LATEST NEWS
హైదరాబాద్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేస్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్  రెడ్డికి పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ   షోకాజ్ నోటీసు జారీ చేసింది.   పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని  పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి.   ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.   పార్టీ ప్రధాన కార్యదర్శి  సోమ భరత్ కుమార్ సంతకంతో.... బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జారీ చేసిన  ఈ నోటీసులో వారం రోజులలో పైలట్ రోహిత్ రెడ్డి తనపై  వచ్చిన డ్రగ్స్ ఆరోపణ లపై పూర్తి వివరాలతో కూడిన లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.  అలాగే, ఈ విషయంలో పార్టీ  తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలు,  అధికారిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉండాలని రోహిత్ రెడ్డిని ఆదేశించారు.  బీఆర్ఎస్ బాధ్యతా యుత రాజకీయ సంస్థగా చట్టపరమైన నిబంధనలు,  నైతిక విలువలను  పాటిస్తుందని, మాదకద్రవ్యాల వినియోగం వంటి అక్రమ కార్యకలాపా లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని ఆ షోకాజ్ నోటీసు పేర్కొంది.   పైలట్ రోహిత్ రెడ్డి పై వచ్చిన ఆరోపణలు పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే అంశంగా భావించి కఠిన వైఖరి అవలంబించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా, నోటీసులో పేర్కొన్న గడువులోపు సంతృప్తికర మైన వివరణ ఇవ్వకపోతే..  ఎటువంటి అదనపు నోటీసు లేకుండానే క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకుం టామని కూడా పైలట్ రోహిత్ రెడ్డిని హెచ్చరించింది. దీంతో ఇప్పుడు రోహిత్ రెడ్డి తనకు అందిన షోకాజ్ నోటీసుకు ఇచ్చే వివరణ, ఆ పై బీఆర్ఎస్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది.  
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో  ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు తీసుకున్న కొన్ని నిర్ణయాలను సవాల్ చేస్తూ ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తలుపుతట్టారు. ఈ కేసు విచారణ ప్రక్రియలో తనకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ ఆయన   పిటిషన్ దాఖలు చేశారు.  ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద  విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.   ఇంతకు ముందే  కేజ్రీవాల్ ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయను విచారణను వేరే బెంచ్ కు మార్చాలని కోరిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన వినతిని తోసిపుచ్చారు. రోస్టర్ నిబంధనల ప్రకారం కేసు కేటాయింపు జరిగిందనీ, విచారణ నుంచి తప్పుకోవాలా వద్దా అనేది   న్యాయమూర్తి విచక్షణకే వదిలేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు అదే తిరస్కరణను కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మరోవైపు, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ దర్యాప్తు అధికారిపై విచారణ జరపాలంటూ గతంలో ట్రయల్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను జస్టిస్ స్వర్ణకాంత శర్మ నిలిపివేశారు. ఈ నిర్ణయాన్ని కూడా కేజ్రీవాల్ తన పిటిషన్‌లో సవాల్ చేశారు.   
తెలంగాణ అసెంబ్లీ వేదికగా సరదా సన్నివేశం చోటుచేసుకుంది.  . బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు..  బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య జరిగిన సరదా సంభాషణ నవ్వుల పువ్వులు పూయించింది.  తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలి రోజు  ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.  ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం నేతలందరూ అసెంబ్లీ లాబీల్లోకి వచ్చారు.  ఆసమయంలో సమయంలో   రాజాసింగ్,  కేటీఆర్ ఒకరికొకరు ఎదురుపడ్డారు.  కొద్ది సేపు ఇరువురూ నవ్వుతూ ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ఫొటోలు తీస్తుంటే.. కేటీఆర్ రాజాసాంగ్ ను ఆటపట్టిస్తూ మనం ముచ్చటించుకుంటుంటే చూసే వారు ఇంకేదో అనుకునే చాన్స్ ఉందంటూ సరదాగా వ్యాఖ్యానించడంతో అక్కడ నవ్వులు విరిశాయి. ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు.  రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   కాగా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు, బడ్జెట్ కేటాయింపులపై పెద్ద ఎత్తున యుద్ధం నడుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్న ఎమ్మెల్యేల అంశంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య కేటీఆర్, రాజాసింగ్ మధ్య జరిగిన సరదా సంభాషణ వాతావరణాన్ని తేలిక చేసిందని చెప్పవచ్చు.   అయితే  ఇదొక రాజకీయ వ్యూహంగా కొందరు పేర్కొంటున్నారు. రానున్న రోజులలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలకు ఇది సంకేతంగా చెబుతున్నారు.  ఈ సరదా సంభాషణ ద్వారా కేటీఆర్.. బీజేపీకి స్నేహహస్తం సాచారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీతో బీఆర్ఎస్ సన్నిహితంగా మెలుగుతోందనీ, ఒక దశలో పార్టీని బీజేపీలో విలీనం చేయాలన్న చర్చ కూడా జరిగిందనీ ఇటీవలి కాలంలో కవిత చేసిన విమర్శలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.   
ALSO ON TELUGUONE N E W S
  -సోషల్ మీడియాలో వైరల్ గా మారిన న్యూస్  -అభిమానుల రియాక్షన్ ఏంటి  -ఆ క్లాస్ మేట్ ఎవరు ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)అనే పేరుకి ఉన్న బ్రాండ్ కెపాసిటీ ఏ పాటిదో తెలిసిందే. దీంతో అల్లు అర్జున్ నామస్మరణ లేకుండా సోషల్ మీడియాకి పొద్దు పొడవని పరిస్థితి. అభిమానులతో పాటు ఇండియన్ సినీ సర్కిల్స్ లో కూడా సేమ్ సిట్యువేషన్. ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ కి సంబంధించిన కొత్త న్యూస్ కోసం వెతకడం వాళ్లందరికీ రోజు వారి దినచర్యలో భాగం. ఈ క్రమంలో లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో సోషల్ మీడియాతో పాటు వాళ్లందరికీ సరికొత్త జోష్ వచ్చినట్లయింది.ఆ న్యూస్ ఏంటో చూద్దాం. అల్లు అర్జున్ ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు  క్లాస్‌లో తన పక్కన కూర్చునే అబ్బాయి చాలా సైలెంట్‌గా ఉండేవాడు. అల్లు అర్జున్, ఆ అబ్బాయి స్కూల్ కి వచ్చినప్పుడు,వెళ్ళేటప్పుడు మాత్రమే పలకరించుకునే వాళ్ళు. ఒకసారి ఫ్రెండ్  నాలుగైదు రోజులు కాలేజీకి రాలేదు. ఏమైందని ఆరా తీస్తే అతని పేరెంట్స్ చనిపోయారని తెలిసింది. దీంతో అల్లు అర్జున్ చాలా బాధపడ్డాడు. కొన్ని రోజుల తర్వాత   ఒక హోటల్‌కి వెళితే తన క్లాస్‌ మేట్‌ హోటల్లో పని చేస్తూ కనిపించాడు. ఇక్కడేంటి అని అడిగితే, పేరెంట్స్ లేరు, ఫీజు కట్టలేని, చదువు మానేస్తున్నా అని అతను చెప్పాడు . దీంతో అల్లు అర్జున్.ఇంటికెళ్లి తల్లి నిర్మల(Allu Nirmala)తో విషయాన్ని చెప్పడంతో ఆమె వెంటనే ఫ్రెండ్  ని ఇంటికి తీసుకురమ్మని చెప్పింది. అతన్ని  తన సొంత బిడ్డలా భావించి, అతడి బాధ్యతని తీసుకుని వాళ్ళ ఇంట్లోనే ఉంచి చదివించారు.  also read: Rashmika Mandanna: రష్మిక ఆసక్తికర పోస్ట్.. ఆ హీరో నా టీం మెంబర్ ఒక తల్లిగా ఆమె తీసుకున్న ఈ నిర్ణయం అల్లు అర్జున్‌పై తీవ్ర ప్రభావం చూపింది. కష్టాల్లో ఉన్న స్నేహితుడిని ఆదుకోవడం ఎంత గొప్ప విషయమో అల్లు అర్జున్ కి ఆ రోజే అర్థమైంది. పైగా స్నేహితులు చాలా ముఖ్యమని కూడా నిర్మల గారు చెప్పడంతో నేటికీ స్నేహానికి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ మంచి చెడులు అల్లు అర్జున్  చూసుకుంటు ఉంటాడు. ఇప్పుడు ఈ న్యూస్ నే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాల విషయానికి వస్తే అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీని శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ తో చేయబోతున్నాడు. ఈ మేరకు అధికార ప్రకటన రావడంతో పాటు ఈ సంవత్సరమే షూటింగ్ స్టార్ట్ కానుంది.    
  - 'దీపావళి బోనస్' ఓటీటీలో ఎక్కడ చూడాలంటే? - ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా 'దీపావళి బోనస్' - మధ్యతరగతి తండ్రి ఆవేదనకు తెరరూపం నేటి కాలంలో కమర్షియల్ సినిమాల కంటే మట్టి వాసన ఉన్న కథలకే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సామాన్యుల జీవితాల్లోని కష్టసుఖాలను, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల భావోద్వేగాలను కళ్లకు కట్టినట్లు చూపే సినిమాలు ఎప్పుడూ స్పెషలే. తాజాగా అలాంటి కోవకు చెందిన తమిళ చిత్రం 'దీపావళి బోనస్' ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' లో డిజిటల్ సందడి చేస్తోంది. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. మధురై నేపథ్యంలో సాగే ఒక మధ్యతరగతి కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఒక కొరియర్ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేసే రవి (విక్రాంత్), ఇళ్లలో పనిచేసే అతని భార్య గీత (రిత్విక), వారి కుమారుడు సచిన్.. ఇలా వీరి చిన్న ప్రపంచంలో దీపావళి పండుగ ఎంతటి ప్రాధాన్యతను సంతరించుకుంది అనేది ప్రధానాంశం. తన కొడుకు కోరుకున్న బట్టలు, వస్తువులు కొనివ్వడం కోసం ఆ తండ్రి ఆశగా ఎదురుచూసే 'దీపావళి బోనస్' సమయానికి అందకపోతే ఆ కుటుంబం ఎదుర్కొనే సంఘర్షణ గుండెలను పిండేస్తుంది. నటుడు విక్రాంత్ తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒక సామాన్య తండ్రి పడే తపనను ఆయన అద్భుతంగా పండించారు. ఇక జాతీయ అవార్డు గ్రహీత రిత్విక తన సహజ నటనతో ఇల్లాలు గీత పాత్రలో ఒదిగిపోయారు. దర్శకుడు జయబాల్ జె ఎక్కడా సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా, చాలా వాస్తవికంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మధురై పట్టణ వాతావరణం, అక్కడి మనుషుల జీవనశైలిని సినిమాటోగ్రాఫర్ గౌతమ్ సేతురామ్ ఎంతో సహజంగా చూపించారు. నిజానికి గత ఏడాది వచ్చిన 'కిడా' వంటి చిత్రాల తరహాలోనే ఇది కూడా ఒక సున్నితమైన పాయింట్ తో సాగుతుంది. చిన్న చిన్న సంతోషాల కోసం పేదవారు పడే తాపత్రయం, ఆ కష్టాల్లోనూ వారు చూపించే మానవత్వం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. మరి పండుగ పూట ఆ కుటుంబం ఆశించిన బోనస్ లభించిందా? ఆ పిల్లాడి కోరిక తీరిందా? అన్నది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వీక్షించాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ కనిపిస్తోంది. పెద్ద పెద్ద యాక్షన్ సినిమాలు చూసి విసుగు చెందిన వారు, ఒక స్వచ్ఛమైన ఫీల్ గుడ్ మూవీని చూడాలనుకునే వారు తప్పకుండా 'దీపావళి బోనస్' ను ఆహాలో ట్రై చేయవచ్చు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ ఎమోషనల్ డ్రామా మీ వీకెండ్ ని మరింత అర్థవంతంగా మారుస్తుందనడంలో సందేహం లేదు.
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) ఫిబ్రవరి 26న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే ఈ జంట, తమ పెళ్లికి సంబంధించిన ఒక్కో వేడుక ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఈ స్టార్ కపుల్ తమ హల్దీ వేడుకకు సంబంధించిన అద్భుతమైన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. (ViRosh Haldi) రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 25న ఈ హల్దీ ఈవెంట్ అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకలో విజయ్, రష్మిక ఇద్దరూ పసుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయారు. ఒకరిపై ఒకరు పసుపు నీళ్లు చల్లుకుంటూ ఎంతో సరదాగా గడిపిన క్షణాలు ఈ ఫోటోలలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.   
    -రష్మిక, విజయ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు -ఇప్పుడెందుకు రష్మిక పోస్ట్ చేసింది -సదరు పోస్ట్ ఆంతర్యమేంటి! ప్రేమ సఫలమై పెళ్లి చేసుకున్న జంట మనస్ఫూర్తిగా ఎంత ఆనందంగా అయితే  ఉంటుందో  విజయ్(Vijay deverakonda),రష్మిక(Rashmika)దేవరకొండని చూస్తే అర్ధం అవుతుంది. వివాహం జరిగే రోజుకి  ముందు నుంచే పలు రకాల ఫంక్షన్స్ ని ఏర్పాటు చేసి ఆ సంతోషకరమైన క్షణాలు తమ నుంచి దూరం కాకుండా లైఫ్ లాంగ్ తోడుండాలనే ఆకాంక్ష వాళ్ళ ముఖాల్లో స్పష్టంగా కనపడింది. ఈ క్రమంలో హల్ది వేడుక కూడా జరుపుకున్నారు. అందుకు సంబంధించి జరిగిన ఒక సంఘటన గురించి రష్మిక రీసెంట్ గా పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ పోస్ట్ విజయ్, రష్మిక మధ్య ఉన్న అండర్ స్టాండ్ కి ప్రతిరూపంగా నిలుస్తుంది. మరి అదేంటో చూద్దాం. రష్మిక ఎక్స్ వేదికగా తన పోస్ట్ లో హల్దీ వేడుక హోలీ ని తలపించింది. నా జుట్టుపై పడిన రంగు ఇప్పటికి పోలేదు. ఆ రోజు నిర్వహించిన అన్ని పోటీల్లో నేనే గెలిచాను. నా టీం సహకారం వల్లే అది సాధ్యమయ్యింది. విజ్జు కూడా నా టీంనే అని తెలిపింది. ఈ విషయంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'రష్మిక,విజయ్ నిజంగా గ్రేట్. పోటీల్లో ఇద్దరు అపోజిట్ గా ఉండకుండా ఓకే జట్టులో ఆడి గెలవడం చూస్తుంటే ఆ ఇద్దరు సరదాగా కూడా ప్రత్యర్థులుగా ఉండటానికి ఇష్టపడలేదనే కామెంట్స్ చేస్తున్నారు. Also read: Ustaad Bhagat singh: ఉస్తాద్ ఊచకోత స్టార్ట్.. ఆ ఏరియాలో రికార్డుల వేట  ఇక ఈ ఇద్దరు అభిమానుల ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేలా 'రణబలి' మూవీలో జంటగా చేస్తున్నారు. పెళ్లి తర్వాత వస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. ఆ ఇద్దరి కాంబోలో వస్తున్న మూడవ సినిమా రణబలి.    
మరో వారసుడు ఎంట్రీకి ముహూర్తం ఖరారు హీరోగా ప్రభుదేవా తనయుడు డైరెక్టర్ గా శేఖర్ మాస్టర్ టాలీవుడ్ వెండితెరపై మరో స్టార్ వారసుడు అడుగుపెట్టబోతున్నాడు. భారతీయ సినిమా రంగంలో 'ఇండియన్ మైఖేల్ జాక్సన్'గా నీరాజనాలు అందుకున్న ప్రభుదేవా(Prabhu Deva) తనయుడు రిషిల్ రాఘవేంద్ర దేవా త్వరలో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ మెగా లాంచ్ వెనుక ఒక క్రేజీ కాంబినేషన్ ఉండటం ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్(Sekhar Master) ఈ సినిమా ద్వారా దర్శకుడిగా మెగా ఫోన్ పట్టబోతుండటం విశేషం. ఇప్పటివరకు వెండితెరపై తన స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన శేఖర్ మాస్టర్, ఇప్పుడు ప్రభుదేవా వారసుడిని వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను భుజాన వేసుకున్నారట. ఓ వైపు ప్రభుదేవా కొడుకు హీరోగా ఎంట్రీ, మరోవైపు శేఖర్ మాస్టర్ డైరెక్టర్ గా ఎంట్రీ అవుతుండటంతో.. ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. సుందరం మాస్టర్ వారసుడిగా వచ్చిన ప్రభుదేవా, అటు డాన్సర్‌గా, ఇటు నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి మూడవ తరం వారసుడిగా రిషిల్ ఇండస్ట్రీలోకి వస్తుండటంతో అటు ఫ్యాన్స్‌లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ ఆసక్తి నెలకొంది. రిషిల్ చూడటానికి అచ్చం తండ్రి ప్రభుదేవాలానే ఉండటం ఈ సినిమాకు మరో ఆకర్షణ కానుంది. ఈ సినిమా కథాంశం ప్రధానంగా మ్యూజిక్, డాన్స్ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఒక డాన్స్ మాస్టర్ కొడుకును మరో స్టార్ కొరియోగ్రాఫర్ డైరెక్ట్ చేస్తుండటంతో, సినిమాలో అదిరిపోయే డాన్స్ మూమెంట్స్ ఉండబోతున్నాయని అర్థమవుతోంది. గతంలో ప్రభుదేవా, లారెన్స్ వంటి వారు కొరియోగ్రాఫర్లుగా ఉండి దర్శకులుగా మారి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త తెలియగానే నెటిజన్లు రిషిల్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. "ప్రభుదేవా కొడుకు అంటే డాన్స్ మామూలుగా ఉండదు" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ టేకింగ్ ఎలా ఉండబోతుందో అని సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం, మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. మొత్తానికి ఒక సెన్సేషనల్ లాంచ్ కోసం టాలీవుడ్ సిద్ధమవుతోందని చెప్పవచ్చు.
ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే ‘ఆస్కార్’ వేడుకలంటే కేవలం అవార్డుల ప్రదానం మాత్రమే కాదు, దాని వెనుక కొన్ని దశాబ్దాల చరిత్ర, ఆసక్తికరమైన లెక్కలు ఉన్నాయి. ఏటా అత్యంత అట్టహాసంగా జరిగే ఈ వేడుక కోసం అకాడమీ సుమారు 500 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తుందంటే ఆశ్చర్యం కలగక మానదు. అతిథుల విందు నుంచి లైటింగ్ వరకు ప్రతి అంశం అత్యంత విలాసవంతంగా ఉంటుంది. అందరూ ఆస్కార్ అని పిలుచుకునే ఈ విగ్రహం అసలు పేరు 'అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్'. దీని బరువు దాదాపు 3.8 కేజీలు ఉంటుంది. ఇక ఈ అవార్డుల చరిత్రలో వాల్ట్ డిస్నీ సృష్టించిన రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. ఆయన ఏకంగా 26 ఆస్కార్లను గెలుచుకుని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. అలాగే మ్యూజిక్ లెజెండ్ జాన్ విలియమ్స్ 54 నామినేషన్లతో మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. 2010లో వ‌చ్చిన ది హ‌ర్ట్ లాక‌ర్ చిత్రానికి ఉత్త‌మ మ‌హిళా ద‌ర్శకురాలిగా తొలి అవార్డు అందుకున్నారు కేథ‌రిన్ బిగెలో. ఇక అత్య‌ధిక అవార్డులు అందుకున్న సినిమాల గురించి చెప్పాలంటే.. బెన్‌హ‌ర్‌, టైటానిక్‌, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ చిత్రాలు 11 ఆస్కార్‌లు సాధించి మొద‌టి వ‌ర‌స‌లో ఉన్నాయి.  సాధారణంగా అవార్డు అందుకున్న వారు వేదికపై మాట్లాడేందుకు కేవలం 45 సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. గతంలో కొందరు సుదీర్ఘంగా ప్రసంగించడంతో ఈ నిబంధనను తీసుకొచ్చారు. అయితే, ఇటీవల జరిగిన వేడుకల్లో అడ్రియన్ బ్రాడీ సుమారు 5 నిమిషాలకు పైగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. 1929లో కేవలం 12 విభాగాలతో మొదలైన ఈ ప్రయాణం, నేడు 24 కేటగిరీలకు చేరుకుంది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్ 2002 నుండి ఈ వేడుకలకు శాశ్వత చిరునామాగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు తమ అభిమాన నటీనటులు ఈ వేదికపై మెరవాలని కోరుకుంటారు. ముఖ్యంగా భారతీయ సినిమాలకు కూడా ఇటీవల కాలంలో ఆస్కార్ వేదికపై గుర్తింపు లభిస్తుండటం మన సినీ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రతి ఏటా ఆస్కార్ నామినేషన్ల దగ్గరి నుండి విజేతల ప్రకటన వరకు సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చలు జరుగుతుంటాయి. ఈ ఏడాది కూడా ఏ సినిమా ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది, ఏ నటుడు గోల్డెన్ విగ్రహాన్ని అందుకుంటాడనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. వచ్చే ఏడాది జరగబోయే వేడుకల్లో మరిన్ని కొత్త రికార్డులు నమోదవుతాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
    -రేపు బెనిఫిట్ షో నుంచి ఉస్తాద్ స్టార్ట్  -అభిమానుల్లో భారీ అంచనాలు  -పవన్ సాధించిన రికార్డు ఎక్కడ! 'ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా' అనే వర్డ్ కి తగ్గట్టుగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తన 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh)తో రిలీజ్ కి ముందే అభిమానులు కాలర్ ఎత్తుకునేలా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా ఒక అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకోవడమే ఇందుకు సాక్ష్యం. ఆ రికార్డు తాలూకు స్వరూపాన్ని చూసేద్దాం. నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ 250K డాలర్ల మార్కుని దాటేశాయి. ప్రీమియర్లకి ఇంకా ఒక రోజు సమయం ఉండగానే ఆ స్థాయి వసూళ్లు రావడం యుఏస్ బాక్సాఫీస్ వద్ద ఉస్తాద్ సృషించబోయే సునామీకి సంకేతంగా భావించవచ్చు. మరి ఈ లెక్కన ఫస్ట్ డే  సంబంధించి ఓవర్సీస్ లో పవన్ ఎంటైర్ కెరీర్ లోనే సరికొత్త రికార్డులు నెలకొల్పుతాడనే అభిప్రాయాన్ని అభిమానులతో పాటు ఉస్తాద్ ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రత్యంగిరా సినిమాస్ భావిస్తుంది. also read: Roja: ప్రముఖ హీరో ఇంటికి కోడలుగా రోజా కూతురు.. ఆ హీరో ఈయనేనా! ఇక తెలుగు నాట కూడా నిన్న ఈవినింగ్ నుంచి బుకింగ్స్ స్టార్ట్ చేయగా, నిమిషాల్లోనే హాట్ కేక్స్ లాగా టికెట్స్ అయిపోతున్నాయి. ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్, హరీష్ శంకర్(Harish Shankar),శ్రీలీల(Sreeleela),రాశిఖన్నా(Raashii Khanna), మైత్రి మూవీస్ అధినేతలు నవీన్(Naveen),రవిశంకర్(Ravishankar)స్పీచ్ తర్వాత అభిమానులైతే ఉస్తాద్ ఎలా ఉండబోతుందో అని తన శక్తీ కొలది ఊహించుకుంటున్నారు. ఉగాదికి వెల్ కమ్ చెప్తూ 19 న ఎంట్రీ ఇస్తున్నా 18  నుంచే ప్రీమియర్స్ ప్రదర్శించనున్న విషయం తెలిసిందే.     
    -వైరల్ మారిన రోజా కూతురు పెళ్లి న్యూస్  -ఎవరు ఆ స్టార్ హీరో  -రోజా స్పీచ్ ఏంటి! తెలుగు సినిమా, రోజా(Roja)కి మధ్య ఉన్న అనుబంధానికి సుదీర్ఘమైన హిస్టరీ నే ఉంది. దాదాపుగా అందరి అగ్ర హీరోలతోను జత కట్టి తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పరుచుకోగా, ఆమె నోటి నుంచి వచ్చిన చాలా సినిమా డైలాగ్స్ ఫుల్ ఫేమస్. బుల్లితెర ప్రేక్షకులని కూడా అలరిస్తూ వస్తున్న రోజా కూతురు పెళ్లికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్రెష్ గా చక్కర్లు కొడుతుంది. మరి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. రోజా కూతురు పేరు అన్షు మాలిక(Anshu Malika)ప్రస్తుతం అమెరికాలో ఉన్నత విద్యని అభ్యసిస్తుంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో అన్షు మాలిక  ఓ స్టార్ హీరో ఇంటికి  కోడలు కాబోతుందనే ప్రచారం జోరుగా జరుగుతుంది. త్వరలోనే పెళ్లి అని కూడా అంటున్నారు. రూమర్ హోదాలోనే చక్కర్లు కొడుతున్న ఈ న్యూస్ గతంలో కూడా తన రూమర్ కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వహించింది. ఆ టైంలో రోజా మాట్లాడుతు నా కూతురు పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. పైగా స్టార్ హీరో ఇంటి కోడలు కాబోతుందట అని అంటున్నారు. ఆ స్టార్ హీరో ఎవరో నాకు కూడా చెప్పండి. అలాంటి ప్రపోజల్స్ నేను ఎప్పుడు వినలేదు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్త నిజం కాదని చెప్పుకొచ్చింది. సో ఈ మాటలతో రూమర్ తలవంచుకునే పరిస్థితి.   aslo read: Vilangu: 7.9 రేటింగ్‌తో ఓటీటీని అల్లాడిస్తున్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులో ఉంది  అదే ఇంటర్వ్యూలో అన్షు మాలిక  హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తల పై స్పందించింది. రోజా మాట్లాడుతు భవిష్యత్తులో తన కూతురు యాక్టింగ్ ఫీల్డ్‌లోకి రావాలని అనుకుంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను. యాక్టింగ్ అనేది ఒక వరం. అది అందరికీ దొరకదు అని చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా పెళ్లి విషయంలో గాని, సినిమా విషయంలో గాని అంతిమ నిర్ణయం  రోజా, సెల్వమణి ల ముద్దుల కూతురు అన్షుదే.   
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
నేటికాలంలో ప్రతి ఇంట్లో వంట గ్యాస్ ఒక ప్రాథమిక అవసరంగా మారింది, కానీ  ప్రస్తుతం గ్యాస్ కొరత ఏర్పడిందని వస్తున్న వార్తల కారణంగా ప్రజల్లో భయం మొదలైంది. ఇంట్లో ఉన్న సిలిండర్ అయిపోతే   గ్యాస్ సిలిండర్లు దొరుకుతాయో లేదో అనే భయం చాలా మందిలో మొదలైంది. కొందరు భయంతో ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నా సరే.. మళ్లీ కొత్తగా బుక్ చేసుకుంటున్నారు.  గ్యాస్ సిలిండర్ కోసం కిలీమీటర్ల మేర క్యూ కట్టిన జనాన్ని వార్తల్లో కూడా చూపిస్తున్నారు. ఈ నైపథ్యంలో గ్యాస్ సిలిండర్ దొరుకుతుందా లేదా అని ఆలోచించేకంటే.. ఇంట్లో ఉన్న గ్యాస్ ను పదుపుగా వాడుకోవడం చాలా మంచిది. గ్యాస్ ను సేవ్ చేసే కొన్ని చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది.  ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. చాలా మంది వినియోగదారులకు దేశీయ LPG సిలిండర్ యొక్క అసలు బరువు గురించి తెలియదు. సరిగ్గా నింపిన సిలిండర్ బరువు దాదాపు 29.7 కిలోలు, ఇందులో 14.2 కిలోల గ్యాస్ మరియు 15.5 కిలోల ఖాళీ సిలిండర్ బరువు ఉంటుంది. డెలివరీ సమయంలో సిలిండర్ బరువు దీని కంటే తక్కువగా ఉంటే సీలింగ్ చేసే ముందు తక్కువ గ్యాస్ నింపబడిన లేదా తీసివేయబడిన స్కామ్‌ను ఇది సూచిస్తుంది. వంట చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. పాత్రల సెలక్షన్..  ఉపయోగించే వంట పాత్రల రకం కూడా  గ్యాస్ వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది. వంట చేసేటప్పుడు, ఎల్లప్పుడూ  అడుగున చదునుగా ఉన్న పాత్రలను ఎంచుకోవాలి.  ఈ  పాత్రలు బర్నర్‌పై సరిగ్గా కూర్చుంటాయి, తద్వారా గ్యాస్ వేడి నేరుగా పాత్రను చేరుతుంది. పాత్ర అడుగు భాగం వంకరగా  ఉంటే, వేడి వ్యాపిస్తుంద,  వంట సమయం ఎక్కువ అవుతుంది, ఫలితంగా గ్యాస్ వినియోగం పెరుగుతుంది. మీడియం ప్లేమ్.. అధిక వేడి మీద వంట చేయడం వల్ల ఆహారం త్వరగా ఉడుకుతుందని,  గ్యాస్ వినియోగం తగ్గుతుందని  అనుకుంటారు. అయితే, ఇది చాలా తప్పు. అధిక వేడి ఆహారాన్ని కాల్చేస్తుంది,  ఎక్కువ గ్యాస్‌ను కూడా వినియోగించుకుంటుంది. చాలా కూరగాయలు, పప్పులు,  బియ్యం మీడియం లేదా తక్కువ వేడి మీద మరింత సులభంగా,  సమర్ధవంతంగా వండవచ్చు, దీనివల్ల గ్యాస్ ఆదా అవుతుంది. ప్రెజర్ కుక్కర్.. వంట చేయడానికి వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్‌ను ఉపయోగించడం మేలు. ప్రెషర్ కుక్కర్‌లో ఆహారం తక్కువ సమయంలోనే ఉడుకుతుంది. ఇది గ్యాస్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. మూత పెట్టి వండటం.. వంట చేసేటప్పుడు పాత్రల మీద మూత పెట్టడం కూడా మంచి అలవాటు. మూత లేకుండా వంట చేయడం వల్ల ఆవిరి బయటకు వెళ్లి వంట ఆలస్యం అవుతుంది. మూత ఉపయోగించడం వల్ల ఆవిరి  ఆహారం వేగంగా ఉడుకుతుంది. దీనివల్ల గ్యాస్ కూడా ఆదా అవుతుంది. బర్నర్.. బర్నర్ శుభ్రతపై  శ్రద్ధ వహించాలి. బర్నర్ రంధ్రాలు మూసుకుపోయినా లేదా ధూళి పేరుకుపోయినా, గ్యాస్ సరిగ్గా మండదు, ఫలితంగా గ్యాస్ వినియోగం పెరుగుతుంది. అందువల్ల వారానికి ఒకసారి బర్నర్‌ను శుభ్రం చేసుకోవడం మంచిది. ఇది  మంట బాగా వచ్చేలా చేస్తుంది. గ్యాస్ వినియోగాన్ని తగ్గిస్తుంది.                                                   *రూపశ్రీ.
  ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టినా.. పెద్దయ్యాక జీవితాలు విడివడి దూరం పెరిగే బంధం తోబుట్టువుల బంధం. అయితే ఈ ప్రపంచంలో రక్త సంబంధానికి ఉన్న శక్తి, దాని ప్రత్యేకత చాలా గొప్పది. తల్లిదండ్రులకు చెప్పుకోలేని విషయాలు తోబుట్టువుకు చెప్పుకునే వారు ఎందరో ఉంటారు.   పిల్లల మధ్య ఉన్న తోబుట్టువుల బంధం  జీవితాంతం నిలిచే సంబంధం. ఈ బంధం ప్రేమతో, గౌరవంతో, పరస్పర సహకారంతో ఉండాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం.  తల్లిదండ్రులు చేసే  ప్రవర్తన,  ప్రేమ చూపే విధానం, మందలించే తీరు, పోలికలు పెట్టడం లాంటి వాటి వల్ల ఈ బంధం బలపడవచ్చు లేదా బలహీనమవచ్చు. తోబుట్టువుల బంధం బలంగా ఉండాలంటే తల్లిదండ్రులు నేర్పించాల్సినవి ఏంటో తెలుసుకుంటే.. తోబుట్టువుల బంధం బలంగా ఉండటానికి తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు.. సమాన ప్రేమ, గౌరవం.. తల్లిదండ్రులు పిల్లలను  అందరినీ సమానంగా ప్రేమించడం, గౌరవించడం చాలా ముఖ్యం. “నువ్వు పెద్దవాడివి కాబట్టి ఎప్పుడూ తక్కువగా వాదించు” లేదా “నువ్వు చిన్నవాడివి, నీ అక్క/అన్న మాట విను” అనే మాటలు కొన్నిసార్లు అన్యాయంగా అనిపిస్తాయి. పిల్లలు ఇద్దరూ తల్లిదండ్రుల దృష్టిలో సమానమైనవారమనే భావన కలిగి ఉండాలి. ఇది అసూయ లేదా అసమానత ఫీలింగ్ రాకుండా చేస్తుంది.  సహకారం, పంచుకోవడం నేర్పించాలి.. చిన్నప్పటి నుంచే కలిసి ఆటలు ఆడించడం, పని చేయించడం, ఒకరికొకరు సహాయం చేసుకోడం అలవాటు చేయాలి. కలసి చేసే పనులు జట్టు భావన,  బాధ్యతా భావం పెంచుతాయి. కష్టాలు, ఇబ్బందులు పంచుకోవడం..  పిల్లలు తమ ఇబ్బందులను ఒకరితో ఒకరు చెప్పుకోవడం, ఒకరికి ఒకరు సహాయం చేసుకోడం, ఒకరి ఇబ్బందులలో మరొకరు తోడు ఉండటం చిన్నతనం నుండే తల్లిదండ్రులు నేర్పించాలి. దీనివల్ల తోబుట్టువు అంటే ధైర్యం, భరోసా ఏర్పడతాయి.  వివాదాలు వచ్చినప్పుడు న్యాయంగా వ్యవహరించడం.. తల్లిదండ్రులు పిల్లల పట్ల న్యాయంగా ఉండాలి. ఎప్పుడు ఒకరికే తమ సపోర్ట్ ఇవ్వడం, తప్పు చేయకపోయినా ఇంకొకరిని తిట్టడం లాంటివి చేయకూడదు. వివాదాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకరి వెంట మరొకరు ఎలా సపోర్ట్ ఉండాలో కూడా నేర్పించాలి.  పోలికలు కాదు ప్రోత్సాహం ఇవ్వడం.. “నీ తమ్ముడు బాగా చదువుతున్నాడు, నువ్వు ఎందుకు చదవడం లేదు?” లాంటి పోలికలు బంధాన్ని పాడుచేస్తాయి. ప్రతిఒక్కరి బలాలు వేరు.  ఒకరు చదువులో, మరొకరు క్రీడల్లో మెరుస్తారు.  “నీకు వంట బాగా వస్తుంది, నీ అక్క డ్రాయింగ్ బాగా వేస్తుంది”  ఇలాంటి మాటలు  వల్ల ఇద్దరూ తమతమ ప్రతిభను గౌరవిస్తారు.   సమయం కేటాయించడం.. పిల్లలతో సమయం గడపడటం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా పిల్లల అభిరుచిని బట్టి వారికి సమయాన్ని కేటాయించాలి.  ఇలా చేస్తే పిల్లలందరికీ తల్లిదండ్రులు “నన్ను ప్రత్యేకంగా చూసుకుంటున్నారు” అనే భావన వస్తుంది.  ఇది అసూయ తగ్గిస్తుంది. ప్రేమ చూపే విధానం నేర్పించడం.. తోబుట్టువులు ఒకరికి ఒకరు ప్రేమ చూపడం, క్షమించుకోవడం నేర్పించాలి. “అన్నకు sorry చెప్పు” అనడం కాకుండా, “నీ మాట వల్ల అన్నకి బాధ కలిగింది, ఇప్పుడు ఎలా సరిచేస్తావు?” అని అడగాలి.  ఇది మనసును అర్థం చేసుకునే నైపుణ్యాన్ని పెంచుతుంది.                           *రూపశ్రీ.
వేసవి కాలం అనగానే చాలామందికి కూలర్లు, ఏసీలు గుర్తుకు వచ్చేస్తాయి.  ఫిబ్రవరి నెల వరకు అంతగా అవసరం లేని, ఎక్కువగా వాడని వారు కూడా మార్చి నెలతో ఏసీలు వాడటం మొదలు పెడతారు. ఏసీ ఎంత చల్లదనం ఇస్తుందో.. అంతే కరెంట్ బిల్లు కూడా తెచ్చిపెడుతుంది.  ఏసీని ఎక్కువగా వాడితే వేలాది రూపాయల కరెంట్ బిల్లు వస్తుంది.  ఈ కారణంగానే చాలామంది మధ్యతరగతి కుటుంబాలు ఏసీ పెట్టించుకోవాలి అనే ఆశ ఉన్నా, కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందనే భయంతో ఆ ఆలోచన మానుకుంటారు. అయితే ఏసీ రోజంతా వాడినా సరే.. కరెంట్ బిల్లు ఎక్కువ రాకూడదంటే కొన్ని సీక్రెట్ ట్రిక్స్  ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకుంటే.. టెంపరేచర్... చాలామంది ఏసీ ఆన్ చేశారంటే తక్కువ టెంపరేచర్ సెట్ చేసుకుంటారు.  ఎక్కువ మంది 17 లేదా 15 వరకు కూడా పెడుతుంటారు. కానీ ఏసీ ని ఎప్పుడూ 26డిగ్రీల వద్ద పెడితే సరిపోతుంది.  ఇది రూమ్ మొత్తం చల్లదనాన్ని ఇస్తుంది. కరెంట్ బిల్లు కూడా తక్కువ వస్తుంది. ఏసీ, ప్యాన్ కాంబినేషన్.. ఏసీ, ప్యాన్ కాంబినేషన్ గురించి చాలామందికి తెలియదు.  ఏసీ వేసినప్పుడు ప్యాన్ ఎందుకు అని కొందరు అనుకుంటారు.  కానీ ఏసీ వేసినప్పుడు కొద్దిసేపు ఫ్యాన్ కూడా ఆన్ చేయాలి.  ఇలా చేస్తే గది తొందరగా చల్లబడుతుంది. ఆ తర్వాత ఫ్యాన్ ఆప్ చేసుకోవచ్చు. డోర్స్, విండోస్.. చాలామంది ఏసీ ఆన్ చేసి డోర్స్, విండోస్ తెరచి ఉంచుతారు. కానీ ఇది చాలా తప్పు.  డోర్స్, విండోస్ తెరచి ఉంచడం వల్ల బయటి వేడి గాలి లోపలి వస్తూ గదిని చల్లబడనివ్వదు.  దీనివల్ల ఏసీ ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. కర్టెన్లు.. కిటికీలకు గాజు అద్దాలు ఉంటే.. వేడి సెగ అనేది లోపలికి వస్తూ ఉంటుంది.  అందుకే కిటికీ ల దగ్గర కర్టెన్లు వేయాలి.  ఇలా చేస్తే వేడి లోపలికి రాదు. ఫిల్టర్.. చాలామంది వేసవి రాగానే ఏసీ వేయాలి అనే ఆలోచన ఉంటుంది కానీ,  ఏసీ ఫిల్టర్ల గురించి మాత్రం అంతగా పట్టించుకోరు.  ఏసీ ఫిల్టర్లను క్లీన్ చేయాలి.  వాటిలో డస్ట్ అలాగే ఉంటే ఏసీ పని చేయడానికి విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతుంది. పైగా ఫిల్టర్ల లో ఉండే డస్ట్ కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది.  శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. స్లీప్ మోడ్ లేదా టైమర్.. వేసవిలో కాసింత చల్లగాలి తగిలితే చాలు నిద్రపోవచ్చు అనుకునేవారు ఏసీని  ఆన్ చేసినప్పుడు స్లీప్ మోడ్ లేదా టైమర్ సెట్ చేసుకోవడం మంచిది. ఇది సెట్ చేస్తే ఏసీ దానంతకు అదే ఆఫ్ అవుతుంది.  ఇది సెట్ చేసుకొనేటప్పుడు రూమ్ లో ప్యాన్ ఆన్ లో ఉంచితే.. ఏసీ ఆప్ అయినా ఫ్యాన్ కారణంగా నిద్రకు ఆటంకం కలగకుండా హాయిగా నిద్రపోవచ్చు. పైన చెప్పుకున్న చిట్కాలు పాటిస్తే ఏసీ ఎంత వాడినా సరే.. కరెంట్ బిల్లు హడలిపోయేంతగా రాదు.  ఖచ్చితంగా విద్యుత్ బిల్లును ఆదా చేసుకోవచ్చు.                                        *రూపశ్రీ.
డ్రై ఫ్రూట్స్ శరీరానికి చాలా మంచివని చెబుతారు.  డ్రై ఫ్రూట్స్  రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి మంచి పోషకాలను,  ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.  అయితే డ్రై ఫ్రూట్స్ శరీరానికి ఎంత మంచివో.. వాటిలో ఎంత మంచి పోషకాలు ఉంటాయో.. వాటిని తీసుకునే విధానం సరిగా లేకపోతే అవన్నీ వ్యర్థమయినట్టే అని అంటున్నారు పోషకాహార నిపుణులు, వైద్యులు.. అంతేకాదు.. ఏ డ్రై ఫ్రూట్స్ లేదా నట్స్ శరీరంలో ఏ అవయవానికి మేలు చేస్తుందో తెలుసుకుని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం అంటున్నారు.  వీటి గురించి పూర్తీగా తెలుసుకుంటే.. బాదం.. బాదంలో పోషకాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఇ, మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.  ప్రయోజనాలు.. మెదడును పదును పెట్టి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.  చర్మాన్ని ఆరోగ్యంగా,  యవ్వనంగా ఉంచుతుంది.   ఎముకలను బలపరుస్తుంది,  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాల్నట్.. వాల్నట్స్ లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B6 వంటి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు.. వాల్నట్స్ ముఖ్యంగా మెదడు ఆరోగ్యానికి,   జ్ఞాపకశక్తికి అద్భుతమైనది.  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.   వాపు,  ఉద్రిక్తతను తగ్గిస్తుంది. జీడిపప్పు.. జీడిపప్పులో మెగ్నీషియం, ప్రోటీన్, భాస్వరం, జింక్ వంటి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు.. జీడిపప్పు  ఎముకలు, దంతాలను బలపరుస్తుంది.  చర్మానికి,  జుట్టుకు మంచిది. గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. పిస్తా పప్పు.. డ్రై ఫ్రూట్స్ లో పిస్తా పప్పు కూడా ఖరీదైనది.  పిస్తా పప్పులో ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ B6 వంటి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు..   పిస్తా పప్పు గుండె,  రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.  బరువు నియంత్రణ,  జీర్ణక్రియకు సహాయపడుతుంది.  మెదడు,  కళ్ళకు మేలు చేస్తుంది. ఎండు ద్రాక్ష.. ఎండు ద్రాక్ష భారతీయులు ఎక్కువగా ఉపయోగించే, ఎంతో కాలం నుండి వాడుతున్న డ్రై ప్రూట్..  ఎండు ద్రాక్షలో ఐరన్, కాల్షియం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.  ప్రయోజనాలు..   రక్తహీనతను తొలగించడంలో ఎండుద్రాక్ష చాలా బాగా పనిచేస్తుంది. ఎముకలు,  దంతాలను బలపరుస్తుంది. కడుపు ఆరోగ్యానికి  జీర్ణక్రియకు మంచిది. అంజీర్.. అంజీర్ చాలా శక్తివంతమైన డ్రై ఫ్రూట్. అంజీర్ లో ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు..  జీర్ణక్రియ,  మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.  ఎముకలు,  దంతాలను బలపరుస్తుంది. గుండె,  రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఖర్జూరం.. ఖర్జూరానికి చాలా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.  ఖర్జూరంలో సహజ చక్కెరలు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంచి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు..    ఖర్జూర పండ్లు తింటే తక్షణ శక్తిని ఇస్తుంది. రక్తాన్ని మెరుగుపరచడంలో,  బలహీనతను తొలగించడంలో సహాయపడుతుంది. గుండె,  కండరాలకు ప్రయోజనకరంగా ఉంటుంది.                                               *రూపశ్రీ.
వేసవి వచ్చేసింది. వేసవి కాలం దానితో పాటు మండే ఎండలు,  ఎండ వేడిని వెంట పెట్టుకుని వస్తుంది. ఈ సీజన్‌లో చెమట, శరీరం తేమ కోల్పోవడం,   నిరంతరం  అలసటగా అనిపించడం వంటి సమస్యలు పెరుగుతాయి. పెరుగుతున్న వేడి,  వేడిగాలుల కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.  వేసవి కాలంలో  హైడ్రేటెడ్ గా ఉండటానికి నీరు తాగుతారు,  కానీ అది శరీరాన్ని చల్లబరచదు. ఎన్ని నీళ్లు తాగినా తృప్తి కలగదు.  మార్కెట్ లో పానీయాలు కొనుగోలు చేయడం,  మరీ ముఖ్యంగా కూల్ డ్రింకుల కొనుగోలు వేసవిలో బాగా పెరుగుతాయి. కానీ వీటిలో రసాయనాలు ఉంటాయి.  ఈ వేసవిలో శరీరం చల్లగా ఉండాలంటే ఇంట్లోనే చేసుకోదగిన కొన్ని పానీయాలు తీసుకోవడం మంచిది. భారతీయులకు ఎంతో సుపరిచితమైన,  ఆరోగ్యానికి మేలు చేస్తూ వేసవి తాపాన్ని తగ్గించే పానీయాలు ఏంటో తెలుసుకుంటే.. బేల్ షర్బత్.. పరమ శివుడి ఆరాధనలో ఉపయోగించే బిల్వ  పత్రం మాత్రమే మనకు తెలుసు. కానీ బిల్వ వృక్షానికి పండ్లు కూడా కాస్తాయి.  వీటినే బిల్వ పండ్లు లేదా బేల్ పండ్లు అని మారేడు కాయలు అని అంటూ ఉంటారు.  ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. బాగా పండిన బిల్వ పండ్లను జ్యూస్ చేసి తాగితే శరీరం చల్లబడుతుంది. కావలసిన పదార్థాలు.. పండిన బిల్వ పండు చల్లని నీరు.. 4 గ్లాసులు బెల్లం లేదా చక్కెర.. 3 నుండి 4 స్పూన్లు నల్ల ఉప్పు.. కొద్దిగా. తయారు విధానం.. బిల్వ పండును పగలగొట్టి గుజ్జు తీయాలి.  ఈ గుజ్డులో నీరు పోసి బాగా బ్లెండ్ చేయాలి.  స్ట్రైయినర్ సహాయంతో వడబోయాలి. ఇందులో బెల్లం లేదా పంచదార,  నల్ల ఉప్పు వేసి బాగా కరిగిన తర్వాత తాగాలి. ఆమ్ పన్నా.. వేసవి అంటే మామిడికాయలు.  పచ్చి మామిడి కాయలతో చేసే ఆమ్ పన్నా రుచిగానే కాకుండా శరీరానికి చలువ చేస్తుంది. కావలసిన పదార్థాలు.. పచ్చి మామిడికాయలు.. 2 బెల్లం లేదా చక్కెర.. 3 టీస్పూన్లు వేయించిన జీలకర్ర పొడి నల్ల ఉప్పు పుదీనా.. తయారీ విధానం.. మామిడికాయలు ఉడకబెట్టి గుజ్జు తీసుకోవాలి.  గుజ్జులో బెల్లం లేదా చక్కెర వేయాలి. ఇందులో కాసింత పుదీనాను వేసి మిక్సీ వేసుకోవాలి.  దీనికి కావలసినంత నీరు కలిపి జ్యూస్ లాగా చేసుకోవాలి. ఇందులో వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు వేసి కలిపి తాగాలి.  ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. జల్ జీరా.. జల్ జీరా పేరు వింటేనే ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది.  ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం,  శరీరానికి చలువ,  గ్యాస్, అజీర్ణం నుండి ఉపశమనం కూడా ఇస్తుంది. కావలసిన పదార్థాలు.. జల్ జీరా పొడి నీరు పుదీనా నిమ్మరసం నల్ల ఉప్పు తయారీ విధానం.. చల్లని నీటిలో జల్ జీరా పొడి,  నిమ్మరసం, నల్ల ఉప్పు,  పుదీనా అన్నీ వేసి బాగా కలిపి తాగడమే.   సత్తు జ్యూస్.. బీహార్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలలో సత్తును వేసవిలో  తాగుతారు. ఇది చాలా శక్తివంతమైన పానీయం.  కడుపును చల్లబరుస్తుంది,  ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది. కావలసిన పదార్థాలు.. సత్తు పొడి.. నల్ల ఉప్పు.. వేయించిన జీలకర్ర పొడి నిమ్మరసం తయారీ విధానం.. నీటిలో సత్తు పొడి, నల్ల ఉప్పు,  వేయించిన జీలకర్ర పొడి అన్ని వేసి బాగా మిక్స్ చేయాలి.  ఇందులో కాసింత నిమ్మరసం కలిపి తాగాలి. మజ్జిగ.. బారతీయులు ఎక్కువగా తాగే ఆరోగ్యకరమైన పానీయం మజ్జిగ.  పెరుగు నుండి  వెన్నను తీయగా మిగిలిన పానీయమే మజ్జిగ.  ఈ మజ్జిగ మరింత రుచిగా ఉండటానికి ఇందులో అల్లం, వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు,  పొదీనా వేసి తాగుతారు.  మజ్జిగ మరింత రుచిగా రావడానికి కరివేపాకుతో పోపు పెట్టి తాగుతారు.  ఇందులో కొత్తి మీర వేసుకుంటే రుచి మరింత బాగుంటుంది.                               *రూపశ్రీ.