![]() |
![]() |

బాహుబలి పార్ట్ 1 , పార్ట్ 2 ,సలార్, సాహో,ఆదిపురుష్, కల్కితో ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా స్టార్ గా నిలిచిన విషయం తెలిసిందే. కలెక్షన్స్ పరంగా ఆయా చిత్రాలతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద ఒక బెంచ్ మార్కుని కూడా సెట్ చేసాడు. దీంతో ప్రభాస్ అప్ కమింగ్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja Saab)పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొని ఉంది. కొంత గ్యాప్ తర్వాత రాజాసాబ్ లో ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపిస్తుండటం, ఫస్ట్ టైం హర్రర్ కామెడీ జోనర్ చేస్తుండటంతో, రాజాసాబ్ హిట్ అనే సంకేతాలు సినీ సర్కిల్స్ లో వినపడుతున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది.
ఇక రాజాసాబ్ డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు రిలీజ్ డేట్స్ మారి, డిసెంబర్ 5 న రిలీజ్ కాబోతుంది. కానీ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులగా డిసెంబర్ నుంచి సంక్రాంతికి వాయిదా పడనుందని, సంక్రాంతి పండగ సినిమాలకి మంచి సీజన్ కదా అని మేకర్స్ ఆలోచిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. భారీ స్థాయిలో విఎఫ్ఎక్స్ వర్క్ ఉందని, అందుకే రిలీజ్ డేట్ వాయిదా పడుతుందని కూడా చెప్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను సంక్రాంతికి రిలీజ్ చెయ్యవద్దని, డిసెంబర్ 5 న పక్కాగా రావాలని కోరుతున్నారు. సంక్రాంతి సీజన్ , నార్త్ కి వర్తించదని, కేవలం సౌత్ వరకే ఉంటుందని, కాబట్టి డిసెంబర్ 5 న రిలీజ్ చెయ్యాలని కోరుతున్నారు. గత సంవత్సరం పుష్ప 2 కూడా డిసెంబర్ 5 న విడుదలై రికార్డు కలెక్షన్స్ ని సాధించింది. దీంతో రాజా సాబ్ కూడా అదే డేట్ కి రిలీజ్ అయ్యి, నార్త్ లో ప్రభాస్ కి ఉన్న ఇమేజ్ దృష్ట్యా, ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై పుష్ప 2 మించి వసూలు చేస్తుంది. డిసెంబర్ 5 సెంటిమెంట్ కూడా వర్క్ అవుట్ అవుతుందంటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.
ప్రొడ్యూసర్ టి జె విశ్వప్రసాద్(TJ Vishwaprasad)మాత్రం చాలా ఇంటర్వూస్ లో మాట్లాడుతు రాజా సాబ్ ఎట్టి పరిస్థితుల్లోను డిసెంబర్ 5 న వస్తుందని చెప్తూనే ఉన్నారు. ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్తున్న 'రాజాసాబ్' లో నిధి అగర్వాల్(Nidhhi Agerwal),మాళవిక మోహనన్(Malavika Mohanan)హీరోయిన్లుగా చేస్తుండగా సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వహబ్, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. మారుతీ(Maruthi)దర్శకుడు కాగా థమన్(Taman)మ్యూజిక్.
![]() |
![]() |