![]() |
![]() |

రచయితగా ‘స్వయంవరం’, ‘నువ్వే కావాలి’, ‘చిరునవ్వుతో’ సినిమాలతో త్రివిక్రమ్ శ్రీనివాస్ హిట్లు కొట్టారు. అయితే, ఆ తరవాత విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’తో ఆయన రేంజ్ మరింత పెరిగింది. త్రివిక్రమ్‌కు స్టార్స్ సినిమాలు వచ్చేలా చేసింది. దర్శకుడు అయిన తరవాత వెంకటేష్‌తో ఆయన ఎప్పుడూ సినిమా చేయలేదు. కానీ, వెంకటేష్–త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా వస్తే చూడాలని ప్రేక్షకుల కోరిక. ఇద్దరినీ అభిమానించేవారి కోరిక కూడా!
కొన్నాళ్ళ క్రితం వెంకటేష్ పుట్టినరోజున బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పోస్టర్ విడుదల చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మాత్రమే ఆ సంస్థ సినిమాలు చేస్తుంది. అందుకని, కాంబినేషన్ కుదిరిందని అభిమానులు సంతోషించారు. కానీ, సినిమా రాలేదు. తాజాగా వెంకటేష్ 75వ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నారని కొందరు రాశారు. అవి నిజం కాదని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ట్వీట్ చేశారు. ఫేక్ న్యూస్ అని స్పష్టం చేశారు. వెంకటేష్–త్రివిక్రమ్ కాంబినేషన్‌పై ఉన్న ఎగ్జయిట్‌మెంట్ అర్థం చేసుకోలమని ఆయన అన్నారు. తమ సంస్థలో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి తామ అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తామన్నారు.
![]() |
![]() |