![]() |
![]() |

`అరవింద సమేత`, `మహర్షి`, `గద్దలకొండ గణేశ్`, `అల వైకుంఠపురములో`.. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతోంది `బుట్టబొమ్మ` పూజా హెగ్డే. స్వల్ప విరామం తరువాత ఈ ముద్దుగుమ్మ వరుసగా మూడు సినిమాలతో పలకరించబోతోంది. అది కూడా.. నెలకో సినిమాతో.
మే 13న `ఆచార్య`తో పలకరించనున్న పూజ.. జూన్ 19న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్`తో సందడి చేయనుంది. జూలై 30న `రాధే శ్యామ్`తో అలరించనుంది. విశేషమేమిటంటే.. ఆయా చిత్రాల్లో నటిస్తున్న కథానాయలకుందరికీ ఇప్పుడో హిట్ అవసరం.
ఆ వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటిస్తున్న `ఆచార్య`లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడీగా నటిస్తోంది పూజ. చరణ్ గత చిత్రం `వినయ విధేయ రామ` డిజాస్టర్ కావడంతో.. `ఆచార్య` ఫలితం తనకి కీలకంగా మారింది. ఇక `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్` సంగతే తీసుకుంటే.. ఇందులో హీరోగా నటిస్తున్న అఖిల్ కి కథానాయకుడిగా ఇప్పటివరకు సక్సెస్ లేదు. అలాగే `రాధేశ్యామ్` విషయానికి వస్తే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గత చిత్రం `సాహో` హిందీనాట ఓకే అనిపించుకున్నా.. తెలుగులో బోల్తా పడింది. ఆ రకంగా.. ఇక్కడ ప్రభాస్ కో హిట్ కావాలి. మరి.. `పూజ ఫ్యాక్టర్` వర్కవుట్ అయి.. చరణ్, అఖిల్, ప్రభాస్ ఖాతాలో విజయాలు తోడవుతాయేమో చూడాలి.
![]() |
![]() |