![]() |
![]() |

చిన్న వయసులోనే తన కంటే వయసులో పెద్ద వాళ్లయిన హీరోలకి అమ్మగా చేసి ప్రేక్షకులని మెప్పించిన నటి అన్నపూర్ణ గారు. అప్పటినుంచి ఆమె అన్నపూర్ణమ్మ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఇప్పటికి అడదడపా సినిమాలు చేస్తు తన నటనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపిస్తు ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమతో అన్నపూర్ణమ్మగారికి ఉన్న అనుబంధం 48 సంవత్సరాలు. తాజాగా అన్నపూర్ణమ్మ గారు ఒక టీవీ షో లో పాల్గొన్నారు. ఆ షో లో ఆమె తన కూతురు చావు గురించి చెప్పిన మాటలు పలువురిని
కంటతడిపెట్టిస్తున్నాయి.
యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో అన్నపూర్ణమ్మ తన జీవితంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన సంఘటన గురించి చెప్పారు. అన్నపూర్ణమ్మకి పిల్లలు లేకపోతే కీర్తి అనే ఒక పాపని దత్తత తీసుకొని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంది. కీర్తిని బాగా చదివించి యుక్తవయసుకి రాగానే మంచి పెళ్లి సంబంధం చూసి పెళ్లి కూడా చేసింది.ఆ తర్వాత కీర్తి కి ఒక పాప పుట్టింది. కాకపోతే ఆ పాపకి ఐదు సంవత్సరాలు నిండినా కూడా మాటలు రాలేదు. ఎంతో మంది డాక్టర్స్ కి పాపని చూపించారు కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో పాప విషయంలో కీర్తి బాధపడుతు ఉంటే అన్నపూర్ణమ్మ ఓదారుస్తు ఉండేవారు.
ఒకరోజు కీర్తి అన్నపూర్ణమ్మ దగ్గరకి వచ్చింది. అప్పుడే వేడి వేడి బజ్జిలు వేస్తున్న అన్నపూర్ణమ్మ కీర్తికి కూడా వాటిని తినిపించింది. మాటల సందర్భంలో మా అత్త గారు వాళ్ళు వేరే ఊరు వెళ్ళారమ్మా అని కీర్తి అన్నపూర్ణమ్మ తో చెప్పింది. దాంతో అన్నపూర్ణమ్మ కీర్తిని తన దగ్గరే ఉండు అని చెప్పింది .కానీ మా ఆయన ఒక్కడే ఇంట్లో ఉంటాడు కదా అని కీర్తి వెళ్ళిపోయింది. ఇక అంతే ఆ వెళ్ళటమే కీర్తి ని అన్నపూర్ణమ్మ చూసిన ఆఖరి రోజు.అలా వెళ్లిన కీర్తి తన ప్లాట్ లో ఉరి వేసుకొని చనిపోయింది. ఈ విషయం మొత్తం చెప్పి అన్నపూర్ణమ్మ బోరున ఏడ్చింది. తన కూతురుకి మాటలు రావడంలేదనే దిగులుతో నా కూతురు కీర్తి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అంటూ అన్నపూర్ణమ్మ గారు కన్నీళ్లు పెట్టుకుంటుంటే అక్కడ ఉన్న సుమతో పాటు ఆడియన్స్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
![]() |
![]() |