![]() |
![]() |

యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో హీరోలు గాయపడుతుంటారు. డూప్ లేకుండా స్టంట్ లు చేసి, హీరోలు గాయపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రీసెంట్ గా యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా గాయపడ్డాడు. ఓ యాక్షన్ సీన్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా, ఏకంగా లారీ మీద నుంచి కిందపడ్డాడు.
విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య డైరెక్షన్ లో రూపొందుతోన్న సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఈ మూవీలోని ఓ యాక్షన్ సీన్ కోసం రిహార్సల్స్ చేస్తుండగా విశ్వక్ గాయపడ్డాడు. తోటి నటులు, ఫైటర్స్ తో కలిసి లారీ మీద ఫైట్ ప్రాక్టీస్ చేస్తుండగా, స్లిప్ అయ్యి విశ్వక్ కిందపడ్డాడు. దీంతో ఒక్కసారిగా షాకైన చిత్ర బృందం, మళ్ళీ వెంటనే తేరుకొని కుర్ర హీరోని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. విశ్వక్ కాలికి గాయం కాగా, ఇప్పటికే కోలుకొని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కూడా అయ్యాడు. ఈ ఘటన జరిగి కొద్దిరోజులు అవుతుండగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డూప్, రోప్స్ లేకుండా ఇలాంటి రిస్కీ స్టంట్ లు చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
![]() |
![]() |