ఏ డ్రై ఫ్రూట్ తింటే ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందంటే..!

posted on: Mar 16, 2026 3:04PM

డ్రై ఫ్రూట్స్ శరీరానికి చాలా మంచివని చెబుతారు.  డ్రై ఫ్రూట్స్  రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి మంచి పోషకాలను,  ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.  అయితే డ్రై ఫ్రూట్స్ శరీరానికి ఎంత మంచివో.. వాటిలో ఎంత మంచి పోషకాలు ఉంటాయో.. వాటిని తీసుకునే విధానం సరిగా లేకపోతే అవన్నీ వ్యర్థమయినట్టే అని అంటున్నారు పోషకాహార నిపుణులు, వైద్యులు.. అంతేకాదు.. ఏ డ్రై ఫ్రూట్స్ లేదా నట్స్ శరీరంలో ఏ అవయవానికి మేలు చేస్తుందో తెలుసుకుని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం అంటున్నారు.  వీటి గురించి పూర్తీగా తెలుసుకుంటే..

బాదం..

బాదంలో పోషకాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఇ, మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.

 ప్రయోజనాలు..

మెదడును పదును పెట్టి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.  చర్మాన్ని ఆరోగ్యంగా,  యవ్వనంగా ఉంచుతుంది.   ఎముకలను బలపరుస్తుంది,  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

వాల్నట్..

వాల్నట్స్ లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B6 వంటి పోషకాలు ఉంటాయి.

 ప్రయోజనాలు..

వాల్నట్స్ ముఖ్యంగా మెదడు ఆరోగ్యానికి,   జ్ఞాపకశక్తికి అద్భుతమైనది.  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.
  వాపు,  ఉద్రిక్తతను తగ్గిస్తుంది.

జీడిపప్పు..

జీడిపప్పులో మెగ్నీషియం, ప్రోటీన్, భాస్వరం, జింక్ వంటి పోషకాలు ఉంటాయి.

 ప్రయోజనాలు..

జీడిపప్పు  ఎముకలు, దంతాలను బలపరుస్తుంది.
 చర్మానికి,  జుట్టుకు మంచిది. గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.

పిస్తా పప్పు..

డ్రై ఫ్రూట్స్ లో పిస్తా పప్పు కూడా ఖరీదైనది.  పిస్తా పప్పులో ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ B6 వంటి పోషకాలు ఉంటాయి.

 ప్రయోజనాలు..
 
పిస్తా పప్పు గుండె,  రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.  బరువు నియంత్రణ,  జీర్ణక్రియకు సహాయపడుతుంది.  మెదడు,  కళ్ళకు మేలు చేస్తుంది.

ఎండు ద్రాక్ష..

ఎండు ద్రాక్ష భారతీయులు ఎక్కువగా ఉపయోగించే, ఎంతో కాలం నుండి వాడుతున్న డ్రై ప్రూట్..  ఎండు ద్రాక్షలో ఐరన్, కాల్షియం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

 ప్రయోజనాలు..

 
రక్తహీనతను తొలగించడంలో ఎండుద్రాక్ష చాలా బాగా పనిచేస్తుంది. ఎముకలు,  దంతాలను బలపరుస్తుంది. కడుపు ఆరోగ్యానికి  జీర్ణక్రియకు మంచిది.

అంజీర్..

అంజీర్ చాలా శక్తివంతమైన డ్రై ఫ్రూట్. అంజీర్ లో ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.

 ప్రయోజనాలు..

 జీర్ణక్రియ,  మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.  ఎముకలు,  దంతాలను బలపరుస్తుంది. గుండె,  రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.

ఖర్జూరం..

ఖర్జూరానికి చాలా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.  ఖర్జూరంలో సహజ చక్కెరలు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంచి పోషకాలు ఉంటాయి.

 ప్రయోజనాలు..

 
 ఖర్జూర పండ్లు తింటే తక్షణ శక్తిని ఇస్తుంది. రక్తాన్ని మెరుగుపరచడంలో,  బలహీనతను తొలగించడంలో సహాయపడుతుంది. గుండె,  కండరాలకు ప్రయోజనకరంగా ఉంటుంది.

                                              *రూపశ్రీ.

google-ad-img
    Related Sigment News
    • Loading...