![]() |
![]() |
.webp)
సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu)హీరోగా సుకుమార్(sukumar)దర్శకత్వంలో వచ్చిన మూవీ 1 నేనొక్కడనే. మహేష్ కెరీర్ లోనే చాలా క్లాస్ మూవీ గా పేరుతెచ్చుకుంది. ఇందులో మహేష్ కి జోడి కట్టి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు అందుకున్న నటి కృతి సనన్(kriti sanon)ప్రెజంట్ తన సొంత భాష హిందీ చిత్ర సీమలో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న కృతి మొన్నీ ఈ మధ్య వచ్చిన ప్రభాస్ ఆదిపురుష్ లోను సీతగా చేసి మెప్పించింది. తాజాగా ఆమె పై డేటింగ్ వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటిపై ఒక రేంజ్ లో ఫైర్ అవుతుంది.
కబీర్ బహియా(kabir bahia)ఇండియా కి చెందిన కబీర్ బిజినెస్ రీత్యా యు కె లో సెటిల్ అయ్యాడు. కొన్ని రోజుల క్రితం కబీర్ తో కృతి డేటింగ్ లో ఉందనే రూమర్స్ వచ్చాయి.మొన్న జులై 27 న జరిగిన తన పుట్టిన రోజుని కబీర్ తో కలిసి జరుపుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఈ ఇద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే న్యూస్ ఒక రేంజ్ లోనే చక్కర్లు కొట్టింది. ఇక్కడ ఇంకో ఆసక్తి కర మైన విషయం ఏంటంటే కబీర్ కంటే కీర్తి పది ఏళ్ళ వయసు పెద్ద.ఇప్పుడు ఈ విషయం మొత్తం మీద ఆమె మాట్లాడుతు నా పై తప్పుడు సమాచారం వచ్చిన్పపుడు నేను బాధపడటమే కాదు. నా కుటుంబం కూడా బాధపడుతుంది.. ఆ తర్వాత దాని వల్ల వచ్చే పరిణామాలు మేమంతా ఎదుర్కోవాలి.నేను కబీర్ తో డేటింగ్ లో ఉన్నాననే న్యూస్ వచ్చిన తర్వాత అందరు నాకు ఫోన్లు, మెస్సేజ్ చేస్తున్నారు. దాంతో అబద్దాల గురించి నిరంతరం స్పందించాలంటే చిరాకు వస్తుంది. 34 ఏళ్ళ కృతి తన కంటే 10 ఏళ్ళు చిన్నవాడితో డేటింగ్ చేస్తుందనే హెడ్డింగ్ ని ఎక్కువ మంది ఉపయోగించారని రూమర్స్ క్రియేటర్స్ ని చాలా గట్టిగానే నిలదీస్తుంది.
అసలు నిజా నిజాలు తెలియకుండా అబద్హాలని ఎలా ప్రచారం చేస్తారు. ఈ రోజుల్లో అలా రాయడం కామన్ అయిపోయింది.గతంలో సోషల్ మీడియా లేనప్పుడు వార్త పత్రికల్లో వచ్చే న్యూస్ చూసి ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చే వారు. అలాంటిది ఆన్ లైన్ లో చేరి ఇష్టమొచ్చినపుడు రాస్తున్నారు. నెగిటివ్ కామెంట్స్ పెట్టడం కూడా ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది.అవతలి వారిపై రూమర్స్ క్రియేట్ చేస్తు భావ ప్రకటన స్వేచ్ఛ అనుకోకండి అని కూడా చెప్పింది. 2021 లో వచ్చిన మీమీ కి నేషనల్ అవార్డుని అందుకున్న కృతి రీసెంట్ గా క్రూ తో వచ్చి విజయాన్ని అందుకుంది.
![]() |
![]() |