Home

»

Latest News

కర్మ ఎవరని వదిలి పెట్టదు

Aug 22, 2026 2:35PM

 

అనసూయ,హేమ.. ఈ ఇద్దరు తెలుగు ప్రేక్షకులకి సుపరిచితులే. ఇప్పుడు ఈ ఇద్దరికీ సంబంధించిన న్యూస్  టాలీవుడ్ సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ  ప్రకంపనలు సృష్టిస్తోంది.  


అనసూయ కొన్ని రోజుల క్రితం మాట్లాడుతు 'సనాతన ధర్మం 'జై శ్రీరామ్'  అనే నినాదం ముసుగులో దాడులకు పాల్పడుతున్నారని, కేవలం నినాదాలు చేయడం కంటే మనుషుల ప్రవర్తన ముఖ్యమనే వ్యాఖ్యలు చేసింది. దీంతో హైదరాబాద్ లోని బోరబండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదవ్వడంతో పాటు  సినీ పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రచ్చ మరింత ముదరడంతో తన మాటలను కొందరు కావాలని వక్రీకరించారని, తాను కూడా హనుమంతుడి భక్తురాలినేనని అనసూయ రెండవ వీడియోలో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.


అయితే ఈ వ్యవహారంపై సీనియర్ నటి హేమ మాట్లాడుతు 'కోట్లాది మంది ప్రజల పవిత్ర విశ్వాసాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మాట్లాడే మాటలకి, చేసే పనులకి  తేడా ఉంటే ప్రజలు వెంటనే పసిగట్టేస్తారు. 'జై శ్రీరామ్' అనేది కేవలం ఒక సాధారణ స్లోగన్ కాదు.అది కోట్లాది మంది హిందువుల గుండెల్లో నిలిచిపోయిన ఒక పవిత్రమైన మంత్రం.  అది ఒక అపారమైన దివ్య శక్తి.


Also Read: విశ్వనాథ్ అండ్ సన్స్ ని దెబ్బ కొట్టిన ఇరుముడి!

అనసూయ మొదట ఒక వీడియో పెట్టి వివాదం రాజేశాక, రెండవ వీడియోలో 'నేను అందరినీ అనలేదు, ఎవరినో కొందరిని ఉద్దేశించి అన్నానంటే కుదరదు. నిజంగా ధైర్యం, దమ్ము ఉంటే తప్పు చేసిన వ్యక్తుల పేర్లని   బహిరంగంగా చెప్పాలి తప్ప, ఇలా మొత్తం వ్యవస్థను, భక్తుల నమ్మకాన్ని లేదా 'జై శ్రీరామ్' అనే నినాదాన్ని తప్పుబట్టేలా మాట్లాడటం తీవ్రమైన పొరపాటు. కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్మే వ్యక్తిగా ఈ విషయంలో హెచ్చరిస్తున్నాను.మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ, పవిత్రమైన నమ్మకాలను కించపరిచేలా మాట్లాడితే ఆ కర్మ పదింతలై తిరిగి మనకే వస్తుందని చెప్పారు.

Anasuya, Hema, Tollywood

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com