![]() |
![]() |

అనిల్ రావిపూడి స్క్రీన్‌ప్లే సమకూర్చి, దర్శకత్వ పర్యవేక్షణ వహించిన 'గాలి సంపత్' సినిమా మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న విడుదలై తొలిరోజు పేలవమైన వసూళ్లను సాధించింది. రాజేంద్రప్రసాద్ టైటిల్ రోల్ పోషించగా, ఆయన కుమారుడిగా శ్రీవిష్ణు నటించిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 52 లక్షల షేర్‌ను మాత్రమే సాధించిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ రాష్ట్రాల్లో దాని ప్రి బిజినెస్ వాల్యూ రూ. 6.3 కోట్లు! అంటే రికవరీ జస్ట్ 8.25 శాతమే! దీన్ని బట్టి ఎంత డిజాస్ట్రస్‌గా 'గాలి సంపత్' బాక్సాఫీస్ స్టార్టయ్యిందో అర్థం చేసుకోవచ్చు.
తొలి రోజు 'గాలి సంపత్'కు నైజాం ఏరియాలో రూ. 16 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. ఈ ఏరియాలో దాని ప్రి బిజినెస్ విలువ రూ. 2.10 కోట్లు. రికవరీ 7.6 శాతం. ఆంధ్రా ఏరియాలో వచ్చిన షేర్ రూ. 31.8 లక్షలు. ఇక్కడ ప్రి బిజినెస్ జరిగింది రూ. 3.15 కోట్లకు. అంటే రికవరీ 10 శాతం. ఇక రాయలసీమలో ఈ మూవీకి అత్యల్పంగా రూ. 4 లక్షల షేర్ వచ్చింది. ఇక్కడ బయ్యర్లు పెట్టిన పెట్టుబడి రూ. 1.05 కోట్లు. రికవరీ 3.8 శాతమే. దీంతో వారు లబోదిబోమంటున్నారు.
మిత్రుడైన నిర్మాత సాయికృష్ణ కోసం ఈ సినిమాకు సమర్పకుడిగానూ వ్యవహరించి, అంతా తన భుజాల మీద వేసుకొని మోశాడు అనిల్ రావిపూడి. కానీ అతని ఊహలను తలకిందులు చేస్తూ, తొలిరోజు ప్రేక్షకులు ఈ సినిమాని చిన్నచూపు చూశారు. ఈ వీకెండ్లో ఈ సినిమా పుంజుకుంటే బయ్యర్ల నష్టాలు తగ్గుతాయి. లేదంటే వారికి భారీ నష్టం తప్పదు.
![]() |
![]() |