![]() |
![]() |
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ ‘ఓజీ’ సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. చాలా గ్యాప్ తర్వాత విడుదలైన ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి ఒక రేంజ్‌లో హైప్ వచ్చింది. కానీ, దానికి ఎన్నో రెట్లు హైప్ ‘ఓజీ’ చిత్రానికి ఎక్కువగా ఉంది. సినిమా రిలీజ్‌కి ఇంకా నాలుగు రోజులు టైమ్ ఉన్నప్పటికీ ఆదివారమే ఈ సినిమాకి సంబంధించిన సందడి మొదలైపోయింది. ‘ఓజి కాన్సర్ట్’ పేరుతో సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఒక స్టేడియంనే బుక్ చేశారంటే ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతుంది. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచే ఎల్ బి స్టేడియం దగ్గర సందడి మొదలైంది. ఓజీ బ్యాండ్స్ తలకి కట్టుకున్న ఫ్యాన్స్ వేలాదిగా తరలి వస్తున్నారు. కొందరు ఎర్ర కండువాలతో కనిపిస్తున్నారు. పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్‌లో 90 శాతం యూత్ ఉంటారు. స్టేడియం మొత్తం యూత్‌తోనే నిండిపోయేలా కనిపిస్తోంది. క్రమంగా స్టేడియం నిండుతోంది. అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ పవన్‌కళ్యాణ్‌కి జేజేలు పలుకుతూ పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేస్తూ అక్కడి వాతావరణాన్ని ఎంతో ఉత్సాహవంతంగా మారుస్తున్నారు ఫ్యాన్స్.
![]() |
![]() |