![]() |
![]() |
‘ఓజి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ అయిన రోజు నుంచి ప్రేక్షకులు, అభిమానులు.. ఈ ఈవెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేశారు. అందులోనూ ఆరోజు ఉదయమే ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించడంతో ఇక అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఆదివారం ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురుచూశారు. కానీ, కొన్ని కారణాల వల్ల ట్రైలర్‌ను ఉదయం రిలీజ్ చెయ్యలేదు. సాయంత్రం జరిగే ఫంక్షన్‌లో రిలీజ్ చేస్తామని చెప్పారు. దీంతో అభిమానులు మేకర్స్‌పై విరుచుకుపడ్డారు. రకరకాల కామెంట్స్ పెడుతూ తమ కోపాన్ని చూపించారు.
సాయంత్రం ఫంక్షన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ట్రైలర్ గురించి ప్రస్తావించలేదు. ఆ తర్వాత పవన్‌కళ్యాణ్ మాత్రం ట్రైలర్‌లో ఇంకా కొన్ని మార్పులు చేయాలని, అందుకే రిలీజ్ చెయ్యలేకపోతున్నామని చెప్పారు. అయినప్పటికీ ఎలా ఉన్నా ఫర్వాలేదు. ఫ్యాన్స్ కోసం దాన్ని ప్లే చెయ్యమని చెప్పడంతో అక్కడి స్క్రీన్‌పై ట్రైలర్‌ను ప్రదర్శించారు. ప్రేక్షకులు, అభిమానులు ఊహించినట్టుగానే ట్రైలర్ ఒక రేంజ్‌లో ఉంది. ఇప్పటివరకు పవన్‌కళ్యాణ్‌ని చూడని ఒక కొత్త లుక్‌తో ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించారు. ట్రైలర్ చూస్తూ అభిమానులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఒక పక్క వర్షం వస్తున్నా లెక్క చేయకుండా కేరింతలు కొట్టారు.
ట్రైలర్‌లో గ్యాంగ్‌స్టర్ ఓజస్ గంభీర గెటప్‌లో ఇంతకుముందెన్నడూ చూడని పవన్‌కళ్యాణ్‌ని ఈ సినిమాలో చూస్తారన్నట్టుగా అతని లుక్ ఉంది. స్క్రీన్ మీద పవన్‌కళ్యాణ్ కనిపిస్తే చాలు అన్నంతగా అతని ప్రజెన్స్ కనిపించింది. అభిమానులు పవర్‌స్టార్‌ని ఎలా చూడాలనుకుంటున్నారో అదే లుక్‌లో పవన్‌కళ్యాణ్ బీభత్సం సృష్టించారు. ఆయన డైలాగ్ డెలివరీ, ఓజీ యాటిట్యూడ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. కత్తితో రౌడీలను ఊచకోత కోసే సీన్.. గన్ పట్టుకొని ‘ఓజాస్ గంభీర.. ఓజాస్ గంభీర’ అంటూ చేసే యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలిచాయి. ఇప్పటివరకు పవన్‌కళ్యాణ్ చేయని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇదని ముందు నుంచి అందరూ అనుకుంటున్నదే. ఆదివారం జరిగిన ఈవెంట్‌తో, అక్కడ రిలీజ్ చేసిన ట్రైలర్‌తో ఎక్స్‌పెక్టేషన్స్ ఒక రేంజ్‌లో పెరిగిపోయాయి. సెప్టెంబర్ 25న థియేటర్లలో సందడి మామూలుగా ఉండదు అనేది అర్థమవుతోంది. ముందు రోజు ప్రీమియర్స్ నుంచే పవర్‌స్టార్ ఫ్యాన్స్ హంగామా మొదలు కాబోతోంది.
![]() |
![]() |