదట ఒక వీడియో పెట్టి వివాదం రాజేశాక, రెండవ వీడియోలో 'నేను అందరినీ అనలేదు, ఎవరినో కొందరిని ఉద్దేశించి అన్నానంటే కుదరదు. నిజంగా ధైర్యం, దమ్ము ఉంటే తప్పు చేసిన వ్యక్తుల పేర్లని   బహిరంగంగా చెప్పాలి తప్ప, ఇలా మొత్తం వ్యవస్థను, భక్తుల నమ్మకాన్ని లేదా 'జై శ్రీరామ్' అనే నినాదాన్ని తప్పుబట్టేలా మాట్లాడటం తీవ్రమైన పొరపాటు. కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్మే వ్యక్తిగా ఈ విషయంలో హెచ్చరిస్తున్నాను.మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ, పవిత్రమైన నమ్మకాలను కించపరిచేలా మాట్లాడితే ఆ కర్మ పదింతలై తిరిగి మనకే వస్తుందని చెప్పారు. Anasuya, Hema, Tollywood
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'విశ్వంభర'పై టాలీవుడ్‌లో అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. 'బింబిసార' చిత్రంతో తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సోషియో ఫాంటసీ మూవీ బాక్సాఫీస్ పొటెన్షియల్ గురించి దర్శకుడు ఇచ్చిన హామీ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్న వశిష్ఠ, బాక్సాఫీస్ వద్ద 'విశ్వంభర' సృష్టించబోయే అలజడి ఏ రేంజ్‌లో ఉంటుందో చాలా నమ్మకంగా వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్‌కు, ఆయనలోని మాస్ మరియు విజువల్ గ్రాండియర్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోయేలా ఈ కథను సిద్ధం చేసినట్లు, థియేటర్లలో ప్రేక్షకులు ఖచ్చితంగా ఒక కొత్త అనుభూతికి లోనవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాలో భారీ విజువల్ ఎఫెక్ట్స్ మరియు వీఎఫ్ఎక్స్ (VFX) పనులు అత్యంత నాణ్యతతో రూపుదిద్దుకుంటున్నాయి. ప్రతి సన్నివేశం కూడా మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేలా డిజైన్ చేశామని, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమని చిత్రబృందం ఎంతో నమ్మకంతో ఉంది. యువి క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్ మరియు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి అందిస్తున్న సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ గ్లింప్స్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకోగా, ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ ప్రాజెక్ట్ పై భారీ బిజినెస్ కాంబినేషన్ నడుస్తోంది. వసిష్ఠ ఇస్తున్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే మెగాస్టార్ ఖాతాలో మరో ఆల్ టైమ్ రికార్డ్ హిట్ పడటం ఖాయమని మెగా ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ విశ్వరూప విజువల్ వండర్ ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందా అని యావత్ సినీ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని (ఆగస్టు 22) పురస్కరించుకుని ప్రముఖ నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు (MLC), ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగేంద్రబాబు హైదరాబాద్‌లోని కోకాపేటలో మొక్కలు నాటి వినూత్నంగా వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కదంబ వృక్షం (కదంబవాసిని) మొక్కను నాటారు. ఈ జాతి మొక్కల ప్రాధాన్యతను వివరిస్తూ 1.5 నుండి 2 సంవత్సరాల వయసున్న ఈ మొక్క ఏపుగా పెరిగి, దట్టమైన పచ్చదనంతో పాటు దాదాపు 10 నుంచి 15 డిగ్రీల వరకు వేడిని తగ్గించే చల్లని నీడను అందిస్తుందని, అలాగే టెన్నిస్ బాల్ ఆకారంలో సువాసనభరితమైన పూలను పూస్తుందని నాగబాబు తెలిపారు. ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ వేడుకపై నాగబాబు స్పందిస్తూ: అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ఇలా మొక్కలు నాటడం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది. తాత్కాలికమైన ఆడంబరాలతో వేడుకలు చేసుకోవడం కంటే, భవిష్యత్ తరాలకు ప్రాణవాయువునిస్తూ, అందరికీ మేలు చేసే ఒక చెట్టును నాటడం ఎంతో అర్థవంతమైన మార్గం. ప్రతి ఒక్కరూ తమ ప్రియమైన వారి పుట్టినరోజుల సందర్భంగా కనీసం ఒక మొక్కనైనా నాటాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మనం చేసే ఈ చిన్న ప్రయత్నం, రేపటి సమాజానికి మనం ఇచ్చే గొప్ప బహుమతి అవుతుంది. హ్యాపీ బర్త్‌డే అన్నయ్యా! ఈ చెట్లలాగే మీ కీర్తి, ప్రేరణ నిరంతరం ఎదుగుతూనే ఉండాలి. కుటుంబ సంప్రదాయంలో భాగంగా ఇప్పటివరకు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక తదితర కుటుంబ సభ్యుల పేర్లతో దాదాపు 120కి పైగా మొక్కలు నాటినట్లు నాగబాబు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు వచ్చి, ప్రియమైన వారి ప్రత్యేక దినోత్సవాల సందర్భంగా మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు.
Cast: Prithviraj Sukumaran, Mohanlal, Neil Nitin Mukesh, Indrans, Shammi Thilakan, Malavika Sharma, Renji Panicker, Sanju Sivaram, Mohini, Anand Manmadhan Crew: Written by Jinu V. Abraham Music by Jakes Bejoy Edited by Chaman Chacko Cinematography by Jomon T. John Directed by Vysakh Produced by Jinu V. Abraham, Suraj Kumar Prithviraj Sukumaran and Vysakh reunited after Pokkiri Raja for the ambitious action thriller Khalifa. The film arrived with considerable expectations, promising a larger-than-life gold-smuggling saga spanning generations, multiple countries and a powerful revenge story. Let's discuss about the film in detail.  Plot: Aamir Ali (Prithviraj Sukumaran) is a young man from Koduvally who runs a men's fashion store and leads a relatively peaceful life with his family. His father Younus Ali (Renji Panicker), a government contractor, gets trapped in a gold-smuggling case engineered by politician Raghavan (Shammi Thilakan) and businessman Harris Basheer (Neil Nitin Mukesh). Circumstances eventually force Aamir into the world of gold smuggling, where he discovers his connection to his grandfather, the legendary Mambarakkal Ahmed Ali (Mohanlal). Aamir builds his own empire and takes on powerful enemies, turning the family legacy into a story of revenge and survival. Analysis: Prithviraj Sukumaran is easily the biggest strength of Khalifa. He carries the film with his screen presence, style and physicality. Aamir Ali suits him perfectly, particularly in the action portions and mass moments. Even when the writing fails to provide enough substance, Prithviraj manages to keep the character watchable. Neil Nitin Mukesh makes a decent Malayalam debut as Harris Basheer. He brings the required menace to the antagonist, though the character itself is written in a fairly routine manner. Shammi Thilakan gets a significant role as Raghavan, while Indrans and Sanju Sivaram provide some support. Malavika Sharma, however, gets very little to do as Fiza, with the character largely restricted to the romantic and family portions. The biggest problem with Khalifa is its writing. Jinu V. Abraham has an interesting basic idea involving a legendary smuggling family, generational legacy and revenge, but the screenplay never develops the premise into something genuinely engaging. The story follows familiar gangster-film templates, and the rise of Aamir from an ordinary youngster to a powerful smuggler happens too conveniently. The film repeatedly tells us that Aamir is exceptionally intelligent and capable, but rarely gives us sufficiently clever sequences to make us believe it. Vysakh's direction gives the film a glossy and larger-than-life appearance, but the presentation often becomes more important than the story. The excessive slow-motion shots, hero elevations and loud stretches make the film feel like it is constantly trying to announce its own mass appeal. The opening portions create some intrigue, but the narrative gradually loses momentum as the predictable revenge drama takes over. Jakes Bejoy's background score does help several action blocks and hero-elevation moments. However, the score is used so heavily that it sometimes feels like it is compensating for the lack of impact in the writing. Jomon T John's cinematography is one of the film's strongest technical aspects, giving the international locations and action sequences a polished look. The action choreography also produces a few effective stretches, particularly the London fight, bridge ambush and the attack on Aamir's house. The much-discussed Mohanlal appearance as Mambarakkal Ahmed Ali is undoubtedly designed to create a major theatrical high. His presence generates curiosity about the larger universe the makers appear to be setting up. But even that moment cannot completely rescue a film that has struggled to establish a compelling narrative. Khalifa feels more like the setup for something bigger than a satisfying standalone film. Positives: Prithviraj Sukumaran's screen presence Jomon T John's cinematography Jakes Bejoy's BGM A few well-executed action sequences Mohanlal's appearance Negatives: Weak and predictable writing Routine gangster template Poorly developed supporting characters Too many hero-elevation and slow-motion moments Narrative loses momentum Film feels more like a setup than a complete story Bottomline: Khalifa fails to live-up to the expectations.  Rating: 2/5   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
Cast: Nivin Pauly, Mamitha Baiju, Sangeeth Prathap, Suresh Krishna, Shyam Mohan, Vinay Forrt, Srinda Crew:  Written by Girish A. D., Kiran Josey Music by Vishnu Vijay Edited by Akash Joseph Varghese Cinematography by Ajmal Sabu Directed by Girish A. D. Produced by Fahadh Faasil, Dileesh Pothan, Syam Pushkaran Nivin Pauly has returned to romantic comedy genre with Sarvam Maya and then, his older films released that did not work at the box office. Still, the expectations from his Onam release Bethelehem Kudumba Unit directed by Premalu fame Girish AD. Mamitha Baiju being cast as his romantic interest in an age-gap love story also created huge buzz. Let's discuss about the film in detail.  Plot:  Ashley (Mamitha Baiju) arrives back to her house from Ireland. She looks around for neighbour Justin (Nivin Pauly). The story goes back to one and a half year, revealing how Ashley's family shifted into the neighbourhood from her village. She is a bass player in a band named Room 17. Justin doesn't want to get hitched and he is more helpful to everyone in the neighbourhood. Ashley falls for his charm but can they both fall in love? Can they accept the differences with age-gap? Watch the movie to know more.  Analysis:  Nivin Pauly is at his absolute charming best. His reactions and screen presence add more life to the character. He is in character from start to finish and we believe he is Justin by the end. Mamitha Baiju surprises yet again with her versatility and she is also apt for Ashley. Her chemistry with Nivin is so beautiful that the age gap doesn't matter. All others are also good.  Girish AD is again in form like he was for Premalu. He tries to take inspiration from real life incidents and real life moments and present them with the same magic. His characters and dialogues are relatable from beginning to the end. But in the second hour rather than main characters' story Joel's story take over and there writing could have been much better.  Still, climax and interval are so heartwarming that they capture the love experienced by the characters with great detail and magical lens. The movie works big time as every character feels like a part of extended family from neighborhood rather than alienated and created specifically for this story. This is the biggest highlight of the film.  Vishnu Vijay's music works big time. BGM and songs enhance the story and feel rather than being a separate entity. Cinematography is good and Interval, climax are beautifully captured while every frame adds to the feel of the film. Editing is good in the first hour but second hour especially, pre-climax could have been better. Bethelehem Kudumba Unit is a film to be experienced and an easy watch.  Positives:  Nivin Pauly's charm Mamitha Baiju performance Relatability in scenes Music is good Technical values are excellent Humor works big time Negatives: Second hour could've been better More moments between lead pair could've been better Pre-climax drag Bottomline:  Bethelehem Kudumba Unit is a good movie that everyone can easily watch.  Rating: 3/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
భార్యాభర్తల బంధం జీవితాంతం కలిసి నడవాల్సిన అనుబంధం. ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవం ఉంటే ఈ బంధం ఎంతో ఆనందంగా ఉంటుంది. అయితే చిన్న చిన్న విషయాలకే తరచుగా గొడవలు రావడం, ఒకరి మాటను మరొకరు అర్థం చేసుకోకపోవడం, ఇంటి పనుల విషయంలో అసంతృప్తి పెరగడం వల్ల దాంపత్య జీవితంలో దూరం ఏర్పడవచ్చు. గొడవలు రావడం ఒక్కటే సమస్య కాదు. వాటిని ఎలా పరిష్కరించుకుంటున్నారన్నదే భార్యాభర్తల బంధానికి అసలు పరీక్ష. భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలకు కారణాలు.. ఒకరి మాట మరొకరు వినకపోవడం.. చాలా సందర్భాల్లో సమస్య పెద్దది కాకపోయినా, తమ మాటను భాగస్వామి పట్టించుకోవడం లేదనే భావన గొడవకు దారితీస్తుంది. ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలోనే అడ్డుకోవడం, వెంటనే సమాధానం చెప్పడానికి ప్రయత్నించడం సమస్యను మరింత పెంచుతుంది. ఇంటి పనుల విషయంలో.. ఇంటిని చూసుకోవడం, వంట చేయడం, పిల్లలను చూసుకోవడం, సరుకులు తీసుకురావడం, బిల్లులు చెల్లించడం వంటి పనులు ఒకరి మీదే ఎక్కువగా పడితే అసంతృప్తి పెరుగుతుంది. ప్రత్యేకంగా ఒకరు బయట ఉద్యోగం చేస్తున్నారనే కారణంతో ఇంటి బాధ్యతలన్నీ మరొకరి బాధ్యతగా భావించడం కూడా గొడవలకు కారణం కావచ్చు. ఆర్థిక విషయాల్లో స్పష్టత లేకపోవడం.. ఆదాయం, ఖర్చులు, పొదుపు, అప్పులు, కుటుంబ అవసరాలు వంటి విషయాల్లో భార్యాభర్తల మధ్య స్పష్టమైన అవగాహన లేకపోతే తరచుగా విభేదాలు రావచ్చు. చిన్న విషయాలను పెద్దవిగా మార్చుకోవడం.. ఇంట్లో ఎవరు ఏ పని చేయాలి, ఎవరు ఆలస్యంగా వచ్చారు, ఫోన్ ఎందుకు ఎత్తలేదు వంటి చిన్న విషయాలు వెంటనే పెద్ద గొడవలుగా మారితే దాంపత్య జీవితంలో ప్రశాంతత తగ్గుతుంది. గత తప్పులను పదేపదే గుర్తు చేయడం.. గతంలో జరిగిన విషయాలను ప్రతి గొడవలోనూ బయటకు తీసుకురావడం వల్ల సమస్య పరిష్కారం కాకుండా కోపం మాత్రమే పెరుగుతుంది. ఒక సమస్యను పరిష్కరించిన తర్వాత దాన్ని మళ్లీ మళ్లీ లేవనెత్తడం మంచిది కాదు. పనుల విషయంలో భార్యాభర్తలు ఎలా ఉండాలి? ఇంటి పని ఎవరిది అనే ప్రశ్న కంటే, మన ఇంటి పని అనే భావన ఉండాలి..  ఇంటి పని భార్యది మాత్రమే, బయట పని భర్తది మాత్రమే అనే ఆలోచన ప్రతి కుటుంబానికీ సరిపోదు. ఎవరి పని, సమయం, ఆరోగ్యం, బాధ్యతలు ఎలా ఉన్నాయో.. దాన్ని బట్టి పనులను పంచుకోవడం మంచిది. భార్య వంట చేస్తే భర్త పాత్రలు శుభ్రం చేయవచ్చు. ఒకరు పిల్లలను చూసుకుంటే మరొకరు ఇంటి ఇతర పనులను చూసుకోవచ్చు. వారాంతాల్లో ఇద్దరూ కలిసి ఇంటి పనులు చేసుకోవచ్చు. పని పంచుకోవడం అంటే సరిగ్గా సగం సగం కావాల్సిన అవసరం లేదు.. భార్యాభర్తలు ప్రతి పనిని 50-50గా పంచుకోవాల్సిన అవసరం లేదు. ఒకరి పరిస్థితిని మరొకరు అర్థం చేసుకుని అవసరమైనప్పుడు ఎక్కువ బాధ్యత తీసుకోవడం కూడా దాంపత్య జీవితంలో పరస్పర సహకారమే. ఒక రోజు భార్యకు ఎక్కువ పని ఉంటే భర్త సహాయం చేయవచ్చు. మరోరోజు భర్తకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే భార్య అతనికి సహకరించవచ్చు. "నువ్వు ఏం చేస్తావు?" అనే మాటకు బదులు "నేను ఏం చేయగలను?" అని ఆలోచించాలి.. దాంపత్య జీవితంలో మాటలకంటే మనస్తత్వం ముఖ్యం. "ఇది నీ పని కదా?" అని అడగడం కన్నా "నీకు పని ఎక్కువగా ఉంది, నేను ఏం చేయగలను?" అని అడిగితే బంధంలో ప్రేమ, గౌరవం పెరుగుతాయి. అలాగే సహాయం చేసిన తర్వాత దాన్ని గొప్పగా చెప్పుకోవడం కూడా అవసరం లేదు. భార్యాభర్తలు ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఉపకారం కాదు,  అది కుటుంబ బాధ్యతలో భాగం. గొడవ వచ్చినప్పుడు ఏం చేయాలి? గొడవ సమయంలో వెంటనే సమస్యను గెలవాలని ప్రయత్నించకుండా, సంబంధాన్ని కాపాడుకోవాలని ఆలోచించాలి. కోపంలో అవమానకరమైన మాటలు మాట్లాడకూడదు. తల్లిదండ్రులు, బంధువులు, పిల్లలను గొడవలోకి లాగకూడదు. పాత విషయాలను తవ్వి తీసుకురాకూడదు.  "నువ్వు ఎప్పుడూ ఇలాగే చేస్తావు" వంటి మాటలు తగ్గించాలి. ఇద్దరూ ప్రశాంతంగా ఉన్న సమయంలో సమస్య గురించి మాట్లాడాలి.  తప్పు ఉంటే "నా వల్ల తప్పు జరిగింది" అని చెప్పడానికి సంకోచించకూడదు. ఎదుటివారు చేసిన మంచి పనులను కూడా గుర్తించి ప్రశంసించాలి.  పిల్లల ముందు గొడవపడటం మంచిది కాదు చివరగా... భార్యాభర్తల మధ్య గొడవలు పూర్తిగా లేకపోవడం కంటే, గొడవ వచ్చిన తర్వాత ఇద్దరూ దాన్ని ఎలా పరిష్కరించుకుంటారన్నదే ముఖ్యం.                                                                                                                                                   *రూపశ్రీ.
ప్రతి వ్యక్తి జీవితంలో భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది.  ఒక వయసుకు వచ్చాక ముడిపడే ఈ బంధం మరణం వరకు తోడు ఉంటుంది. అయితే.. నేటికాలంలో చాలామంది బార్యాభర్తల మధ్య ప్రేమ, ఆప్యాయత కంటే గొడవలే ఎక్కువ ఉంటున్నాయి.  ఈ గొడవలే చాలామంది విడిపోవడానికి కూడా దారితీస్తాయి.  భార్యాభర్తల మధ్య అసలు గొడవలు లేకపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది.  కానీ.. ఒకే కుటుంబంలో పుట్టి పెరిగిన వాళ్ల మధ్య కూడా గొడవలు అనేవి సహజంగానే ఉంటాయి. అసలు గొడవలే లేకుండా ఉండే బంధం ఏదీ ఉండదు. కానీ వీలైనంత వరకు గొడవలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం తప్పకుండా భార్యాభర్తలు ఇద్దరి మీదా ఉంటుంది. భార్యాభర్తలు కొన్ని అలవాట్లు వదిలేస్తే.. వారి బంధంలో చాలా వరకు గొడవలు తగ్గుతాయి.  ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. పరస్పర అగౌరవం, బాధపెట్టేలా మాట్లాడటం..  భార్యాభర్తల సంబంధానికి పునాది పరస్పర గౌరవం. , భార్యాభర్తలు చిన్న విషయాలకే ఒకరినొకరు అవమానించుకున్నా లేదా కఠినమైన మాటలు మాట్లాడినా, ఆ ఇంటిలోని పాజిటివ్ ఎనర్జీ  నశిస్తుంది. రోజూ దూషణలు లేదా అవమానకరమైన మాటలు వాడే ఇంట్లో శాంతి ఎప్పటికీ ఉండదు, పైగా పేదరికం  మొదలవుతుంది. దుబారా ఖర్చు..  ఒక కుటుంబం  ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి సరైన ఆర్థిక నిర్వహణే కీలకం. భార్యాభర్తలలో ఎవరికైనా తమ ఆదాయానికి మించి ఖర్చు చేసే అలవాటు ఉన్నా లేదా డబ్బును విచక్షణారహితంగా దుబారా చేసినా, ఆ కుటుంబం త్వరగా పేదరికంలోకి జారిపోతుంది. వైవాహిక జీవితంలో ఒత్తిడికి, ఆర్థిక ఇబ్బందులకు అనవసరమైన ఆర్భాటం, దుబారా ఖర్చులే అతి పెద్ద కారణాలు. రహస్యాలు,  అపనమ్మకం.. ఏ బంధం అయినా బలంగా ఉండాలంటే..  నమ్మకమే ప్రాథమిక విషయం. భార్యాభర్తలలో ఎవరైనా ఒకరికొకరు ముఖ్యమైన విషయాలను దాచడం మొదలుపెట్టినప్పుడు లేదా మోసానికి పాల్పడినప్పుడు, ఆ సంబంధంలో అనుమానం, విద్వేషం చోటుచేసుకుంటాయి. పారదర్శకత లేనిచోట  గొడవలు ఎక్కువ ఉంటాయి.  అటువంటి అల్లకల్లోల వాతావరణం మనిషి  సామర్థ్యం మీద ప్రభావం చూపిస్తుంది, ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. సోమరితనం..  సోమరులకు , అపరిశుభ్రంగా జీవించేవారికి లక్ష్మీదేవి ఆశీస్సులు లభించవు. భార్యాభర్తలు ఉదయాన్నే ఆలస్యంగా నిద్రలేచినా, ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోయినా, లేదా వారే అపరిశుభ్రంగా ఉన్నా, ఇంట్లో ప్రతికూల శక్తి ప్రభావం పెరుగుతుంది. సోమరితనం సమయం , డబ్బు రెండింటి నష్టానికి దారితీసి, పేదరికానికి కారణం అవుతుంది. తద్వారా వారి మధ్య గొడవలు కూడా పెరుగుతాయి. ఇంటి విషయాలు బయటపెట్టడం..  ఇంటి విషయాలు ఎల్లప్పుడూ కుటుంబంలోనే ఉండాలి. తమ పరస్పర వివాదాలు, వ్యక్తిగత బలహీనతలు లేదా కుటుంబ రహస్యాలను ఇతరులకు వెల్లడించే భార్యాభర్తలు తమ వినాశనాన్ని తామే కొనితెచ్చుకుంటారు. బయటి వ్యక్తులు దీనిని అవకాశంగా తీసుకుని, విభేదాలను మరింత పెంచుతారు. చాణక్య నీతి ప్రకారం సంతోషకరమైన వైవాహిక జీవితానికి ఇతరుల సలహాలు తీసుకోవాలంటే, ముందుగా సమస్యలను అందరికీ చెప్పకుండా గోప్యత  పాటించడం ముఖ్యం.  ఒకరికొకరు రక్షణ కవచంగా ఉండటం, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, సంక్షోభసమయాల్లో ఓర్పు వహించడం, , కుటుంబంలోని పూజలు, వ్రతాలు వంటివి కలిసి ఆచరించడం, మర్యాదను కాపాడుకోవడం ముఖ్యం.                                                                                                                                                   *రూపశ్రీ.
మోకాలి నొప్పి అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. ఇది గాయం వల్ల లేదా ఆర్థరైటిస్, గౌట్ , ఇన్ఫెక్షన్ వంటి కొన్ని సమస్యల వల్ల కూడా  సంభవించవచ్చు. సాధారణ సమస్యలు అయితే  కొన్ని ట్రీట్మెంట్ తో  నయమవుతాయి. కానీ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు చాలా కాలం పాటు నొప్పికి కారణమవుతాయి. మోకాళ్ల నొప్పి మొత్తం ఆరోగ్యానికి హానికరంగా పరిగణించబడుతుంది. చాలా ఏళ్ల పాటు మోకాళ్ల నొప్పులు ఉంటే, అది జీవన నాణ్యతపై కూడా ప్రభావం చూపుతుంది. అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారు  కీళ్లపై అధిక ఒత్తిడిని కలిగించాల్సి వస్తుంది, దీనివల్ల నడవడం లేదా మెట్లు ఎక్కడం వంటి సాధారణ పనులు కూడా కష్టమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం కూడా మోకాళ్ల నొప్పికి దోహదపడుతుంది. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. శరీరం పై మోకాళ్ల నొప్పి ప్రభావం..  మోకాలి నొప్పులన్నీ తీవ్రమైనవి కావు, కానీ గాయం, ఆస్టియో ఆర్థరైటిస్, కీళ్లపై ఒత్తిడి వంటి కొన్ని సమస్యలకు చికిత్స చేయకుండా వదిలేస్తే అవి తీవ్రమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  అయితే మోకాలి నొప్పి శరీరంలోని ఇతర భాగాలలో సమస్యలను కలిగించగలదా? అని గమనిస్తే..   ఎక్కువ కాలం మోకాలి నొప్పి ఉంటే తుంటి, తొడ లేదా కాలి కింది భాగంలోని కండరాల సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి నడవడం, లేచి నిలబడటం కూడా కష్టంగా మారుతుంది. మోకాలి సమస్యలను నివారించడానికి వ్యాయామం.. క్రమం తప్పకుండా చేసే  వ్యాయామ అలవాట్లు మోకాలి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.   క్వాడ్రిసెప్స్ , హామ్‌స్ట్రింగ్ కండరాలపై దృష్టి సారించే బలవర్ధక వ్యాయామాలు నొప్పిని తగ్గించడంలో సహాయపడే అవకాశం ఉంటుంది. చురుకుగా ఉండటం బరువును అదుపులో ఉంచుకోవడానికి , కండరాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది, దీనివల్ల మోకాళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్లవాతం వంటి సమస్యలను నివారించడంలో వ్యాయామం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బరువు..  శరీర బరువు ఎక్కువగా ఉంటే..  మోకాళ్ల నొప్పిని పెంచుతుంది. ఇది కీళ్లవాతానికి కూడా ఒక కారణం అవుతుంది. అధిక బరువు కీళ్లపై ఒత్తిడిని పెంచుతుంది, ఇది అక్కడి కండరాలను ప్రభావితం చేస్తుంది. క్రమం తప్పని వ్యాయామం బరువును అదుపులో ఉంచుకోవడానికి , కీళ్లవాతం ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. సరైన ఫుట్ వేర్.. చాలా మంది ఫుట్ వేర్ విషయంలో తగినంత జాగ్రత్త తీసుకోరు.  నాణ్యత లేని బూట్లు , హై-హీల్ చెప్పులు కూడా కీళ్ల , మోకాళ్ల సమస్యలకు కారణమవుతాయి. అందువల్ల, మంచి, సౌకర్యవంతమైన బూట్లు ధరించాలి. ముఖ్యంగా కీళ్లవాతం ఉన్నవారు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సరైన బూట్లు ధరిస్తే.. ఎన్నో మడమ , మోకాళ్ల సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.                                                                                                                                                   *రూపశ్రీ.  
మునగాకు (Moringa Leaves) మనకు ప్రకృతి అందించిన పోషక విలువలు ఉన్న ఆహారాల్లో ఒకటి. మునగాకులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే దీనిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు. మునగాకు పొడిని ఎలా తీసుకోవాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి? దీన్ని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? షుగర్, కీళ్ల నొప్పులు, రోగనిరోధక శక్తి వంటి విషయాల్లో మునగాకు ఎలా ఉపయోగపడుతుంది? అనే అంశాలను ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ వివరించారు. మునగాకు పొడిని సరైన విధంగా తీసుకోవడం, ఆహారంలో ఎలా చేర్చుకోవాలి అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గమనిక: మునగాకు లేదా మునగాకు పొడి ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ఉపయోగపడవచ్చు. అయితే డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనల మేరకు ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిది. మందులకు బదులుగా మునగాకు పొడిని ఉపయోగించకండి. TeluguOne Health లో ఆరోగ్యానికి సంబంధించిన తాజా సమాచారం, నిపుణుల సూచనలు, ఉపయోగకరమైన ఆరోగ్య చిట్కాలను తెలుసుకోండి.
దాహంగా అనిపించినప్పుడు, గొంతు పొడిగా మారినప్పుడు నీరు తాగడం సహజం.  అయితే ఇలా నీరు తాగగానే.. మళ్లీ కాసేపటికే వెంటనే దాహం వేస్తుంది కొందరికి.  దీని గురించి చాలామంది పట్టించుకోరు.  ఇదేమైనా ఆరోగ్య సమస్య ఏమో అని కొందరు సందేహ పడుతూ ఉంటారు. కానీ నిజానికి ఇదిశరీరంలో ఏదో అనారోగ్యానికి సంకేతం కాదని,  కానీ.. శరీరంలో ఏదో ఒక సమస్యను మాత్రం ఖచ్చితంగా సూచిస్తుందని అంటున్నారు.  చాలా వరకు ఎన్ని సార్లు నీరు తాగినా మళ్లీ దాహం వేయడానికి అసలు కారణం శరీరం డీహైడ్రేషన్ అవ్వడమే.. ఎక్కువ శారీరక కష్టం చేయడం.. అధికంగా చెమట పట్టడం, ఎండకు గురికావడం లేదా అధికంగా ఉప్పు తీసుకోవడం వంటివన్నీ శరీరాన్ని డీహైట్ర్ అయ్యేలా చేసి ఎక్కువ దాహం వేయడానికి కారణం అవుతాయి.  కానీ ఎక్కువ దాహం కావడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. మధుమేహం.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, తరచుగా చాలా దాహం వేయడం అనేది మధుమేహానికి ఒక తొలి లక్షణం కావచ్చని అంటున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, శరీరం అదనపు గ్లూకోజ్‌ను మూత్రం ద్వారా బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంది, ఈ ప్రక్రియలో నీరు కూడా విసర్జించబడుతుంది, దీనివల్ల తరచుగా దాహం వేస్తుంది. మూత్రపిండాల ఆరోగ్యం.. మూత్రపిండాలు శరీరంలో నీరు , ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుతాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే, ఈ సమతుల్యతకు భంగం వాటిల్లి, తరచుగా దాహం వేయడానికి దారితీస్తుంది. ఈ లక్షణం మూత్రపిండాలకు సంబంధించిన సమస్యను కూడా సూచించవచ్చు. డయాబెటిస్ ఇన్సిపిడస్.. డయాబెటిస్ ఇన్సిపిడస్ అనేది శరీరంలో ఒక నిర్దిష్ట హార్మోన్ లోపించడం వల్ల కలిగే సమస్య. దీనివల్ల అధిక దాహం , తరచుగా మూత్రవిసర్జన కలుగుతాయి. ఇది డయాబెటిస్ మెల్లిటస్ కు భిన్నంగా ఉంటుంది, కానీ దీని లక్షణాలు చాలా వరకు ఒకేలా ఉంటాయి. నోరు పొడిబారడం.. కొన్నిసార్లు, తగినంత లాలాజలం ఉత్పత్తి కాకపోవడం వల్ల ఎప్పుడూ దాహం కలుగుతుంది, ఈ పరిస్థితిని నోరు పొడిబారడం అంటారు. దీనివల్ల నోరు, గొంతు, నాలుక పొడిబారవచ్చు, కొన్నిసార్లు పెదవులు కూడా పగలవచ్చు. ఈ సమస్య కొన్ని మందుల దుష్ప్రభావంగా కూడా ఎదురవుతుంది. వైద్యుడిని ఎప్పుడుసంప్రదించాలి? పై లక్షణాలు కొనసాగితే, ముఖ్యంగా మధుమేహం, మూత్రపిండాల వ్యాధి లేదా హార్మోన్ల సమస్యలు వంటి ముందు నుంచే ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో, వాటిని తేలికగా తీసుకోకూడదు. ఈ లక్షణాలు పిల్లలు , వృద్ధులలో మరింత తీవ్రంగా ఉంటాయి. కాబట్టి సకాలంలో రోగ నిర్ధారణ , సరైన చికిత్స చాలా అవసరం.                                                                                                                                                 *రూపశ్రీ.  
రెస్టారెంట్లలో భోజనం తర్వాత స్వీట్ సొంపు ఇస్తుంటారు.  చాలామందికి ఈ సొంపు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది.  కొందరు ఇంట్లో కూడా భోజనం తర్వాత స్వీట్ సొంపు తినడం లేదా సొంపు కండ చెక్కర కలిపి తినడం చేస్తుంటారు.  చాలా మంది స్వీట్ సొంపును కేవలం మౌత్ ప్రెషనర్ అనుకుంటారు.  అందుకే భోజనం తర్వాత నోరు తాజాగా అనిపించడం కోసం దీన్ని ఇస్తారని అనుకుంటారు.  కానీ భారతీయ వంటకాల్లో భోజనం తర్వాత సోంపును తినడం ఎప్పటినుండో ఉందట.  ఇది కేవలం మౌత్ ప్రెషనర్ గా కాకుండా..  చాలా రకాల  సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందట.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. సొంపు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. జీర్ణక్రియకు.. భోజనం తర్వాత కొద్దిగా సోంపు నమలడం భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. జీర్ణ సంబంధిత అసౌకర్యాలు తగ్గించడంలో సోంపు సహాయపడుతుందని చెబుతారు. అయితే దీని ప్రభావం అందరికీ ఒకే విధంగా ఉండదు. నోటిని తాజాగా ఉంచడానికి.. సోంపు లో ఉండే సహజ సువాసన , రుచి భోజనం తర్వాత వచ్చే దుర్వాసనను తాత్కాలికంగా తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే దీనిని  రెస్టారెంట్లలో తరచుగా మౌత్ ఫ్రెషనర్‌గా అందిస్తారు.  ఫైబర్ మూలం.. సోంపు గింజలలో పీచుపదార్థం ఉంటుంది.  కొంచెం సొంపు తిన్నా సరే.. అందులో  లభించే పీచుపదార్థం చాలా ఎక్కువగా ఉండకపోయినప్పటికీ ప్రభావవంతగా పనిచేస్తుంది.  ఆహారం తినగానే సొంపు తింటాం కాబట్టి ఆహారం బాగా జీర్ణం కావడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు.. సోంపులో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానకి చాలా సహాయపడతాయి. కండ చక్కెర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. చాలా రెస్టారెంట్లలో స్వీట్ సొంపు ఇస్తుంటారు. అయితే  కొన్ని చోట్ల మాత్రం ప్లెయిన్ సొంపును కండచెక్కర తో కలిపి ఇస్తుంటారు.  ఈ కండ చక్కెరను మిశ్రీ అని కూడా అంటారు.  ఇందులో ప్రధాన పదార్థం చక్కెర. అందువల్ల ఇది తియ్యగా ఉంటుంది.  కొంతమంది భోజనం తర్వాత సోంపు గింజలతో మిశ్రీని కలిపి తినడానికి ఇష్టపడతారు.  ఇధి రుచిని మెరుగుపరుస్తుంది. అయితే.. మిశ్రీని ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు.. మిశ్రీ లో తీపిదనం ఆరోగ్యానికి మంచిది కాదు. దీన్ని మితంగా తీసుకుంటే బాగనే ఉంటుంది. కానీ అధికంగా తీసుకోకూడదు. డయాబెటిస్ పేషంట్లు దీని విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.                                                                                                                                                 *రూపశ్రీ.