![]() |
![]() |

తండ్రీ కూతుళ్ళైన కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం 'అగ్ని నక్షత్రం'. విలక్షణ నటుడు సముద్రఖని, మలయాళీ నటుడు సిద్ధిక్, విశ్వంత్, జబర్దస్త్ మహేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి ప్రతీక్ ప్రజోష్ దర్శకుడు.
శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై మోహన్ బాబు, లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం ఉదయం ఘనంగా జరిగింది. ఈ చిత్రానికి 'అగ్ని నక్షత్రం' అనే టైటిల్ పెట్టారు. తాజాగా విడుదలైన టైటిల్ మోషన్ పోస్టర్ చూస్తుంటే ఇది పోలీస్ స్టోరీ వంటి విభిన్నమైన కథాంశంతో రూపొందుతోందని అర్థమవుతోంది.

'సన్ ఆఫ్ ఇండియా' ఫేమ్ డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. ఈ సినిమాకి మధురెడ్డి ఎడిటర్ గా లిజో కె జోస్ సంగీతం, గోకుల్ భారతి కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు. శర వేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది.
![]() |
![]() |