![]() |
![]() |
గత కొన్నేళ్ళుగా సినిమా రంగానికి చెందినవారు, రాజకీయ నాయకులు.. ఇతర ప్రముఖులు.. ఇలా సెలబ్రిటీలను మాత్రమే టార్గెట్ చేస్తూ.. వాళ్ళు అడక్కపోయినా వారి జాతకాలను చెబుతూ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తెచ్చుకున్న జ్యోతిష్యుడు వేణుస్వామి. అయితే అత్యుత్సాహంతో కొందరి విషయంలో అతను చెప్పిన విధంగా జరక్కపోవడంతో అభాసుపాలై విపరీతమైన ట్రోలింగ్‌కి గురయ్యాడు.
తాజాగా హీరో నాగచైతన్య, శోభితల వ్యక్తిగత జీవితం గురించి వేణుస్వామి చెప్పిన జాతకంతో అందరి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ విషయాన్ని సినిమా ఇండస్ట్రీ సీరియస్‌గా తీసుకొని మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో వేణుస్వామి అరెస్ట్ అయ్యాడంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై స్పందిస్తూ వేణుస్వామి ఒక వీడియోను విడుదల చేశారు. తను ఆఫీస్‌లోనే క్లయింట్స్‌తో బిజీగా ఉన్నానంటూ ఆ వీడియోలో చెప్పారు.
‘నేను అరెస్ట్ అయ్యానంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ విషయాన్ని క్లారిఫై చెయ్యడానికే ఈ వీడియో చేస్తున్నాను. ప్రస్తుతం మా ఆఫీస్‌లో పూజలు జరుగుతున్నాయి. అంతేకాదు, నేను నా క్లయింట్స్‌తో చాలా బిజీగా ఉన్నాను. నేను అరెస్ట్ అయ్యానంటూ ఎందుకు ప్రచారం జరుగుతోందో మీకు తెలుసు. ‘మా’లో సభ్యురాలైన ఓ నటిని ఓ పొలిటీషియన్ ఎన్ని బండబూతులు తిట్టాడో, ఒకప్పుడు పవన్ కళ్యాణ్‌ని ఎలా ఆడుకున్నారో అందరికీ తెలిసిందే. ఏదిఏమైనా ఇప్పుడు మనం సెలబ్రిటీస్ జాతకాలు చెప్పడం లేదు కాబట్టి నెలరోజుల తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. దేవుడి దయవల్ల, మీడియా, సోషల్ మీడియా దయవల్ల గతంలో కంటే రెట్టింపు బిజీగా ఉన్నాను’ అన్నారు.
జనంలో పాపులారిటీ తెచ్చుకోవడానికే తనకు సంబంధం లేని వ్యక్తుల, ముఖ్యంగా సెలబ్రిటీల జాతకాలు చెప్తున్నాడనేది అందరి అభిప్రాయం. ఇప్పుడది నిజమేనని తెలుస్తోంది. నాగచైతన్య, శోభిత జాతకం చెప్పిన తర్వాత వేణుస్వామి మరింత బిజీ అయిపోయాడని అతని మాటల్ని బట్టే తెలుస్తోంది. మొత్తానికి అతను అనుకున్నదే జరిగింది. వేణుస్వామి ఎందుకు ఇదంతా చేస్తున్నాడనే విషయంలో ఓ క్లారిటీ వచ్చింది.
![]() |
![]() |