![]() |
![]() |

పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’లో ఐటమ్ సాంగ్ ‘కేవ్వు కేక...’లో డ్యాన్స్ చేసిన మలైకా అరోరా గుర్తుంది కదా! ఆమెకు కరోనా వచ్చింది. బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్ కొవిడ్19 వైరస్ బారిన పడ్డాడని ప్రకటించిన కొన్ని గంటలకు ఓ బాలీవుడ్ మీడియా పోర్టల్‌తో తనకు కరోనా సోకిన సంగతి ఆమె వెల్లడించింది. తనకంటే వయసులో పదకొండేళ్లు చిన్నోడైన అర్జున్ కపూర్‌తో ఆమె డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. రిలేషన్‌షిప్ గురించి పబ్లిక్‌గా మాట్లాడనప్పటికీ, ఈ ప్రేమజంట వ్యవహారం ప్రేక్షకులందరికీ తెలిసిందే.
అర్జున్ నుండి మలైకాకు కరోనా సోకిందో? మలైకా నుండి అర్జున్‌కి సోకిందో? మొత్తం మీద ప్రేమజంట కరోనా బారిన పడింది. మలైకా అరోరా కూడా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటున్నట్టు తెలియజేసింది. ఆమెలో కూడా వైరస్ లక్షణాలు లేవు. కరోనాను జయించి మరింత స్ట్రాంగ్‌గా, హెల్దీగా తిరిగొస్తానని మలైకా అరోరా ప్రకటించింది. అర్జున్ కపూర్‌తో ప్రేమలో పడటం వల్ల సల్మాన్‌ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ నుండి విడాకులు తీసుకున్నదని బాలీవుడ్ టాక్.
![]() |
![]() |