![]() |
![]() |
సూపర్‌స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ ‘కూలీ’ ఆగస్ట్ 14న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. అంతేకాదు, రజినీకాంత్ సినీ జీవితం ప్రారంభించి 50 సంవత్సరాలు కాబోతోంది. ఈ రెండు సందర్భాలను అభిమానులు పండగలా జరుపుకోబోతున్నారు. అభిమానులే కాదు, కొన్ని సంస్థలు కూడా రజినీ గోల్డెన్ జూబ్లీ ఇయర్‌ను సెలబ్రేట్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఆగస్ట్ 14ని సెలవు దినంగా ప్రకటించాయి. ఇదిలా ఉంటే, యుఎన్‌ఓ ఆక్వా సంస్థ అధికారికంగా ఒక లెటర్‌ను విడుదల చేసింది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు సెలవుతోపాటు ‘కూలీ’ సినిమా చూసేందుకు ఉచిత టికెట్లను కూడా అందజేయబోతోంది. చెన్నయ్‌తోపాటు బెంగళూరు, తిరుచ్చి, తిరునెల్వేలి, చెంగల్పట్టు, మట్టుతావని, అలపాలయం తదితర బ్రాంచిల్లోని ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుందని కంపెనీ విడుదల చేసిన లెటర్‌లో పేర్కొంది.
సూపర్‌స్టార్ రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన ‘కూలీ’ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, ఆమిర్‌్‌ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్లు కూడా నటించారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా ‘వార్2’ కూడా అదే రోజు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలకూ భారీ హైప్ ఉంది. అయితే ఏ సినిమా ఎంతటి ఘనవిజయం సాధిస్తుంది అనేది ఆసక్తిదాయకంగా మారింది.
![]() |
![]() |