![]() |
![]() |

కింగ్ నాగార్జున, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో ఓ యాక్షన్ థ్రిల్లర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్.. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుందని సమాచారం.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో నాగ్ సరసన నటించే హీరోయిన్ విషయంలో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురు మరెవరో కాదు.. కాజల్ అగర్వాల్, తమన్నా, రాశీఖన్నా. ఎవరి కాల్షీట్స్ అందుబాటులో ఉంటాయో.. వారికే ఈ సినిమాలో నాయికగా నటించే అవకాశం ఉంటుందని టాక్. మరి.. ఈ ముగ్గురిలో ఎవరు ఫైనల్ గా నాగ్ తో జోడీ కడతారో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ గుల్ పనాగ్.. నాగ్ కి చెల్లెలికి నటిస్తుండగా, అనిఖ సురేంద్రన్ మేనకోడలి పాత్రలో దర్శనమివ్వనున్నట్లు కథనాలు వస్తున్నాయి.
మరి.. ఈ యాక్షన్ థ్రిల్లర్ తో నాగ్, ప్రవీణ్ కాంబో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
![]() |
![]() |