Home

»

Latest News

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే!

May 20, 2020 5:33PM

లుక్ విడుదల అయింది. అయితే, 'ఆర్ఆర్ఆర్'లో లుక్‌ కాదు. ఒక ప్రైవేటు ఫోటోషూట్లో లుక్‌. 'ఆర్ఆర్ఆర్'లుక్ విడుదల అయితే అభిమానులకు ఎంత కిక్ ఇచ్చేదో తెలియదు కాని ఈ‌ లుక్ మాత్రం పిచ్చ కిక్ ఇచ్చిందని అనడంలో ఎటువంటి సందేహం లేదు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు పండగ వాతావరణం తీసుకొచ్చాడు ట్రైనర్ స్టీవెన్స్ లాయిడ్. దర్శక ధీరుడు రాజమౌళి చేయలేని పనిని, అతడు చేసి చూపించాడు. 'ఆర్ఆర్ఆర్' లుక్ విడుదల కాలేదని తీవ్ర నిరాశలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, అతడు అమితానందపడేలా అద్భుతమైన పని చేశాడు. ఇంతకీ, ఎన్టీఆర్ జిమ్ ట్రైనర్ ఏం చేశాడంటే... ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ విడుదల చేశారు. ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని తీసిన ఈ ఫోటో అరాచకం అంతే. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఎన్టీఆరేనా... అంత సన్నగా సిక్స్ ప్యాక్ చేసిందని ఆశ్చర్యపోయేలా ఆ ఫొటోలో ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఫస్ట్ లుక్ రాలేదని నిరాశలో ఉన్న అభిమానులు కొంతలో కొంత ఆనందపడుతున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com