![]() |
![]() |

గ్లామర్ ఫీల్డ్ లో సక్సెస్ అయ్యాక డబ్బు, పేరు ఎలా వస్తాయో.. సక్సెస్ కాకముందు కష్టాలు కూడా అలాగే ఎదురవుతాయి. దానికి ఎవరూ అతీతం కాదు. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) సైతం ఎన్నో కష్టాలను, కన్నీళ్లను, అవమానాలను దాటుకొని ఈ స్థాయికి వచ్చింది.
టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా పాన్ ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మిక. పలు బడా సినిమాల ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. అయితే కెరీర్ స్టార్టింగ్ లో మాత్రం ఆమెకు అవకాశాలు అంత తేలికగా రాలేదట. ఎన్నో కష్టాలను, అవమానాలను ఎదుర్కొందట. ఈ విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వయంగా రష్మికనే పంచుకుంది.
"ఆడిషన్ కి వెళ్లిన ప్రతిసారి తిరస్కారం ఎదురయ్యేది. కొందరైతే నటనకు పనికొచ్చే ముఖమేనా అని అవమానించేవారు. కన్నీళ్లతో ఇంటికి వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎట్టకేలకు ఓ సినిమాలో సెలెక్ట్ అయ్యాను. రెండు, మూడు నెలల పాటు వర్క్‌షాప్ కూడా నిర్వహించారు. కానీ తర్వాత ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. చాలా ఆడిషన్స్ లో రిజెక్ట్ అయ్యాను. ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అయినా ఎప్పుడు వెనకడుగు వేయలేదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, సినిమా సినిమాకి ప్రతిభను మెరుగుపరచుకుంటూ వస్తున్నాను." అని రష్మిక చెప్పుకొచ్చింది.
సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం రష్మిక చేతిలో 'పుష్ప 2', 'కుబేర', 'ది గర్ల్ ఫ్రెండ్', 'ఛావా', 'సికిందర్' వంటి సినిమాలు ఉన్నాయి.
![]() |
![]() |