![]() |
![]() |

పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'లైగర్' మూవీ షూటింగ్ పూర్తయింది. 'సాలా క్రాస్‌బ్రీడ్' అనేది ట్యాగ్‌లైన్. దాన్ని బట్టే మూవీలో విజయ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందనేది అర్థమవుతోంది. చాలా బోల్డ్‌గా, పవర్‌ఫుల్‌గా ఆ క్యారెక్టర్ ఉంటుందని ఇప్పటికే విడుదలైన టీజర్స్ తెలియజేస్తున్నాయి. లేటెస్ట్‌గా ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేసిన విజయ్ పోస్టర్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను సునామీలా ఊపేస్తోంది. ఇప్పటిదాకా అంత బోల్డ్‌గా, అంత సెక్సీగా విజయ్ ఎప్పుడూ కనిపించలేదు. దాదాపు న్యూడ్‌గా ఆ పోస్టర్‌లో దర్శనమిస్తున్నాడు విజయ్. కండలు తిరిగిన దేహంతో, తన శరీరంలోని ప్రైవేట్ పార్ట్ వద్ద ఒక ఫ్లవర్ బొకేను అడ్డం పెట్టుకొని నిల్చొని ఉన్నాడతను. అతని ఒంటిపై నూలుపోగు కనిపించడం లేదు. సెన్సేషనల్ స్టార్‌గా పేరు పొందినప్పటికీ, సినిమా కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నానని ఈ పోస్టర్‌తో అతను చెప్పేస్తున్నాడు.
'లైగర్'లో విజయ్ మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ రోల్ చేయడానికి చాలా శ్రమించాడు విజయ్. దాని కోసం ట్రైనింగ్ తీసుకున్నాడు. తన శరీరాన్ని ఉక్కు కండలతో మార్చేశాడు. ఈ మూవీలో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. నిన్న అతని బర్త్‌డే సందర్భంగా టీమ్ శుభాకాంక్షలు తెలిపింది. అంతే కాదు, విజయ్ సహా ఆ సినిమాకు పనిచేస్తున్న పలువురు టైసన్‌తో కలిసున్న ఫొటోలు షేర్ చేసి, అతనెంత వినమ్రశీలో కొనియాడారు.
ఇటీవల హీరో హీరోయిన్లు విజయ్, అనన్యా పాండేపై ముంబైలో ఓ పాటను చిత్రీకరించాడు పూరి జగన్నాథ్. త్వరలో ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. ఇక నుంచీ రెగ్యులర్‌గా అప్‌డేట్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. పూరి కనెక్ట్స్, బాలీవుడ్‌కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్ సంయుక్తంగా 'లైగర్'ను నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, అపూర్వ మెహతా నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో నిర్మాణమవుతున్న ఈ చిత్రాన్ని తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 25న 'లైగర్' ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కానున్నది.

![]() |
![]() |