![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్న పాన్ - ఇండియా మూవీస్ లో `సలార్` ఒకటి. క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటిస్తుండగా.. వెర్సటైల్ స్టార్ జగపతి బాబు ఓ ముఖ్య పాత్రలో దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే, ప్రభాస్ విషయంలో దర్శకధీరుడు రాజమౌళి బాటలోనే ప్రశాంత్ నీల్ కూడా పయనిస్తుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. `స్టూడెంట్ నంబర్ వన్`, `సింహాద్రి`, `సై` వంటి హ్యాట్రిక్ హిట్స్ తరువాత జక్కన్న రూపొందించిన నాలుగో చిత్రం `ఛత్రపతి`లో హీరోగా నటించాడు ప్రభాస్. ఆ సినిమాతో అప్పట్లో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు ప్రభాస్. కట్ చేస్తే.. ఇప్పుడు ప్రశాంత్ నీల్ నాలుగో చిత్రం `సలార్`లోనూ ప్రభాస్ నే హీరో. `ఉగ్రమ్`, `కేజీఎఫ్ః ఛాప్టర్ 1`, `కేజీఎఫ్ః ఛాప్టర్ 2` వంటి హ్యాట్రిక్ హిట్స్ తరువాత `సలార్` తీస్తున్నాడు ప్రశాంత్. మరి.. అప్పట్లో హ్యాట్రిక్ డైరెక్టర్ రాజమౌళి నాలుగో సినిమాలో నటించి సంచలనం సృష్టించిన ప్రభాస్.. ఇప్పుడు మరో హ్యాట్రిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నాలుగో చిత్రం విషయంలోనూ అదే బాట పడతాడేమో చూడాలి.
![]() |
![]() |