![]() |
![]() |
.jpg)
వంద కోట్ల మార్క్... టాలీవుడ్‌కి చాలా ఈజీ అయిపోయింది. అత్తారింటికి దారేది, శ్రీమంతుడు, బాహుబలి... ఈ ఫీట్‌ని సాధించి చరిత్ర సృష్టించాయి. బాహుబలి అయితే.. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.600 కోట్లు కొల్లగొట్టింది. జనతా గ్యారేజ్ కూడా వంద కోట్ల క్లబ్‌లో చేరినట్టు చిత్రబృందం ప్రకటించింది. అయితే... ఓవరాల్ లెక్కలు తీస్తే దిమ్మతిరిగిపోయింది. ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరలేదని దానికి ఆమడ దూరంలోనే నిలిచిపోయిందని ట్రేడ్ వర్గాలు లెక్కగడుతున్నాయి. ఓవరాల్ కలక్షన్లు చూస్తే జనతా గ్యారేజ్ ఫైనల్ గా రూ.76 కోట్ల దగ్గరే అగిపోయిందట. గ్రాస్ పరంగా లెక్క వేసినా వంద కోట్లకు రాలేదని చెబుతున్నారు.
అయితే చిత్రబృందం మాత్రం ఈసినిమా రూ.130 కోట్ల గ్రాస్ చేరుకొందని, రూ.81 కోట్ల షేర్ రాబట్టిందని లెక్కగడుతోంది. నిజానికి షేర్ మాత్రమే లెక్క గట్టాలి. గ్రాస్ అన్నది కంటికి కనిపిస్తుంది తప్ప.. ఆ లెక్క చేతికి అందదు. నిర్మాత చేతికొచ్చేది కూడా షేర్ మాత్రమే. ఆ లెక్కన చూసినా.. జనతా గ్యారేజ్ వంద కోట్లు కొట్టలేదు. అయితే ఎన్టీఆర్ సినిమాల్లోకెల్లా ఇదే హయ్యస్ట్ కలక్షన్స్. ఆ విషయంలో మాత్రం అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇటు జనతా గ్యారేజ్ చిత్రబృందం మాత్రం ఫుల్ హ్యపీగా ఉంది. ఈయేడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంలో జనతా గ్యారేజ్‌దే నెంబర్ వన్ పొజీషన్.
![]() |
![]() |