LATEST NEWS
దేశ రాజకీయాలలో హాట్ టాపిక్ గా ఉన్న అంశం ఏదైనా ఉందంటే.. అది నియోజకవర్గాల పునర్విభజన బిల్లు మాత్రమే. అటువంటి కీలక బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి కేంద్రం ముహూర్తం నిర్ణయించేసింది. ఈ నెలాఖరులోనే పార్లమెంటులో ఆ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదింప చేసుకోవాలని కేంద్రం కసరత్తు చేస్తోంది.  ఇందు కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది  గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి. దేశ అత్యున్నత చట్టసభల రూపురేఖలను సమూలంగా మార్చేయగల ఈ అంశంపైనే ఇప్పుడు రాజకీయవర్గాలలో ఎడతెగని చర్చ జరుగుతోంది.  ఇందు కోసం కేంద్రం బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నది.   దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న జనాభా ప్రాతిపదికన స్థానాల కేటాయింపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కేంద్రం వ్యూహాలకు పదును పెడుతున్నది.  పార్లమెంట్‌లో లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి   850కి పెంచే దిశగా ప్రతిపాదనలు దాదాపు సిద్ధమయ్యాయని చెబుతున్నారు. అలాగే  దశాబ్దాల తరబడి వాయిదా పడుతూ వస్తున్న 33 శాతం మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని కూడా ఈ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో జత చేయాలని కేంద్రం నిర్ణయించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికే  మహిళలకు చట్టసభల్లో మూడో వంతు స్థానాలు దక్కేలా చేయాలని కేంద్రం భావిస్తోంది.  అయితే.. లోక్‌సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమైతే ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా విపరీతంగా పెరిగినందున అక్కడి సీట్లు భారీగా పెరుగుతాయని, ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే  ఆందోళన వ్యక్తమౌతున్నది. ఈ సమస్యకు   చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక ఫార్ములా  రూపొందించినట్లు తెలుస్తోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ వంటి ఐదు ప్రధాన దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్యను ప్రస్తుతమున్న 129 నుండి  195కు పెంచి, దేశంలోని మొత్తం లోక్‌సభ స్థానాల్లో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్య శాతాన్ని  తగ్గకుండా కాపాడేలా హోంశాఖ కసరత్తు చేస్తున్నది.   ప్రాంతీయ అసమతుల్యతలకు తావులేకుండా అన్ని ప్రాంతాల ప్రయోజనాలకూ సమ ప్రాతినిథ్యం వచ్చేలా బిల్లును రూపొందిస్తున్నట్లు చెబుున్నారు.  ఇక పోతే.. ఈ రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదింపజేసుకోవడం కేంద్రానికి సవాలే.   రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి  పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల  మెజారిటీ అవసరం. దీంతో కేంద్రానికి అందుకు సరిపడా సంఖ్యా బలం పార్లమెంటులో లేకపోవడంతో బిల్లు ఆమోదం సులభ సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే   కేంద్రం  చాకచక్యంగా వ్యవహరిస్తూ, ఇండియా కూటమిలోని కొన్ని కీలక భాగస్వామ్య పక్షాలు,  ప్రాంతీయ పార్టీలతో తెరవెనుక లోపాయికారీ సంప్రదింపులు జరుపుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారమౌతోంది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో విభేదిస్తున్న కొన్ని ప్రాంతీయ పార్టీలు, అలాగే డీఎంకే వంటి దక్షిణాది ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టడం ద్వారా ఈ ప్రతిష్టాత్మక బిల్లును  గట్టెక్కించాలని కేంద్రం పావులు కదుపుతోంది. ఈ పునర్విభజన ప్రక్రియకు సంబంధించి కేవలం కేంద్ర స్థాయిలోనే కాకుండా, ప్రాంతీయ స్థాయిలో కూడా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గతంలోనే డీలిమిటేషన్ అంశంపై దక్షిణాది రాష్ట్రాల్లో వస్తున్న అపోహలను తొలగించడానికి, అలాగే అన్ని వర్గాలను విశ్వాసంలోకి తీసుకోవడానికి కేంద్ర పెద్దలు ప్రత్యేక రాయబారాలు నడిపినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు, దక్షిణాది రాష్ట్రాల అసెంబ్లీలలో కూడా ఈ అంశంపై చర్చలు జరిగి, కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక తీర్మానాలు కూడా వెలువడిన నేపథ్యం ఉంది. ఇలాంటి సున్నితమైన రాజకీయ వాతావరణం నెలకొన్న తరుణంలో, కేంద్రం ఈ నెలాఖరున నేరుగా పార్లమెంట్ వేదికగా ఈ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించడం భారతీయ సమాఖ్య వ్యవస్థలో సరికొత్త చర్చకు తెరతీసింది. దక్షిణాది రాష్ట్రాల హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా చూస్తామన్న కేంద్రం హామీలు ఎంతవరకు ఆచరణలో నిలుస్తాయనేది వేచి చూడాలి.   [Delimitation Bill before Parliament, Increase Lok Sabha Seats, Womens Reservation Bill, Special Session Parliament, Telugu One] 
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి విజయదశమి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. రైతులకు మేలు.. యువతకు ఉజ్వల భవిష్యత్తు: చంద్రబాబు.! విజయదశమి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ప్రకటన విడుదల చేశారు. రైతన్నల శ్రమకు తగిన ఫలితం అందించడం, మహిళలకు సాధికారత కల్పించడం, యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించడం లక్ష్యంగా తమ ప్రభుత్వం చేస్తున్న కృషికి జగన్మాత ఆశీస్సులు లభించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తన సందేశంలో పేర్కొన్నారు. ధర్మమార్గంలో పయనిస్తే విజయమే: రేవంత్ రెడ్డి.! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో దసరా పండుగకు విశిష్టమైన స్థానం ఉందని పేర్కొన్నారు. సత్యం, ధర్మం, ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రజల ఐకమత్యానికి విజయదశమి ప్రతీకగా నిలుస్తుందని వివరించారు.ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో, ధర్మమార్గంలో ముందుకు సాగితే అంతిమ విజయం సాధించవచ్చనే గొప్ప సందేశాన్ని ఈ పర్వదినం అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఇంటా సంతోషాలు వెల్లివిరియాలి.! విజయదశమి పండుగ తెలంగాణ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రతి ఇంటా సంతోషాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని, లక్ష్మీదేవి, దుర్గాదేవి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా, మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ప్రజలంతా సంతోషంగా, సురక్షితంగా పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. బతుకమ్మ సంబురాలు, జమ్మి ఆకు పూజలతో తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలు సంప్రదాయబద్ధంగా, ఉత్సాహంగా విజయదశమి వేడుకల్లో పాల్గొంటున్నారు.       [ CM Chandrababu Naidu, CM Revanth Reddy, Vijayadashami Wishes, Dussehra Greetings, AP CM Chandrababu, Telangana CM Revanth Reddy, Dussehra 2026, Vijayadashami 2026, Telugu States News, Chandrababu Dussehra Message, Revanth Reddy Dussehra Message, TeluguOne News ]  
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్‌ మెహందీకి ఉత్తరాఖండ్‌లో ఒక సాంస్కృతిక వేడుకలో తీవ్రమైన చేదు అనుభవం ఎదురైంది. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమంలో ఆయన పాట పాడుతుండగా, ఒక రాష్ట్ర మంత్రి నేరుగా వేదికపైకి వచ్చి ఆయనను అడ్డుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో నవరాత్రుల సందర్భంగా ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవడానికి ప్రముఖ సింగర్ దలేర్‌ మెహందీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపై తనదైన శైలిలో పాటలు పాడుతూ ప్రేక్షకులను అలరిస్తున్న తరుణంలో అనుహ్య పరిణామం చోటుచేసుకుంది. నరేంద్రనగర్ శాసనసభ్యుడు, ఉత్తరాఖండ్ కేబినెట్ మంత్రి సుబోధ్ ఉనియాల్ హఠాత్తుగా వేదికపైకి దూసుకెళ్లారు. స్టేజీపై మైక్ అందుకున్న ఆయన, దలేర్‌ మెహందీని ఉద్దేశించి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన నవరాత్రి వేడుకల్లో, అమ్మవారి సన్నిధిలో ఇలాంటి అపవిత్రమైన పనులు చేయడం తగదని మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గాయకుడు మద్యం మత్తులో ఉన్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తాగి వచ్చి వేదికపై పాటలు పాడటం ఏమాత్రం సరికాదని, ఇది ఈ వేడుకల మర్యాదను దిగజార్చేలా ఉందని మండిపడ్డారు. వేదిక పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందని ఆయన గట్టిగా హెచ్చరించారు. మంత్రి చేసిన సంచలన ఆరోపణలతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఏం జరుగుతుందో అర్థంకాక ప్రేక్షకులు, నిర్వాహకులు నివ్వెరపోయారు. ఈ వివాదంతో వేదికపై కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఊహించని పరిణామానికి షాకైన దలేర్‌ మెహందీ, ఎలాంటి ప్రతిఘటన చేయకుండా వినయంగా నడుచుకున్నారు. మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో ఆయన రెండు చేతులు జోడించి, దయచేసి వేదికను వీడాలని లేదా ప్రశాంతంగా ఉండాలని నమస్కరిస్తూ విజ్ఞప్తి చేయడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. సెలబ్రిటీలు పాల్గొనే బహిరంగ వేడుకల్లో రాజకీయ నాయకులు ఇలా బహిరంగంగా నిలదీయడం స్థానికంగా మరియు నెటిజన్లలో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే, ఈ వివాదంపై దలేర్‌ మెహందీ కానీ ఆయన అధికారిక బృందం కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన వివరణ ఇవ్వలేదు.       [ Daler Mehndi, Subodh Uniyal,  Daler Mehndi drunk controversy, Uttarakhand news, Navratri celebrations Daler Mehndi, Singer Performance, Viral News, TeluguOne News, Telugu News ]
ALSO ON TELUGUONE N E W S
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతోమంది ఆయనకు అభిమానులుగా ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కూడా ఉన్నాడు. రజనీకాంత్ సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని గతంలోనూ చెప్పిన సంజూ.. తాజాగా తన అభిమానాన్ని మరోసారి ప్రత్యేకంగా చాటుకున్నాడు. రజనీ నటించిన ‘జైలర్ 2’ సినిమా చూసేందుకు ఏకంగా ఓ థియేటర్ మొత్తాన్ని బుక్ చేసుకున్నాడు.  ఢిల్లీలో ఓ కార్యక్రమం ఉండటంతో సినిమా విడుదలైన రోజున చూడలేకపోయానని సంజూ తెలిపాడు. అందుకే మరుసటి రోజు తన భార్య, స్నేహితులతో కలిసి సినిమా చూసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రజనీకాంత్ సినిమాలు చూడటమంటే తనకు చాలా ఇష్టమని, ఆయన తదుపరి సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటానని చెప్పాడు. ఈసారి మొత్తం థియేటర్‌ను బుక్ చేసుకునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని, పెద్ద తెరపై రజనీకాంత్‌ను చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నానని వెల్లడించాడు.  ఈ ప్రత్యేక ప్రదర్శనకు తన భార్య, స్నేహితులతో పాటు భారత క్రికెట్ జట్టులోని తమిళం తెలిసిన సహాయక సిబ్బందిని కూడా సంజూ ఆహ్వానించాడు. దీంతో ఈ సినిమా ప్రదర్శన ఓ ప్రత్యేకమైన అభిమానుల వేడుకగా మారింది. క్రికెట్ మైదానంలో తన ఆటతో అభిమానులను అలరించే సంజూ.. తెరపై రజనీకాంత్‌ను చూడటానికి ఇంత ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్ 2’లో రజనీకాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో కనిపిస్తున్నారు. తన అభిమాన నటుడి సినిమాను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆస్వాదించాలనే ఉద్దేశంతో సంజూ చేసిన ఈ పని రజనీకాంత్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సూపర్‌స్టార్‌పై ఆయనకున్న అభిమానం మరోసారి బయటపడటంతో ఈ వార్త వైరల్‌గా మారింది.     [Sanju Samson, Rajinikanth, Jailer 2 Movie, Sanju Samson Rajinikanth Fan, Jailer 2 Theatre Booking, Sanju Samson Latest News, Rajinikanth Fans, Jailer 2 Private Screening]
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా నటిస్తున్న భారీ చిత్రం ‘రామాయణ’. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ సినిమాకు నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తొలి భాగం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన తెలుగు ప్రీ రిలీజ్ వేడుకలో యశ్ చేసిన ప్రసంగం ఆసక్తికరంగా మారింది. తెలుగు ప్రేక్షకుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. భారతీయ సినిమా ప్రపంచ స్థాయికి ఎదగాలంటే అన్ని భాషల సినీ అభిమానులు కలిసి రావాలని కోరారు.  రెండు నెలల క్రితం కూడా తెలుగు ప్రేక్షకులను కలిశానని గుర్తుచేసుకున్న యశ్.. తన గత సినిమా కొందరికి నచ్చిందని, మరికొందరికి నచ్చలేదని చెప్పారు. సినిమా నచ్చినవారితో పాటు నచ్చని వారికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకుల ప్రేమే తమను ముందుకు నడిపిస్తుందని, వారిని ఎప్పటికప్పుడు అలరించాలనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నామని పేర్కొన్నారు. రాజమౌళి, ప్రభాస్, రామ్‌చరణ్, ఎన్టీఆర్ వంటి ప్రముఖులు భారతీయ సినిమా ఎలాంటి అద్భుతాలు చేయగలదో ప్రపంచానికి చూపించారని ప్రశంసించారు.  ఇక ‘రామాయణ’లో నటిస్తున్న సాయి పల్లవిపై యశ్ ప్రశంసలు కురిపించారు. సీత పాత్రలో ఆమె అద్భుతంగా నటించారని అన్నారు. రణ్‌బీర్ కపూర్ ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని, ఆయనలో ఎలాంటి అహంకారం కనిపించదని పేర్కొన్నారు. రాముడి పాత్రలో రణ్‌బీర్ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతారని అభిప్రాయపడ్డారు. అలాగే శూర్పణఖ పాత్రలో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రస్తావిస్తూ, ఆ పాత్ర చేయడం అంత సులభం కాదని చెప్పారు. దర్శకుడు నితీశ్ తివారీతో కలిసి పనిచేయడం మంచి అనుభవమని తెలిపారు.  ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో నిర్మాత నమిత్ మల్హోత్రా ఎంతో కష్టపడుతున్నారని యశ్ అన్నారు. ఆయనలో ఉన్న సినిమా పట్ల అభిరుచి, అంకితభావం తనను ఆకట్టుకున్నాయని చెప్పారు. నమిత్ ఈ ప్రాజెక్టు గురించి చెప్పినప్పుడే రావణుడి పాత్రలో నటించడంతో పాటు సినిమాను నిర్మించేందుకు కూడా అంగీకరించానని వెల్లడించారు. తెలుగు ప్రేక్షకులు ‘రామాయణ’ను ఆదరించాలని కోరిన యశ్.. ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.     [Yash Ramayana Speech, Ramayana Telugu Pre Release Event, Yash as Ravana, Ranbir Kapoor as Rama, Sai Pallavi as Sita, Yash Praises Sai Pallavi, Namit Malhotra Ramayana, Ramayana Movie Release Date]
విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె ‘రామాయణ’ చిత్రంలో సీతాదేవి పాత్రలో నటిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా కనిపించనున్న ఈ భారీ చిత్రం కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన ‘రామాయణ’ తెలుగు ప్రీ రిలీజ్ వేడుకలో సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సీత పాత్ర పోషించడం తనకు ఎంతో అదృష్టమని ఆమె పేర్కొన్నారు.  సీతాదేవి పాత్ర ద్వారా ప్రశాంతంగా ఉండటం, ఆధ్యాత్మికంగా ఆలోచించడం వంటి విషయాలను నేర్చుకున్నానని సాయి పల్లవి తెలిపారు. ఈ పాత్ర కోసం తాము మూడేళ్ల పాటు పనిచేశామని, అయితే దర్శకుడు నితీశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా మాత్రం దాదాపు పదేళ్లుగా ఈ ప్రాజెక్టుపై ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి గొప్ప ఇతిహాసంలో భాగం కావడం తనకు ఎంతో ప్రత్యేకమని ఆమె వెల్లడించారు. పాత్రలను మరింత బాగా అర్థం చేసుకునేందుకు చిత్ర బృందం కొన్ని పుస్తకాలు చదవాలని సూచించిందని, ఎన్టీఆర్ నటించిన రామాయణానికి సంబంధించిన చిత్రాన్ని కూడా చూశానని తెలిపారు.  ఇక రణ్‌బీర్ కపూర్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని కూడా సాయి పల్లవి పంచుకున్నారు. తొలి రోజు షూటింగ్‌లోనే ఇంటర్వెల్ సన్నివేశాన్ని చిత్రీకరించారని, ఆ సమయంలో తాను కొంత టెన్షన్ పడుతుంటే రణ్‌బీర్ ఎంతో సౌకర్యంగా ఉండేలా సహకరించారని చెప్పారు. భిన్నమైన సంస్కృతుల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఆయన అండగా నిలిచారని ప్రశంసించారు. యశ్ గురించి మాట్లాడుతూ.. తన మూలాలకు సంబంధించిన కథలను చెప్పాలనే తపన ఆయనలో కనిపిస్తుందని అన్నారు. రావణుడి పాత్రను యశ్ తన నటనతో ప్రేక్షకులకు నచ్చేలా చేస్తారని అభిప్రాయపడ్డారు.  ఈ వేడుకలో సాయి పల్లవి హిందీలో రాముడి భజనను పాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమా హిందీలో చిత్రీకరించినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు సులభంగా అర్థమవుతుందని ఆమె చెప్పారు. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ కూడా సాయి పల్లవి నటనను ప్రశంసించారు. రణ్‌బీర్ రాముడిగా అద్భుతంగా నటించారని, సాయి పల్లవి సీత పాత్రలో ఎంతో ప్రశాంతంగా కనిపించారని పేర్కొన్నారు. భారతీయ ఇతిహాసాన్ని భారీ స్థాయిలో తెరపైకి తీసుకొస్తున్న ‘రామాయణ’ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. 
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న భారీ చిత్రం ‘రామాయణ’. నితీశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘రామాయణ పార్ట్‌ 1’ తెలుగు ప్రీ రిలీజ్‌ వేడుకలో రణ్‌బీర్ కపూర్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా శ్రీరాముడి పాత్ర తనపై ఎలాంటి ప్రభావం చూపించిందో ఆయన వివరించారు.   [Ranbir Kapoor Ramayana Speech, Ramayana Part 1, Ranbir Kapoor as Lord Rama, Ramayana Telugu Pre Release Event, Ranbir Kapoor Hyderabad Event, Sai Pallavi Sita, Yash Ravana, Ramayana Movie Updates] కొన్ని కథలు కేవలం వినడానికి, చూడటానికి మాత్రమే పరిమితం కావని.. అవి మన జీవితాల్లో లోతుగా భాగమై ఉంటాయని రణ్‌బీర్ అన్నారు. రామాయణం కూడా అలాంటి కథేనని పేర్కొన్నారు. శ్రీరాముడిగా నటించడం తనకు ఎంతో భావోద్వేగభరితమైన ప్రయాణమని చెప్పారు. ఈ పాత్ర ద్వారా ధైర్యం, కరుణ, క్షమాగుణం, కర్తవ్యనిష్ఠ, కృతజ్ఞత వంటి విలువల ప్రాధాన్యతను మరోసారి తెలుసుకున్నానని తెలిపారు. మంచి కొడుకుగా, తండ్రిగా, సోదరుడిగా, భర్తగా, స్నేహితుడిగా ఎలా ఉండాలో రామాయణం నేర్పిస్తుందని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.  ఇక తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాల గురించి కూడా రణ్‌బీర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనను, తన సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు ఎప్పుడూ కష్టపడతానని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌కు రావడం తనకు ఎప్పుడూ ప్రత్యేకమేనని, తెలుగు ప్రేక్షకుల ప్రేమ తనకు ఎంతో విలువైనదని తెలుగులోనే మాట్లాడటం విశేషం. ఆయన తెలుగు మాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.  భారీ స్థాయిలో రూపొందుతున్న ‘రామాయణ’లో సాయి పల్లవి, యశ్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారతీయ ఇతిహాసాన్ని ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. రాముడి పాత్ర తనకు వ్యక్తిగతంగా ఎన్నో పాఠాలు నేర్పిందని రణ్‌బీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. తెరపై ఆయన శ్రీరాముడిగా ఎలా కనిపించబోతున్నారో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
Celebrity conversations become memorable when they move beyond film promotions to reveal the friendships, struggles and personal experiences behind familiar public figures. That is the space Jayammu Nischayammu Raa with Jagapathi explores in its second season. Hosted by Jagapathi Babu, the Zee Telugu talk show brings leading personalities from the Telugu film industry into a relaxed setting where nostalgia, candid revelations and spontaneous humour take centre stage. The latest episode brings together acclaimed director Trivikram Srinivas, popular actor Sunil and music director S.S. Thaman. The newly released promo offers glimpses of an interaction that moves between personal memories and the creative relationships shaping Telugu cinema, feeling less like a conventional celebrity interview and more like a gathering of familiar personalities sharing stories beyond the spotlight. At the heart of the episode is the enduring friendship between Trivikram and Sunil. Their recollections of sharing a flat in Panjagutta during their early days offer a glimpse into a period before both established themselves in the Telugu film industry. These memories bring a personal dimension to their journeys, reminding audiences that behind professional achievements lie years of companionship, ambition and shared experiences. The conversation also finds room for humour when Jagapathi Babu steers the discussion towards Trivikram’s marriage. Sunil’s playful description of it as an “arranged-plus-love” marriage adds to the easygoing atmosphere, demonstrating how familiar friendships can produce moments that scripted interactions rarely replicate. This balance between personal revelations and light-hearted banter gives the format its appeal. The arrival of S.S. Thaman introduces another dimension, shifting attention towards the creative pressures behind filmmaking. His account of the expectations surrounding the first song in a Trivikram film offers an entertaining glimpse into the relationship between a director and his composer. The exchange highlights the pressure to deliver something memorable when expectations are high. With Trivikram and Sunil revisiting their early years, Thaman sharing insights into the creative process and Jagapathi Babu guiding the conversation, the upcoming episode brings together nostalgia, industry anecdotes and effortless humour. It offers audiences an opportunity to see celebrated personalities in a more personal light, making the conversation itself the central attraction. For ZEE5, the show also offers an opportunity to deepen engagement with Telugu audiences through entertainment rooted in the region’s cinematic culture. By extending celebrity conversations beyond the screen, the platform adds another dimension to its Telugu content offering, complementing films and series with a format built around personalities, relationships and shared cultural familiarity. The upcoming episode of Jayammu Nischayammu Raa – Season 2 will premiere on ZEE5 this Friday, followed by its television broadcast on Zee Telugu this Sunday.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Rumours about Hrithik Roshan joining forces with Jailer 2 director Nelson Dilipkumar for Hombale Films have been doing the rounds. Hrithik reportedly has a commitment with the KGF and Kantara production house, and the possibility of an exciting collaboration with Nelson has generated curiosity. However, the speculation seems far from concrete, considering the commitments lined up for both the actor and the director. Hrithik had previously confirmed that he would make his directorial debut with Krrish 4. The ambitious superhero franchise is a major personal commitment for the actor, who is expected to take charge behind the camera as well. While there is no clarity on when the film will go on floors, his directorial plans remain an important factor when assessing reports about his next projects. Nelson, meanwhile, has several possibilities on the table. Producer Naga Vamsi has reiterated his desire to make the much-discussed film with Jr NTR happen, although he indicated that the project would take time. Nelson is also committed to directing the highly anticipated Rajinikanth-Kamal Haasan reunion film. With Jailer 2 delivering a strong box-office performance, the director's immediate priorities could revolve around his existing commitments. Rajinikanth, who is currently shooting for Dharman, may also be keen to move forward with the reunion project as soon as schedules permit. The success of Jailer 2 has further strengthened Nelson's position, making his next directorial move an important one. Given these circumstances, the reports of Hrithik Roshan teaming up with Nelson for Hombale Films appear premature. The collaboration could be an exciting prospect, but until an official announcement or a credible confirmation emerges, it is best treated as speculation rather than a project that is ready to take off. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Victory Venkatesh, Srinidhi Shetty starrer Aadharsha Kutumbam, directed by Trivikram Srinivas has good anticipation among family audiences. The first single became popular and now, the makers have released second single, Maala, featuring Nivetha Pethuraj.  Venkatesh and Nivetha add a lively charm to the song with their refreshing screen presence and delightful chemistry. Their graceful moves and infectious energy make Maala a visual treat, perfectly complementing the song’s vibrant mood. Sung by Thaman S, Dhanunjay Seepana and Ranina Reddy, the song features lyrics by Ramajogayya Sastry and choreography by Bhanu Master. Aadarsha Kutumbam brings together the blockbuster combination of Venkatesh and Trivikram once again, promising a wholesome family entertainer packed with emotions, fun and entertainment.  The film is produced by S. Radha Krishna under the banner of Haarika & Hassine Creations. The film boasts a talented technical team, with Ravi K. Chandran handling cinematography, Navin Nooli overseeing editing and A. S. Prakash taking charge of the art direction. Thaman S is composing the music.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
మెగాస్టార్ చిరంజీవి తర్వాతి సినిమా ఎవరితో ఉండబోతోంది? ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ ప్రశ్న ఆసక్తిని పెంచుతోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ తర్వాత చిరంజీవి చేయాల్సిన శ్రీకాంత్ ఓదెల సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఇదే సమయంలో తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు పేరు తెరపైకి రావడంతో మెగాస్టార్ తదుపరి ప్రాజెక్ట్‌పై కొత్త చర్చ మొదలైంది. ‘జిగర్‌తండా’, ‘పేట’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు.. చిరంజీవికి ఓ కథ వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌కు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అన్నది ఇంకా తెలియలేదు. కార్తీక్ సుబ్బరాజు సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్‌తో పాటు భిన్నమైన కథనం, బలమైన పాత్రలు కనిపిస్తుంటాయి. అలాంటి దర్శకుడు చిరంజీవి కోసం ఎలాంటి కథను సిద్ధం చేశారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ కాంబినేషన్ ఖరారైతే, మెగాస్టార్‌ను ఆయన ఏ తరహా పాత్రలో చూపిస్తారనేది అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచే అంశం. ‘దసరా’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి ఓ భారీ యాక్షన్ సినిమా చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. నాని నిర్మాణంలో రూపొందాల్సిన ఈ ప్రాజెక్ట్‌పై అప్పట్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే శ్రీకాంత్ ఓదెల ‘ది పారడైజ్’ సినిమా అనుకున్నదానికంటే ఎక్కువ సమయం తీసుకోవడంతో చిరంజీవి సినిమా షెడ్యూల్ కూడా మారిపోయింది. ఈ విషయంపై నాని ఇటీవల మాట్లాడుతూ.. ‘ది పారడైజ్’ ఆలస్యం కావడంతో చిరంజీవి సినిమా అనుకున్న సమయానికి ముందుకు వెళ్లలేదని, ఈ ప్రాజెక్ట్‌ గురించి మళ్లీ కూర్చొని చర్చించలేదని తెలిపారు. కాబట్టి సినిమా పూర్తిగా ఆగిపోయిందని చెప్పలేం. కానీ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై మాత్రం స్పష్టత లేదు. శ్రీకాంత్ ఓదెల సినిమా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో చిరంజీవితో సినిమా చేయాలని బుచ్చిబాబు సానా, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ వంటి దర్శకులు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం కూడా నడుస్తోంది. అయితే వీరిలో ఎవరితోనూ చిరంజీవి సినిమా అధికారికంగా ఖరారు కాలేదు. ప్రస్తుతం చిరంజీవి దృష్టి బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’పై ఉంది. ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెలతో ముందుకు వెళ్తారా? లేక కార్తీక్ సుబ్బరాజుకు అవకాశం ఇస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: ‘మాలా’ సాంగ్ వచ్చేసింది.. వెంకటేష్, నివేదా పేతురాజ్ కెమిస్ట్రీ అదిరింది.!       [Chiranjeevi Next Film, Chiranjeevi Kaaka Movie, Megastar Chiranjeevi, Karthik Subbaraj, The Paradise Movie, Srikanth Odela, Kaaka Movie, Nani, Telugu Film News]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ప్రకృతి మనకు ప్రసాదించిన అమూల్యమైన దివ్యౌషధాలలో ఉసిరి ముందుంటుంది. పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ, ఉసిరికాయ చేసే మేలు మాత్రం అనూహ్యం, ఖరీదైన సూపర్‌ఫుడ్స్‌ను సైతం ఇది తలదన్నగలదు. ముఖ్యంగా శీతాకాలం వచ్చిందంటే చాలు, వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా దగ్గు, జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు సర్వసాధారణంగా మారుతుంటాయి. ఇలాంటి సమయంలో ప్రతిరోజూ ఉసిరి రసాన్ని తీసుకోవడం ద్వారా శరీరానికి అద్భుతమైన రక్షణ లభిస్తుంది. నారింజ మరియు దానిమ్మకాయలతో పోలిస్తే విటమిన్ సి ఉసిరిలో అత్యధిక మోతాదులో లభిస్తుంది. ఈ విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచి, వివిధ రకాల వైరల్ వ్యాధులు దరిచేరకుండా కవచంలా కాపాడుతుంది. కేవలం ఇమ్యూనిటీ మాత్రమే కాకుండా, చలికాలంలో చాలామందిని వేధించే జీర్ణక్రియ సమస్యలకు కూడా ఉసిరి చక్కటి పరిష్కారం చూపుతుంది. చలికాలంలో తగిన మోతాదులో నీరు తీసుకోకపోవడం వల్ల గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువవుతాయి. ప్రతిరోజూ ఉదయం పూట ఖాళీ కడుపుతో ఉసిరి జ్యూస్ సేవించడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడి, ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా, మధుమేహం (డయాబెటిస్)తో బాధపడుతున్నవారికి ఉసిరి రసం ఒక నిజమైన వరం లాంటిదనే చెప్పాలి. ఉసిరిలో సహజంగా లభించే 'క్రోమియం' మరియు విటమిన్ సి, ఫైబర్, ఫోలేట్, ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల డయాబెటిస్ రోగులు తమ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సులభంగా నియంత్రించుకోవచ్చు. ఇక శీతాకాలంలో చర్మం పొడిబారిపోవడం, జుట్టు రాలిపోవడం వంటి సౌందర్య సమస్యలు కూడా చాలా సాధారణం. ఉసిరిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మానికి సహజమైన నిగారింపును అందించడంతో పాటు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి ముఖంపై మచ్చలను తొలగిస్తాయి. అలాగే జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి చుండ్రు సమస్యను నివారిస్తూ ఒత్తైన కురులను అందిస్తుంది. కాబట్టి, ఎలాంటి దుష్ప్రభావాలు లేని ఈ న్యాచురల్ మెడిసిన్‌ను ప్రతిరోజూ మీ ఆహారంలో భాగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.       daily juice for blood sugar control, diabetic healthy juice recipe, lower blood sugar naturally, juice for diabetes control, natural diabetic drinks, home remedies for diabetes management, healthy juice for high sugar.  
మానసిక ఆరోగ్యం విషయంలో ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. డిప్రెషన్ లేదా మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ (MDD) అనేది కోట్లాది మందిని వేధిస్తున్న తీవ్రమైన సమస్య. అయితే దీనికి వైద్య చికిత్స అందించే విధానాలలో శాస్త్రవేత్తలు తాజాగా ఒక అద్భుతమైన మరియు సరికొత్త మార్గాన్ని కనుగొన్నారు. హెబ్రూ యూనివర్సిటీ పరిశోధకులు మరియు ప్రముఖ వైద్య నిపుణులు ఇటీవల నిర్వహించిన ఒక క్లినికల్ ట్రయల్‌లో, ఇంటి వద్దే ఉంటూ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (మెదడును ఉత్తేజపరిచే టెక్నాలజీ) మరియు గేమింగ్ ఆధారిత కాగ్నిటివ్ కంట్రోల్ ట్రైనింగ్‌ను సంయుక్తంగా ఉపయోగించడం ద్వారా డిప్రెషన్ లక్షణాలను గణనీయంగా తగ్గించవచ్చని నిరూపించారు. సాధారణంగా ఇలాంటి బ్రెయిన్ స్టిమ్యులేషన్ చికిత్సల కోసం రోగులు ఆసుపత్రులు లేదా క్లినిక్‌లకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఈ సరికొత్త పద్ధతి ద్వారా రోగులు ఎలాంటి ఆసుపత్రి చుట్టూ తిరగకుండా, పూర్తిగా తమ ఇంటి సౌకర్యవంతమైన వాతావరణంలోనే చికిత్స పొందడానికి అవకాశం ఏర్పడింది. ఈ సరికొత్త అధ్యయనంలో భాగంగా ట્રાన్ಸ್‌క్రానియల్ డైರೆಕ್ಟ್ కరెంట్ స్టిమ్యులేషన్ (tDCS) అనే టెక్నాలజీని ఉపయోగించారు. ఇది చాలా తక్కువ మోతాదులో విద్యుత్ ప్రవాహాన్ని మెదడు యొక్క నిర్దిష్ట భాగాలకు అందించి, న్యూరల్ ప్లాస్టిసిటీని మెరుగుపరుస్తుంది. ఈ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన గణాంకాలు మరియు డేటా పరిశీలకులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నాయి. అధ్యయనంలో చురుకైన ట్రీట్‌మెంట్ పొందిన పార్టిసిపెంట్స్ తమ హామిల్టన్ డిప్రెషన్ రేటింగ్ స్కేల్ (HDRS) స్కోర్లలో సగటున 9.41 పాయింట్ల భారీ తగ్గుదలని నమోదు చేశారు. కేవలం ప్లేసిబో లేదా కంట్రోల్ గ్రూప్‌లో ఉన్నవారు కేవలం 7.14 పాయింట్ల తగ్గుదలని మాత్రమే చూపించగా, యాక్టివ్ ట్రీట్‌మెంట్ తీసుకున్న గ్రూప్‌లో దాదాపు 45 శాతం మంది రోగులు వ్యాధి నుంచి పూర్తిగా ఉపశమనం (Remission) పొందడం విశేషం. ఇది సాధారణ నియంత్రణ సమూహంతో పోలిస్తే దాదాపు రెట్టింపు ఫలితం కావడం గమనార్హం. ఈ పరిశోధనలో కేవలం బ్రెయిన్ స్టిమ్యులేషన్ మాత్రమే కాకుండా, మెదడు యొక్క ఏకాగ్రతను మరియు అభిజ్ఞా నియంత్రణను (Cognitive Control) పెంచే ప్రత్యేకమైన వీడియో గేమ్ శిక్షణను కూడా జోడించారు. ఈ గేమింగ్ శిక్షణ రోగులలోని ఆలోచనా సరళిని, ఏకాగ్రత లోపాలను మరియు మెదడులోని రివార్డ్ ప్రాసెసింగ్ మెకానిజాన్ని మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడింది. నిపుణులు వెల్లడించిన వివరాల ప్రకారం, రోగులు ఈ చికిత్సను ఇంట్లోనే ఉంటూ ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా సులభంగా పాటించగలిగారు. రోజువారీ జీవితంలో సాధారణ మందులు లేదా యాంటీడిప్రెసెంట్స్ (SSRIs) వాడకం వల్ల వచ్చే బరువు పెరగడం, లైంగిక సమస్యలు లేదా ఇతర తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వంటి ఇబ్బందులు ఈ హోమ్  బేస్డ్ టెక్నాలజీలో కనిపించకపోవడం దీనికి అతిపెద్ద ప్లస్ పాయింట్. రాబోయే రోజుల్లో మానసిక వైద్య రంగంలో ఈ డిజిటల్ మరియు హోమ్  బేస్డ్ థెరపీలు ఒక నూతన శకానికి నాంది పలకనున్నాయి. ఆసుపత్రులకు వెళ్లే అవకాశం లేని వారికి, తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతూ తక్షణ ఉపశమనం కోరుకునే వారికి ఈ అత్యాధునిక బ్రెయిన్ స్టిమ్యులేషన్ మరియు గేమింగ్ కంట్రోల్ టెక్నాలజీ ఒక గొప్ప వరంగా మారనుంది. తక్కువ ఖర్చుతో, ఎవరి సహాయం లేకుండా తమ ఇంట్లోనే ఉంటూ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ పరిశోధన ఒక బలమైన పునాది వేసింది. డిప్రెషన్‌పై పోరులో టెక్నాలజీ ఎలా గేమ్  చేంజర్‌గా మారుతుందో చెప్పడానికి ఈ క్లినికల్ ట్రయల్ ఫలితాలు తిరుగులేని సాక్ష్యంగా నిలుస్తున్నాయి.     Home brain stimulation depression, gaming therapy for depression, digital therapeutics mental health, non invasive brain stimulation, neurostimulation for depression, tDCS home treatment depression, innovative mental health therapy.
పండుగల రోజు ఇంటిల్లిపాదికీ నచ్చే, సులభంగా తయారుచేసుకోగలిగే ప్రసాదాలలో పెసరపప్పు అటుకుల పాయసం ఎంతో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ముఖ్యంగా కృష్ణాష్టమి, ఉగాది, నవరాత్రులు వంటి పవిత్రమైన పర్వదినాలలో అమ్మవారికి లేదా దేవునికి నైవేద్యంగా దీనిని అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పిస్తుంటారు. ఈ సాంప్రదాయ వంటకం కేవలం పూజా కార్యక్రమాలకే పరిమితం కాకుండా, ఇంట్లో ఏ చిన్న వేడుక జరిగినా నోరూరించే తియ్యటి వంటకంగా అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఒక్కసారి ఈ అద్భుతమైన రుచి చూస్తే చాలు, ప్రతి పండగకూ ఇదే పాయసం వండాలని ఇష్టపడతారు. దీని తయారీలో వాడే ప్రతి పదార్ధం, కొలతలు ఈ పాయసానికి అద్భుతమైన రుచిని, సువాసనను తెచ్చిపెడతాయి. ఈ కమ్మని పాయసం తయారీకి కావలసిన పదార్థాలను పరిశీలిస్తే: అర కప్పు పెసరపప్పు, ఒక కప్పు అటుకులు, ఒకటింపావు కప్పు బెల్లం (తీపి తక్కువగా కావాలనుకునేవారు ఒక కప్పు వాడుకోవచ్చు), పెసరపప్పు నానబెట్టడానికి రెండు కప్పుల నీళ్లు, బెల్లం కరిగించడానికి పావు కప్పు నీళ్లు, మూడు కప్పుల పాలు, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, అర టీస్పూన్ యాలకుల పొడి, తగినన్ని పచ్చి లేదా ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే రుచిని పెంచడానికి తగినంత జీడిపప్పు, బాదం పప్పు అవసరమవుతాయి. తయారీ విధానం చాలా సులభం. ముందుగా ఒక వెడల్పాటి పాన్‌లో అర కప్పు పెసరపప్పును లో నుంచి మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ కమ్మటి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. పెసరపప్పు రంగు కొద్దిగా మారిన తర్వాత స్టవ్ ఆపి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పప్పును రెండుసార్లు శుభ్రంగా కడిగి, రెండు కప్పుల నీళ్లు పోసి 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. పప్పు ఎంత బాగా నానితే అంత త్వరగా, మృదువుగా ఉడుకుతుంది. పప్పు నానే లోపు, బెల్లం సిరప్ సిద్ధం చేసుకోవాలి. ఒక గిన్నెలో ఒకటింపావు కప్పు బెల్లం వేసి, పావు కప్పు నీళ్లు పోసి కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగి, ఒక పొంగు రాగానే స్టవ్ ఆపి, వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి; వేడిగా ఉన్నప్పుడు ఫిల్టర్ చేస్తే సిరప్ చిక్కబడకుండా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు అదే పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, ఒక కప్పు అటుకులు వేసి లో నుంచి మీడియం ఫ్లేమ్‌లో క్రిస్పీగా, కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. అటుకులు వేగిన తర్వాత కొద్దిగా పొంగినట్లుగా కనిపిస్తాయి. వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో నానబెట్టిన పెసరపప్పును వేసి, ఒక టీస్పూన్ నెయ్యి కూడా కలిపి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. పప్పు మరీ పేస్ట్ లాగా కాకుండా, కొద్దిగా పలుకులుగా మెత్తబడేంత వరకు ఉడికించాలి. ఇలా చేయడం వల్ల పాయసం తినేటప్పుడు పప్పు తగులుతూ ఎంతో రుచికరంగా ఉంటుంది. పప్పు ఉడికే లోపు, మరొక గిన్నెలో మూడు కప్పుల పాలు పోసి ఒక పొంగు వచ్చే వరకు కాచి, మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన పెసరపప్పులో వేయించిన అటుకులు వేసి బాగా కలుపుకోవాలి. మంటను సిమ్‌లో ఉంచి, కాచి పెట్టుకున్న పాలను కూడా పోసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అటుకులు కొద్దిగా మెత్తబడేంత వరకు ఉడికించడం ముఖ్యం. ఈ పాయసం ఉడికేటప్పుడు కొంచెం పల్చగా అనిపించినా, చల్లారాక గట్టిపడుతుంది కాబట్టి కొద్దిగా పల్చగానే దించుకోవడం మంచిది. అటుకులు సరిగ్గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే యాలకుల పొడి, పూర్తిగా చల్లారిన బెల్లం సిరప్‌ను పాయసంలో వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం సిరప్ కలిపిన తర్వాత, తిరిగి స్టవ్ ఆన్ చేసి మరో రెండు నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించాలి. చివరగా, చిన్న పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఈ వేయించిన డ్రై ఫ్రూట్స్‌ను పాయసంలో వేసి బాగా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోరూరించే కమ్మని పెసరపప్పు అటుకుల పాయసం ప్రసాదం సిద్ధం!       Atukulu Pesara Pappu Payasam, poha moong dal payasam, festive special naivedyam recipes, Andhra style payasam recipe, poha moong dal kheer, festival sweet recipes, traditional payasam recipe.
షుగర్ వ్యాధి ఉన్నవారిలో కిడ్నీ సమస్యలు ఎందుకు వచ్చే అవకాశం ఉంది? రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే మూత్రపిండాల పనితీరుపై ఎలాంటి ప్రభావం పడుతుంది? కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలను తెలుసుకోవడం ప్రతి డయాబెటిస్ పేషెంట్‌కు ఎంతో ముఖ్యం. ఈ TeluguOne Health వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ షుగర్ వ్యాధి, కిడ్నీల ఆరోగ్యం, సంప్రదాయ వైద్య విధానాల్లో ఉపయోగించే ఔషధ మొక్కల గురించి వివరిస్తారు. ముఖ్యంగా తెల్ల గలిజేరు అని పిలిచే పునర్నవ మొక్క, పల్లేరు గింజలు, పండ్ల సంప్రదాయ ఉపయోగాల గురించి తెలుసుకోవచ్చు. ఈ మూలికలను సంప్రదాయ వైద్యంలో ఎలా పరిగణిస్తారు, వాటిని ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అవసరమో తెలుసుకోవచ్చు. డయాబెటిస్ వల్ల కిడ్నీలపై ఎలాంటి ప్రభావం పడవచ్చు? షుగర్ పేషెంట్లు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? పునర్నవ (తెల్ల గలిజేరు) మొక్కకు సంప్రదాయ వైద్యంలో ఉన్న ప్రాధాన్యత ఏమిటి? పల్లేరు గింజలు, పండ్లను సంప్రదాయ వైద్య విధానాల్లో ఎలా ఉపయోగిస్తారు? మూలికలతో తయారుచేసే ఔషధాలను వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తించడానికి వైద్య పరీక్షలు ఎందుకు ముఖ్యం? వంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు కిడ్నీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం, వైద్యుల సూచనల ప్రకారం మందులు వాడటం, అవసరమైన కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. కిడ్నీ సమస్యలు ప్రారంభ దశలో ఉన్నప్పుడు స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అందువల్ల క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. షుగర్ వ్యాధి ఉన్నవారు తమ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పునర్నవ మరియు పల్లేరు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ వివరణతో కూడిన ఈ TeluguOne Health వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మూలికలు కిడ్నీ వ్యాధులను నయం చేస్తాయని నిర్ధారిత ఆధారాలు లేవు. వైద్యుల సూచన లేకుండా షుగర్ మందులను ఆపకండి లేదా మూలికలను వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించకండి.
ఆరోగ్యంగా ఉండాలని చాలామంది విటమిన్ సప్లిమెంట్లు, ఇతర మందులు వాడుతుంటారు. అయితే ఏ మందును ఎంత మోతాదులో తీసుకోవాలి? ఎన్ని రోజులు వాడాలి? ఇతర మందులతో కలిపి తీసుకోవచ్చా? అనే విషయాలు తెలుసుకోకుండా మందులు వాడితే అనవసరమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా Vitamin D, Vitamin B12 వంటి సప్లిమెంట్లను వైద్యుల సూచనల మేరకు తీసుకోవడం ఎంతో ముఖ్యం. మందులు వాడేటప్పుడు చేసే చిన్న పొరపాట్లు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. వైద్యులకు తమ ఆరోగ్య సమస్యలను పూర్తిగా చెప్పకపోవడం, వాడుతున్న మందుల వివరాలను తెలియజేయకపోవడం, సొంతంగా మందుల మోతాదును మార్చుకోవడం వంటి అలవాట్లు చికిత్సకు ఆటంకం కలిగించవచ్చు. ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం (World Patient Safety Day) సందర్భంగా, రోగుల భద్రతకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను హోమియోపతి వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఈ వీడియోలో వివరించారు. Vitamin D, B12 సప్లిమెంట్లు వాడేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? Vitamin D శరీరంలో కాల్షియం శోషణకు, ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనది. Vitamin B12 నరాల పనితీరుకు, ఎర్ర రక్తకణాల తయారీకి అవసరం. ఈ విటమిన్ల లోపం ఉన్నప్పుడు వైద్యులు తగిన పరీక్షలు చేసి, అవసరాన్ని బట్టి సప్లిమెంట్లను సూచించవచ్చు. అయితే ఈ మందులను ఎక్కువ మోతాదులో తీసుకుంటే త్వరగా ఆరోగ్యం మెరుగుపడుతుందని భావించడం సరైంది కాదు. ముఖ్యంగా Vitamin D అధిక మోతాదులో తీసుకోవడం వల్ల రక్తంలో కాల్షియం స్థాయులు పెరిగి ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందువల్ల వైద్యుల సలహా లేకుండా మోతాదును పెంచడం లేదా ఎక్కువకాలం కొనసాగించడం చేయకూడదు. వైద్యులకు మీ ఆరోగ్య సమస్యలను ఎందుకు పూర్తిగా చెప్పాలి? కొంతమంది తమకు ఉన్న లక్షణాలను, గతంలో ఎదురైన ఆరోగ్య సమస్యలను లేదా ప్రస్తుతం వాడుతున్న మందులను వైద్యులకు పూర్తిగా తెలియజేయరు. మరికొందరు ఇతరుల సలహాతో మందులు వాడుతుంటారు. ఇలాంటి వివరాలు దాచడం వల్ల సరైన చికిత్స నిర్ణయించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీకు ఉన్న లక్షణాలు, అలర్జీలు, ఇప్పటికే వాడుతున్న మందులు, విటమిన్ సప్లిమెంట్లు, గతంలో తీసుకున్న చికిత్సల గురించి వైద్యులకు స్పష్టంగా చెప్పాలి. ఈ సమాచారం సరైన చికిత్స అందించడానికి, మందుల మధ్య అవాంఛిత ప్రతిచర్యల ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మందుల మోతాదులో చేసే పొరపాట్లు ఎంత ప్రమాదకరం? వైద్యులు సూచించిన మోతాదు కంటే ఎక్కువగా లేదా తక్కువగా మందులు తీసుకోవడం, సమయానికి తీసుకోకపోవడం, ఒకరి మందులను మరొకరు వాడటం వంటి పొరపాట్లను నివారించాలి. మందుల పేర్లు, మోతాదు, తీసుకోవాల్సిన సమయం, వాడే కాలం గురించి స్పష్టత లేకపోతే వైద్యుడిని లేదా ఫార్మసిస్ట్‌ను అడిగి తెలుసుకోవాలి. మందుల వల్ల ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. వైద్యుల సలహా లేకుండా సూచించిన చికిత్సను నిలిపివేయడం లేదా మోతాదును మార్చడం కూడా సరికాదు. రోగుల భద్రతలో మన బాధ్యత ఏమిటి? రోగుల భద్రత అనేది వైద్యుల బాధ్యత మాత్రమే కాదు. రోగులు కూడా తమ ఆరోగ్యం గురించి అవగాహన కలిగి ఉండాలి. మందుల వివరాలను సరిచూసుకోవడం, వైద్యులు సూచించిన విధంగా వాడటం, సందేహాలు ఉంటే అడగడం, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం వంటి అలవాట్లు చికిత్సను మరింత సురక్షితంగా మార్చడంలో సహాయపడతాయి. ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ అందించే ఈ వీడియోలో Vitamin D, Vitamin B12 మందుల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్యులకు ఆరోగ్య వివరాలను చెప్పడం ఎందుకు అవసరం, మందుల మోతాదులో పొరపాట్లను ఎలా నివారించాలి, సురక్షితమైన చికిత్స కోసం రోగులు పాటించాల్సిన పద్ధతులు వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి. గమనిక: ఈ సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా మందులు, విటమిన్ సప్లిమెంట్లు వాడేందుకు వైద్యులను సంప్రదించండి. వైద్యుల సూచన లేకుండా మందుల మోతాదును మార్చవద్దు.