![]() |
![]() |

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి రామ్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు అవుతున్నా ఇంకా హవా తగ్గలేదు. యూట్యూబ్ లోనూ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ యూట్యూబ్ లో 200మిలియన్ల(20 కోట్లు) మార్క్ ను దాటింది.
ఇస్మార్ట్ శంకర్ మూవీ హిందీ వెర్షన్‌ని గతేడాది ఫిబ్రవరిలో యూట్యూబ్ లో అప్లోడ్ చేయగా.. టాలీవుడ్ ప్రేక్షకుల మాదిరే బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి కూడా ఈ మూవీకి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటివరకు 200 మిలియన్ల వ్యూస్, 1.9మిలియన్ల లైకులలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా, యూట్యూబ్ లో డబ్బింగ్ సినిమాల ద్వారా 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం హీరో రామ్‌కు ఇది నాలుగోసారి. సౌత్ ఇండియా నుంచి డబ్బింగ్ సినిమాల ద్వారా నాలుగు సార్లు 200 మిలియన్ మార్క్ ని అందుకున్న తొలి హీరోగా రామ్ నిలిచారు.
ఇక రామ్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో ఒక బైలింగువల్ సినిమా చేస్తున్నాడు. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇస్మార్ట్ రేంజ్ లో ఆకట్టుకుంటుందేమో చూడాలి.
![]() |
![]() |