![]() |
![]() |

జనతా గ్యారెజ్ తరువాత దాదాపు చాలా గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ కొత్త చిత్రానికి ఎట్టకేలకు మూహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. చిత్రం ఫిబ్రవరి 10న పూజా కార్యక్రమాలు జరుపుకోనుందని.. రెగ్యులర్ షూటింగ్ 15 నుంచి ప్రారంభమవుతుందని.. నందమూరి కల్యాణ్ రామే స్వయంగా తన ఫేస్ బుక్ ద్వారా తెలిపారు. బాబి దర్శకత్వంలో.. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై కల్యాణ్‌రామ్ నిర్శిస్తున్న ఈసినిమాకి ఇప్పటికే ‘జై.. లవ కుశ..’ అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారు. ఇంక సినిమాటోగ్రాఫర్‌గా సీకే మురళీధరన్‌ను కూడా ఎంపిక చేశారు. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నట్టు టాక్. మరి ఇప్పటికే వరుస హిట్ లతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ కు ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుందాం...
![]() |
![]() |