దాసోహం శివ దాసోహం (శివరాత్రి స్పెషల్)

 

శివరాతిరి ఈ రోజు శివరాత్రి సందర్భంగా శివుడి గురించి తెలుసుకుందాం.... శివుడు ఆద్యంతాలు లేని వాడు. అతిశయించిన వాడు. రూపాతీతుడు. అందుకే....
వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం...శశిధరం వందే పశూనాం పతిమ్
వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుందప్రియమ్
వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరమ్....అని
ఆది శంకరుల వారు కీర్తించారు.
శివ అంటే కల్మషం లేని వాడు అని అర్ధం...
సత్వరజస్తమో గుణములేవీ అంటని వాడు.....
శివుడు జనన మరణాలకు అతీతుడు....అందుకే సదాశివుడు అన్నారు. అసలు పరమ శివుని ఆక్రుతిలో ఒక్కోదానికి
ఒక్కొక్క అర్ధం ఉంది. 
శివుని త్రిశూలం.....సత్వ రజస్తమో గుణాలకు ప్రతిరూపం...
ఢమరుకం....శబ్ద బ్రహ్మ స్వరూపం.....
శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి సంకేతం...
గంగా దేవి శాశ్వతానికి ప్రతీక...సర్పాలు జీవాత్మలు...
పులి చర్మం అహంకారాన్ని త్యజించమనటానికి....
కోరికలకు దూరంగా ఉండమనటానికి....కోరికలకు దూరంగా ఉండమని భస్మం పరిశుద్దతకు అని....అలాగే ఆయన పట్టుకున్న
నాలుగు జింక కాళ్ళు నాలుగు వేదాలకు ప్రతీకలని అంటారు.
నందీశ్వరుడు సత్ సాంగత్యానికి....నంది ధర్మదేవతలకు...
త్రినేత్రం అంటే మూడవ నేత్రం.....జానానికి సూచిక..


ఇలా పరమశివుడు నామధేయాల వివరాలలోకి వస్తే.....

1. ఆది దేవుడు
2. రుద్రుడు
3. పరమశివుడు
4. గంగాధరుడు
5. గౌరీపతి
6. నటరాజు
7. కైలాసాధిపతి
8. పశుపతి
9.గౌరీశంకరుడు
10. హరుడు
11. చంద్రమౌళి
12.ముక్కంటి
13.పాలాక్షుడు
14 చంద్రశేఖరుడు
15. నీలకంఠుడు
16. దక్షిణా మూర్తి   ఇలా ఎన్నో పేర్లతో స్వామి నామస్మరణం చేసుకుంటారు. ఆయనిచ్చే దీవెనలు తీసుకుంటారు.

 

 శివరాత్రి 

శివరాత్రి సందర్భంగా.... శివరాత్రి పర్వదిన వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం..
శంకరోతి ఇతి శంకరః అంటే శమము లేదా శాంతినిచేయువాడు అని అర్థము. దుఃఖమునందున్నవారికి ఉపశమనం... శివనామస్మరణ చేసినవారికి దినదినాభివృద్ధి  కలుగుతాయి... అభిశేకప్రియశ్శివః అలంకారప్రియో విష్ణుః, అని ఆగమాదులు చెపుతున్నాయి. అలంకారము విష్ణువుకి, అభిషేకము శివునికి ప్రీతి.


శివరాత్రి అంటే..

శివరూపం లింగరూపం అందులోనూ వృత్తాకారం శివుడు,పానవట్టం పార్వతీరూపం అని ఆగమవాక్యం.ఒకప్పుడు హరిబ్రహ్మాదులకు చైతన్యకారకంగురించి స్పర్థ వచ్చినప్పుడు వారిమధ్య ఒక పెద్ద జ్యోతి రూపం ఏర్పడింది. ఆ రూపం పై కొన చూడటానికి హంస రూపంలో బ్రహ్మ ,వరాహంగా విష్ణువు వెళ్లారు ఎంతసేపటికీ అంతుతెలియక అలసిపోయి ప్రార్థన చేయగా ఆజ్యోతి శివలింగాకారంగా శివాప్రతీకగా ఏర్పడినది.

జ్ఞానరూపియైన శివుడు చైతన్యజ్యోతిగా ఆవిర్భవించిన రాత్రి అమావాస్య గా చెపుతారు లోకంలో ఇప్పటికీ త్రయోదశి చతుర్దశి కలిసిన రోజుని శివరాత్రిగా చెపుతారు ఇదిప్రతిమాసంలో వస్తుంది. కానీ పాలసముద్రం చిలికినపుడు హాలాహలభక్షణం చేసి ఒక చిన్న రేగుపండుఅంతగా చేసి కంఠంలో ధరించినరాత్రి లోకాల్నికాపాడిన శివుని ఆరాత్రి జాగరణతో దేవతలు జనులు ప్రార్థించినరాత్రిగా మహాశివరాత్రి అని చెపుతారు. లోకమంతా శివరక్షణవల్ల మంగళాన్ని పొందుటవల్ల దానికి ప్రతీకగా శివ కళ్యాణాన్ని కూడ జరుపుతారు.


శివరాత్రి నాడు చేయవలసిన విధుల వివరాల్లోకి వస్తే...

ప్రాతఃకాలంలో లేవాలి...
ఉతికిన వస్త్రాలు ధరించాలి...
దేవాలుదర్శనం చేయాలి,,,,,,
అన్నం కాకుండా పాలు, పండ్లు పలహారంమాత్రమే తీసుకోవాలి
తక్కువ ఆహారం తీసుకోవాలి
ఇతరులతో మటల్లోకూడా దైవసంబంధమైనవే ఎక్కువగా ఉండాలి...
వీలైనంత తక్కువ వమాట్లాడాలి....
ఎక్కువసేపు పంచాక్షరీ (ఓం నమశ్శివాయ) జపం చేయటం...
పండ్లు పలహారాలు దేవునుకి నివేదించటం వాటిని ఇతరులకు పంచిపెట్టటం...
వీలైనంత వరకు జాగరణచేయటం...
శివునికి అభిశేకం చేస్తే చాలామంచిది..
చాపమీద పడుకోవటం...
స్త్రీ లైనా పురుషులైనా బ్రహ్మచర్యం పాటించటం..
లింగోద్భవపుణ్యకాలం వరకూ మేల్కొనివుండాలి వీలైతే మరుసటి రోజువరకూ ఉండాలి...


శివరాత్రి చేయకూడనివి..

అనారోగ్యంతో ఉపవాసం చేయకండి సాత్విక ఆహారం స్వీకరించి పూజించండి.
ప్రాతస్సంధ్య,సాయం సంధ్యలో నిద్రపోకండి,
శివ పూజకి మొగలిపూవు వాడకూడదు.
నీటిని అభిశేకానికి ఎక్కువగా వాడండి ఇతరపదార్థాలు 
పంచామృతం,పండ్లరసాలు,సుగంధ పరిమళ పదార్థాలు తక్కువగావాడాలి.
సిమెంట్‌ రాతివంటి అన్నిలింగాలకన్నా పుట్టమన్నుతో చేసినశివలింగానికి అభిషేకిస్తే 
ఎక్కువ ఫలితం వస్తుంది.
తినాల్సిన స్థితివస్తే పిండిపదార్థాలు తీసుకోవచ్చు....
శివరాత్రి నాడు చేయాల్సిన వాటి వివరాలు తెలుసుకున్నారుకద..
అందరూ శివరాత్రి పర్వదినం తీసుకోండి.....
మహా శివుని దీవెనలు తీసుకోండి...


More Maha Shivaratri