![]() |
![]() |

సినీ పరిశ్రమలో మిగిలిన భాషల హీరోయిన్లతో పోలిస్తే మళయాళం హీరోయిన్లు త్వరగా నెగ్గుకొస్తున్నారు. అందం, గ్లామర్‌తో పాటు నటనలో నూటికి నూరు మార్కులు వేయించుకోగల సత్తా వీరి సొంతం. అవసరమైతే వీలైనంత త్వరగా సొంతంగా డబ్బింగ్ చెప్పుకునేందుకు కూడా వెనుకాడరు. నిత్యామీనన్, సమంతా ఈ కోవకే చెందుతారు. అందుకే మళయాళ ముద్దుగుమ్ములు దర్శకనిర్మాతలకు బాగా కనెక్టై నేడు దక్షిణాదిని ఒక ఊపు ఊపుతున్నారు. కొత్త అందాలను తెరకు పరిచయం చేయడంలో టాలీవుడ్ డైరెక్టర్స్ ఎప్పుడూ ముందుంటారు. చూడ్డానికి బాగుండి కాస్త నటించగలిగితే చాలు వెంటనే దిగుమతి చేసేసుకుంటారు. అలా 2016లో కూడా చాలా మంది కేరళ కుట్టీలను మన వాళ్లు తెలుగుతెరకు పరిచయం చేశారు..వారెవరో ఓ లుక్కేద్దాం.
కీర్తీ సురేష్:
.jpg)
"నేను శైలజ" సినిమాతో ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కీర్తీ సురేష్. ఆ వెంటనే నాని హీరోగా తెరకెక్కిన నేను లోకల్ మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సారి ఏకంగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్ కాంభినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్‌గా సెలక్టయ్యింది. దాంతో పాటు అల్లుఅర్జున్, ఎన్టీఆర్, సూర్యల సరనన కీర్తీని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం.
ఆర్తన:

శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో రాజ్‌తరుణ్ హీరోగా తెరకెక్కిన "సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు" సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది ఆర్తన. లంగావోణిలో అచ్చ తెలుగు కోనసీమ అమ్మాయిగా ఆర్తన అందాలు కనువిందు చేశాయి.
నివేధా థామస్:

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన "జెంటిల్‌మెన్" సినిమాతో నివేధా థామస్ తెలుగు తెరకు పరిచయమైంది. ప్రేమికుడు దూరమైన ప్రియురాలిగా..నిజాన్ని రాబట్టే అమ్మాయిగా నివేధా నటనను ఎవ్వరూ మరచిపోలేరు. తన అందం, నటనతో ఏకంగా హీరో నానినే డామినేట్ చేసింది. అందుకే వీరద్దరీ కలయికలో మరో సినిమా రాబోతోంది.
నమితా ప్రమోద్:

ఆది హీరోగా వచ్చిన "చుట్టాలబ్బాయ్" సినిమాతో పరిచయమైంది నమితా ప్రమోద్. ప్రజంట్ నారా రోహిత్ సరసన "కథలో రాజకుమారి" అనే సినిమాలో నమిత నటిస్తోంది..ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.
అనుపమ పరమేశ్వరన్:

మళయాళం ప్రేమమ్‌తో ఫుల్ పాపులర్ అయిన అనుపమపై సహజంగానే తెలుగు దర్శకుల కళ్లుపడ్డాయి. నితిన్ హీరోగా తెరకెక్కిన "అ..ఆ" ద్వారా అనుపమను తెలుగువారికి పరిచయం చేశాడు త్రివిక్రమ్..ఆ వెంటనే ప్రేమమ్ రీమేక్‌లో ఛాన్స్ కొట్టేసింది ఈ రింగుల జుట్టు అమ్మాయి. శర్వానంద్‌తో నటించిన శతమానం భవతి సంక్రాంతికి రిలీజవుతుండగా..మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, రాజ్‌తరుణ్ సినిమాలు వరుసలో ఉన్నాయి.
అను ఇమ్మాన్యుయేల్:

నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో వచ్చిన "మజ్ను" సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్. పెద్ద కళ్లు, ముఖంపై చిరునవ్వుతో ఈ అమ్మడు ప్రేక్షకులకు బాగానే కనెక్టయ్యింది. ఈ బ్యూటీ రెండో సినిమాతోనే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఛాన్స్ కొట్టేసింది. పవన్-త్రివిక్రమ్ కాంభినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీలో ఒక హీరోయిన్‌గా కీర్తీ సురేష్ సెలక్టవ్వగా..సెకండ్ హీరోయిన్‌గా అనుని ఎంపిక చేసినట్లు సమాచారం.
మంజిమా మోహన్:

ప్రేమకథల స్పెషలిస్ట్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన "సాహసం శ్వాసగా సాగిపో" సినిమాతో తెలుగునాట జెండా పాతింది మంజిమా మోహన్. క్యూట్ లుక్స్, వెరైటీ ఎక్స్‌ప్రెషన్స్‌తో విమర్శకుల ప్రశంసలు పొందింది మంజిమా..అయితే ఈ భామకు తెలుగులో ఆఫర్లు కరువైనప్పటికి తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది..అవి వచ్చే ఏడాది విడుదలకానున్నాయి.
మరిన్ని విషయాలు:
* నాని ఈ ఏడాది ముగ్గురు మళయాళీ భామలతో నటించారు.
- నివేధా థామస్ (జెంటిల్‌మెన్)
- అను ఇమ్మాన్యుయేల్ ( మజ్ను)
- కీర్తీ సురేష్ (నేను లోకల్-విడుదల కాలేదు) .
* అనుపమ, మడోన్నా సెబాస్టియన్‌లు ప్రేమమ్ మళయాళం, తెలుగు వర్షన్‌లలో నటించారు.
![]() |
![]() |