![]() |
![]() |

ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి టాలీవుడ్‌లో దాపురించింది. నమ్మడమే.. మోసం చేయడానికి తొలి మెట్లు అన్నట్టు కొంతమంది హీరోలు, ప్రొడ్యూసర్లు, మీడియేటర్లు కాపు కాచుకొని కూర్చుంటారిక్కడ. ఇలానే ఓ స్టార్ హీరో తాను నమ్ముకొన్న వాళ్ల చేతిలోనే కోట్టకు కోట్లు మోసపోయిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్‌లో మినిమం గ్యారెంటీ రేంజు ఉన్న హీరో ఆయన. స్టార్ దర్శకులంతా తనతో పనిచేశారు. పారితోషికం విషయంలో చాలా పట్టుగా ఉండే ఈ హీరో బాగానే వెనకేశాడు. అయితే... తనకు అత్యంత ఆప్తుడు అనుకొన్న వ్యక్తి చేతిలో కోట్లకు మోసపోయాడు.
హైదరాబాద్ శివార్లలో త్వరలో రియల్ ఎస్టేట్ బూమ్ పెరగబోతోంది... అంటూ.. ఆ హీరోని ఊరించి ఎందుకూ పనికిరాని ఓ భూమిని ఈ హీరోకి అంటగట్టాడట. కేవలం తన స్నేహితుడిపై నమ్మకంతో... ఆ భూమిని ఎక్కువ రేటుకి కొనేశాడట సదరు హీరో. భూమిని అమ్మిపెట్టడం వల్ల .. ఆ స్నేహితుడు కోటి రూపాయలు వెనకేసుకొన్నాడని, కేవలం కోటి రూపాయల కోసం.. ఏమాత్రం విలువలేని భూమిని తనకు అంటగట్టాడన్న విషయం ఆ హీరోకి ఆ తరవాత అర్థమైందట. అప్పటి నుంచీ ఆ హీరో.. నమ్మక ద్రోహిని దూరం పెట్టాడని తెలుస్తోంది. ఆ హీరోని మోసం చేసిన సదరు వ్యక్తి ఇప్పుడు మరో ఇద్దరు హీరోలకు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. వీళ్లకీ ఎప్పుడోకప్పుడు టోపీ వేయక తప్పదని ఇండ్రస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఆ హీరో ఎవరు? ఆయన్ని మోసం చేసిన ఆ ప్రబుద్దుడు ఎవరన్నది మాత్రం సస్పెన్స్.
![]() |
![]() |