![]() |
![]() |

సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఘట్టమనేని కృష్ణ మరణించి ఏడాది గడిచిపోయింది. కృష్ణ మరణం అటు కుటుంబసభ్యుల్ని, ఇటు అభిమానుల్ని శోకసంద్రంలో ముంచేసింది. అలాంటి కృష్ణగారి గురించి గల్లా జయదేవ్ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు. కృష్ణతో దిగిన ఫోటోని కూడా ఈ సందర్భంగా షేర్ చేశారు. " మీరు మమ్మల్ని విడిచిపెట్టి ఒక సంవత్సరం అయ్యింది, కానీ మేము ప్రతిరోజూ మిమ్మల్ని తలచుకుని బాధపడుతున్నాము. మీతో గడిపిన సమయం , ఆ మధురమైన జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నాం.
మీ జీవితం నుండి ఎన్నో విషయాలను నేర్చుకున్నాం..ఎంతో ఇన్స్పైర్ అయ్యాము. మామయ్యా నిన్ను మిస్ అవుతున్నాం. మీరు ఎప్పటికీ మా హృదయాల్లో ఉంటారు." అంటూ ఆర్ద్రతతో కూడిన ఒక టాగ్ లైన్ ని జత చేశారు. ఎన్నో రకాల ప్రయోగాలతో అందరికీ నచ్చే సినిమాలు తీసి చరిత్రలో నిలిచిపోయారు. 1960లో కృష్ణ 'చేసిన పాపం కాశీకెళ్ళినా' అనే నాటకంలో శోభన్‌బాబుతో కలిసి నటించారు.

ఆ తర్వాత 'భక్త శబరి', 'సీతారామ కళ్యాణం', 'ఛైర్మన్' వంటి నాటకాల్లో నటించి అందరి దృష్టిలో పడ్డారు. కృష్ణ హీరోగా ఎంపికైన ఫస్ట్ మూవీ 'కొడుకులు కోడళ్ళు' రిలీజ్ కాకుండా ఆగిపోయింది. 1968 నుంచి 74 వరకు తెనాలిలో ఉన్న ఏడు థియేటర్స్ లో కృష్ణ నటించే సినిమాలనే ఆడించేవారు. నిర్మాతల హీరోగా కృష్ణకి ఎంతో పేరుంది. టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లోనే ఆయన జేమ్స్‌బాండ్, కౌబాయ్ క్యారెక్టర్స్ ని పరిచయం చేసి టాలీవుడ్ లో హాలీవుడ్ ని ఆడియన్స్ కి పరిచయం చేసిన ఘనత కృష్ణ గారిదే. అప్పట్లో ఆయన మూవీస్ విషయంలో చేసిన ప్రయోగాలు ఇప్పటి ఎంతో మంది డైరెక్టర్స్ కి మార్గదర్శకాలు అని చెప్పొచ్చు.
![]() |
![]() |