![]() |
![]() |

యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr) బామ్మర్ది నితిన్ నార్నె(narne nithiin)నయా మూవీ ఆయ్(aay)తన గత చిత్రం మాడ్ మంచి విజయం సాధించడంతో పాటు అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఆయ్ ని నిర్మిస్తుండంతో అందరిలో భారీ అంచనాలే ఉన్నాయి. పైగా మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ లాంటి బడా హీరోల సినిమాలతో పోటీ పడుతుండటంతో అందరిలో ఆయ్ రిజల్ట్ మీద క్యూరియాసిటీ కూడా నెలకొని ఉంది. చిత్ర యూనిట్ లో అయితే చిన్న పాటి టెన్షన్ కూడా ఉంటుందనే టెన్షన్ ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఆ టెన్షన్ మొత్తాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun)పోగొట్టాడు అని చెప్పాలి.
గీతా ఆర్ట్స్ 2 ఉరఫ్ జి ఏ 2 ఆర్ట్స్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ‘ఆయ్ ని నిర్మించాడు. విద్య కొప్పినీడి కూడా వన్ అఫ్ ది ప్రొడ్యూసర్. అగస్ట్ 15 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. నూతన కధానాయిక నయన్ సారిక హీరోయిన్ గా పరిచయం కాబోతుంది.ఇక తాజాగా అల్లు అర్జున్ ఆయ్ టీం కి తన బెస్ట్ విషెస్ తెలిపాడు. తనకు అత్యంత సన్నిహితులైన బన్నీ వాస్, విద్యా కొప్పినీడిలకు ఆయ్ మంచి విజయాన్నిఅందించాలి. అదే విధంగా నార్నె నితిన్, నయన్ సారికలకు మంచి హిట్ రావాలని కూడా కోరుకుంటున్నానని చెప్పాడు. ఇప్పుడు ఈ ట్వీట్ తో యూనిట్ మొత్తం ఎంతో సంతోషంగా ఉంది. బన్నీ ట్వీట్ తమ సినిమాకి ఎంతగా హెల్ప్ అవుతుందో యూనిట్ కి తెలుసు. అందుకే బన్నీ కి థ్యాంక్స్ చెబుతూ రీట్వీట్ కూడా చేసింది. మరి మీ బామ్మర్దికి మీ బావ బన్నీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడు. నీ ట్వీట్ ఎప్పుడని ఎన్టీఆర్ ని ఉద్దేశించి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
.webp)
ఇక ఆయ్ మూవీ పూర్తిగా గోదావరి బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కింది.ఆల్రెడీ టీజర్, ట్రైలర్,ప్రచార కార్యక్రమాలు ఒక రేంజ్ లో ఉండి ఆయ్ మీద అందరిలో పాజిటివ్ వైబ్రేషన్స్ కి కలిగిస్తున్నాయి.అంజి(anji) దర్శకుడు కాగా రామ్ మిర్యాల, అజయ్ అరసడ సంయుక్తంగా సంగీతాన్ని అందించారు. టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఆయ్ ని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. ఆ వివరాలన్నీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
![]() |
![]() |