![]() |
![]() |

సంక్రాంతి 2021కి లేదా సంక్రాంతికి ఒక వారం ముందు 'ఉప్పెన' చిత్రాన్ని విడుదల చేస్తే ఎలా ఉంటుందని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ సమాలోచనలు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమా 'ఉప్పెన'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.
కరోనాకి ముందు ఏప్రిల్ నెలాఖరున సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. తరవాత మే 7న రిలీజ్ అనుకున్నారు. కానీ, కుదరలేదు. ఇప్పుడు ఏకంగా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వెళ్లిపోయారు.
ప్రజెంట్ కొన్ని సినిమాలు ఓటీటీ వేదికలలో విడుదల అవుతున్నాయి. 'ఉప్పెన'కి కూడా ఓటీటీ నుండి ఆఫర్స్ వచ్చాయి. అయితే, మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా కావడంతో థియేటర్లలో విడుదల చేయాలని పట్టుదలగా ఉన్నారట. థియేటర్లలో అయితే సినిమాకి అప్రిసియేషన్ వస్తుందని నమ్మకంగా ఉన్నారట. సంక్రాంతి రిలీజ్ గురించి డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడుతున్నారట.
![]() |
![]() |