![]() |
![]() |

వంగవీటి మోహనరంగా జీవితకథతో పాటు బెజవాడ రౌడీ రాజకీయాలను మెయిన్ ఎలిమింట్‌గా తీసుకుని సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన మూవీ "వంగవీటి". ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు చాలా రియలిస్టిక్ కథలను తీసిన వర్మ ఎప్పుడూ ఒరిజనల్ నేమ్స్ వాడలేదు..కానీ ఫస్ట్ టైం వంగవీటిలో మాత్రం ఒరిజనల్ నేమ్స్ వాడాడు..వంగవీటి రాధా, వంగవీటి మోహనరంగా, దేవినేని నెహ్రూ, దేవినేని గాంధీ, దేవినేని మురళీ ఇలా అన్ని ఒరిజనల్ నేమ్సే..వాటితో పాటు ఆసక్తిని కలిగించిన పేరు ఎన్టీఆర్.
అయితే తెలుగుజాతి మొత్తం దైవంలా కొలిచే మహనీయుని పేరును వర్మ తెరమీదకు తీసుకురావడంతో సినీ, రాజకీయ జనాలు వంగవీటి కోసం ఉత్కంఠగా ఎదురుచూశారు. రామూ, ఎన్టీఆర్ పేరును వాడటం వెనుక కారణం ఉంది. రంగా హత్య జరిగిన సమయంలో ఎన్టీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే సినిమాలో అన్నగారిని ఎలా చూపించింది మాత్రం సస్పెన్స్ అని..తాను ఎవ్వరికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా తీశానని..నిజానిజాలు తెరమీదే చూడాలని వర్మ చెప్పాడు.
![]() |
![]() |