LATEST NEWS
  బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తండ్రి కేసీఆర్‌ను కలిసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి కవిత ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. తన కుమారుడికి కేసీఆర్‌ ఆశీర్వాదం తీసుకోనున్నట్టు సమాచారం. కవిత అమెరికా పర్యటనకు  డిల్లీ రౌజ్‌ అవెన్యూ కోర్టు ఇప్పటికే అనుమతించింది.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు అమెరికాకు వెళుతున్నారు. తన కుమారుడిని అక్కడ కాలేజీలో చేర్పించనున్నారు. 15 రోజుల పాటు ఆమె అమెరికాలోనే ఉండనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. 15 రోజుల పాటు కవిత అమెరికాలో ఉండనున్నారు.  కుమారుడిని అమెరికా యూనివర్శిటీలో జాయిన్ చేసి.. కొన్ని రోజులు ఆమె అక్కడే ఉండి.. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.మరోవైపు అధినేత కేసీఆర్ పార్టీలోని కీలక నేతలకు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు రావాలని ఆదేశించారు. దీంతో కేటీఆర్, హరీష్ రావులతోపాటు పలువురు కీలక నేతలు ఇప్పటికే ఎర్రవల్లికి పయనమయ్యారు. మరికొద్ది రోజుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై చర్చించనున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. అలాగే అసెంబ్లీ సమావేశాలు, కాళేశ్వరం ప్రాజెక్ట రిపోర్ట్ తదితర అంశాలపై చర్చించే అవకాశమున్నట్లు టాక్.
  కడప పోలీసు పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో  ప్రొటోకాల్‌ ప్రకారం తనకు కుర్చీ వేయలేదని అలిగి వెళ్లిపోయారు. తనకు వేదిక సమీపంలో తనకు కేటాయించిన సీటులో అధికారులు కూర్చున్నారని ఆమె అలిగారు. అయితే, ముందు వరుసలో కుర్చీలన్నీ అధికారులతో నిండిపోయాయి. దీంతో ఎమ్మెల్యే మాధవి రెడ్డి కడప జాయింట్ కలెక్టర్ ఆదితి సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అధికారులు ఎమ్మెల్యే కోసం మరో కుర్చీని ఏర్పాటు చేశారు.  అయితే, జాతీయ పతాక ఆవిష్కరణ జరిగేంత వరకూ నిలుచునే ఉన్న ఎమ్మెల్యే.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఎమ్మెల్యే మాధవి రెడ్డి అలగడంతో కలెక్టర్‌ కలుగజేసుకుని ఆమెను స్టేజిపైకి రావాలని ఆహ్వానించారు. కానీ అప్పటికే కోపంతో ఊగిపోయిన మాధవి రెడ్డి స్టేజిపైకి వెళ్లడానికి తిరస్కరించింది. దీంతో అక్కడకు వెళ్లి కూర్చోవాలని సూచించారు. అయినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగేంత వరకు దాదాపు అరగంటపాటు అక్కడే నిల్చుండి కార్యక్రమాలను తిలకించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.  
  ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే స్త్రీ శక్తి’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి  డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మహిళల కోసం ఈ కీలక పథకం నేటి నుంచి అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం ఉండవల్లి నుంచి తాడేపల్లి, కనకదుర్గ వారధి మీదుగా విజయవాడ బస్ టెర్మినల్ వరకు చంద్రబాబు, పవన్, లోకేశ్ బస్సులోనే వెళ్లారు. వీరితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, పలువురు ఇతర కూటమి నేతలు కూడా ఈ ప్రయాణంలో పాల్గొన్నారు. మహిళా ప్రయాణికులతో కలిసి ప్రయాణిస్తూ వారి సంతోషంలో పాలుపంచుకున్నారు. సీఎం, మంత్రులు ప్రయాణిస్తున్న బస్సు వెళ్లే మార్గంలో మహిళలు పెద్ద సంఖ్యలో గుమిగూడి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దారి పొడవునా మంగళహారతులతో నీరాజనాలు పలుకుతూ ఘన స్వాగతం పలికారు. ‘థాంక్యూ సీఎం సర్‌’ అంటూ నినాదాలతో తమ కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నేతలు పలుచోట్ల బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలలో ఒకటైన ఈ పథకాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా మహిళల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.మహిళలు 5 రకాల బస్సుల్లో ఫ్రీ బస్సు ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించింది కూటమి ప్రభుత్వం.  పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించారు. అలాగే సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చు. ప్రభుత్వం జారీ చేసిన ఆధార్‌, రేషన్‌ కార్డు, ఓటర్‌ ఐడీలలో ఏదో ఒకటి చూపించి కండక్టర్‌ జారీ చేసే జీరో ఫేర్‌ టికెట్‌తో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.స్త్రీ శక్తి' పథకం ద్వారా ఏకంగా 2.62కోట్ల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. మరోవైపు ఉచిత బస్సు ప్రయాణాన్ని ట్రాన్స్‌జెండర్లకు సైతం వర్తింపజేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ పథకం అమలుతో ఏపీ ప్రభుత్వంపై ఏటా రూ.1,942 కోట్ల అదనపు భారం పడనుంది. .   
ALSO ON TELUGUONE N E W S
భీమవరం టాకీస్ పతాకంపై ఇప్పటికే 114 చిత్రాలను నిర్మించి ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ... ప్రపంచ సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఒకేసారి 15 చిత్రాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో కిక్కిరిసిన సినీ అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అతిరధమహారధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.  మురళీమోహన్, రేలంగి నరసింహారావు, సుమన్, శ్రీకాంత్, జె.డి.చక్రవర్తి, తనికెళ్ళ భరణి, 30 ఇయర్స్ పృథ్వి, అజయ్ ఘోష్, సి.కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, తుమ్మల ప్రసన్నకుమార్, చదలవాడ శ్రీనివాసరావు, భరత్ భూషణ్, వల్లూరిపల్లి రమేష్ బాబు, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యులు విజయేంద్రప్రసాద్, కె.ఎల్.స్టూడియో అధినేత కొంతం లక్ష్మణ్, గజల్ శ్రీనివాస్, చీకటి ప్రవీణ్, ఇమ్మడి రమేష్, వంశీ రామరాజు, కె.ధర్మారావు, శ్రీమతి గిడుగు కాంతి కృష్ణ తదితర దిగ్గజాలు హాజరై రామసత్యనారాయణను అభినందించారు. కొబ్బరికాయలు కొట్టుకున్న  15 చిత్రాల-దర్శకుల వివరాలు! 1) జస్టిస్ ధర్మ (యండమూరి వీరేంద్రనాధ్), 2) నాగపంచమి(ఓం సాయిప్రకాష్), 3) నా పేరు పవన్ కల్యాణ్(జె.కె.భారవి), 4) టాపర్ (ఉదయ్ భాస్కర్), 5) కె.పి.హెచ్.బి. కాలని(తల్లాడ సాయికృష్ణ), 6) పోలీస్ సింహం(సంగకుమార్), 7) అవంతిక- 2(శ్రీరాజ్ బళ్ళా), 8) యండమూరి కథలు(రవి బసర), 9) బి.సి. -(బ్లాక్ కమాండో)(మోహన్ కాంత్), 10) హనీ కిడ్స్(హర్ష), 11) సావాసం(ఏకరి సత్యనారాయణ), 12) డార్క్ స్టోరీస్(కృష్ణ కార్తీక్) 13) మనల్ని ఎవడ్రా ఆపేది(బి.శ్రీనివాసరావు), 14) ది ఫైనల్ కాల్(ప్రణయ్ రాజ్ వంగరి), 15) అవతారం(డా: సతీష్)...ఈ 15 చిత్రాలకు 15 కెమెరాలతో క్లాప్, స్విచ్ఛాన్, గౌరవ దర్శకత్వం చేయించడం విశేషం.  తెలుగు సినిమాకు ప్రపంచ రికార్డు సాధించేలా ఒకేసారి 15 చిత్రాలు మొదలు పెట్టిన రామసత్యనారాయణను అతిధులంతా అభినందించారు. 2025, ఆగస్టు 15న కొబ్బరికాయలు కొట్టిన ఈ 15 చిత్రాలకు 2026 ఆగస్టు 15కి పూర్తి చేసి గుమ్మడికాయలు కొట్టేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నామని రామసత్యనారాయణ పేర్కొన్నారు. ఈ 15 చిత్రాలకు KLస్టూడియోను 25% డిస్కౌంట్ తో ఇస్తున్నందుకు కొంతంకు కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా పేరొందిన 9 సంస్థలు ఈ ప్రారంభోత్సవాన్ని వరల్డ్ రికార్డ్ బుక్స్ లో నమోదు చేశాయి. ఒకేరోజు మొదలై ప్రపంచ రికార్డ్స్ లో నమోదైన ఈ 15 చిత్రాలకు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ పి.ఆర్.ఓ. కావడం విశేషం!!
ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న విక్టరీ వెంకటేష్‌ తాజాగా తన 77వ చిత్రాన్ని త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో చేస్తున్నారు. గతంలో వెంకటేష్‌ సూపర్‌హిట్‌ సినిమాలు నువ్వు నాకు నచ్చావ్‌, మల్లీశ్వరి చిత్రాలకు రచయితగా పనిచేసిన త్రివిక్రమ్‌కి ఇంత కాలానికి వెంకటేష్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది. సాత్రంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ‘వెంకీ77’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ప్రారంభమైన ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బేనర్‌పై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.  వెంకీ సినిమాలకు రైటర్‌గా పనిచేసిన త్రివిక్రమ్‌ ఎంతో కాలంగా అతని కాంబినేషన్‌లో సినిమా చెయ్యాలని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి మీడియాలో కూడా బాగా ప్రచారం జరిగింది. అయితే వెంకీకి సరిపోయే కథతో ఇంతకాలం ఎదురుచూసిన త్రివిక్రమ్‌ ఒక అద్భుతమైన కథతో డైరెక్టర్‌గా వెంకీతో సూపర్‌హిట్‌ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్‌. 
Cast: Superstar Rajinikanth, King Nagarjuna, Satyaraj, Shruti Haasan, Soubin Shahir, Upendra, Aamir Khan, Pooja Hegde Crew:  Written by Chandhru Anbazhagan, Lokesh Kanagaraj Music by Anirudh Ravichander Cinematographer by Girish Gangadharan Editing by Philomin Raj Directed by Lokesh Kanagaraj Produced by Kalanithi Maran Coolie has created huge buzz as it marks Rajinikanth and Lokesh Kanagaraj coming together for the first time ever. Adding to the enormous buzz - King Nagarjuna joined as antagonist for the first time ever in this film. Also, Rajini completed 50 Years of his acting career and it marks a grand celebration of his career, too. Upendra, Aamir Khan doing cameos in this film makes it even more special. Let's discuss about the film, in detail.  Plot:  Rajasekhar (Satyaraj) is murdered by someone and his friend, family member Deva (Rajinikanth) starts investigating why.  Rajasekhar's daughters, mainly elder one Preeti (Shruti Haasan), hates Deva and his involvement. Even though he is her uncle. Still, Deva finds a way to investigate.  As Kingpin Simon (Nagarjuna) and his head of henchmen Dayalan (Soubin Shahir) look for Rajasekhar's invention to electrocute dead bodies. Already Rajasekhar had been working for them, so Deva joins them along with Preeti. Why Simon needs this invention? What is Dayalan hiding? Will Deva find out the Rajasekhar's killer and reason? Watch the movie to know more.  Analysis:  Superstar Rajinikanth entertains with a tailor-made role for him. He is charismatic, looks good and his aura is magnetic. Even in younger portions, with the help of AI, he did his best. King Nagarjuna looked good in a villainous role. He is able to bring his swag and style to the forefront in a different manner.  Soubin Shahir got a huge role among all and he did give his best. He is scary and performed ruthlessly in a character that demands more physical agility too. Aamir Khan's cameo is underwhelming while Upendra performed well. Shruti Haasan, Rachita Ram are good while Satyaraj did his good.  Lokesh Kanagaraj is good in building tension in scenes that seem very normal to commercial films that follow mass template. He brings something new to the table and has a talent to present it in fresh perspective. While he did execute well several scenes, there are few unnecessary drags that undermine the film's impact.  Still, watching such a huge ensemble cast in different roles and their conversations does make it worth it. Action sequences does pack a punch and he keeps audiences engaged. Keep expectations in check as Lokesh did not serve another Vikram but a Rajinikanth film in his style.  Bottomline:  Action packed film with a middling storyline but strong execution.  Rating: 2.75/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. We would encourage viewers' discretion before reacting to them.
Today, the lyrical song “Adugu Aduguna” from MissTerious, produced by Ashley Creations, was released by Hyderabad City Police Commissioner C. V. Anand. This song has been picturized on a dedicated and hard-working police officer. After watching the song, Commissioner C. V. Anand praised singer MLR Karthikeyan, appreciating his performance and stating that the song was beautifully filmed. He also congratulated ML Raja, who composed the music, for writing and composing the song in a way that wonderfully highlights the commitment of the police force. He further applauded director Mahi Komatireddy for attempting to present a suspense thriller in a fresh way, and producer Jay Vallamdas, who despite being settled in the USA, has endured many challenges and expenses to bring this film to life. The event was attended by Hero Rohit Sahni, Gautham, director Mahi Komatireddy, producer Jay Vallamdas, Executive Producer Ram Uppu (Bunny Ram), and others. Producer Jay Vallamdas and director Mahi Komatireddy expressed heartfelt thanks to Commissioner C. V. Anand for taking time out of his busy schedule to release the lyrical song of their film. They announced that the lyrical video is now available on Ashley Music’s YouTube channel starting today, and requested everyone to watch and support them.
అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకి తెరదించుతు సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth),కింగ్ నాగార్జున(Nagarjuna)ప్రెస్టేజియస్ట్ మూవీ 'కూలీ'(Coolie)ఈ రోజు థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. 'దేవ'గా రజనీ, సైమన్ గా 'నాగ్' తమ అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసారని అభిమానులతో పాటు, ప్రేక్షకులు ముక్త కంఠంతో చెప్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంతో పాటు సన్ పిక్చర్స్ నిర్మాణపు విలువలు ఒక రేంజ్ లో ఉన్నాయనే మాటలు కూడా వ్యక్తమవుతున్నాయి. కూలీకి సంబంధించి రజనీకాంత్ తో పాటు ఎవెరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే చర్చ రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. ఈ క్రమంలో ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక 'డెక్కన్ హెరాల్డ్' నివేదిక ప్రకారం కూలీకి రజనీ 200 కోట్ల రూపాయిల రెమ్యునరేషన్ తీసుకున్నాడని, నాగార్జున 10 కోట్లు, అమీర్ ఖాన్ 20 కోట్లు, శృతి హాసన్ 4 కోట్లు, స్పెషల్ సాంగ్ చేసిన పూజాహెగ్డే 3 కోట్లు, ఉపేంద్ర, సత్యరాజ్ ఐదు కోట్లు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక దర్శకుడు లోకేష్ కనగరాజ్ 50 కోట్లు, మ్యూజిక్ ని అందించిన అనిరుద్ 15 కోట్లు తీసుకుట్టుగా డెక్కన్ హెరాల్డ్'(Deccan herald)నివేదిక ఇచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 'కూలీ'ని భారీ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్(Sun Pictures)పై కళానిధి మారన్(Kalanithi Maran)సుమారు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మించాడు. కథకి తగ్గ ఆర్టిస్టులని, టెక్నీషియన్స్ ని ఎంచుకోవడంతో పాటు, కథకి తగ్గట్టుగా భారీ సన్నివేశాలని చిత్రీకరించడంలోను సన్ పిక్చర్స్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది. అందుకే ఖర్చుకి వెనకాడకుండా కూలీలో భారీ కాస్టింగ్ ని ఎంపిక చేసుకుంది. సన్నివేశాలు కూడా ఎంతో రిచ్ గా ఉన్నాయని మూవీ చూసిన ప్రేక్షకులు చెప్తున్నారు. రజనీ రీసెంట్ హిట్ జైలర్ ని సన్ పిక్చర్స్ నే నిర్మించింది.   
రజనీకాంత్(Rajinikanth)నాగార్జున(Nagarjuna),లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'కూలీ'(Coolie)ఈ రోజు వరల్డ్ వైడ్ గా  ఉన్న థియేటర్స్ లో అడుగుపెట్టింది. ఎర్లీ మార్నింగ్ నుంచే  షోస్ ప్రదర్శించడంతో అభిమానులు, మూవీ లవర్స్ తో థియేటర్స్ దగ్గర సందడి వాతావరణం నెలకొని ఉంది. రివ్యూస్ కూడా పర్లేదనే స్థాయిలోనే వస్తున్నాయి. అభిమానులకి, తెలుగు సినిమాప్రేక్షకులకి నాగార్జునతో ఉన్న అనుబంధం ఈ నాటిది కాదు. మూడు దశాబ్దాలపై నుంచి కొనసాగుతు వస్తుంది. తెలుగు సినిమా అగ్ర హీరోల్లో నాగార్జున కూడా ఒకరు.   అలాంటి నాగార్జున తన కెరీర్ లోనే ఫస్ట్ టైం 'కూలీ'లో 'సైమన్'(Simon)అనే క్యారక్టర్ లో నెగిటివ్ రోల్ పోషించాడు. ఈ రోల్ నాగార్జున ఒప్పుకున్న దగ్గర్నుంచి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో సంశయించారు. ముఖ్యంగా వీరాభిమానులైతే, ప్రతి నాయకుడిగా ఎందుకు  చేయడమని సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనని వెళ్లబుచ్చారు. కానీ మొదటి నుంచి నటనే తన ప్రాణంగా భావించి, భిన్నమైన పాత్రల ద్వారా అభిమానులని, ప్రేక్షకులని అలరిస్తున్న నాగార్జున సైమన్ క్యారక్టర్ తన వద్దకు రాగానే, ఎంతో ప్రెస్టేజియస్ట్ గా తీసుకొని చేసాడు. చెయ్యడమే కాదు, పాన్ ఇండియా లెవల్లో తన నటనతో మెస్మరైజ్ చేసాడు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి సరికొత్త స్టైలిస్ట్ ప్రతి నాయకుడు దొరికాడని కూడా సినీ విశ్లేషకులు చెప్తున్నారు.  ఇక మూవీ చూసిన అనంతరం చాలా మంది ప్రేక్షకులు మాట్లాడుతు సైమన్ గా నాగార్జున నటన చాలా బాగుంది. ముఖ్యంగా యాక్షన్, డ్రెస్ స్టైల్ సరికొత్తగా ఉంది. హీరో నాగార్జున కనపడలేదు. ఒక కొత్త నాగార్జున వచ్చి చేసినట్టుగా ఉందని చెప్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు కూడా ఈ విషయంలో నాగార్జునని  మెచ్చుకుంటు తెలుగు వాడి సత్తా తమిళనాట చూ పించాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.    
తన అభిమాని 'రేణుకస్వామి'(Renuka Swami)ని హత్య చేసిన సంఘటనలో, ప్రముఖ కన్నడ నటుడు 'దర్శన్'(Darshan)గత ఏడాది జూన్ 11 న అరెస్టయ్యి, దాదాపు ఏడు నెలల పాటు జైలులో ఉన్నాడు. ఆ తర్వాత వైద్యపరమైన కారణాలు చూపించి హైకోర్ట్ లో బెయిల్ కి అప్పీల్ చేసాడు. డిసెంబర్ 13 న కర్ణాటక హైకోర్టు(Karnataka High court)బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యాడు.  దీంతో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తు కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలు చేసింది. సదరు పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తన తీర్పుని వెల్లడించింది. సదరు తీర్పులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు ఉత్తర్వులలో తీవ్రమైన లోపా బియష్టత  ఉంది. హైకోర్టు విచారణ దశకు ముందు జరిగిన వాటినే విచారించింది. దర్శన్ ని  విడుదల చెయ్యడానికి సరైన కారణం లేదు. ఏక పక్షంగా తీర్పుని వెల్లడించింది. విచారణకి కోర్టు మాత్రమే సరైన వేదిక, బలమైన ఆరోపణలు, ఫోరెన్సిక్ ఆధారాలు బెయిల్ రద్దుకి బలాన్ని ఇస్తున్నాయి. ఇంత తీవ్రమైన కేసులోపూర్తి విచారణ చెయ్యకుండా బెయిల్ ఇవ్వకూడదని సుప్రీం కోర్ట్ బెయిల్ రద్దు చేసింది.     
సినిమా పేరు: కూలీ  తారాగణం: రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్, పూజాహెగ్డే, సౌబిన్ షాహిర్, సత్య రాజ్ తదితరులు   సంగీతం: అనిరుద్ రవిచందర్   ఎడిటర్:  ఫిలోమిన్ రాజు  సినిమాటోగ్రాఫర్:  గిరీష్ గంగాధరన్ బ్యానర్: సన్ పిక్చర్స్  నిర్మాత: కళానిధి మారన్  రచన, దర్శకత్వం: లోకేష్ కనగరాజ్  విడుదల తేదీ: అగస్ట్ 14 , 2025  అభిమానులతో పాటు పాన్ ఇండియా సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'కూలీ' ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టింది. ప్రచార చిత్రాల్లో రజనీ, లోకేష్ కనగరాజ్ మానియా కనిపించడం, కింగ్ నాగార్జున ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ లో కనిపించడంతో కూలీ 'రిజల్ట్' పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ 'దేవ' ( రజినీకాంత్) ఒక అనాధ.స్టూడెంట్స్ తో పాటు, పేదవాళ్ళకి తక్కువ ధరకే నివాసం ఉండటానికి, 'దేవ మెన్షన్' అనే హాస్టల్ లాంటి దాన్ని నిర్వహిస్తు ఉంటాడు. సైమన్(నాగార్జున).. పోర్ట్ లో వంశపారంపర వ్యాపారంగా వస్తున్నకోట్ల ఖరీదు చేసే విదేశీ వాచీలతో పాటు మరికొన్ని విలువైన వస్తువులని స్మగుల్ద్ చేస్తుంటాడు. కానీ ఆ వ్యాపారం చాటున ప్రపంచానికి తెలియని మరో క్రూరమైన పని చేస్తుంటాడు.దయాళ్( సోబిన్) సహాయంతో బిజినెస్ కి అడ్డోచే వాళ్ళని, పోలీస్ ఇన్ఫార్మర్ లని  క్రూరంగా చంపుతుంటారు. ఈ క్రమంలో 'ఎలక్ట్రిక్ క్రిమీటర్' తయారు చేసే రాజశేఖర్( సత్యరాజ్) సహాయం కోరతారు. తన పెద్ద కూతురు ప్రీతి(శృతి హాసన్) తో కలిసి డబ్బుల కోసం సైమన్ చెప్పిన పని చేస్తుంటాడు. కానీ రాజశేఖర్ ని గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తారు.   సైమన్ కి  దయాల్ పోలీస్ ఇన్ ఫార్మర్ అని తెలియడంతో సైమన్ చంపుతాడు. కానీ దయాల్ ప్రాణాలతో బయటపడతాడు. దేవ పోర్ట్ కి ఎందుకు వచ్చాడు? రాజశేఖర్ ని ఎవరు చంపారు? దయాల్ నిజంగానే పోలీస్ ఇన్ ఫార్మరేనా? 'ఎలక్ట్రిక్ క్రిమీటర్' అనే ఏంటి? స్మగుల్ద్ వస్తువుల వెనుక సైమన్ చేస్తున్న క్రూరమైన పని ఏంటి? సైమన్ కి దేవకి శత్రుత్వం ఉందా? దేవ నిజంగానే ఒక అనాధనా?  దేవ గతం ఏంటి? 'కూలి'లో ఎవరి క్యారక్టర్ ఎలా ముగిసిందనేదే ఈ చిత్ర కథ ఎనాలసిస్  లోకేష్ కనగరాజ్ తన మేకింగ్ స్టైల్ ప్రకారం, బలమైన సీన్ ని తగ్గించడం, బలహీనమైన సీన్ ని పెంచడంలో మరోసారి సక్సెస్ అయ్యాడు. మూవీ మొత్తంపై రజనీకాంత్, నాగార్జున, సోబిన్ ల నటన  కథనాన్ని బీట్ చేసింది. ఈ ముగ్గురి నటన మాత్రమే కూలికి ప్లస్ పాయింట్. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే దేవ ఇంట్రడక్షన్ దగ్గర్నుంచి, తన స్నేహితుడు కోసం పోర్ట్ కి రావడం, ఆ తర్వాత పోర్ట్ లో వచ్చే చాలా సీన్స్ చూసాక, రొటీన్ కథ అని తెలిసిపోతుంది. సైమన్  క్యారక్టర్ ని ప్రెజెంట్ చేసిన విధానం బాగున్నా, ఎక్కువ సన్నివేశాలని సృష్టించలేకపోయారు. ఎక్కువగా దయాల్ చుట్టే కథనం నడిచింది. ప్రీతి లైఫ్ లో ఒక సస్పెన్సు ఉందని చెప్పి ఉండాల్సింది. కొన్ని సన్నివేశాల్లో దేవతో సైమన్ మాట్లాడుతు నిన్ను ఎక్కడో చూసినట్టు ఉందని అంటాడు. సైమన్  ఎక్కడ చూశాడో అనే విషయాన్నీ దేవ చివరలో చెప్తాడు. అలా కాకుండా దేవ గురించి కొన్ని దేశాలకి చెందిన పోలీసులు, డాన్  వెతుకుతునట్టుగా, ఒక దేశంలో దేవ గురించి పాఠ్య పుస్తకాల్లో చదుతున్నట్టుగా సినిమా ప్రారంభంలోనే కొన్ని సీన్స్ ని క్రియేట్ చేసుండాల్సింది. దేవ చివర్లో సైమన్ తో చెప్పే  కథకి, అలాంటి సీన్స్ అవసరం కూడా. సెకండ్ హాఫ్ లో  కథకి  ముఖ్యమైన 'కీ' పాయింట్ ని చెప్పి, గ్యాంగ్ స్టార్ డ్రామాని హై లెవల్ కి తీసుకెళ్లారు. ఈ ప్రాసెస్ లో ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్దం చెప్తున్నారో తెలియదు. దర్శకుడు మాత్రం తనకి కావాల్సిన విధంగా సీన్స్ ని అల్లుకున్నాడు. మనం ముందుగానే ఊహిస్తాం కాబట్టి క్లై మాక్స్ లో వచ్చిన 'దహి'పెద్దగా గూస్ బంప్స్ తెప్పించలేకపోయాడు. అలా కాకుండా మధ్యలోనే వచ్చి నా లాంటి డాన్స్ క్లైమాక్స్ లో రావడం రొటీన్, అందుకే మధ్యలోనే వచ్చానని సదరు క్యారక్టర్ ద్వారా చెప్పించినా బాగుండేదేమో. మనిషి డెడ్ బాడీలని సెకన్స్ లో తగలబెట్టడం చూపించారు.కాబట్టి రజనీకాంత్ నే ఆ విషయాన్నీ కనిపెట్టాల్సింది. కూలీలు మిస్ అవుతున్నారని పోర్ట్ లోకి వచ్చి, అప్పుడు రాజశేఖర్ గురించి తెలిసి, తన పోరాటాన్ని ఉధృతం చేస్తే  సినిమా రేంజ్ మారిపోయేది. పైగా దయ లక్ష్యం కూడా 'కూలి' లకి ఏం జరగకూడదనే కదా. ఆ దిశగా ఆలోచించలేకపోయారు. కొన్ని వందల మంది చనిపోయాక  హీరో వచ్చినట్లయింది. దేవ, ప్రీతి మధ్య ఉన్న సస్పెన్సు చివరలో ప్రీతి క్యారక్టర్ కి తెలియాల్సింది. నటీనటులు, సాంకేతిక నిపుణల పని తీరు   దేవ గా 'రజనీకాంత్' మరో మారు సిల్వర్ స్క్రీన్ పై తన  మ్యాజిక్ చూపించాడు. ఏడు పదుల వయసులో కూడా ఆ ఎనర్జీ చూస్తే థియేటర్స్ లో విజిల్స్ మోగుతూనే ఉన్నాయి. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ ఇలా అన్నిటిలోను, తన వన్ మ్యాన్ షో ప్రదర్శించాడు.సైమన్ గా నాగార్జున పెర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే .దేవ క్యారెక్టర్ నీ బీట్ చేసే విధంగా నాగ్ యాక్టింగ్ సాగింది. నెగిటివ్ రోల్ కి సంబంధించి సరికొత్త డైలాగ్ మాడ్యులేషన్ ని, ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి రుచి చూపించాడు. నాగ్ వల్ల కూలీ కి మరింత నిండు తనం వచ్చింది.  క్లైమాక్స్ లో దహిగా అమీర్ ఖాన్ మెరుపు లు మెరిపించాడు.ఉపేంద్ర ఫైటింగ్ సీన్ వరకే పరిమితం. మిగతా క్యారెక్టర్లలో చేసిన శృతి హాసన్, సత్యరాజ్, సోబిన్ తమదైన నటన ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి సోబిన్ ద్వారా సరికొత్త విలన్ దొరికాడు. లోకేష్ దర్శకత్వం, రివర్స్ స్క్రీన్ ప్లే వేగాన్ని పెంచిన రొటీన్ కథనాలు నడిచాయి. టేకింగ్ పరంగా ప్రతి సీన్ చాలా వేగంగా పరిగెత్తింది. పూజాహెగ్డే స్పెషల్ సాంగ్ పర్లేదు. అనిరుద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫొటోగ్రఫీ, నిర్మాణ విలువలు అతి పెద్ద ఎస్సెట్. ఫైనల్ గా చెప్పాలంటే కథనాలు అంతగా మెప్పించకపోయినా, లోకేష్ దర్శకత్వం, రజనీ, నాగార్జున పెర్ ఫార్మెన్స్, నిర్మాణ విలువలు బాగున్నాయి.ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బెటర్.  రేటింగ్ 2 .75 / 5                                                                                                                                                                                                                                                              అరుణాచలం   
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
  మన దేశ గుర్తింపు భారతదేశ జాతీయ జెండా. దీనికి మూడు రంగులు ఉన్నాయి కాబట్టి దీనిని త్రివర్ణ పతాకం అని పిలుస్తారు. ఇది దేశ ఐక్యత, గర్వం,  త్యాగానికి చిహ్నం. స్వాతంత్ర్య దినోత్సవం వంటి జాతీయ పండుగలు,  కార్యక్రమాలలో జెండా ఎగురవేయడం జరుగుతుంది. ఆగస్టు 15, జనవరి26 వంటి  ప్రత్యేక సందర్భాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేటప్పుడు, "భారత జెండా కోడ్"లో నిర్దేశించబడిన కొన్ని నియమాలను పాటించడం అవసరం. జెండా  ఎగురవేయడానికి ప్రభుత్వం  పాటించే  నియమాలను తెలుసుకుంటే.. భారత జాతీయ జెండా ఎలా ఉంటుంది? భారత జాతీయ జెండా మూడు రంగులలో ఉంటుంది. త్రివర్ణ పతాకం పైభాగంలో ముదురు కాషాయ రంగు ఉంటుంది, ఇది ధైర్యం,  త్యాగానికి చిహ్నం. మధ్యలో ఉన్న తెలుపు రంగు శాంతి,  సత్యానికి చిహ్నం.  దిగువన ఉన్న ఆకుపచ్చ రంగు విశ్వాసం,  సస్యశ్యామలతకు  చిహ్నం. మధ్యలో 24 చువ్వలు కలిగిన ముదురు నీలం అశోక చక్రం ఉంటుంది. జెండా ఎగురవేయడానికి నియమాలు, నిబంధనలు.. జెండాను ఎగురవేసేటప్పుడు సగం ఎత్తులో ఎగురవేయకూడదు. ఆదేశాలు లేకుండా త్రివర్ణ పతాకాన్ని సగం ఎత్తులో ఎగురవేయకూడదు. జాతీయ జెండాలో ఎటువంటి చిత్రం, పెయింటింగ్ లేదా ఛాయాచిత్రం ఉపయోగించకూడదు. చెరిగిన,  మురికిగా ఉన్న జెండాలను ఎగురవేయకూడదు. జెండాను ఏ విధంగానూ తారుమారు చేయకూడదు. ఎవరికైనా సెల్యూట్ చేయడానికి త్రివర్ణ పతాకాన్ని అవనతం చేయకూడదు. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో మాత్రమే జెండా ఎగురవేయాలి. సూర్యాస్తమయం తర్వాత త్రివర్ణ పతాకాన్ని దించాలి. త్రివర్ణ పతాకాన్ని ఎల్లప్పుడూ స్పష్టంగా కనిపించే ప్రదేశంలో ఎగురవేయాలి. జెండా ఎగురవేసే సమయం స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఉదయం 8:30 గంటలకు ప్రధానమంత్రి ఎర్రకోట వద్ద జెండాను ఎగురవేస్తారు. సాధారణ పౌరులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయవచ్చు. జెండా కోడ్‌ను ఎందుకు పాటించాలి? జెండాను గౌరవించడం దేశ గౌరవానికి చిహ్నం. నియమాలను పాటించడం ద్వారా మన జాతీయ జెండా గౌరవాన్ని కాపాడుకుంటాము. జెండా ఎగురవేయడం అంటే ఏమిటి? ప్రతి సంవత్సరం ఆగస్టు 15న జెండా ఎగురవేయడం జరుగుతుంది. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, బ్రిటిష్ పాలకుల జెండాను తొలగించి, త్రివర్ణ పతాకాన్ని కింది నుండి పైకి లాగి ఎగురవేశారు. దీనిని జెండా ఎగురవేయడం అంటారు. ప్రతి సంవత్సరం దేశ ప్రధానమంత్రి ఎర్రకోట ప్రాకారాల నుండి జెండాను ఎగురవేస్తారు. దీనిలో జెండాను తాడు సహాయంతో కింది నుండి పైకి లాగుతారు. జెండా ఎగురవేయడం అనేది కొత్త దేశం యొక్క ఆవిర్భావానికి చిహ్నం. జెండా ఎగురవేయడంలో రెండవ పద్దతి.. ఆగస్టు 15న జెండా ఎగురవేస్తే, జనవరి 26న అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. ఈ రోజున జెండా ఇప్పటికే కట్టబడి ఉంటుంది. జనవరి 26న, రాష్ట్రపతి రాజ్‌పథ్‌పై జెండాను ఎగురవేస్తారు. ఈ రెండింటి మధ్య తేడాలు చాలామందికి తెలియవు.                                           *రూపశ్రీ.
భారతదేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం ను జరుపుకుంటుంది . 2025లో ఇది శుక్రవారం నాడు వస్తుంది.  ఆగస్టు 15, 1947న 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వలస పాలన నుండి భారతదేశం విముక్తి పొందినందుకు గుర్తుగా స్వాతంత్ర్యదినోత్సవంను  జరుపుకుంటారు.  స్వాతంత్ర్యదినోత్సవం అనేది దేశమంతా కలిసి జరుపుకునే పండుగ. భారతీయులు ఈ రోజును చాలా  ఉత్సాహంగా జరుపుకుంటారు, విద్యాసంస్థలు, కార్యాలయాలు,  ప్రభుత్వ సంస్థలు జెండా ఎగురవేయడం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం మొదలైనవి చాలా గొప్పగా చేస్తాయి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 2025 78వ స్వాతంత్ర్య దినోత్సవమా లేక 79వ స్వాతంత్ర్య దినోత్సవమా అనే దానిపై గందరగోళం ఉంది. ముఖ్యంగా పాఠశాలలు,  విద్యాసంస్థలు, వివిధ కార్యాలయాలలో ఇది చాలా గందరగోళం ఏర్పరుస్తుంది.  ముఖ్యంగా ఉపన్యాసాలు,  వక్తృత్వ పోటీలలో ఈ అంశాన్ని ప్రస్తావించే విషయంలో చాలా అయోమయానికి గురవుతూ ఉంటారు. దీనికి చెక్ పెట్టేందుకు.. అలాగే ప్రతి ఏడాది స్వాతంత్ర్యదినోత్సవం నాడు దేశ ప్రభుత్వం ఒక థీమ్ ప్రకటించి దాని లక్ష్యసాధన దిశగా అడుగులు వేయడం జరుగుతుంది. ఈ ఏడాది థీమ్ ఏంటనేది కూడా తెలుసుకుంటే.. చాలా మంది 1947 (భారతదేశం బ్రిటిష్ వలసవాదుల నుండి స్వాతంత్ర్యం పొందిన సంవత్సరం) ను 2025 నుండి తీసివేస్తారు. దీని వల్ల  78 వస్తుంది. ఈ కారణంగా గందరగోళం తలెత్తుతుంది. వారు మొదటి వేడుకను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల ఈ తప్పు జరుగుతుంది. కాబట్టి సరైన మార్గం ఆగస్టు 15, 1947 - భారతదేశం స్వాతంత్ర్యం పొందిన రోజు - మొదటి స్వాతంత్ర్య దినోత్సవంగా లెక్కించడం. కాబట్టి, 2025 భారతదేశ స్వాతంత్ర్య వేడుక 79వ సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భారత ప్రభుత్వం ఇంకా అధికారిక థీమ్ ను ప్రకటించలేదు. ప్రతి సంవత్సరం, ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ థీమ్ ను  ఐక్యత, దేశభక్తి, సామాజిక పురోగతి,  భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుల సహకారాలపై కేంద్రీకరిస్తుంది. ఈ సంవత్సరం థీమ్ జాతీయ అభివృద్ధి,  సమిష్టి బాధ్యతపై ప్రాధాన్యతనిస్తూ ఇలాంటి విలువలను అనుసరిస్తుందని భావిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశ ప్రజలకు మన స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను,  వారి విలువలను నిలబెట్టుకోవడాన్ని గుర్తుచేస్తాయి కాబట్టి అవి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ప్రతి సంవత్సరం భారతదేశం అంతటా వేడుకలు జరుపుకుంటారు, రాష్ట్ర రాజధానులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు,  సంఘాలు జెండా ఎగురవేయడం,  కవాతులు,  సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహిస్తాయి. ప్రధానమంత్రికి సాయుధ దళాలు,  ఢిల్లీ పోలీసులు గౌరవ వందనం సమర్పించడంతో అధికారిక స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జాతీయ గీతం,  21 తుపాకీల వందనంతో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు ఎర్రకోటపై పూల వర్షం కురిపిస్తాయి.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేస్తారు.                                 *రూపశ్రీ.
  నేటి డిజిటల్ యుగంలో పిల్లలను మొబైల్ ఫోన్‌లకు దూరంగా ఉంచడం ప్రతి తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారింది. ఆటలు, యూట్యూబ్, సోషల్ మీడియా, ఇవన్నీ పిల్లలను ఎంతగా ఆకర్షిస్తాయంటే వారు బయటి ప్రపంచం నుండి దూరమైపోతారు. ఇది వారి చదువులను ప్రభావితం చేయడమే కాకుండా  కళ్ళకు కూడా చాలా ప్రమాదం. మరీ ముఖ్యంగా ఇలా ఫోన్ కు బానిస అయిపోవడం అనేది పిల్లల సామాజిక అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుంది. దీని వల్ల జరుగుతున్న నష్టాలేంటి? ఫోన్ నుండి పిల్లలను దూరం ఉంచడం ఎలా? తెలుసుకుంటే.. నష్టాలు.. ఫోన్ చేతిలో ఉంటే చాలు.. పిల్లలు బయటకు వెళ్లి ఆడుకోవడానికి ఇష్టపడరు. బదులుగా వారు ఎక్కువ సమయం మొబైల్‌లోనే గడుపుతారు. ఈ రోజుల్లో ఒక సంవత్సరం పిల్లవాడు కూడా మొబైల్‌లో వీడియోలు చూపిస్తేనే  ఆహారం తింటాడు, లేకుంటే ఏడుస్తూనే ఉంటాడు. మరోవైపు, 14 ఏళ్ల టీనేజర్ బాలుడు కూడా పాఠశాల నుండి వచ్చిన తర్వాత మొబైల్‌తో బిజీగా ఉంటాడు. ఫోన్ లో గేమ్స్.. ఆటలు,  యూట్యూబ్‌లో గంటల తరబడి గడుపుతాడు.  మొబైల్ ఫోన్ వాడటం వల్ల వారి సామాజిక, శారీరక,  మానసిక అభివృద్ధిలో ఆటంకం ఏర్పడుతుంది. ఇది ఆందోళన చెందాల్సిన విషయమే అయినా..  కొన్ని చిన్న మార్పులు,  స్మార్ట్ ట్రిక్స్‌తో పిల్లలు మొబైల్‌కు బానిసల్లా మారడాన్ని  చాలా వరకు తగ్గించవచ్చు. ఇందుకోసం కింది టిప్స్ పాటించవచ్చు. స్క్రీన్ టైమ్ ఫిక్స్ చేయాలి.. మొబైల్ వ్యసనాన్ని తగ్గించడానికి, పిల్లల స్క్రీన్ టైమ్ కోసం ఒక నియమాన్ని రూపొందించాలి.  ప్రతిరోజూ మొబైల్ వాడకానికి ఒక సమయాన్ని ఫిక్స్ చేయాలి. తద్వారా పిల్లవాడు రోజంతా మొబైల్ వాడకుండా ఆ సమయానికి మాత్రమే దాన్ని ఉపయోగిస్తాడు. ఇది క్రమంగా  మొబైల్ వ్యసనం నుండి బయటపడేలా చేస్తుంది. యాక్టివిటీస్.. పెయింటింగ్, కథలు, బయటకు వెళ్లి ఆడుకోవడం, ఆర్ట్స్,క్రాప్ట్స్ ద్వారా పిల్లల దృష్టిని మొబైల్ ఫోన్ల నుండి మళ్లించవచ్చు. వారి మొబైల్ వినియోగాన్ని తగ్గించడానికి వారిని ఇంటరాక్టివ్ కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. కుటుంబం.. పిల్లలలో ఉన్న మొబైల్ వ్యసనాన్ని మాన్పించడానికి పిల్లలతో ఆడుకోవాలి. వారితో మాట్లాడాలి, మొబైల్ కంటే కుటుంబంతో ఎక్కువ ఆనందం ఉందని వారికి అనిపించేలా చేయాలి. ఒక పిల్లవాడు బోర్ కొట్టినప్పుడు లేదా ఒంటరిగా అనిపించినప్పుడు, అతను మొబైల్ వాడటం ఒక వ్యసనంగా మారుతుంది. కానీ అతను తన పరిసరాలతో లేదా కుటుంబంతో ఆనందించడం ప్రారంభించినప్పుడు మొబైల్‌ను మరచిపోయి కుటుంబంతో సమయం గడుపుతాడు.  ఎంపిక.. పిల్లలు వినోదం కోసం లేదా సమయం గడపడానికి మొబైల్‌ను ఉపయోగిస్తారు. ఈ కారణాన్ని అర్థం చేసుకుని వారికి మొబైల్‌కు ఇతర ప్రత్యామ్నాయాలను అందించాలి. ఉదాహరణకు.. పజిల్స్, బోర్డ్ గేమ్‌లు, పుస్తకాలు,  పిల్లల కోసం సంగీతం వంటి ఎంపికలను ఉండేలా చూడాలి. ఇది పిల్లలలో ఉత్సుకతను రేకెత్తిస్తుంది,  మొబైల్ వ్యసనాన్ని తగ్గిస్తుంది. రోల్ మోడల్స్.. పిల్లలు తాము చూసేది నేర్చుకుంటారు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు తల్లిదండ్రులు  రోజంతా మొబైల్‌లో గడుపుతూ ఉంటే  పిల్లలు కూడా అలాగే చేస్తారు. కాబట్టి  మొబైల్ వాడకాన్ని  పరిమితం చేసుకోవాలి. తల్లిదండ్రుల దినచర్య, తల్లిదండ్రులు చేసే పనుల దృష్ట్యా పిల్లలు కూడా చక్కని దినచర్య అలవర్చుకుంటారు.  పిల్లలకు తల్లిదండ్రులే మంచి రోల్ మోడల్స్ కావాలి.                                       *రూపశ్రీ.
  వయసు పెరిగే కొద్దీ  ఎముకలు పెళుసుగా,  బలహీనంగా మారతాయి. అయితే అనుసరించే జీవనశైలి,  అలవాట్లు బలమైన ఎముకలకు,  శరీరం  సాఫీగా కదలడానికి దోహదం చేస్తాయి. చాలా మంది మోకాళ్ సమస్య వచ్చేవరకు మోకాళ్ల గురించి అస్సలు ఆలోచించరు. కానీ శరీర బరువును మోసేవి కాళ్లు. ఆ భారం ఎక్కువగా మోకాళ్ల మీద ఉంటుంది. అందుకే ఒక వయసు దాటగానే మోకాళ్లు నొప్పులు రావడం,  లేక ఇతర మోకాళ్ల సంబంధ సమస్యలు రావడం జరుగుతుంది.  అయితే మోకాళ్లను సంవత్సరాల తరబడి ఎలాంటి సమస్యలు చట్టు ముట్టకుండా ఉండేందుకు కొన్ని టిప్స్ పాటించాలి. ఇవన్నీ లైప్ స్టైల్ అలవాట్లలో భాగమే.. అవేంటో తెలుసుకుంటే.. బరువు.. కొంచెం అదనపు బరువు ఉన్నా అది  మోకాళ్లపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రతి అడుగుతో  శరీర బరువుకు నాలుగు రెట్లు ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం వల్ల ఈ ఒత్తిడి తగ్గుతుంది.  దీర్ఘకాలిక గాయం అయ్యే అవకాశాలు తగ్గుతాయి. మూవ్ మెంట్.. తరచుగా కదలికలు చేయడం వల్ల  మోకాళ్లను సరళంగా ఉంచుకోవచ్చు. అంతేకాదు  కీళ్ళు కూడా  మంచి స్థితిలో ఉంటాయి. నడక, ఈత, సైక్లింగ్ లేదా యోగా వంటి తక్కువ ప్రభావ వ్యాయామాలు మోకాళ్లకు సున్నితంగా  ఉంటాయి. మోకాళ్ల మీద ఒత్తిడి ఉండదు.  కానీ మోకాళ్లను  బలంగా మారుస్తాయి. కండరాల సపోర్ట్.. దృఢమైన కాళ్ళ కండరాలు, ముఖ్యంగా  హామ్ స్ట్రింగ్స్,  క్వాడ్స్,  మోకాళ్ల నుండి ఒత్తిడిని తగ్గిస్తాయి.  వ్యాయామ నియమావళిలో బాడీ వెయిట్ స్క్వాట్‌లు, లెగ్ రైజ్‌లను చేర్చడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.  ఇవన్నీ చేసేటప్పుడు గాయం కాకుండ ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలి. మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలు బిగుతుగా ఉండటం వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయి. ప్రతిరోజూ స్ట్రెచింగ్స్, ముఖ్యంగా  తొడలు, పిక్కలు,  తుంటిని వదులుగా,  స్ట్రయిట్ గా   ఉంచుతుంది. వ్యాయామం తర్వాత లేదా  రోజు చివరిలో వేగవంతమైన స్ట్రెచింగ్ ను  డైలీ రొటీన్ లో భాగం చేసుకోవాలి. షూస్..  నడవడం లేదా వ్యాయామం చేయడం వంటివి చేసేటప్పుడు  మంచి ఆర్చ్ సపోర్ట్,  కుషనింగ్ ఉన్న బూట్లు ధరించాలి. బాగు్నాయి కదా అని పాత షూస్ ను వర్కౌట్స్ కు సరిపడకపోయినా వేసుకుంటే ఆ తరువాత నష్టాలు ఎదురుచూడాల్సి రావచ్చు. మరొక విషయం ఏమిటంటే.. ఎక్కువసేపు హీల్స్ ధరించకూడదు. ఫోజ్ మార్చుకోవాలి.. ఫోజ్ ను భంగిమ అని కూడా  అంటారు.  సరైన భంగిమ కాకుండా వ్యాయామం చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టు ఫోజ్ లు పెడుతుంటే అది   వీపును గాయపరచడమే కాకుండా,  మోకాలి అమరికను కూడా దెబ్బతీస్తుంది. నిటారుగా నిలబడాలి, నిటారుగా కూర్చోవాలి. అలాగే వ్యాయామం అయినా వాకింగ్ అయినా, యోగా అయినా వాటికి తగిన విధంగా శరీరాన్ని బ్యాలన్స్ చేయాలి. అలాగే  బరువులు ఎత్తేటప్పుడు కూడా ఫోజ్ చూసుకోవాలి.                        *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
  భారతీయులు  ఆహార ప్రియులు. భారతదేశంలో ఉండే అన్ని వంటకాలు, అన్ని పదార్థాలు మరెక్కడా లభించవని కూడా చెప్పవచ్చు. అయితే భారతదేశంలో ఎక్కువ భాగం ఆహారం నూనె వినియోగం తోనే జరుగుతుంది. నూనె లేకుండా చాలా వంటకాలను అస్సలు తయారు చేయలేరు కూడా.  నూనె భారతీయ  వంటగదిలో ఒక ముఖ్యమైన భాగం. కానీ నూనెను ఎక్కువగా ఉపయోగిస్తే అది ఆరోగ్యానికి విషంగా మారుతుంది. ఆహారంలో ఎక్కువ నూనెను ఉపయోగిస్తే అది ఊబకాయం, గుండె జబ్బులు,  అనేక ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. నూనెలో ఉండే అధిక కేలరీలు శరీరానికి  అనేక విధాలుగా హాని కలిగిస్తాయి. అందుకే ఇప్పుడు  నూనె లేని ఆహారం అనే ట్రెండ్‌ని  చాలామంది అనుసరిస్తున్నారు. ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.  అసలు నో ఆయిల్ డైట్ అంటే ఏమిటి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి తెలుసుకుంటే.. నూనె లేని ఆహారం అంటే.. నో ఆయిల్ డైట్‌లో ఆహారంలో  నూనె పూర్తిగా తొలగించబడుతుంది. బదులుగా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, డ్రై ఫ్రూట్స్,  విత్తనాలు వంటి తృణధాన్యాలు  సహజమైనవిగా  తింటారు. వీటిలో ఇప్పటికే కొంత సహజ కొవ్వు ఉంటుంది. అది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. నూనె లేని ఆహారం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఆహారం నుండి నూనెను పూర్తిగా తొలగించినప్పుడు బరువు తగ్గడం సులభం అవుతుంది. ఉడికించిన పప్పులు, కాల్చిన కూరగాయలు,  నూనె లేకుండా చేసిన వాటిని ఆహారంలో చేర్చడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుంది. శుద్ధి చేసిన నూనెలో ఒమేగా-6 కొవ్వులు అధికంగా ఉంటాయి.  దీన్ని  ఆహారం నుండి తొలగిస్తే, శరీరంలో మంట తగ్గుతుంది,  కొలెస్ట్రాల్,  రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నూనె లేని ఆహారం తీసుకోవడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఇది కడుపు, కాలేయం,  క్లోమంపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది గ్యాస్, ఆమ్లతత్వం,  అపానవాయువు వంటి సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది. ఆహారంలో నూనె వాడకపోవడం ద్వారా ముఖంపై మొటిమలు,  మచ్చలు తగ్గుతాయి. దీనితో పాటు శరీరం కూడా డీటాక్స్ అవుతుంది. ఇది ముఖంపై సహజమైన మెరుపును తెస్తుంది. నూనె పదార్థాలు తినకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.  ఇది తరచుగా ఆకలి, మానసిక స్థితిలో మార్పులు,  అతిగా తినే అలవాటును తగ్గిస్తుంది.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...