LATEST NEWS
ఏపీలో  స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్న రాజకీయ ఘర్షణలు, ఉద్రిక్త వాతావరణం హాట్ టాపిక్ గా మారాయి.  ముఖ్యంగా రాయలసీమ, పల్నాడు వంటి ప్రాంతాలలో  పార్టీల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచే నామినేషన్ల దాఖలు, అభ్యర్థుల బెదిరింపులు, భౌతిక దాడుల వంటి సంఘటనలు చోటుచేసుకోవడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రశ్నార్ధకంగా మార్చాయి. ఒకవైపు అధికార కూటమి, మరోవైపు వైసీపీ ఈ హింసాత్మక ఘటనలపై పరస్పర విమర్శలతో మాటల యుద్ధానికి దిగాయి.  ఈ పరిణామాల నేపథ్యంలో, ఎన్నికల సమయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని దుయ్యబడుతోంది. అయితే అధికార  యంత్రాంగం మాత్రం శాంతిభద్రతలను కాపాడటానికే తాము కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది.   వైసీపీ ఓటమి భయంతోనే  ఉద్దేశపూర్వకంగా హింసను ప్రేరేపిస్తున్నదనీ, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే లక్ష్యంగా కుట్రలు పన్నుతున్నదనీ అధికార తెలుగుదేశం కూటమి విమర్శిస్తున్నది.   నామినేషన్ పత్రాలను చించివేయడం, ఎన్నికల అధికారులపై దాడులకు పాల్పడడం వంటి ఘటనలు ప్రజాస్వామ్య వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ధ్వజమెత్తుతోంది.  రాయలసీమ వంటి ప్రాంతాలలో ఎన్నికల హింసకు, అక్కడ వేళ్లూనుకున్న ఫ్యాక్షన్ రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. పార్టీలకతీతంగా కొన్ని ప్రాంతాలలో సాగే ఈ ఆధిపత్య పోరు, ఎన్నికల సమయానికి మరింత హింసాత్మకంగా మారడం కద్దు. ఇప్పుడూ అదే జరుగుతోంది. స్థానిక సంస్థల మీద పట్టు సాధించడం ద్వారా ప్రాంతీయ ఆర్థిక వనరులు, కాంట్రాక్టులు, స్థానిక భూభాగాలపై ఆధిపత్యం దక్కుతుందన్న ఉద్దేశమే ఈ ఘర్షణలకు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే నామినేషన్ల కేంద్రాల వద్ద పేపర్లు లాక్కోవడం, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం వంటి అసాంఘిక కార్యకలాపాలు పునరావృతమవుతున్నాయి. గ్రామాల్లో బలమైన పట్టున్న నాయకులు తమ వర్గాల ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్నికలను ఒక యుద్ధ రంగంగా మారుస్తున్నారు. ఈ తరహా రాజకీయ సంస్కృతి స్థానిక సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తోందని, సామాన్య ప్రజలు భయంతో ఓటు హక్కును వినియోగించుకోలేని దుస్థితికి దారితీస్తోందని ప్రజాస్వామ్య వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు కేవలం ఒక పార్టీకి లేదా ప్రభుత్వానికి సంబంధించినవి కావు; ఇవి మొత్తం రాష్ట్ర ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎదురవుతున్న పరీక్ష. శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసుల నిష్పక్షపాత వైఖరి, ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి వంటి అంశాలపై మరింత పకడ్బందీ విధానాలు రావాల్సిన అవసరం ఉంది. రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది. [Andhra Pradesh Local Elections, Political Clashes, Rayalaseema Factionalism, Election Related Unrest, Telugu One]
వైసీపీ అధినేత జగన్ పొలిటికల్ పాలసీలను ఏపీ సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు.  స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు, ప్రజాస్వామ్య వ్యవస్థను పక్కనబెట్టి అరాచకాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా వైసీపీ అధినేత  హిట్ అండ్ రన్ తరహా రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్  బాధ్యతారహితంగా, ఒక క్రిమినల్ లిటిగెంట్‌లా వ్యవహరిస్తున్నారన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు..  గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.   ఈ సందర్భంగా వైసీపీ హయాంలో సాగిన దౌర్జన్యాలు, అబద్ధాలు, అరాచకాలను వివరిస్తూ.. అదే హింస... అవే అబద్ధాలు... అవే అరాచకాలు  అనే శీర్షికతో రూపొందించిన  బుక్‌లెట్  చంద్రబాబు ఆవిష్కరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకమైన, పవిత్రమైన ఎన్నికల నిర్వహణ ప్రాధాన్యతను   నొక్కిచెప్పిన ఆయన దేశంలో రాజ్యాంగబద్ధంగా స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల వ్యవస్థ పనిచేస్తోందని, కానీ గత ప్రభుత్వ హయాంలో ఈ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమం,  సుపరిపాలన ద్వారా మాత్రమే నిజమైన పారదర్శక పాలన సాధ్యమవుతుందని, విపక్షాల అరాచక రాజకీయాలను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారనిఅన్నారు.   గత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను పూర్తిగా అపహాస్యం చేశారన్న చంద్రబాబు స్వయంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్  హోదాలో ఉన్న అధికారి కూడా తనకు ప్రాణభయం ఉందంటూ ఫిర్యాదు చేయాల్సిన దుస్థితి అప్పట్లో దాపురించిందని గుర్తుచేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు విపక్షాల అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా బెదిరించడం, దాడులు చేయడం, నామినేషన్ పత్రాలను చింపివేయడం వంటి అరాచకాలకు వైసీపీ శ్రేణులు పాల్పడిందని చెప్పారు.  జగన్ అరాచక పాలనను భరించలేక జనం 2024 ఎన్నికల్లో  తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి చరిత్రాత్మక మద్దతు ఇచ్చారని చంద్రబాబు చెప్పారు.   తమపై ప్రజలు ఉంచిన అపారమైన నమ్మకానికి ఆ విజయం ప్రతీక అన్న ఆయన.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తమ ప్రభుత్వం అనునిత్యం శ్రమిస్తోందని వివరించారు. ప్రజల మద్దతు కోల్పోయిన వైసీపీ ఇంకా   పాత పద్ధతుల్లోనే వ్యవహరిస్తోందన్న చందరబాబు,  అభివృద్ధిని అడ్డుకోవడం, రాష్ట్రాన్ని అస్థిరపరచడం, అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టడం వంటి పద్ధతులనే వారు ఇప్పటికీ నమ్ముకున్నారన్నారు.   స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు తమ ప్రజాస్వామ్య హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఎలాంటి హింసాత్మక ఘటనలనైనా కఠినంగా అణచివేస్తామని హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయాలని చూస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కుండబద్దలు కొట్టారు.    [CBN Say Jagan Criminal Litigant,   YCP Violence, Local Body Elections, Andhra Pradesh Politics, Telugu One]
బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో వైఎస్ షర్మిల కుమార్తె వివాహం నిర్వహించడంపై వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తం చేసిన అభ్యంతరాలు ఇప్పుడు వైఎస్ కుటుంబంలో  విభేదాలు, వైరుద్ధ్యాలు, వైషమ్యాలను మరోసారి రచ్చకెక్కించాయి. సెక్యూరిటీ, వ్యక్తిగత భద్రత, ప్రాణహాని నెపంతో బెంగళూరు నివాసాన్ని వివాహానికి ఇవ్వలేనంటూ జగన్ రాసిన లేఖపై షర్మిల కుటుంబ సభ్యులు, వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహుతులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  జగన్ లేఖకు బదులుగా ఆయనకు పలు ప్రశ్నలు, సవాళ్లతో కూడిన లేఖ రాశారు.    గత కొంత కాలంగా వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో ఆస్తుల పంపిణీ, రాజకీయ విభేదాల చుట్టూ వివాదాలు నడుస్తున్నసంగతి విదితమే ఈ క్రమంలోనే షర్మిల కుమార్తె అంజలి వివాహాన్ని బెంగళూరులోని వైఎస్ కుటుంబ నివాసంలో జరిపేందుకు సిద్ధమవ్వగా, భద్రతా కారణాలను ఉటంకిస్తూ,   జగన్  యలహంక ప్యాలెస్ ను షర్మిల కుమార్తె వివాహ వేడుకకు వేదిక కావడానికి నిరాకరించారు. ఇదు కుటుంబ పరంగా విభేదాలు మరింత పెచ్చరిల్లేందుకు దోహదం చేయడమే కాకుండా, రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారింది.  వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.  గతంలో లేని భయం ఇప్పుడేందుకని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటు బాంబులు, కత్తుల సంస్కృతితో తీవ్ర ప్రాణాభయం ఉన్నప్పటికీ, కుటుంబంలోని పిల్లల పెళ్లిళ్లను ఎప్పుడూ ఆపలేదనీ, ఘనంగా నిర్వహించారనీ గుర్తు చేశారు. అంతే కాదు.. వైఎస్ రాజశేఖరరెడ్డి శత్రువులను కూడా వివాహాది శుభకార్యాలకు ఆహ్వానించారని ఆ లేఖలో జగన్ కు  గుర్తు చేశారు.   వైఎస్ సోదరుల పిల్లలు, తోడబుట్టిన చెల్లెలు విమలమ్మ పిల్లల పెళ్లిళ్లు వైఎస్ ఇళ్లలోనే జరిగాయని ఆ లేఖలో పేర్కొన్నారు. జార్జ్ రెడ్డి, అనిల్ రెడ్డి పెళ్లి, విమలమ్మ కొడుకు యువరాజ్, కుమార్తె దివ్య పెళ్లిళ్లు, రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు రఘుదీప్ పెళ్లి, అలాగే సుధీకర్ రెడ్డి కుమార్తె విరోనికా రెడ్డి వివాహాలు వైఎస్ నివాసాల్లోనే ఘనంగా జరిగాయని  ఉదాహరించారు. వైఎస్ ఎన్నడూ జగన్ లా పెళ్లిళ్లను, కుటుంబ వేడుకలను అడ్డుపెట్టుకుని ప్రాణహాని ఉందంటూ   దాక్కోలేదని పేర్కొంటూ.. మేనకోడలి పెళ్లి వల్ల  ప్రాణహాని ఉందన్న భయం ఉంటే జగన్ ఆ పది రోజులూ బెంగళూరు ప్యాలెస్ వైపు రాకుండా వేరే  దేశానికో లేదా   ప్రాంతానికో వెళ్లిపోవచ్చునంటూ హితవు పలికారు.  యలహంక ప్యాలెస్‌లోని ఇరు భవనాలు, వాటి చుట్టూ ఉన్న కాంపౌండ్ గోడలు వేరని గూగుల్ మ్యాప్స్ ద్వారా చూసినా ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుందని, అలాంటప్పుడు భద్రతా సమస్య ఎక్కడి నుంచి వస్తుందని ఆ లేఖలో షర్మిల కుటుంబం నిలదీసింది. షర్మిలకు కాబోయే వియ్యంకులు ఇప్పటికేబెంగళూరులోని షర్మిల రెసిడెన్సీ వేదిక అంటూ ఆహ్వానపత్రాలు ముద్రించి బంధువులకు పంచిన విషయం తెలిసి కూడా జగన్ ఇలా వివాహ వేదికను వద్దనడం తమ పరువు తీయాలన్న ఉద్దేశంతోనేనని దుయ్యబట్టారు.  రెండు వైపులా కేవలం అత్యంత ముఖ్యమైన వందలాది మంది బంధువుల సమక్షంలో ప్రశాంతంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఇలాంటి కుట్రలతో అడ్డుకోవడం ఏంటంటూ నిలదీశారు. మేనకోడలి పెళ్లికి రావడం, శుభకార్యంలో పాల్గొనడం ఇష్టం లేక సెక్యూరిటీ సాకు చూపిస్తూ, ప్యాలెస్ షర్మిలది కాదు, అదేమీ ఫంక్షన్ హాలు కాదు అంటూ  అంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శించారు.   పక్కనే ఉండి కూడా మేనకోడలి పెళ్లికి హాజరు కాలేదనే చెడు ముద్ర సమాజంలో పడకుండా ఉండేందుకే, ముందుగానే ఇలాంటి వివాదాలు సృష్టించి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.  వైఎస్ కుటుంబంలో గత కొంతకాలంగా ఆస్తులు, రాజకీయాల పరంగా వస్తున్న విభేదాలు ఇప్పుడు నివాసాలు, శుభకార్యాల వేదికల వరకు పాకడం తెలుగు రాష్ట్రాల్లో  చర్చనీయాంశమైంది. మేనకోడలి పెళ్లి విషయంలోనూ అన్నా చెల్లెళ్ల  మధ్య ఈ స్థాయిలో మాటల యుద్ధం నడవడం పట్ల  వైఎస్సార్ అభిమానులు , కుటుంబ శ్రేయోభిలాషులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  [Jagan, YS Sharmila Strong Counter, Jagan, Yelahanka Palace, Life Thret, Letter, Sharmila Daughter Marriage,  YS Rajasekhara Reddy Family, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
Horror drama 418, presented by Prashanth Neel and produced by Mythri Movie Makers, has reportedly recovered its investment within two days of release. The makers, who interacted with the media for the first time following the film’s positive reception, credited director Kirtan Nadagouda’s meticulous planning and the film’s sound design for connecting with audiences. Mythri Ravi revealed that the team decided to give 418 a pan-India release after hearing the script, believing its horror elements would appeal to audiences across languages. He added that Prashanth Neel and his wife Likitha took the project personally and were actively involved in promoting it. The idea of holding a premiere in Mumbai to gather audience feedback also came from Kirtan, Ravi revealed.   Ravi said viewers have been particularly appreciative of the sound design and horror elements, while Mythri Naveen thanked audiences for giving the production house a successful outing in the horror genre. The team is hopeful that the film will continue its theatrical run and urged audiences to experience it in cinemas. Director Kirtan revealed that he developed the idea after Salaar and worked on the script for over a year. He meticulously planned every aspect, from performances and music to sound and production design, to ensure the elements came together as a complete theatrical experience. Kirtan also thanked Mythri Movie Makers for backing his vision and providing the resources needed to realise it. Chaitra Achar, Surya Raj, Charan Lakkaraju, Preeti Pagadala are part of ensemble of the film.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘ఫైల్ నంబర్ 25’ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇందులో ప్రభాస్‌ను రెబల్ సైనికుడు, వ్యూహకర్త, గూఢచారిగా పరిచయం చేశారు. అయితే ఈ గ్లింప్స్ చూసిన కొందరు నెటిజన్లు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘డెవిల్’ సినిమాను గుర్తుచేసుకుంటున్నారు. రెండు చిత్రాల్లోనూ నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇండియన్ నేషనల్ ఆర్మీ నేపథ్యంలో గూఢచర్యానికి సంబంధించిన అంశాలు ఉండటమే ఈ పోలికలకు కారణం. ‘ఫౌజీ’ గ్లింప్స్ రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బెర్లిన్‌లో మొదలవుతుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్, అడాల్ఫ్ హిట్లర్ మధ్య జరిగే సంభాషణ ద్వారా ప్రభాస్ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. బ్రిటిష్ పాలకులకు సవాల్ విసురుతూ, తన అసలు గుర్తింపును రహస్యంగా ఉంచుకుని పనిచేసే భారతీయ గూఢచారిగా ప్రభాస్ కనిపించనున్నారు. భగవద్గీత స్ఫూర్తితో రూపొందించిన రహస్య కోడ్, శత్రువుల వ్యూహాలను దెబ్బతీసే ఆపరేషన్లు వంటి అంశాలు ఈ గ్లింప్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చివర్లో ప్రభాస్ గంభీరమైన లుక్‌లో కనిపించడంతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ 2023లో విడుదలైంది. బ్రిటిష్ పాలన కాలం నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ నేపథ్యంలో రూపొందిన ఈ పీరియడ్ యాక్షన్ చిత్రంలో కళ్యాణ్ రామ్ గూఢచారి త్రివర్ణ అలియాస్ డెవిల్‌గా కనిపించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన నేపథ్యం, ఇండియన్ నేషనల్ ఆర్మీ కార్యకలాపాలు, రహస్య మిషన్లు ఈ కథలో కీలకంగా ఉంటాయి. అందుకే ‘ఫౌజీ’లోనూ ఇలాంటి అంశాలు కనిపించడంతో, కళ్యాణ్ రామ్ ఇలాంటి కథతో మూడేళ్ల క్రితమే ప్రేక్షకుల ముందుకొచ్చారని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, రెండు సినిమాల్లోనూ చారిత్రక నేపథ్యం, గూఢచర్యం వంటి అంశాలు ఉన్నంత మాత్రాన కథలు ఒకటేనని చెప్పలేం. ‘ఫౌజీ’ పూర్తి కథ ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. కేవలం గ్లింప్స్ ఆధారంగా పోలికలు పెట్టడం తొందరపాటేనని ప్రభాస్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. హను రాఘవపూడి ఈ కథను ఏ విధంగా తెరకెక్కించారు? ప్రభాస్ పాత్రలో ఎలాంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయి? అనేది సినిమా విడుదలయ్యాకే స్పష్టమవుతుంది. ఈ చిత్రం 2027 మార్చి 19న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అప్పటివరకు ‘ఫౌజీ’, ‘డెవిల్’ పోలికలపై చర్చ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.     [Prabhas Fauzi, Fauzi Glimpse, Kalyan Ram Devil, Prabhas New Movie, Hanu Raghavapudi, Subhas Chandra Bose, Indian National Army, Period Spy Thriller, Tollywood News]
Ranbir Kapoor seems to have played an unexpected role in Prabhas’ Spirit securing the Diwali 2027 release. According to a report, the Ramayana actor tipped off his Animal director Sandeep Reddy Vanga about the part 2 of Ramayana likely postponement, allowing the filmmaker to move quickly and lock the lucrative festive slot. The report claims that Ranbir informed Vanga after learning that Ramayana 2 would require additional time. Vanga subsequently decided to bring Spirit to the Diwali 2027 window, with producer Bhushan Kumar backing the move. The alleged conversation is particularly interesting given Ranbir and Vanga’s association. Meanwhile, Ramayana 2, featuring Ranbir as Lord Rama and Yash as Ravana, is reportedly being pushed to Diwali 2028. The sequel is said to require more shooting time, particularly for its ambitious war sequences. However, the makers have yet to officially confirm the reported postponement. Vanga has announced October 29, 2027, as the worldwide theatrical release date for Spirit, which stars Prabhas alongside Triptii Dimri. The film was initially scheduled for March 5, 2027, before moving to the festive window. While the reports claim postponement of Ramayana 2, makers did not confirm it yet.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో, ఈ సినిమాకు సంబంధించిన ఓ బిహైండ్ ద సీన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో రజనీకాంత్, బాలీవుడ్ నటి విద్యాబాలన్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌తో పాటు పలువురు నటీనటులు కనిపించారు. ముఖ్యంగా విద్యాబాలన్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. జ‌న‌వ‌రి 1న విద్యాబాల‌న్ పుట్టిన‌రోజు. జైల‌ర్‌2 సెట్స్‌లో ఆమె పుట్టిన‌రోజు వేడుక‌ను నిర్వ‌హించారు. ఆ స‌మ‌యంలో బిందాస్ సాంగ్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. విద్యాబాల‌న్ కేక్ క‌ట్ చేసిన అనంత‌రం రజనీకాంత్‌కు కేక్ తినిపించగా, ఆయన కూడా ఆమెకు కేక్ తినిపించారు. ఆ సమయంలో విద్యాబాలన్ సరదాగా ‘మేము కపుల్ కాదు’ అంటూ నవ్వడం వీడియోలో కనిపించింది. సినిమాలో కాంత పాత్రలో కనిపించిన విద్యాబాలన్‌తో టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజనీకాంత్ చేసే సరదా సన్నివేశాలను గుర్తుచేసుకుంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాంత పుట్టినరోజును టైగర్ సెలబ్రేట్ చేస్తున్నాడంటూ సరదాగా పోస్టులు పెడుతున్నారు. ఈ వీడియోలో మరో ఆసక్తికరమైన విషయం కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ప్రముఖ హాస్యనటుడు సంతానం ఈ వేడుక‌లో కనిపించడంతో ‘జైలర్ 2’లో ఆయన కూడా నటించారనే చర్చ మళ్లీ మొదలైంది. సంతానం ఈ సినిమా కోసం సుమారు పది రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నప్పటికీ, ఆయనకు సంబంధించిన సన్నివేశాలను తుది ఎడిటింగ్‌లో తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన నటించిన సన్నివేశాలను డిలీటెడ్ సీన్స్ రూపంలో విడుదల చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాలో చోటు దక్కని కొన్ని సన్నివేశాలు ఓటీటీ అన్‌కట్ వెర్షన్‌లో వస్తాయనే ఆశాభావాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అయితే సంతానం సన్నివేశాలతో పాటు అదనపు ఫుటేజ్‌ను ఓటీటీలో విడుదల చేస్తారనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.     [Jailer 2 BTS Video, Rajinikanth, Vidya Balan, Nelson Dilipkumar, Santhanam Deleted Scenes, Jailer 2 Viral Video, Kantha Birthday, Tamil Cinema News]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు. అక్టోబర్ 23న ఆయన 47వ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేక పోస్టర్లు, ఏఐ వీడియోలు, ఫొటోలతో శుభాకాంక్షలు తెలిపారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రభాస్‌కు విషెస్ చెప్పారు. అయితే, టాలీవుడ్‌కు చెందిన కొందరు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయకపోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ముఖ్యంగా ప్రభాస్ పుట్టినరోజుకు ఒక రోజు ముందు, అక్టోబర్ 22న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుట్టినరోజు సందర్భంగా పలువురు తెలుగు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ వంటి ప్రముఖులు అమిత్ షాకు విషెస్ చెప్పినప్పటికీ, ప్రభాస్‌కు బహిరంగంగా శుభాకాంక్షలు చెప్పలేదని కొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ప్రభాస్‌కు విషెస్ చెప్పిన కొందరు ఈసారి సోషల్ మీడియాలో స్పందించకపోవడంపై కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ అభిమానుల్లో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. తమ అభిమాన హీరో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, తోటి సినీ ప్రముఖుల నుంచి ఆశించిన స్థాయిలో శుభాకాంక్షలు రాలేదని అభిప్రాయపడుతున్నారు. అయితే, పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టు చేయనంత మాత్రాన వ్యక్తిగతంగా శుభాకాంక్షలు చెప్పలేదని లేదా వారి మధ్య సాన్నిహిత్యం లేదని నిర్ణయించలేమని మరికొందరు అంటున్నారు. మరోవైపు, ప్రభాస్‌కు ఈ ఏడాది కూడా పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. దర్శకులు మారుతి, అనిల్ రావిపూడి, నటుడు గోపీచంద్ తదితరులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో అందరూ ప్రభాస్‌ను విస్మరించారనే అభిప్రాయం సరైంది కాదు. అయినప్పటికీ, అమిత్ షాకు విషెస్ చెప్పిన కొందరు సినీ ప్రముఖులు ప్రభాస్ పుట్టినరోజున ఎందుకు స్పందించలేదనే ప్రశ్న అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై అనవసరంగా ఫ్యాన్ వార్స్‌కు దిగకుండా, సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా వ్యక్తిగత సంబంధాలపై అంచనాలు వేయకూడదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.     [Prabhas Birthday, Prabhas Fans, Tollywood Celebrities, Amit Shah Birthday Wishes, Prabhas Birthday Controversy, Chiranjeevi, Mahesh Babu, Ram Charan, Vijay Deverakonda, Telugu Cinema News]
సినిమా రిలీజ్ అంటేనే స్టేట్స్ లో ఉన్న సినీ ప్రేమికుల్లో,సినీ సర్కిల్స్ లో పండుగ వాతావరణం ఉంటుంది. మరి వెలుగు కాంతులని పంచే దీపావళికి తెలుగు సినిమా వస్తే.. ఆ ఆ ఆనంద స్థాయి యొక్క రేడియేషన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. పైగా ఈ నెల 30 నుంచే ఆ సందడి స్టార్ట్ కానుంది. విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ ల ఆదర్శ కుటుంబం 30 న నూతన నటీనటులతో కింగ్ నాగార్జున, వెంకీ కుడుముల సౌజన్యంతో    . మహేష్ ఉప్పల దర్శకత్వంలో అనీష్ రెడ్డి, అనుస్వర రాజన్ జంటగా  తెరకెక్కిన'  'ఇట్లు అర్జున కూడా  30న. విశ్వక్ సేన్  'కల్ట్'. 'కిల్లర్', మరియు 'రుద్రవనం పిఎస్' (Rudravanam PS) వంటి సినిమాలు కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అట్రాక్టివ్ కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాయో వేచి చూడాలి.    ఇక సరిగ్గా వారం తిరిగేసరికి  అత్యంత భారీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ 'రామాయణం పార్ట్ 1' నవంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ పౌరాణిక దృశ్యకావ్యంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా మరియు సన్నీ డియోల్ హనుమంతుడిగా అద్భుతమైన పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు వెర్షన్‌కి సంబంధించి ప్రముఖ నిర్మాణ సంస్థ దిల్ రాజు  గ్రాండ్‌గా విడుదల చేస్తుండటంతో టాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి నవంబర్ 6,న  అనూష్ గోరక్ దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'హటః' సిద్ధమైంది. కుష్లు మద్దాల, నమ్రిత, తనుజ పుట్టస్వామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  ఇన్ని ఆసక్తికరమైన సినిమాలతో ఈ వారం థియేటర్లు కళకళలాడటం ఖాయంగా కనిపిస్తోంది.  ఇది కూడా చదవండి: 50 ఏళ్ల వ్యక్తితో అమ్మాయి లవ్: డైరెక్ట్ గా ఓటిటిలో!       ఇక విశ్వనాధ్ అండ్ సన్స్ తో జోష్ మీద ఉన్న సూర్య 'సీన్' మూవీతో నవంబర్ 6 న, నయనతార మహాశక్తి కూడా అదే రోజు, సమ్మర్ హాలిడేస్ అనే మరో తెలుగు మూవీ. మిస్టికల్ థ్రిల్లర్  'హతః కూడా అదే రోజు విడుదల కానున్నాయి.. కుష్లు, రెహమాన్, నమ్రిత ఎం.వి, తనుజ పుట్టస్వామి ప్రధాన క్యారెక్టర్స్ పోషించిన ఈ చిత్రాన్ని అనుష్ గోరక్ తెరకెక్కించాడు. ఈ విధంగా మూవీ లవర్స్ కి ,ప్రేక్షకులకి ఎన్ని దీవాలిలు ఒకేసారి రాబోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.   [Diwali 2026 Tollywood Box Office Clash, Tollywood Diwali movies, Ramayana Part One, Hatha movie, box office clash,TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]    
టాలీవుడ్‌లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజీవ్ కనకాల తాజాగా తన భార్య, ప్రముఖ యాంకర్ సుమ కనకాల గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. సుమ చేపట్టిన ‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్స్’ సంస్థ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సంస్థ ద్వారా పండుగలు జరుపుకోలేని అనాథలు, వృద్ధులు, దివ్యాంగులకు పండుగల ఆనందాన్ని పంచుతున్న సుమ సేవలను రాజీవ్ ప్రశంసించారు. భార్య గురించి ఆయన మాట్లాడిన మాటలకు సుమ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ మాట్లాడుతూ.. సుమ ప్రయాణం సాధారణమైనది కాదని అన్నారు. వృత్తిపరమైన జీవితంతో పాటు వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంతో దృఢనిశ్చయంతో ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. ఈ సంస్థను ఐదేళ్ల క్రితం అధికారికంగా ప్రారంభించినప్పటికీ, అంతకుముందు నుంచే సుమ సేవా కార్యక్రమాలు చేస్తోందని వెల్లడించారు. తమ పెళ్లయిన రెండుమూడేళ్ల నుంచే ఆమె ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోందని, చాలామందికి గుప్తదానాలు కూడా చేసిందని గుర్తుచేసుకున్నారు. ‘ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి మేము వెనుక ఉన్నప్పటికీ, ఆమెకు పెద్దగా సపోర్ట్ చేయలేదు. నిజానికి తన చుట్టూ ఉన్నవారికి సుమే అండగా నిలిచింది’ అని రాజీవ్ అన్నారు. ఇలాంటి మంచి పనులు మరింతకాలం కొనసాగించాలని ఆకాంక్షిస్తూ, సుమ 116 ఏళ్లు జీవించాలని కోరుకుంటున్నానని భావోద్వేగంగా చెప్పారు. చివర్లో ‘లవ్ యూ’ అంటూ తన ప్రేమను వ్యక్తం చేశారు. భర్త మాటలు వింటూ ప్రేక్షకుల మధ్య కూర్చున్న సుమ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రసంగం ముగిసిన తర్వాత ఆమె వేదికపైకి వెళ్లి రాజీవ్‌ను దగ్గరుండి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే, సుమ బుల్లితెర కార్యక్రమాలు, సినిమా ఈవెంట్లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సేవా కార్యక్రమాలకు కూడా సమయం కేటాయిస్తున్నారు. పండుగల సమయంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినవారికి ఆనందాన్ని పంచాలనే ఉద్దేశంతో ‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్స్’ను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ఐదో వార్షికోత్సవ వేడుకలో రాజీవ్ చేసిన ప్రసంగం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.     [Rajeev Kanakala, Suma Kanakala, Festivals For Joys, Rajeev Kanakala Emotional Speech, Suma Social Service, Anchor Suma, Tollywood News]
  కొన్ని చిత్రాలు అంతే కాన్సెప్ట్ తోనే తమ వైపు చూసేలా చేసుకుంటాయి. అలాంటి ఒక చిత్రమే 'పారివారిక మనోరంజన్'. అంత వెరైటీ ఏముందని అనుకోకండి. 50 ఏళ్ల వ్యక్తితో ఓ యువతి లవ్‌లో పడితే... ఇదే కాన్సెప్ట్. అంటే ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ.  కారణాలు తెలియదు గాని థియేటర్స్ లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం డైరెక్ట్‌గా 'సోనీ లివ్' (Sonyliv) ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుంది. రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తారు. తాజాగా నిన్న  రిలీజ్ చేసిన టీజర్ ట్రెండ్ అవుతోంది. సినిమా టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. రంజన్ దూబే (పంకజ్ త్రిపాఠీ) అనే వ్యక్తి ఇంట్లోకి ప్రాపర్టీ మేనేజర్ అండ్ హౌస్ కీపర్‌గా వస్తుంది హెలెన్ (అదితీ రావ్ హైదరీ). ఢిల్లీ నుంచి వచ్చిన ఈ అమ్మాయి దూబేను ఎందుకు ఇష్టపడింది? ఆ తర్వాత వీరిద్దరి మధ్య లవ్ స్టోరీ ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఇది కూడా చదవండి: ఉపాసన సంచలన వ్యాఖ్యలు: ఆ ఆడవాళ్లు ఎవరు!      వరుణ్ వి. శర్మ దర్శకుడు కాగాప్రేక్షకులు కోరుకునే స్వచ్ఛమైన ప్రేమ, పరిమళించే హాస్యం, కుటుంబ బంధాల భావోద్వేగాల సమ్మేళనంతో మూవీ సాగబోతునట్టుగా తెలుస్తుంది.బ్రజేంద్ర కాల, అలీ అబ్బాస్ జాఫర్  వరుణ్ వి. శర్మ సంయుక్తంగా ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించారు.   [Parivarik Manuranjan Ott Release Date, Parivarik ManuRanjan, Pankaj Tripathi OTT movie, Aditi Rao Hydari new film, Sony LIV direct release, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ప్రతి భార్య తెలుసుకోవాల్సిన విషయం.. భర్తతో ఏం చెప్పాలి..ఏం చెప్పకూడదు.! పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే పవిత్రమైన బంధం. ఈ బంధం ప్రేమ, నమ్మకం మీద గట్టిగా నిలబడుతుంది. భార్యాభర్తల మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదని, ప్రతి విషయం ఒకరితో ఒకరు పంచుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ, భర్తతో ఏ విషయాలు పంచుకోవాలి, ఏ విషయాలు పంచుకోకూడదు అనే దానిపై కొంత విజ్ఞత పాటించడం చాలా ముఖ్యం. ప్రతి భార్య తమ కాపురాన్ని మరింత సంతోషంగా ఉంచుకోవడానికి భర్తతో ఏ విషయాలు చెప్పాలి? ఏ విషయాలు చెప్పకూడదు?  వంటి విషయాల గురించి వివరంగా తెలుసుకుంటే.. వ్యక్తిగత అభిరుచులు , స్పేస్.. పెళ్లి అయ్యాక కూడా ప్రతి ఒక్కరికీ వారి సొంత ఇష్టాలు, అలవాట్లు, అభిరుచులు ఉంటాయి. తమకు నచ్చిన దుస్తులు ధరించడం, స్నేహితులతో కొంత సమయం గడపడం లేదా వ్యక్తిగత ఆసక్తులను అనుసరించడం చాలా సాధారణమైన విషయం. వీటి కోసం ఏదో తప్పు చేస్తున్న వాళ్లలా ఫీల్ కావాల్సిన  అవసరం లేదు. భర్తతో ఈ విషయాల గురించి మనసు విప్పి మాట్లాడితే ఇద్దరూ ఒకరికొకరు వ్యక్తిగత స్వేచ్ఛను ఇచ్చుకుంటూ సంతోషంగా ఉండవచ్చు. బంధువులు లేదా స్నేహితుల రహస్యాలు.. ఎవరో తమ స్నేహితురాలూ లేదా బంధువు తమపై నమ్మకంతో కొన్ని వ్యక్తిగత విషయాలు పంచుకొని ఉండవచ్చు. అలాంటి విషయాలను అనుమతి లేకుండా ఇతరులతో, ముఖ్యంగా భర్తతో చెప్పడం సరికాదు. ఎదుటివారి వ్యక్తిగత గోప్యతను గౌరవించడం చాలా అవసరం. అయితే, ఎవరికైనా ఎలాంటిదైనా తీవ్రమైన ప్రమాదం లేదా ప్రొటెక్షన్ కు సంబంధించిన,  సహాయం కోసం అర్థించడం వంటి సమస్య ఉంటే అప్పుడు భర్తతో  మాట్లాడటంలో తప్పులేదు. పాతకాలపు జ్ఞాపకాలు లేదా సంబంధాలు.. పెళ్లికి ముందు ప్రతి ఒక్కరికీ ఒక గతం ఉంటుంది. ఆ వ్యక్తిగత గతానికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని భర్తకు పూసగుచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రస్తుత జీవితంతో ఎలాంటి సంబంధం లేని విషయాలను అనవసరంగా మాట్లాడటం వల్ల మనసుల్లో చిన్నపాటి అపార్ధాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ గతానికి సంబంధించిన విషయాలు ప్రస్తుత కాపురాన్ని, ఆరోగ్యాన్ని లేదా భద్రతను ప్రభావితం చేసేలా ఉంటే మాత్రం నిజాయితీగా స్పష్టంగా మాట్లాడుకోవడం మంచిది. కోపంలో మాటలను మనసులో పెట్టుకోకూడదు.. కొన్నిసార్లు చిన్నపాటి మనస్పర్థల వల్ల లేదా కోపం కారణంగా భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరగవచ్చు. ఆ సమయంలో ఇద్దరూ కోపంతో కొన్ని మాటలు అనడం సాధారణం. ఆ కోపపు మాటలను జీవితాంతం మనసులో ఉంచుకొని ప్రతిసారీ గుర్తుచేయడం వల్ల బంధం బలహీనపడుతుంది. ఆవేశం తగ్గాక ప్రశాంతంగా కూర్చుని అసలు సమస్య ఏమిటో మాట్లాడుకోవడం ఎప్పుడూ మంచిది. ప్రతి చిన్న ఆందోళనను వెంటనే చెప్పాలనుకోవడం.. ఏదైనా సమస్య వచ్చిన వెంటనే దాని గురించి ఆలోచించి ఒత్తిడికి గురికావాల్సిన పనిలేదు. ప్రతి మనిషికి తమ మనసులోని భావాలను అర్థం చేసుకోవడానికి కొంత సమయం అవసరం. భార్య ఏదైనా చిన్న విషయంతో ఇబ్బంది పడుతుంటే, ముందుగా తనను తాను శాంతపరచుకొని, సరైన సమయం చూసి భర్తతో ఆ విషయం గురించి మాట్లాడవచ్చు. అయితే ఏ విషయాన్నీ చాలాకాలం పాటు మనసులోనే దాచుకోవడం కూడా మంచిది కాదు, సరైన సమయంలో భర్తతో షేర్ చేసుకోవడం  వల్ల మనసు తేలికవుతుంది. సంతోషకరమైన కాపురానికి సూత్రం.. భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయం దాచడం లేదా ప్రతిదీ చెప్పాలనే ఒత్తిడి పెట్టుకోవడం రెండు పద్ధతులూ సరైనవి కావు. ఆర్థిక విషయాలు, ఆరోగ్యం, కుటుంబ నిర్ణయాలు వంటి ముఖ్యమైన విషయాల్లో నిజాయితీగా ఉండటం ఎంత అవసరమో, పర్సనల్  స్పేస్ ను, ఇతరుల ప్రైవసీని  గౌరవించడం కూడా అంతే ముఖ్యం. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి సరిహద్దులను మరొకరు గౌరవించుకుంటే ఆ బంధం ఎల్లప్పుడూ కలకాలం పదిలంగా ఉంటుంది.                                     *రూపశ్రీ.
మంచితనం మంచిదే.. కానీ అందరి ముందు దాన్ని గొప్పగా బయటపెట్టాలని చూస్తే జరిగేది ఇదే..! జీవితంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఏ విషయాలను ఎవరితో పంచుకోవాలి అనే అంశంపై ఆచార చాణక్యుడు చెప్పిన విషయాలు ఎప్పటికీ ఎంతో విలువైనవిగా నిలుస్తాయి. ఎన్ని తరాలు మారినా చాణక్యుడు చెప్పిన మాటలు అందరికీ వర్తించేలా ఉంటాయి.  మనిషి స్వభావంలో నిజాయితీ ఉండటం చాలా మంచి గుణం. కానీ, అదే నిజాయితీని , మంచితనాన్ని అందరి ముందూ అతిగా ప్రదర్శించడం    మాత్రం అది చాలా ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉందని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. నేటి ఆధునిక సమాజంలో ప్రతీ ఒక్కరినీ గుడ్డిగా నమ్మడం, మన వ్యక్తిగత విషయాలన్నింటినీ ఇతరుల ముందు ఓపెన్ గా చెప్పుకోవడం  ఎంత ప్రమాదకరమో చాణక్య నీతి స్పష్టంగా తెలియజేస్తుంది.మంచితనం మంచిదే కానీ.. నిజాయితీగా, వ్యక్తిగత విషయాలను అందరూ మంచివారే అనే అమాయకత్వంతో చెప్పుకోకూడదట.  ఒకవేళ అలా చేస్తే ఏం జరుగుతుందో చాణక్యుడు వివరంగా చెప్పాడు.  ఆ విషయాలేంటో తెలుసుకుంటే.. అందరినీ నమ్మకూడదు.. సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో నలుగురితో మంచిగా ఉండాలని కోరుకుంటారు. ఎవరికీ చెడు చేయకూడదనే భావనతో ప్రవర్తిస్తారు. అయితే, ఈ లోకంలో అందరూ ఒకే రకమైన మనస్తత్వంతో ఉండరని గుర్తుంచుకోవాలి. మనం అందరితోనూ చాలా నిష్కల్మషంగా ఉంటూ, మన మనసులోని ప్రతి మాటను, బలహీనతలను, భవిష్యత్తు ప్రణాళికలను ఇతరుల ముందు విప్పితే, కొందరు దాన్ని తమ స్వార్థం కోసం వాడుకునే ప్రమాదం ఉంది. ఎదుటి వ్యక్తి ఎలాంటివారో సరిగ్గా అంచనా వేయకుండా ప్రతి ఒక్కరినీ వెంటనే నమ్మేయడం వల్ల మానసిక ఆందోళనలు, సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత విషయాలు చెప్పొద్దు.. ఆచార చాణక్యుడి బోధనల ప్రకారం, నిజాయితీగా ఉండటం అంటే మన జీవితంలోని ప్రతి చిన్న రహస్యాన్ని అందరికీ పంచేయడం కాదు. నిజాయితీ అనేది మన వ్యక్తిగత ప్రవర్తనలో, పనుల్లో ఉండాలి తప్ప మన బలహీనతలను అందరికీ బహిర్గతం చేసేలా ఉండకూడదు. ఎవరైతే తమ వ్యక్తిగత విషయాలను, రహస్యాలను ఇతరుల ముందు సులభంగా బయటపెడతారో, వారు తరచూ ఇబ్బందుల్లో పడుతుంటారు. ముఖ్యంగా మన భవిష్యత్తు లక్ష్యాలు, ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిగత సమస్యలు వంటి చాలా కీలకమైన అంశాలను ఎవరితో పంచుకుంటున్నామో చాలా జాగ్రత్తగా గమనించాలి. పరిశీలన ముఖ్యం.. ఎవరినైనా గుడ్డిగా నమ్మే ముందు వారి ప్రవర్తనను, ఆలోధనా విధానాన్ని కొంతకాలం గమనించడం ఎప్పుడూ మేలు చేస్తుంది. అందరి ముందూ తమ మంచితనాన్ని గొప్పగా చాటుకోవాలని ప్రయత్నించే వారు తరచూ ఇతరుల మోసాలకు బలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీవితంలో ఆచరణాత్మకమైన తెలివితేవిలతో మెలగడం చాలా అవసరం. ఎవరితో ఎంత దూరం ఉండాలి, ఏ విషయాలు ఎవరితో మాట్లాడాలి అనే విచక్షణ జ్ఞానం ఉన్నప్పుడే వ్యక్తిగత జీవితం ప్రశాంతంగా, సురక్షితంగా సాగుతుంది. కాబట్టి, మంచితనాన్ని కలిగి ఉండటం ఎంత ముఖ్యమో, దాన్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలనే వివేకం ఉండటం కూడా అంతే ముఖ్యం.                                                                                                                                             *రూపశ్రీ.
సాయంత్రం వేళల్లో వేడి వేడిగా ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు స్ట్రీట్ స్టైల్ రుచులు టప్ మని గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా బయట దొరికే కరకరలాడే మసాలా వడల సువాసన చూస్తే ఎవరికైనా నోరూరిపోతుంది. అయితే అదే అద్భుతమైన రుచిని, శుభ్రతతో ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వడల తయారీ కోసం ముందుగా సరిగ్గా అరకిలో (500 గ్రాముల) శనగపప్పును ఎంచుకోవాలి. ఈ పప్పును నాలుగు గంటల పాటు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత పప్పులో చుక్క నీరు కూడా లేకుండా పూర్తిగా వడకట్టడం చాలా ముఖ్యం. పిండిలో తడి అస్సలు ఉండకూడదు, అప్పుడే వడలు చక్కగా వస్తాయి. ఇలా పూర్తిగా వడకట్టిన శనగపప్పులో నుండి ఒక గుప్పెడు పప్పును మాత్రం విడిగా పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పప్పును రోట్లో లేదా మిక్సీ జార్‌లో వేసి అసలు నీరు కలపకుండా రుబ్బుకోవాలి. అయితే ఈ పప్పును మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా, కొద్దిగా పలుకుగా, బరకగా రుబ్బుకోవాలి. ఇలా పలుకుగా రుబ్బడం వల్ల మనం తినే ప్రతి ముక్కకూ వడ అద్భుతమైన రుచిని ఇస్తుంది. ముందుగా పక్కన పెట్టుకున్న గుప్పెడు శనగపప్పును ఈ రుబ్బిన మిశ్రమంలో కలపడం ద్వారా వడలు తింటున్నప్పుడు తగులుతూ మంచి క్రంచీ అనుభూతిని ఇస్తాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని, అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, గుప్పెడు పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేయాలి. అలాగే తగినంత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగును జోడించాలి. దీనితో పాటు చిటికెడు జీలకర్ర, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, క్రిస్పీ టెక్స్చర్ కోసం కొద్దిగా బియ్యం పిండిని వేయాలి. రుచికి సరిపడా ఉప్పును ప్రారంభంలో తక్కువగా వేసి, అవసరమైతే ఆ తర్వాత సర్దుబాటు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పదార్థాలన్నింటినీ చేతితో గట్టిగా మరియు సమానంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలో తగినంత నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కేలోపు కలుపుకున్న పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి, మీకు నచ్చిన ఆకారంలో పలుచని వడలుగా ఒత్తుకోవాలి. బాగా క్రిస్పీగా కావాలంటే పిండిని కాస్త పలుచగా ఒత్తుకోవాలి. లోపల మెత్తగా, పైన క్రిస్పీగా కావాలంటే మామూలు మందంలో ఒత్తుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత మంటను మీడియానికి తగ్గించి వడలను నూనెలో జాగ్రత్తగా జారవిడవాలి. వడలు నూనెలో వేసిన వెంటనే గరిటెతో కదపకూడదు, లేదంటే అవి విడిపోయే అవకాశం ఉంది. ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండు మూడు నిమిషాలు ఆగి, మరోవైపునకు నిదానంగా తిప్పుకోవాలి. మీడియం మంటపై రెండు వైపులా చక్కటి బంగారు గోధుమ రంగులోకి మారే వరకు వేయించుకోవాలి. నూనెలో బుడగలు పూర్తిగా తగ్గిన తర్వాత వడలు సరిగ్గా కాలినట్లు అర్థం చేసుకోవచ్చు. ఈ కొలతలతో తయారైన పిండితో సుమారు 25 నుంచి 30 వరకు గుండ్రటి మసాలా వడలు తయారవుతాయి. ప్రత్యేకంగా ఈ మసాలా వడలకు ఎలాంటి అదనపు కారప్పొడి లేదా చట్నీలు అవసరం లేదు. ఎందుకంటే ఇందులో వేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వంటి అన్ని దినుసులు కలిసి దీనికి అద్భుతమైన సహజ రుచిని ఇస్తాయి. ఎలాంటి హడావిడి లేకుండా ఓపికగా మీడియం మంటపై వీటిని కాల్చుకుంటే హోటల్ లేదా స్ట్రీట్ స్టైల్ కంటే అద్భుతమైన రుచి ఇంటివారందరినీ కట్టిపడేస్తుంది. సాయంత్రం పూట వేడి వేడి టీతో ఈ క్రిస్పీ మసాలా వడలను తింటుంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వారాంతంలో మీ కుటుంబ సభ్యుల కోసం ఈ సింపుల్ రెసిపీని ట్రై చేసి రుచి చూడండి.     Street Style Masala Vada, Crispy Dal Vada Recipe, South Indian Paruppu Vadai, Tea Time Snacks, Easy Evening Snacks At Home, Crunchy Chana Dal Vada, Indian Deep Fried Snacks.  
కడుపులో మంట, గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలతో తరచూ ఇబ్బంది పడుతున్నారా? తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, ఛాతీలో మంటగా అనిపించడం, కడుపు నిండినట్లు ఉండటం వంటి లక్షణాలను చాలామంది సాధారణ గ్యాస్ట్రిక్ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, ఈ సమస్యలు ఎందుకు వస్తాయి? ఎలాంటి అలవాట్లు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి? ఏ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి? ఈ TeluguOne Health వీడియోలో ప్రముఖ వైద్యులు  డాక్టర్ సి.ఎల్. వెంకట్రావు గారు గ్యాస్ట్రిక్ సమస్యలకు సంబంధించిన  ముఖ్యమైన విషయాలను వివరిస్తున్నారు. తరచుగా గ్యాస్ రావడానికి గల కారణాలు, కడుపులో మంట, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యల వెనుక ఉండే కారణాలు, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు ఎందుకు వస్తాయి? సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, అతిగా తినడం, నిద్రకు సంబంధించిన అలవాట్లు వంటి అనేక అంశాలు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపవచ్చు. కొందరిలో తరచుగా కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం, తేన్పులు, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి సమస్యలు పదేపదే ఎందుకు వస్తున్నాయి? మన రోజువారీ అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? అనే విషయాలను డాక్టర్ వివరణలో తెలుసుకోండి. GERD అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? కడుపులోని ఆమ్లం తిరిగి ఆహారనాళంలోకి రావడాన్ని గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD) అంటారు. దీనివల్ల ఛాతీలో మంట, నోటిలోకి పుల్లటి ద్రవం రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. సాధారణ గ్యాస్ట్రిక్ సమస్యలకు, GERD వంటి పరిస్థితులకు మధ్య ఉన్న తేడాలను తెలుసుకోవడం ముఖ్యం. ఈ సమస్యలకు కారణాలు ఏమిటి? ఎప్పుడు వైద్య పరీక్షలు అవసరమవుతాయి? అనే అంశాలపై ఈ వీడియోలో అవగాహన పొందవచ్చు. గ్యాస్ట్రోస్కోపీ పరీక్ష ఎప్పుడు అవసరం? గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికీ గ్యాస్ట్రోస్కోపీ పరీక్ష అవసరం ఉండదు. అయితే, లక్షణాలు, వాటి తీవ్రత, వైద్యుడి పరిశీలన ఆధారంగా ఈ పరీక్షను సూచించవచ్చు. కడుపులో మంట లేదా అజీర్ణం ఎక్కువకాలం కొనసాగితే ఏం చేయాలి? ఎలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు? గ్యాస్ట్రోస్కోపీ పరీక్ష ద్వారా ఏమి తెలుసుకోవచ్చు? వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి. ఆహారపు అలవాట్లు, నిద్ర, గట్ హెల్త్ ప్రాధాన్యం జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ఎంతో ముఖ్యం. మన పేగుల్లో ఉండే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుంది? గట్ హెల్త్‌ను కాపాడుకోవడానికి ఎలాంటి అలవాట్లు ఉపయోగపడతాయి? తరచుగా గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు తరచుగా వస్తున్నా, కడుపులో మంట తగ్గకపోయినా, అజీర్ణం లేదా కడుపు ఉబ్బరం ఎక్కువకాలం కొనసాగినా స్వయంగా మందులు వాడకుండా వైద్యుడిని సంప్రదించండి. తీవ్రమైన కడుపునొప్పి, రక్తవాంతులు, నల్లటి మలం, మింగడంలో ఇబ్బంది లేదా కారణం తెలియని బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే తక్షణ వైద్య పరిశీలన అవసరం. గ్యాస్ట్రిక్ సమస్యలకు గల కారణాలు, GERD లక్షణాలు, గ్యాస్ట్రోస్కోపీ పరీక్ష అవసరం, ఆహారపు అలవాట్లు, నిద్ర, గట్ హెల్త్ గురించి మరింత తెలుసుకోవడానికి డాక్టర్ సి.ఎల్. వెంకట్రావు గారి వివరణతో కూడిన ఈ TeluguOne Health వీడియోను పూర్తిగా చూడండి. మరింత ఆరోగ్య సమాచారం, వైద్య నిపుణుల సూచనలు, ఉపయోగకరమైన ఆరోగ్య విషయాల కోసం TeluguOne Health‌ను అనుసరించండి. గమనిక: ఈ సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇది వ్యక్తిగత వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు.
 జాగ్రత్త.. నొప్పి కూడా కనిపించకుండా శరీరంపై దాడి చేసే ఆరోగ్య సమస్యలు ఇవి..! శరీరంలో ఏ చిన్న సమస్య వచ్చినా సాధారణంగా నొప్పి రూపంలో బయటపడుతుంది. తలనొప్పి, కడుపునొప్పి, కీళ్లనొప్పులు వంటివి రాగానే మనం వెంటనే జాగ్రత్తపడి వైద్యులను సంప్రదిస్తాం. కానీ అన్ని ఆరోగ్య సమస్యలూ హెచ్చరికగా నొప్పిని ఇవ్వవు. మన శరీరంలో ఎలాంటి నొప్పి లేదా స్పష్టమైన లక్షణాలు లేకుండానే కొన్ని తీవ్రమైన వ్యాధులు సైలెంట్ గా మొదలై దెబ్బతీస్తుంటాయి. బయటకు మనం చాలా ఆరోగ్యంగా, ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ లోపల అనారోగ్యం నిశ్శబ్దంగా పాకే ప్రమాదం ఉంది. అందుకే ఆరోగ్య నిపుణులు వీటిని సైలెంట్ కిల్లర్స్ అని పిలుస్తుంటారు.నొప్పి లేకుండా సైలెంట్ కిల్లర్స్ లాగా శరీరాన్ని ఆక్రమించే ఆ జబ్బులు ఏంటో తెలుసుకుంటే.. నిశ్శబ్దంగా దాడి చేసే ప్రధాన ఆరోగ్య సమస్యలు.. హై బ్లడ్ ప్రెషర్ లేదా అధిక రక్తపోటు.. ఎక్కువ రక్తపోటు సమస్యను  ప్రధాన సైలెంట్ కిల్లర్ గా చెబుతారు. బిపి  బాగా పెరిగినా చాలామందికి ఎలాంటి నొప్పి గానీ, శారీరక ఇబ్బంది గానీ కనిపించదు. కేవలం తలనొప్పి లేదా తలతిరగడం వస్తేనే బిపి పెరిగిందని అనుకోవడం పొరపాటు. బిపి చాలా కాలం పాటు అదుపులో లేకపోతే అది నిశ్శబ్దంగా గుండె, మూత్రపిండాలు, కళ్లు , మెదడు రక్తనాళాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఆహారంలో ఉప్పు తగ్గించడం, రోజువారీ వ్యాయామం, బరువును అదుపులో ఉంచుకోవడం , తరచుగా బిపి తనిఖీ చేయించుకోవడం ద్వారా దీనిని అరికట్టవచ్చు. టైప్-2 డయాబెటిస్.. టైప్-2 డయాబెటిస్ కూడా మొదటి దశలో ఎలాంటి నొప్పులను కలిగించదు. శరీరంలో ఇన్సులిన్ సక్రమంగా పనిచేయనప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. మొదట్లో  సాధారణ అలసట తప్ప ప్రత్యేకమైన లక్షణాలు ఉండవు. కానీ రక్తంలో వేగంగా  మారే చక్కెర స్థాయిలు దీర్ఘకాలంలో కంటి చూపు, నరాలు, గుండె , కిడ్నీల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లేదా హెచ్ బి ఎ1సి పరీక్షల ద్వారా దీనిని మొదట్లోనే  గుర్తించవచ్చు. క్రమబద్ధమైన వ్యాయామం , బాలెన్స్డ్ డైట్  తీసుకోవడం  దీనికి మంచి పరిష్కారం. ఫ్యాటీ లివర్.. ఫ్యాటీ లివర్ సమస్య కూడా కాలేయంలో కొవ్వు చేరుతున్న సమయంలో ఎలాంటి నొప్పిని తెలియజేయదు. కాలేయ కణాలలో అధిక కొవ్వు చేరడం వల్ల మొదట్లో  అసౌకర్యం ఉండదు కానీ, వ్యాధి ముదిరితే కాలేయ వాపు , ఫైబ్రోసిస్ కు దారితీస్తుంది. ఊబకాయం, టైప్-2 డయాబెటిస్ , అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఎక్కువ. బరువు తగ్గడం, పౌష్టికాహారం తీసుకోవడం , క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. క్రానిక్ కిడ్నీ డిసీజ్.. క్రానిక్ కిడ్నీ డిసీజ్ లేదా మూత్రపిండాల వ్యాధి కూడా మొదటి దశల్లో ఎలాంటి నొప్పిని కలిగించదు. కిడ్నీల పనితీరు నెమ్మదిగా తగ్గుతున్నప్పుడు శరీరంలో ద్రవాలు చేరి పాదాల వాపు, అలసట, మూత్రంలో మార్పులు వంటివి వ్యాధి ముదిరిన తర్వాతే కనిపిస్తాయి. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బిపి, షుగర్  స్థాయిలను ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోవాలి. అలాగే వైద్యుల సలహా లేకుండా తరచూ పెయిన్ కిల్లర్స్ వాడటం మానుకోవాలి. కిడ్నీల పనితీరును తెలుసుకోవడానికి క్రియేటినిన్ , మూత్ర పరీక్షలు తోడ్పడతాయి. నొప్పి లేదు కదా అని నిర్లక్ష్యం చేయకుండా వయస్సు, శరీర తత్వాన్ని బట్టి సంవత్సరానికి కనీసం ఒకసారైనా సాధారణ హెల్త్ చెకప్ చేయించుకోవడం ఎంతో ఉత్తమం. సరైన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు , క్రమబద్ధమైన వైద్య పరీక్షలే మనల్ని ఈ నిశ్శబ్ద వ్యాధుల నుండి కాపాడుతాయి.                                                                                                                                                 *రూపశ్రీ.