![]() |
![]() |

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన చివరి సినిమా 'మహర్షి'. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా వచ్చి రెండేళ్లు దాటినా వంశీ తదుపరి సినిమా ఇంతవరకు స్టార్ట్ కాలేదు. నిజానికి మహర్షి తరువాత మళ్ళీ మహేష్ తోనే వంశీ మూవీ చేయాల్సి ఉండగా అది కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయింది. ఇక ఇటీవల కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా వంశీ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ రాబోతుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా వంశీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి.. అలాగే ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కి మధ్య వస్తున్న గ్యాప్ గురించి క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. విజయ్ తో తాను సినిమా చేయబోతున్నానని, తన కెరీర్లోనే ఇది అతి పెద్ద ప్రాజెక్ట్ అని అన్నారు . కరోనా నేపథ్యంలో ప్రస్తుతం సరైన సమయం కాదని ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించలేదని తెలిపారు. కొవిడ్ తగ్గాక ఈ సినిమా మొదలవుతుందని, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని వంశీ చెప్పుకొచ్చారు.
ఇక తన సినిమాల ఆలస్యంకు గల కారణాన్ని కూడా వంశీ వెళ్లడించారు. స్వభావ రీత్యా తాను కథకుడిని కాదు. కథల కోసం ఇతర రచయితల మీద ఆధారపడాల్సి వస్తుంది. అందుకే సినిమాలు ఆలస్యం అవుతున్నాయని వంశీ పేర్కొన్నారు. అయితే ఇక పై కథల విషయంలో ఆలస్యం జరుగకుండా చూసుకుంటానని అన్నారు. విజయ్ తో చేయబోయే సినిమా తర్వాత చేయాల్సిన ప్రాజెక్టు కోసం కూడా ఇప్పట్నుంచే కథ రెడీ చేసుకుంటున్నానని వంశీ తెలిపారు.
![]() |
![]() |