Home

»

Latest News

ఫ్రాడ్ కేసులో హీరోయిన్ భర్తకు సమన్లు!

Nov 15, 2023 10:36AM

ప్రముఖ నటి నమిత భర్త వీరేంద్ర చౌదరి ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. రూ.50 లక్షల మోసం కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా ఆయనకు సేలం సెంట్రల్‌ క్రైం బ్రాంచి సమన్లు పంపింది.

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) కౌన్సిల్‌ తమిళనాడు విభాగ ఛైర్మన్‌ పదవికి వీరేంద్ర చౌదరి ఇటీవల నియామకమయ్యారు. అయితే  కొద్దిరోజుల క్రితం ఈ పదవి ఇప్పిస్తాడంటూ అమ్మాపాళయం జాకిర్‌ ప్రాంతానికి చెందిన గోపాల్‌స్వామి వద్ద ముత్తురామన్‌ అనే వ్యక్తి  రూ.50 లక్షలు తీసుకున్నాడట. కానీ ఆ పదవిని వీరేంద్ర చౌదరి చేపట్టడంతో తాను మోసపోయానని గ్రహించిన గోపాల్‌స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఈ కేసులో ముత్తురామన్‌తో పాటు కౌన్సిల్‌ జాతీయ కార్యదర్శి దుశ్యంత్‌ యాదవ్‌ను అక్టోబర్ 31న అరెస్టు చేశారు. అలాగే కౌన్సిల్‌ తమిళనాడు విభాగ అధ్యక్షుడు వీరేంద్రతో పాటు ముత్తురామన్‌ సహాయకుడు, బీజేపీ రాష్ట్ర మీడియా విభాగ ఉపాధ్యక్షుడు మంజునాథ్‌ ని కూడా విచారణకు హాజరు కావాలంటూ సూరమంగళం పోలీసులు నోటీసులు పంపారు. ఆ ఇద్దరూ హాజరు కాకపోవడంతో తాజాగా విచారణను సేలం సెంట్రల్‌ క్రైం బ్రాంచికి బదిలీ చేసినట్లు సమాచారం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com