![]() |
![]() |

వంగవీటి మోహనరంగా.. చనిపోయి పాతికేళ్లు గడుస్తున్నా..ఇంకా వైబ్రేషన్స్ పుట్టించే పేరు. బెజవాడతో పాటు పరిసర ప్రాంతాలపై ఆయన చూపించిన ప్రభావం అలాంటిది. తాజాగా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఆయన జీవితకథను ప్రధాన ఇతివృత్తంగా "వంగవీటి" అనే సినిమాను తీశారు. సినిమా ఎనౌన్స్ చేసినప్పుడే బెజవాడ ఉలిక్కిపడింది. విజయవాడకు చెందిన గాంధీ గ్లోబల్ ట్రస్ట్ సభ్యులు..వంగవీటిపై పోలీసులను ఆశ్రయించారు.
ఈ సినిమా రెండు కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందంటూ అనుమానం వ్యక్తం చేశారు. ముప్పై ఏళ్ల క్రితంనాటి పాతగాయాలను మళ్లీ ఇప్పుడు తెరపై చూపిస్తే ప్రశాంతంగా ఉన్న బెజవాడలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు. రంగా తనయుడు రాధా అయితే ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. అయితే అన్ని అవాంతరాలను తట్టుకుని వంగవీటి ఇవాళ ధియేటర్ల ముందుకు రావడంతో బెజవాడ పోలీసులు అలర్టయ్యారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. వంగవీటి రంగా, దేవినేని నెహ్రూ నివాసాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
![]() |
![]() |