![]() |
![]() |

`అల వైకుంఠపురములో`, `క్రాక్` చిత్రాలలో ప్రతినాయకుడిగా అలరించారు సముద్రఖని. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న మల్టిస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారాయన. కట్ చేస్తే.. మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే ఛాన్స్ సముద్రఖనికి దక్కిందని టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. `క్రాక్` వంటి బ్లాక్ బస్టర్ తరువాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. నటసింహ నందమూరి బాలకృష్ణని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మే నుంచి సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. కాగా, ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర కోసం సముద్రఖనితో సంప్రదింపులు జరుపుతున్నాడట గోపీచంద్. కథ, పాత్ర నచ్చడంతో సముద్రఖని కూడా వెంటనే ఓకే చెప్పారని వినికిడి. త్వరలోనే బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్ మూవీలో సముద్రఖని ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
ఇదిలా ఉంటే.. `క్రాక్` తరహాలోనే బాలయ్య కాంబో చిత్రాన్ని కూడా వాస్తవ ఘటనల ఆధారంగానే గోపీచంద్ మలినేని తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.
![]() |
![]() |