![]() |
![]() |

వక్కంతం వంశీ..స్టార్ రైటర్. ఎన్నో బ్లాక్ బస్టర్లకు కథలు అందించిన వ్యక్తి. అదే ఎంతోమంది స్టార్ హీరోలతో సన్నిహిత్యాన్ని సంపాదించేలా చేసింది. నిన్న గాక మొన్న వచ్చిన రచయితలు కూడా మెగాఫోన్ పట్టుకుని టాప్ డైరెక్టర్లు అయిపోతుండగా..ఏళ్లుగా కథలు రాస్తూ వస్తున్న వంశీ మాత్రం ఇంకా పెన్ను, పేపర్ పట్టుకునే కూర్చొన్నాడు. ఎన్టీఆర్‌తో ఉన్న ఫ్రెండ్‌షిప్ కారణంగా ఆయన సినిమాతోనే డైరెక్టర్‌గా మారతానంటూ చాలా వేదికలపై చెప్పాడు వంశీ..కానీ స్వయంగా జూనియరే అతనికి హ్యాండివ్వడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు.
అయితే నిరాశ చెందకుండా బన్నీకి కథ చెప్పి సినిమా కన్ఫర్మ్ చేయించుకున్నాడు..కానీ ఇప్పటి వరకు ఆ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ హరీశ్ శంకర్‌తో డీజే చేస్తుండగా..ఆ వెంటనే లింగుస్వామితో ద్విభాషా చిత్రం చేస్తానని చెప్పాడు కానీ వంశీ సినిమా పేరు మాత్రం చెప్పిన దాఖలాలు లేవు. చూస్తూ ఉంటే బన్నీ కూడా వంశీకి హ్యాండిచ్చినట్లే కనిపిస్తోంది. దీంతో ఇక డైరెక్షన్ వైపు ఆశలు వదిలేసుకుని..రచయితగానే కొనసాగాలని చూస్తున్నాడట వక్కంతం.
![]() |
![]() |