![]() |
![]() |

హాలీవుడ్ స్టార్ సిల్వెస్టర్ స్టాలోన్ కథానాయకుడిగా నటించిన `రాంబో`.. భారతీయ రూపం దాల్చనుందా? అవుననే వినిపిస్తోంది బాలీవుడ్ లో. అంతేకాదు.. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టైటిల్ రోల్ లో నటించే అవకాశముందంటున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. `బ్యాంగ్ బ్యాంగ్`, `వార్` చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నట్లు కొన్నాళ్ళుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఇది హాలీవుడ్ మూవీ `రాంబో`కి ఇండియన్ వెర్షన్ అని తెలిసింది. అంతేకాదు.. ఇక్కడి నేటివిటికి తగ్గట్టుగా, ప్రభాస్ ఇమేజ్ కి అనుగుణంగా ఈ రీమేక్ ప్లాన్ చేస్తున్నాడట సిద్ధార్థ్. త్వరలోనే `రాంబో` రీమేక్ పై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో `సలార్`, `ఆదిపురుష్`, నాగ్ అశ్విన్ డైరెక్టోరియల్ ఉన్నాయి. అలాగే పిరియడ్ రొమాంటిక్ సాగా `రాధేశ్యామ్` జూలై 30న థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇక సిద్ధార్థ్ ఆనంద్ విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో `పఠాన్` చేస్తున్నాడు. అలాగే హృతిక్ రోషన్ తో `ఫైటర్` చేయబోతున్నాడు. సో.. 2022 చివరలో గానీ లేదా 2023 ఆరంభంలో గానీ `రాంబో` పట్టాలెక్కే అవకాశముందన్నమాట. చూద్దాం.. ఏం జరుగుతుందో?
![]() |
![]() |