![]() |
![]() |

కథానాయికగా పదహారేళ్ళుగా వెండితెరపై వెలుగులు పంచుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇటు దక్షిణాదిలోనూ.. అటు ఉత్తరాదిలోనూ నటిగా తనదైన ముద్ర వేస్తోంది.
ఇదిలా ఉంటే.. తమన్నా ఓటీటీ డెబ్యూ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ వేదిక `ఆహా` అందిస్తున్న వెబ్ - సిరీస్ `లెవెన్త్ అవర్`లో ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ ప్రధాన పాత్ర పోషించింది. కార్పోరేట్ వరల్డ్ చుట్టూ తిరిగే ఈ సిరీస్ లో తమన్నా `బాస్ లేడీ`గా దర్శనమివ్వనుంది. ఏప్రిల్ 9న ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది. కాగా, ఈ సిరీస్ కోసం తమన్నా భారీ మొత్తమే పారితోషికంగా పుచ్చుకుందట. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. అక్షరాలా రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ ని ఈ ముద్దుగుమ్మ అందుకున్నట్లు తెలిసింది. మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంది.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం తమన్నా చేతిలో `ఎఫ్ 3`, `మాస్ట్రో`, `గుర్తుందా శీతాకాలం` వంటి తెలుగు చిత్రాలు ఉన్నాయి. అలాగే `బోలే చుడియాన్` అనే బాలీవుడ్ ప్రాజెక్ట్ లోనూ తమన్నా నటిస్తోంది. అదేవిధంగా `క్వీన్` రీమేక్ `దటీజ్ మహాలక్ష్మి` విడుదలకు సిద్ధమైంది.
![]() |
![]() |