![]() |
![]() |

'బిగ్ బాస్' ఫేమ్ హిమజ పెళ్లి వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే మరోసారి హిమజ తన పెళ్లి వార్తలపై స్పందించింది. 'ఆస్క్ మీ ఏ క్వొశ్చన్'లో భాగంగా తన ఫ్యాన్స్‌తో సరదాగా ముచ్చటించింది. తన ప్రొఫెషనల్ విషయాలతో పాటు పర్సనల్ విషయాల్ని వెల్లడించింది. ఇంతకీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అక్కాయ్.. ప్లానింగ్ చేస్తున్నావా? అంటూ కొంత మంది హిమజని ప్రశ్నించారు. దీంతో హిమజ షాకింగ్ ఆన్సర్ ఇచ్చేసింది. ప్రస్తుతం హిమజ షేర్ చేసిన ఆన్సర్ నెట్టింట సందడి చేస్తోంది.
ఇదిలా వుంటే హిమజ పెళ్లిపై ఇటీవల రక రకాల వార్తలు పుట్టుకొచ్చాయి. 2012లో రాజేష్ ఆనందన్ అనే బిజినెస్‌మేన్‌తో హిమజకు పెళ్లైందని ప్రచారం జరిగింది. అది కాస్తా పక్కన పడటంతో చల్లా విజయ్ రెడ్డిని హిమజ వివాహం చేసుకుందని, ఇద్దరూ కలిసి వుంటున్నారంటూ మరో వార్త పుట్టుకొచ్చింది. ఇంతలోనే ఇద్దరు విడిపోయారంటూ మరో వార్త నెట్టింట హల్ చల్ చేసింది. అయితే వరుసగా తనపై వదంతులు వినిపిస్తుండటంతో సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది. 'పెళ్లి వార్తల్ని ఇకనైనా ఆపండ్రా బాబూ' అంటూ ఘాటుగా స్పందించింది.
"నాక్కూడా చెప్పకుండానే నాకు పెళ్లిళ్లు చేసేస్తున్నారు, ఆపండ్రా బాబు" అంటూ కౌంటర్లు వేసింది. "నా డైవోర్స్‌కైనా నన్ను పిలవండర్రా" అంటూ సెటైర్లు వేసింది. "నా పేరెంట్స్ ఎమోషనల్ అవుతున్నారు. దయచేసి ఫేక్ న్యూస్‌ని ఆపండి" అంటూ రిక్వెస్ట్ చేసింది. అయితే తాజాగా పెళ్లి గురించి మాత్రం షాకింగ్ పోస్ట్ పెట్టడం విశేషం. తనకు పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదని, తనకు పీస్ ఆఫ్ ఫ్రీడమ్ కావాలంటూ తన అభిమానులు అడిగిన ప్రశ్నకు రిప్లై ఇచ్చి షాకిచ్చింది.
![]() |
![]() |