![]() |
![]() |

శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ టైటిల్ రోల్ లో నటించిన `యువరత్న` చిత్రం.. ఈ గురువారం కన్నడ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రిలీజైంది. సాయేషా కథానాయికగా నటించిన ఈ సినిమాని సంతోష్ ఆనంద్ రామ్ డైరెక్ట్ చేశారు. తెలుగు సంగతి పక్కన పెడితే.. కన్నడంలో ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. పునీత్ ఖాతాలో మరో సెన్సేషనల్ హిట్ ఖాయమంటున్నారు.
కాగా, డైరెక్టర్ సంతోష్ ఆనంద్ రామ్ `యువరత్న`తో హ్యాట్రిక్ కొట్టారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన `మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి` (2014), `రాజకుమార` (2017) చిత్రాలు కన్నడ చిత్ర
పరిశ్రమలో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. `కేజీఎఫ్` ఫేమ్ యశ్ హీరోగా నటించిన `మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి` ఆ ఏడాది బెస్ట్ గ్రాసర్స్ లో ఒకటి కాగా.. పునీత్ రాజ్ కుమార్ కథానాయకుడిగా నటించిన
`రాజకుమార` ఇండస్ట్రీ హిట్. కట్ చేస్తే.. ఇప్పుడు `యువరత్న`తో సంతోష్ ఆనంద్ రామ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరి `హ్యాట్రిక్ డైరెక్టర్` అయిపోయారు.
ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటించిన `యువరత్న`కి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించారు.
![]() |
![]() |