![]() |
![]() |

టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్‌గా అల్లు అర్జున్‌కు ఉన్న పేరు ప్రఖ్యాతులు తెలిసిందే. హెయిర్ స్టైల్ దగ్గర్నుంచీ డ్రస్సింగ్ దాకా, బాడీ బిల్డింగ్ నుంచి బాడీ లాంగ్వేజ్ దాకా బన్నీ స్టైలే వేరు. తెలుగు ప్రేక్షకులే కాదు, హిందీ ప్రేక్షకులు, మల్లు ప్రేక్షకులు కూడా అతడి స్టైల్‌కు దాసోహమంటున్నారు. అలాంటి స్టైల్ ఐకాన్‌కు స్టైలిష్ గిఫ్ట్ పంపాడు యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ. ఈ ఇద్దరూ తమ తదుపరి సినిమాలతో పాన్ ఇండియా స్టార్లు కావడానికి తాపత్రయ పడుతున్నారు. బన్నీ 'పుష్ప' మూవీతో, దేవరకొండ 'ఫైటర్' మూవీతో పాన్ ఇండియా ఆడియెన్స్‌ను టార్గెట్ చేసుకున్నారు.
అసలు విషయానికి వస్తే, దేవరకొండకు రౌడీ పేరుతో సొంత క్లాత్ బ్రాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఆ రౌడీ వేర్ నుంచి స్పెషల్‌గా డిజైన్ చేసిన బ్లాక్ కలర్ టీ షర్ట్, అదే కలర్ షార్ట్, మూడు స్పెషల్ మాస్క్‌లను పంపాడు. అవన్నీ స్టైలిష్‌గా ఉండటం గమనించదగ్గ అంశం. వాటన్నింటినీ ఫొటో తీసి, తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశాడు బన్నీ. "Thank yu soo much Vijay Deverakonda.. So sweet of you to send your latest collection of Rowdy" అని ఆ పోస్ట్‌పై రాసుకొచ్చాడు.

![]() |
![]() |