![]() |
![]() |
గత కొన్ని సంవత్సరాలుగా అల్లు అర్జున్ లుక్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. పుష్ప రిలీజ్ ముందు నుంచి ఇప్పటివరకు గడ్డంతోనే ఉంటున్నాడు. అలాంటిది ఒక్కసారిగా లుక్ మారిపోయింది. ప్రస్తుతం అట్లీ కాంబినేషన్‌లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీని కోసం బన్నీ లుక్ పూర్తిగా మార్చేశాడు అట్లీ. పుష్పకు ముందు ఎలా ఉండేవాడో.. మళ్ళీ ఆ లుక్ తీసుకొచ్చాడు. ఇప్పుడా లుక్ వల్ల అల్లు అర్జున్‌కి ఘోరమైన అవమానం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై మెగా ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. అల్లు అర్జున్‌కి అవమానం జరిగితే ఫ్యాన్స్ ఎందుకు యుద్ధానికి దిగారు అనే విషయం తెలుసుకుందాం.
అట్లీ కాంబినేషన్‌లో చేస్తున్న సినిమాకి సంబంధించిన షూటింగ్ కోసం గత నెల ముంబాయి వెళ్లాడు బన్నీ. తన షెడ్యూల్ పూర్తి చేసుకొని హైదరాబాద్ రిటర్న్ అయ్యారు. ముంబాయి విమానాశ్రయంలోకి మాస్క్‌తో వచ్చారు అల్లు అర్జున్. సెక్యూరిటీ చెక్‌లో భాగంగా బన్నీని మాస్క్ తియ్యమన్నారు. బన్నీతో వున్న వ్యక్తి అతను అల్లు అర్జున్ అని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ, సెక్యూరిటీ ఆఫీసర్ మాత్రం ఫేస్ చూపించాలని అడిగారు. తప్పని పరిస్థితిలో బన్నీ తన మాస్క్ తీసి ఫేస్ చూపించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ‘ఒక హీరోని గుర్తు పట్టలేకపోయారు.. అల్లు అర్జున్ పరువు పోయిందిగా’, ‘మాస్క్ ఎందుకు పెట్టుకున్నట్టు.. ఏమైనా జబ్బులు ఉన్నాయా’, ‘వాళ్ళ డ్యూటీ వాళ్లు చేస్తున్నారు.. ఎందుకంత బిల్డప్’, ‘అల్లు అర్జున్‌కి పొగరు ఏమాత్రం తగ్గలేదు’.. కామెంట్స్ వస్తున్నాయి. వాళ్ళంతా మెగా ఫ్యాన్స్ అని అర్థమవుతూనే ఉంది. ‘మాస్క్ ఉంటే ఎవరినైనా గుర్తు పట్టడం కష్టం.. అందులో పరువుపోయేది ఏముంది?’, ‘సెక్యూరిటీకి సహకరించడం తప్పు ఎలా అవుతుంది అంటూ బన్నీ ఫ్యాన్స్ రిప్లయ్ ఇస్తున్నారు.
![]() |
![]() |